Cbc Church Ggm

Cbc Church Ggm Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cbc Church Ggm, Christian church, gumpellagudem village madharam post kare palli mandal khammam dist, Yellandu.

PLEASE SUBSCRIBE...LIKE.COMMENT.SHARE.
06/10/2025

PLEASE SUBSCRIBE...LIKE.
COMMENT.SHARE.

అభీ అనగా అర్థం ఏమిటి ?

28/12/2024
🌹 *దావీదు* 🌹  *2వ భాగము*  ( *దావీదు కుటుంబం* )దావీదు చిన్నతనంలో సౌలు దగ్గరకు పిలువబడినాడు. *గొర్రెల దగ్గర నుండి రాజ గృహం...
07/09/2024

🌹 *దావీదు* 🌹

*2వ భాగము*

( *దావీదు కుటుంబం* )

దావీదు చిన్నతనంలో సౌలు దగ్గరకు పిలువబడినాడు.

*గొర్రెల దగ్గర నుండి రాజ గృహంలోనికి పిలువబడినాడు.*

*రాజు దగ్గర సితార వాయించేవాడు.*

అప్పటినుండి రాజుకు అల్లుడు కావాలని ఆశించాడు. కానీ , తగిన ప్రతిఫలం పొందలేదు. ఈ విషయంలో సౌలు దావీదును మోసం చేశాడు. చివరికి మీకాలును పెళ్లి చేసుకొని సౌలు అల్లుడని పిలువబడినాడు. కానీ ఏమి అనుభవించలేదు. సౌలు తన కుమార్తె అయిన మేరబును ఇస్తానని ఇవ్వలేదు.
మీకాలుని ఇచ్చాడు. .తిరిగి ఫల్తీయేలునకు ఇచ్చాడు. దావీదు ప్రేమలో పడ్డాడు తమ పితరుడైన ఇస్సాకు లాగా ప్రార్ధించలేదు. తద్వారా అనేకమంది భార్యలను వివాహం చేసుకోవలసి వచ్చింది.

1 దిన 2:13 -16 ప్రకారం అన్నయ్య లు :-

1.ఏలీయాబు
2.అబీనాదాబు
3.షమ్మాను
4.నేతనేలును
5.రద్దయి
6.ఓజెము
7.దావీదు

*అక్కలు :-*

1.సెరూయా
2.అబీగయీలు

*భార్యలు :-*

2సమూయేలు 3:2-5 - ప్రకారం

1.అహీనోయము
2. అబీగయీలు
3.మయకా
4.హగ్గీతు
5.అబీటలు
6.ఎగ్లా
7.అభీషగును (1రాజులు1:3)
8.మీకాలు (2సమూ 6:16)
9.బత్షెబ(1దిన 3:5)

*కుమారులు* :-

2సమూ 2:2 ,3:2-5 --ప్రకారం

1.అమ్నోను
2.కిల్యాబు = దానియేలు
3. అబ్షాలోము
4.ఆదోనియా
5.షెపట్యా
6.ఇత్రెయాము

2సమూ 5:13-16 ,1దిన 14:3-7,.....

7.షమ్మాయ
8.షోబాబు
9.నాతాను
10.సొలొమోను
11.ఇబారు
12.ఎలీషువ
13.నెపెగు
14.యాఫియ
15.ఎలీషామా
16.ఎల్యాదా
17.ఎలీపెలెటు
18.నొగహు
19.ఎలీపెలెటు

కుమార్తె. :-

20.తామారు

ఇంత పెద్ద కుటుంబ వ్యవస్థను ఎలా నడిపించాలి.అసలు స్త్రీ విషయంలో దావీదు దగ్గర నుండే గాడి తప్పింది అని చెప్పాలి. అమ్నోను చెల్లెలైన తామరును ఆశించడం.అబ్షాలోము అమ్నోనును చంపడం ఇదంతా విషాదంలాగే ఉన్నది.వీరిలో పరిపాలన నాయకత్వం దావీదు తదుపరి సొలొమోనుకు వచ్చింది.

✍️...
ప్రభువు పరిచర్యలో...
రెవ.టి.డేవిడ్ రాజు
కల్వరి బాప్టిస్టు చర్చి
గుంపెళ్ళగూడెం - మామిడి గుండాల
9949366859

🌹 *దావీదు* 🌹( *1వ భాగము)*  *యూదా గోత్రం*  *పరిపాలన కాలం 40 సంవత్సరాలు 6మాసాలు*  *(పుట్టుక .)* 1సమూయేలు 17: 12  :- ప్రకార...
06/09/2024

🌹 *దావీదు* 🌹

( *1వ భాగము)*

*యూదా గోత్రం*

*పరిపాలన కాలం 40 సంవత్సరాలు 6మాసాలు*

*(పుట్టుక .)*

1సమూయేలు 17: 12 :- ప్రకారం యెష్షయికి ఎనిమిది మంది కుమారులు. దావీదు చివరివాడు. ఈ వివరాలు 1సమూయేలు16:6-12 - వరకు చూడగలం .యెష్షయికి ఏడుగురు కుమారులు ఉన్నట్లు మరోచోట చూడగలం.

1 దినవృత్తాంతాలు 2:13 ,16 వరకు వివరాలు గలవు. ఇందులో చివరివాడు. ఏడో వాడైన దావీదు అని రాయబడి ఉంది. బహుశా ఈ సమయానికి దావీదు సహోదరులలో ఒకరు లేరు అనిపిస్తుంది.

సహోదరీలు ఇద్దరు ఉన్నట్లు 2 సమూయేలు 17: 25 - కూడా చూడగలం. సెరుయా , అభీగయులు

వీరు ఉన్నత కుటుంబమునకు చెందినవారు. వాక్యానుసారముగా గ్రహించగలరు. వీరి తాత ముత్తాతలు బోయజని గ్రహించగలం. దావీదు యూదా గోత్రమునకు చెందినవాడు.

ఇంతకీ ఆ కాలంలో
దావీదు వృత్తి కీర్తన 78 :70 ,71 ప్రకారం తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించెను.

దావీదు గొర్రెల కాపరి .

ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ,

చక్కగా పాటలు పాడగలడు,

సితారా వాయించగలడు.

సౌలు బలహీనమైన రాజు అని గ్రహించిన తక్షణమే దేవుడు సమూయేలు ద్వారా దావీదును ఎన్నిక చేసాడు. ఆ సమయంలో అన్నాడు
1సమూయేలు 13: 14 - యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. అతడు దావీదు చిన్న వయస్సు నుండి దేవునికి చాలా ఇష్టమైన వాడు. యేసయ్య కూడా చాలా ప్రేమించేవాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏ పాపం చేయనివాడు. దావీదు దేవుని యందు భక్తి భావములు కలవాడు.

1సమూయేలు 16: 12 - ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును. చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. ఈ మాటను లోతుగా గమనించినప్పుడు ఏ మాత్రం మోహపు చూపు లేనట్లు అని అర్థం.యెష్షయికి పదిమంది పిల్లలలో దావీదు ప్రత్యేకమైన వాడు.

✍️...
*రెవ.టి.డేవిడ్ రాజు*
*కల్వరి బాప్టిస్టు చర్చి*
*గుంపెళ్ళగూడెం - మామిడి గుండాల*
*9949366859*

నా ఆత్మీయ తండ్రితో కలిసి.... నేను
03/09/2024

నా ఆత్మీయ తండ్రితో కలిసి.... నేను

నేను....నా సతీమణి
03/09/2024

నేను....నా సతీమణి

Address

Gumpellagudem Village Madharam Post Kare Palli Mandal Khammam Dist
Yellandu
507122

Website

Alerts

Be the first to know and let us send you an email when Cbc Church Ggm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share