Yadagirigutta

Yadagirigutta YADAGIRIGUTTA is a Temple City of Telangana State, India. Just 60 KM from capital city Hyderabad.
(6455)

Whick also known as Yadadri, SLNS Devastanam, Patha Narasimha Swamy Devastanam, Surendrapuri, K***a Kaladhamam, Lotus Temple etc., are situated in Town

49 రోజుల హుండీ ఆదాయం 3.52 కోట్లు
20/08/2026

49 రోజుల హుండీ ఆదాయం 3.52 కోట్లు

      19-08-2026
20/08/2026

19-08-2026

Yadagirigutta on 15th August
15/08/2026

Yadagirigutta on 15th August

యాదగిరిగుట్ట దేవస్థానం (వైటిడి) గౌరవ ధర్మకర్తల మండలి రెండవ సమావేశం ప్రెసిడెన్షియల్ సమావేశ మందిరము నందు నిర్వహించబడింది. ...
14/08/2026

యాదగిరిగుట్ట దేవస్థానం (వైటిడి) గౌరవ ధర్మకర్తల మండలి రెండవ సమావేశం ప్రెసిడెన్షియల్ సమావేశ మందిరము నందు నిర్వహించబడింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 26 అంశాలను ఆమోదించారు. అదనంగా 5 టేబుల్ అజెండా అంశాలను కూడా ఆమోదించారు.
సమావేశంలో ఆమోదించిన ముఖ్యమైన నిర్ణయాలు:

1. దీక్షాపరుల మండపం: భక్తుల సౌకర్యార్థం కొండపైన పుష్కరిణి వద్ద సుమారు రూ.43.12 కోట్ల వ్యయంతో దీక్షాపరుల మండపం నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.

2. నిత్య కళ్యాణ మండపం: బాలాలయం స్థలంలో సుమారు రూ.9.87 కోట్ల వ్యయంతో నిత్య కళ్యాణ మండపం మరియు రాయిగిరి వద్ద ప్రస్తుత ఆర్చ్ స్థానములో భారీ ఆర్చ్ ను సుమారు రూ.3.16 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఆమోదించారు. ఈ కళ్యాణ మండపాన్ని, భారీ ఆర్చ్ ను గౌరవ ధర్మకర్తల మండలి చైర్మన్ డా. ఎమ్.సత్యనారాయణ రెడ్డి గారు స్వంత ఖర్చులతో నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

3. వేద పాఠశాల, విశ్వవిద్యాలయం, మోడల్ గోశాల: దేవస్థానం పరిసర ప్రాంతంలో వేద పాఠశాల, విశ్వవిద్యాలయం మరియు 40 ఎకరాలలో మోడల్ గోశాల ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.
4. అన్నప్రసాదం విస్తరణ: భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్యను ప్రస్తుత 1,500 మంది నుండి 2,000 మందికి పెంచేందుకు మరియు పరిశుభ్రత ప్రమాణాలతో అన్నప్రసాదాలను తయారు చేయడానికి అవసరమైన పరికరాలను రూ.18 లక్షలతో టెండరు ద్వారా కొనుగోలు చేయడానికి ఆమోదించారు.

5. సాంకేతిక మరియు ఆన్లైన్ సేవలు: ప్రముఖ దేవాలయాలలో అమలులో ఉన్న విధానాలను అనుసరించి, ఈ దేవస్థానంలో కూడా టీసీఎస్ (TCS) సంస్థ సహకారంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ టికెట్ వ్యవస్థ తదితర సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఆమోదించారు.

6. విజన్-2047: విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా దేవస్థానం అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు వ్యూహ పత్రము తయారు చేయుటకు ఐఎస్బి వారిని నియమించుటకు ఆమోదము తెలిపియున్నారు.

7. ప్రత్యేక సబ్కమిటీలు, కమిటీలు: దేవస్థానంలో ఆర్థిక క్రమశిక్షణ, పనుల నాణ్యత,కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత మరియు దేవస్థాన ఆస్తుల సమర్థవంతమైన నిర్వహణ కోసం గౌరవ ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక సబ్కమిటీలు, కమిటీలను ఏర్పాటు చేయడానికి ఆమోదించారు.

8. దేవస్థానముపై పడు ఆర్థిక భారము తగ్గించుటకు దేవస్థాన భవన సముదాయములపై, పార్కింగ్ స్థలములో 4 మెగా వాట్లతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయుటకు ఆమోదించినారు.

9. ప్రధాన కూడళ్లలో రాతి విగ్రహాలు: దేవస్థానం పరిసర ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో గరుడాళ్వార్, యాద ఋషి, శ్రీ రామానుజులు, ప్రహ్లాదుడు మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి రాతి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఆమోదించారు.

10. రెండవ కళ్యాణకట్ట: వయోవృద్ధులు, మహిళలు మరియు చిన్నపిల్లల సౌకర్యార్థంకొండకింద దేవస్థానం అద్దె గదుల సమీపంలో రెండవ కళ్యాణకట్టను రూ.9 లక్షలతో నిర్మించేందుకు ఆమోదించారు. ఈ నిర్మాణాన్ని గౌరవ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గుండా మల్లయ్య గారు స్వంత ఖర్చులతో చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
11. డోనార్ మరియు పిలిగ్రిమ్ ఎమినిటి సెంటర్లు: భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కొండపైన వేంచేపు మండపం పక్కన డోనార్ ఎమినిటి సెంటర్, అలాగే బస్టాండ్ ఉత్తర భాగంలో పిలిగ్రిమ్ ఎమినిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆమోదించారు.

12. ఎలక్ట్రానిక్ శంఖు చక్ర నామాల లైటింగ్: యాదగిరిగుట్ట పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు స్పష్టంగా కనిపించే విధంగా గతంలో ఉన్న మాదిరిగా ఆలయ దక్షిణ భాగంలో ఎలక్ట్రానిక్ శంఖు చక్ర నామాలను లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. ఈ లైటింగ్ వ్యవస్థను ధర్మకర్తల మండలి సభ్యులు కొణిదెల సురేఖ గారు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

13. సోలార్ ఫెన్సింగ్: కొండపైన విష్ణు పుష్కరిణి ప్రాంతాన్ని కోతుల నుండి రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. ఈ సోలార్ ఫెన్సింగ్ను ధర్మకర్తల మండలి సభ్యులు ఈశ్వరమ్మ యాదవ్ గారు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

14. మెట్ల మార్గంలో షెడ్: భక్తుల సౌకర్యార్థం కొండకింద నుండి కొండపైకి వచ్చే మెట్ల మార్గంలో దాతల సహకారంతో షెడ్ నిర్మాణం చేపట్టేందుకు సంబందించిన ఏం.ఓ.యు. ను ఆమోదించారు.

15. ప్రోటోకాల్ పరిధిలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ప్రముఖులు వ్యక్తిగతంగా ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయబడుతుంది. ప్రముఖుల యొక్క సిఫారసు లేఖలు / ఫోన్ సందేశముల ఆధారంగా వాహనాలు కొండపైకి ప్రవేశానికి, దర్శనం పొందేందుకు నిర్దేశించిన టిక్కెట్లను పొందవలసియుంటుంది. ఈ విధానం అందరికీ సమానమైన అవకాశాన్ని కల్పించడంతో పాటు, దర్శన వ్యవస్థలో పారదర్శకత, క్రమశిక్షణ మరియు నిబంధనలు అవసరమని బోర్డ్ భావించి తీర్మానించనైనది.

యాదాద్రి, జూలై 29: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజు, ఐఏఎస్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ...
29/07/2026

యాదాద్రి, జూలై 29: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజు, ఐఏఎస్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, యాదాద్రి దేవస్థానం (వైటీడీ) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) భవాని శంకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అధికారికంగా స్వీకరింపజేశారు.
Yadadri, July 29: Telangana Chief Secretary Sanjay Jaju, IAS, offered prayers to Lord Sri Lakshmi Narasimha Swamy at the Yadadri Temple and was formally sworn in as an Ex-Officio Member of the Yadadri Temple Development (YTD).

యాదగిరిగుట్ట లో  ఏకాదశి లక్ష పుష్పార్చనశ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ మ...
25/07/2026

యాదగిరిగుట్ట లో ఏకాదశి లక్ష పుష్పార్చన

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. పాంచరాత్రాగమానుసారంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు....

Yadadri Giri Pradakshinaశ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్...
22/07/2026

Yadadri Giri Pradakshina
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి తమ భక్తిని చాటుకున్నారు.

దేవాదాయ శాఖలో చారిత్రాత్మక నియామకాలురాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేసిన 191 పోస్టుల్లో యాదగిరిగుట్ట  దేవస్థానము లో 54 పోస్టులు...
17/07/2026

దేవాదాయ శాఖలో చారిత్రాత్మక నియామకాలు
రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేసిన 191 పోస్టుల్లో యాదగిరిగుట్ట దేవస్థానము లో 54 పోస్టులు నియామకం కాబడిన వారికీ నియామక పత్రాలు అందజేయనైనది.
[పోస్టుల వివరాలు :
పరిచారకులు ( ప్రధాన ఆలయం ) -19,
పరిచారిక (శివాలయం )- 5 ,
వేదపండిత్ ( అథర్వణ వేదం ) -1,
పురోహిత్ (వాహన పూజలు) -1,
సహాయా పాచక (రామానుజకుటం) - 11 ,
సహాయ పాచక (బ్రాహ్మణ సత్రం) -2,
సహాయ పాచక (ప్రసాద విక్రయం) - 6 ,
సహాయ పాచక (అన్నదానం) - 4,
డోలు -1,
సన్నాయి -2,
శృతి -1,
తాళం -1,

శుభోదయంReal and AI
17/07/2026

శుభోదయం
Real and AI

TTD సందర్షన లో  YTDతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం శ్రీవారి భక్తులకు టిటిడి అంద...
16/07/2026

TTD సందర్షన లో YTD

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలు, పాలనను అధ్యయనం చేసేందుకు యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి భవాని శంకర్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారుల బృందం తిరుమల తిరుపతి దేవస్థానమును సందర్శించారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో దాత లకు కల్పించబడుచున్న సదుపాయాలు డోనార్ ఫెసిలిటీ సెంటర్ మరియు విచ్చేయు భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించుటలో టీటీడీ అవలంబిస్తున్న విధానాలను పరిశీలించారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు వితరణ, కళ్యాణ కట్ట, క్యూలైన్లు నిర్వహణ, వసతి, ఐటీ, వివిధ ట్రస్ట్ లు, ధార్మిక కార్యక్రమాలు, విద్యాసంస్థల నిర్వహణ, వైద్య సేవలు, శ్రీవారి సేవలు, విజిలెన్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, కంపార్ట్మెంట్ ల నిర్వహణ, కమాండ్ కంట్రోల్ సెంటర్, పారిశుధ్యం, పచ్చదనం, గోశాల, ప్రసాదాల తయారీ తదితర అంశాల తెలుసుకున్నారు

Address

Yadadri Yadagirigutta
Yadgirpalli
508115

Alerts

Be the first to know and let us send you an email when Yadagirigutta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category