Medaram

Medaram Sammakka Saralamma Jatara or Medaram Jatara is a tribal festival of honouring the goddesses celebrat

 #మేడారంహుండీ ఆదాయం రూ.13,25,83,269గత జాతర కంటే రూ.65,454 ఎక్కువ.బంగారం 486gr.వెండి 31 gr.
12/02/2026

#మేడారంహుండీ ఆదాయం రూ.13,25,83,269
గత జాతర కంటే రూ.65,454 ఎక్కువ.
బంగారం 486gr.
వెండి 31 gr.

*సొంత కొడుకు చెర నుంచి కాపాడాలని ఓ తల్లి ఆవేదన*మేడారం నోట్ల లెక్కింపు ఓ పెద్ద టాస్క్... బెల్లం, పసుపు అద్దిన, నలిగిన నోట...
09/02/2026

*సొంత కొడుకు చెర నుంచి కాపాడాలని ఓ తల్లి ఆవేదన*

మేడారం నోట్ల లెక్కింపు ఓ పెద్ద టాస్క్...

బెల్లం, పసుపు అద్దిన, నలిగిన నోట్లు...

అంతేకాదు... నోట్ల మీద కోరికలు...

అందులో ఇదుగో, ఇలా కొడుకు నుంచి రక్షించు తల్లీ వంటి వినతులు కూడా...

సమ్మక్క- సారలమ్మలకు ఏం చెప్పుకోవాలనుకున్నా నోట్ల మీద రాసి హుండీలో వేయడమే...

With Bramhasri Samavedam Shanmukha Sarma – I just got recognised as one of their top fans! 🎉
07/02/2026

With Bramhasri Samavedam Shanmukha Sarma – I just got recognised as one of their top fans! 🎉

*మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం*హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు మొదలైంది. ఈ లెక్కింపును దేవా...
05/02/2026

*మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం*

హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు మొదలైంది. ఈ లెక్కింపును దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం 500 మంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపడుతున్నారు. మొత్తం 788 హుండీలలోని కానుకలు లెక్కిస్తారు. గత జాతరలో 540 హుండీలు పెట్టగా 13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ధపా అంతకన్నా ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
#మేడారం

ఇదిగో ఇదే సమ్మక్కతల్లి నెలవున్న కుంకుమభరిణె కలిగి ఉన్న వెదురుబుర్ర     #మేడారంPhoto credit:Sri Veljala Chandrasekhar(Sr ...
01/02/2026

ఇదిగో ఇదే సమ్మక్కతల్లి నెలవున్న కుంకుమభరిణె కలిగి ఉన్న వెదురుబుర్ర
#మేడారం

Photo credit:
Sri Veljala Chandrasekhar(Sr Journalist)
Sri Chethi Srinivas (Velugu Photo Journalist)

ఈసారి మేడారం జాతరలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ తన డ్యాన్స్‌తో నెట్టింట వైరల్‌గా మారారు. గిరిజన డాన్స్‌తో నెటిజన్ల మ...
01/02/2026

ఈసారి మేడారం జాతరలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ తన డ్యాన్స్‌తో నెట్టింట వైరల్‌గా మారారు. గిరిజన డాన్స్‌తో నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. మినిస్టర్ సీతక్క, ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అక్కడ ఉన్న మిగతా సిబ్బందితో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎంతో కష్టపడితే కానీ సివిల్స్ ర్యాంక్ రాదు. అదీ ఐపీఎస్ దక్కాలంటే ఎంతో పట్టుదల, క్రమశిక్షణ అవసరం. గొప్పగా చదివి, కరోఠ శిక్షణ దాటి.. బాధ్యతతో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఈ లేడీ ఆఫీసర్ గురించి.. కొందరు మేడారం మోనాలిసా.. కాస్త దిగజారి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటివారు హద్దుల్లో ఉంటే మంచిది.

ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్. ఆమెకు IAS అజయ్ యాదవ్ (తెలంగాణ కేడర్)తో వివాహం జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల నుంచి NOCలు వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ ఆమెను తెలంగాణకు బదిలీ చేసింది. ప్రస్తుతం వసుంధర యాదవ్ ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె గ్రేహౌండ్స్‌లో పనిచేసినట్లు సమాచారం.

యూపీలోని ఆజంగఢ్‌కు చెందిన వసుంధర యాదవ్.. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేశారు. నాన్న ఫరూబీ యాదవ్ కల నెరవేర్చేందుకు సివిల్స్ ఎంచుకున్నారు. ఐదుసార్లు ఓటమి ఎదరైనా.. వెనక్కి తగ్గకుండా.. ఆరో ప్రయత్నంలో తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా నిలిచారు. ఫిబ్రవరి 2025లో ఆమెకు IAS అజయ్ యాదవ్‌తో వివాహమైంది.

01/02/2026

*ముగిసిన మేడారం జాతర*

*ఏర్పాట్లపై భక్తుల్లో తీవ్ర అసంతృప్తి*

*ప్రభుత్వ వైఫల్యంతో ఆగం ఆగమైన భక్తులు*

*అనుభవం లేని అధికారులతో ట్రాఫిక్ కుప్పకూలింపు*

*సీతక్క ఫ్లెక్సీల హడావుడి.. మౌలిక వసతులపై నిర్లక్ష్యం*

మేడారం / వరంగల్.

ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈసారి ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “చిన్నచిన్న ఇబ్బందులే” అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*14గంటల బస్సు ప్రయాణం*

సాధారణంగా వరంగల్ నుంచి మేడారం చేరేందుకు రెండు గంటల ప్రయాణమే సరిపోతే, ఈసారి 13 నుంచి 14 గంటల వరకు బస్సుల్లోనే చిక్కుకుపోయామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు వరంగల్‌లో బస్సు ఎక్కిన భక్తులు, మరుసటి రోజు ఉదయం 9 గంటల తర్వాతే మేడారం చేరిన పరిస్థితి నెలకొందని తెలిపారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాపోయారు.

*అడవుల్లోనే వాహనాలు?*

అనేక కార్లు రాత్రంతా అడవుల్లోనే నిలిచిపోయాయని, కనీస వెలుతురు, నీరు, టాయిలెట్ సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. సింగిల్ రోడ్లు ఉన్న గత జాతరల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదని, డబుల్ రోడ్లు, ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారిందని విమర్శించారు.

*అనుభవం లేని యంగ్ ఆఫీసర్లు?*

రోడ్డు మార్గాల్లో క్షేత్రస్థాయిలో ఒక్క అనుభవజ్ఞుడైన అధికారి కూడా సమర్థవంతంగా పని చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో మాత్రం పదుల సంఖ్యలో యంగ్ పోలీస్ అధికారులు కనిపించారని, గద్దెల చుట్టూనే హడావుడి పరిమితమైందని భక్తులు విమర్శిస్తున్నారు. గతంలో రోడ్లను సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ఒక అధికారి నియమించేవారని గుర్తు చేస్తున్నారు.

*వరంగల్ పోలీస్ అధికారుల సేవలు వినియోగించుకోలేదు?*

అనుభవం ఉన్న వరంగల్ పోలీస్ అధికారుల సేవలను ఎందుకు వినియోగించుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గన్ ఫైరింగ్‌లు, డాన్స్‌లు కాదు, టెక్నాలజీని ఉపయోగించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

*సీతక్క ఫ్లెక్సీలకు ప్రాధాన్యం.. వసతులకు నిర్లక్ష్యం?*

ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే కనిపించాయని, వాటికి ఇచ్చిన ప్రాధాన్యత భక్తులకు ఉపయోగపడే టాయిలెట్లు, మంచినీటి సౌకర్యాలపై లేకపోయిందని భక్తులు బహిరంగంగా విమర్శించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రతి చోట కనీసంగా నీరు, టాయిలెట్లు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

*వీవీఐపీ దర్శనాలపై విమర్శలు?*

ఒక సీరియల్ నటిని "ఓ పోలీస్ అధికారి" పోలీస్ వాహనంలో తీసుకొచ్చి వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనం కల్పించినట్లు సమాచారం.

అనంతరం సదరు నటి పోలీస్ టోపీ, లాఠీతో ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటే, ఇలాంటి వ్యవహారాలు అన్యాయమని భక్తులు మండిపడుతున్నారు.

*కానిస్టేబుళ్లకు కష్టాలు.. అధికారులకు ఎంజాయ్?*

జాతర నిర్వహణలో కష్టపడ్డది మాత్రం క్షేత్రస్థాయి కానిస్టేబుళ్లేనని, పై స్థాయి యంగ్ అధికారులు మాత్రం బాధ్యతలకన్నా హడావుడికే పరిమితమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి.

*ఇది చిన్న ఇబ్బందులు కాదు*

రాష్ట్ర జనాభాలో సుమారు పావు వంతు భక్తులు వచ్చే ఈ మహాజాతరను సమర్థంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర జనాభాలో సుమారు పావు వంతు అంటే కోటిన్నర మంది భక్తులు వచ్చే ఈ మహాజాతరకు మించిన ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ప్రభుత్వానికి ఇంకేముందని ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి విగ్రహాలు, అలంకరణలు చేయడం కంటే, అమ్మవార్లపై అపార భక్తితో వచ్చిన భక్తులను కనీసం సాటి మనిషిలా చూసుకునే ఏర్పాట్లు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

ఉద్యోగం లేక అల్లాడుతున్న యువతకు తాత్కాలిక ఉపాధి వారం రోజుల పాటు కల్పిస్తూ, భక్తులకు సమాచారం, మార్గనిర్దేశం, అవసరమైన సహాయం అందించేలా వాలంటీర్లను నియమించి ఉంటే, వృద్ధులు–పిల్లలను గద్దెల వరకు చేర్చే ఏర్పాట్లు చేయవచ్చని, దీనికి గరిష్టంగా 2 కోట్ల వరకు సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది చిన్నచిన్న ఇబ్బందులు కాదని, మొత్తం ప్రభుత్వ వైఫల్యమేనని మేడారానికి వచ్చిన భక్తులంతా రాజకీయాలకు అతీతంగా స్పష్టంగా చెబుతున్నారు.

*మేడారం జాతర ఖర్చుల షాక్.. మాంసం–మద్యం పైనే రూ.400 కోట్లు!* తెలంగాణలో నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన మేడారం జాతరలో భక్...
01/02/2026

*మేడారం జాతర ఖర్చుల షాక్.. మాంసం–మద్యం పైనే రూ.400 కోట్లు!*

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన మేడారం జాతరలో భక్తులు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. కోటిన్నర మంది భక్తులు హాజరుకాగా, 14 లక్షల మేకలు, గొర్రెలను బలిచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క మద్యం కోసమే రూ.10 కోట్లు, మాంసం-మద్యం కలిపి రూ.400 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. వీటితో పాటు కోటికి పైగా కొబ్బరికాయలు, 500 టన్నుల బెల్లం విక్రయాలు జరిగాయి.

01/02/2026

సీతక్క మీడియా సమావేశం..
జ్యోతిష్యుడు వేణుస్వామిపై పరోక్షంగా ఫైర్
#మేడారం

ట్రాఫిక్ జామ్అధికారులపై భక్తుల ఫైర్2004 తర్వాత మళ్లీ ఇప్పుడు..
01/02/2026

ట్రాఫిక్ జామ్
అధికారులపై భక్తుల ఫైర్
2004 తర్వాత మళ్లీ ఇప్పుడు..

Address

Medaram
Warangal
506002

Alerts

Be the first to know and let us send you an email when Medaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Medaram:

Shortcuts

Share