Sri Gnana Saraswati Devi Peetam

Sri Gnana Saraswati Devi Peetam devotion with essence of humanity ( అవ్యక్తరుపము : సామాన్య నేత్ర దృష్టికి కాక ,ఉపాసనా శక్తి గల జ్ఞాన దృష్టి కి మాత్రమే కనబడు రూపము ..

నేడు అమ్మవారు సాకారముగా అనుగ్రహించిన స్థలము ,ఒకప్పుడు అరణ్యముగా మునుల,సిద్ధుల తపస్సులచే అలరారిన తపోభూమి. ఆవిధంగా వారి తపస్సులచే అలరరిన ఈ ప్రదేశం కాలాంతరములో వేదపాఠశాలగా అనేక మంది విద్యార్థులకు వేదవిద్యను అందించిన వేదభూమి. (ఆదిశంకరుల శృంగేరి ఆమ్నాయ పీఠాధిపతి 9వ జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్యస్వామి వారి జన్మ స్థలము మరియు వేదాభ్యాస స్థలము ఈ ప్రదేశమే కావడం స్మరణీయము) ఆ క్రమములో నిత్య వేదపారాయణ

ాది , క్రతువులతొ మరియు అగ్ని కార్యములతో అలరారిన ఈ స్థలాన్ని "వేదప్రియా" "వేదగమ్యా" అయిన ఆ సరస్వతీ దేవి అవ్యక్త రూపిణిగా సాక్షాత్కరించి అనుగ్రహించినది. "అనంతమామృతం పరం జ్ఞానేనైకేన తల్లభ్యం క్లేశేనపరమమ్ పదం !
జ్ఞానమేవ ప్రవిష్యంతే మామేవ ప్రవిష్యంతితే !! ( కూర్మ పురాణం) "
నా అమృత పరమైన అనంత రూపము మిక్కిలి ప్రయత్నముతో , కేవలం జ్ఞానముతో మాత్రమే పొన్దదగినది . జ్ఞానదృష్టి కలవారు మాత్రమే నన్ను ప్రవేశింతురు.)
కాలప్రవహములొ ఈ స్థలములు ఆక్రమణలకు మరియు నిరాదరణకు గురై వాటి అస్థిత్వాన్నికోల్పోయినవి .
ఆ తదుపరి మన గురువుగారు ,శ్రీ.విద్యోపాసకులు , వేదాంత శిరోమణి బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ
శ్రీ ఉమాశంకర సరస్వతీ(పండిత్) స్వామి వారికి వారి శిష్యులు ఈ ప్రదేశాన్ని మరియు అందులో గృహాన్ని నిర్మించి గురుదక్షిణగా సమర్పించిన తరువాత , వారి నిత్య దేవి ఆరాధనలో అలౌకికానందఅనుభూతి కలుగుతుండటంచే వారు ఈ ప్రదేశములో కొంత కాలము దీక్షాబద్దులై తపస్సు చేయడంతో ఆ తల్లి దర్శనమిచ్చి , ఆశీర్వదించి అనుగ్రహించడంచేత ఈ పీఠము ఏర్పడినది.
నేటికి ఆ తల్లి యొక్క సామీప్యతానుభూతి ఈ పీఠములో కొద్దిపాటి ధ్యానముతో ఉపాసకులు పొందవచ్చును.
ఈ విధముగా ఇంతింతై వటుడిన్తై అన్నట్లుగా ,ఆ తల్లిని దర్శించి ఆ తల్లి అనుగ్రహముతో సకల శుభములను పొందే భక్తుల సంఖ్య దినదినము అభివృద్ధి చెందుతున్నది.

Address

Bhadrakali Temple Road
Warangal
506001

Opening Hours

Monday 6am - 12pm
5:30pm - 8:30pm
Tuesday 6am - 12pm
5:30pm - 8:30pm
Wednesday 6am - 12pm
5:30pm - 8:30pm
Thursday 6am - 12pm
5:30pm - 8:30pm
Friday 6am - 12pm
5:30pm - 8:30pm
Saturday 6am - 12pm
5:30pm - 8:30pm
Sunday 6am - 12pm
5:30pm - 8:30pm

Telephone

+918074692852

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Gnana Saraswati Devi Peetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Gnana Saraswati Devi Peetam:

Shortcuts

Share