Abhay_anjaneya_swamy_temple

Abhay_anjaneya_swamy_temple 🙏 *శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆటోనగర్ వరంగల్*🙏

💐మా చైర్మన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు💐
19/06/2022

💐మా చైర్మన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు💐

Jai sri ram... 🙏🙏
25/05/2022

Jai sri ram... 🙏🙏

Hanuman jayanti shubakanshalu...🙏🙏
25/05/2022

Hanuman jayanti shubakanshalu...🙏🙏

02/04/2022

🙏🙏🙏🙏🙏
🏵️యుగ యుగాల పర్వం ఉగాది🏵️
🌼🌼🌼🌼🌼
అఖండమైన సృష్టి ప్రారంభమైన రోజు ఉగాది. తెలుగువారికి...చాంద్రమానం అనుసరించేవారికి సంవత్సరంలో తొలి పండుగ. ఎన్నో యుగాల నాటి ఈ పండుగ కాల విభజనకు ఒక సూచిక. భవిష్యత్తులో చేయాల్సిన సత్కార్యాలకు సంకల్పం చేసుకోవడానికి కాలం ఇచ్చిన ఒక అవకాశం.

కాలం అనంతం. దాని భ్రమణం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అందుకనే దాన్ని ‘కాలచక్రం’ అన్నారు. అలాంటి కాలానికి పరిమితులు లేకపోతే మానవుల మనుగడ కష్టమవుతుంది. పూర్వ ఋషులు తమ మేధస్సుతో కాలాన్ని ఖగోళం ఆధారంగా లెక్కించారు. సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయనీ, సూర్యుడి ప్రభావం మిగిలిన గ్రహాల మీద ఉంటుందనీ గుర్తించారు. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అనీ, చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే ఒక మాసం అనీ, భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే ఒక సంవత్సరమనీ గణన చేశారు. ఈ గణనలో నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, పక్షాలూ, ఋతువులూ, ఆయనాలు (ఆయనం అంటే ప్రయాణం. సూర్యుడి గమనం ఆధారంగా ఆయనాలను పూర్వులు నిర్వచించారు. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే సమయాన్ని ఉత్తరాయనం అనీ, దక్షిణం వైపు ప్రయాణించడాన్ని దక్షిణాయనమనీ పేర్కొంటారు) ఎలా ఏర్పడ్డాయో ‘శ్రీ విష్ణుపురాణం’ ఈ శ్లోకాల్లో వివరించింది.

కాష్ఠా పంచదశాఖ్యాతా నిమేషా మునిసత్తమః

కాష్ఠా త్రిశంత్కలా త్రింశక్తలా మౌహూర్తికోవిధిః

తావత్సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషంస్కృతమ్‌

అహోరాత్రాణితావన్తి మాసః పక్షద్వయాత్మకః

రెప్పపాటు కాలం ఒక నిమిషం. పదిహేను నిమిషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కల. ముప్ఫై కలలు ఒక ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు ఒక దినం (పగలు-రాత్రి). పదిహేను దినాలు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక మాసం. ఆరు మాసాలు ఒక ఆయనం. రెండు ఆయనాలు ఒక సంవత్సరం. సంవత్సరానికి ఆరు ఋతువులుగా కాలమానాన్ని ఈ శ్లోక భావం వెల్లడిస్తోంది.. నాటి ఋషులు కాలమానాన్ని తొమ్మిది విధాలుగా విభజించారు. ప్రస్తుతం అయిదు కాలమానాలే ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో చాంద్రమాన, సూర్యమానాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సూర్య, చంద్రుల సంచారాన్ని బట్టి ఈ మానాలు ఏర్పడ్డాయి.

చైత్ర శుక్ల సమారంభే జగతాం జగదీశ్వరః

సర్వం చక్రేతదారాజన్‌! తతస్తస్మిన్‌ సదాదినే

బ్రహ్మ చైత్ర శుక్ల పాడ్యమి రోజున సృష్టి ముగించాడనీ, అదే యుగారంభమనీ చెబుతారు. అయితే, ఆ రోజునే సృష్టి ప్రారంభమయిందనీ అందుకే ఆ రోజు యుగాదిగా పరిగణన పొందిందనీ అంటారు. కాలక్రమంలో యుగాది అనే మాట ఉగాదిగా ప్రాచుర్యం పొందింది. ‘ఉగస్య ఆదిః ఉగాది’ అన్నారు పెద్దలు. ‘ఉగం’ అంటే నక్షత్ర సంచారం. అది మొదటి నక్షత్రమైన అశ్వినితో ప్రారంభమవుతుంది. శ్రీ విష్ణోత్తర పురాణాన్ని అనుసరించి... భూమధ్య రేఖ పైనుంచి చైత్ర శుక్ర పాడ్యమి అశ్వని నక్షత్రంలో సూర్యుడు ఉదయించాడు. అదే యుగారంభం అని వేద, పురాణాలు చెప్పాయి. చాంద్రమానాన్ని అనుసరించేవారు తెలుగువారు, కన్నడిగులు, మహారాష్ట్రవాసులు, మరికొన్ని ప్రాంతాలవారు ఈ రోజును ఉగాదిగా, సంవత్సరాదిగా పండుగ జరుపుకొంటున్నారు. ఆ రోజునే వసంత ఋతువు ప్రారంభం కావడం సంవత్సరాదికి మరో విశేషం.

కొత్త సంవత్సరం ఆరంభమైనప్పుడు... దాన్ని ఎలా పాటించాలో కూడా ఆనాడే ఋషులు నిర్ణయించారు. విధి విధానాలను స్పష్టంగా చెప్పారు. ఆ ప్రకారం... ప్రాతఃకాలంలో తైలాభ్యంగన స్నానం చెయ్యాలి. ఇంట్లోని పెద్దలతో నువ్వుల నూనెను తలపై పెట్టించుకొని, వారి ఆశీస్సులు తీసుకున్న తరువాత స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందన్నది పెద్దల మాట. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, కులదైవాన్ని ఆరాధించాలి. పెద్దలకు నమస్కరించి, ఆశీస్సులు పొందాలి. దైవాన్ని ఆరాధించే సమయంలో నూతన పంచాంగాన్ని పూజించాలి.వై ఉగాది పచ్చడి నివేదించాలి. ఆ పచ్చడి ఎలా చేయాలో కూడా శాస్త్రమే చెప్పింది.

‘కించ యద్వర్షాదౌ నింబ కుసుమం - శర్కరామ్ల ఘృతైర్యుతం

భక్షతం పూర్వ యేమేస్యాత్‌ - తద్వర్షం సౌఖ్యదాయకం’ అని.

ప్రధానమైన వేప పువ్వుతో పాటు బెల్లం, కొత్త చింతపండు, ఆవు నెయ్యి, మామిడి కాయముక్కలు కలిపి గుజ్జుగా తయారు చేయాలి. నివేదన పూర్తికాగానే ప్రసాదంగా దాన్ని పరగడుపునే భుజించాలి. ఆయుర్వేద పరంగా ఇది గొప్ప ఔషధం. దీనివల్ల ఏడాది కాలం వాత, పిత్త, కఫ దోషాలు దరి చేరవని ఆయుర్వేదం చెబుతోంది. ఇంట్లో కానీ, దేవాలయాలలో కానీ పంచాగ శ్రవణం చేయాలి. దీనివల్ల... గ్రహాల సంచారం ద్వారా వ్యక్తులకు కలిగే సుఖాలు, సంపదలతో పాటు ఆ సంవత్సర కాలంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది.
🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏

02/04/2022

*ఆరు రుచులు ఆరోగ్య రహస్యం* 🌺

ఉగాది అనగానే గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలోని ఆనంద, విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయినులని ఆయుర్వేదం చెబుతున్నది. వేపపూవు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.
మన నాలుక గ్రహించగలిగే ఆరు రుచులను షడ్రుచులు అంటారు. అవి మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు (కారం), తీక్తం (చేదు), కషాయం (వగరు). ఆరోగ్యపరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి.
ఉగాది పచ్చడిలో ఆరోగ్యం..
వేప పూవు ఉగాది పచ్చడిలోని ప్రధాన ద్రవ్యం. దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు. అవి అందించే ఆరోగ్యం ఏంటో చూద్దాం.

🌸 *తీపి* 🌸

వాత, పిత్త హరిణి. తీపి శరీరానికి అవసరమైన బలాన్ని అందించి పోషిస్తుంది. తల్లి పాలను వృద్ధిపరుస్తుంది. దప్పిక, మూర్ఛలను తగ్గిస్తుంది. మంటలనుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది.

🌺 *పులుపు* 🌺

వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. గుండెకు మేలు చేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. శుక్రాన్ని తగ్గిస్తుంది. రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజితం చెందిస్తుంది.

🌸 *ఉప్పు* 🌸

వాతహరిణి. మలబద్ధకాన్ని నివారించి ఆకలిని పెంపొందిస్తుంది. కఫాన్ని, కంటి ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. శుక్రనాశకంగా పనిచేస్తుంది.

🌺 *కారం* 🌺

ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది. రుచిని పుట్టిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. కాని ఎక్కువగా తీసుకుంటే రస రక్తాది ధాతువులు దెబ్బతింటాయి.

🌸 *చేదు* 🌸

కఫహారం, పిత్తాహారం, క్రిమిహారం, జ్వరహారం. విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలలోని దోషాలను తగ్గిస్తుంది. దప్పికను, దురదలను, మంటలను పోగొడుతుంది. చర్మవ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తుంది.

🌺 *వగరు* 🌺

శేలష్మ, రక్త, పిత్తాల బాధను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది. అధిక స్రావాలను ఆపుతుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్రకణాలను నష్టపరుస్తుంది.

🔻 *బెల్లం (తీపి):* జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్నిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది.

🔻 *కొత్త చింతపండు (పులుపు):* తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది. విరేచనకారకం, వాపును ఐక్యం చేస్తుంది.

🔻 *ఉప్పు:* కఫహారం, విషాహారం, మలమూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది.

🔻 *మిరియాలు (కారం):* కఫవాతహారం, ఆకలిని పెంచుతుంది. శుక్రకణ నాశిని.

🔻 *వేపపూవు (చేదు):* కఫ పిత్తాదులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దగ్గు, వ్రణాలు, జ్వరానికి చాలా మంచిది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

🔻 *పచ్చిమామిడి (వగరు):* కషాయరసం కలిగినది. విరేచనాలను తగ్గిస్తుంది. బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.

ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి, నూతన సంవత్సరంతోపాటు నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.
🙏🙏🙏🙏🙏*ఆరు రుచులు ఆరోగ్య రహస్యం* 🌺

ఉగాది అనగానే గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలోని ఆనంద, విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయినులని ఆయుర్వేదం చెబుతున్నది. వేపపూవు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.
మన నాలుక గ్రహించగలిగే ఆరు రుచులను షడ్రుచులు అంటారు. అవి మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు (కారం), తీక్తం (చేదు), కషాయం (వగరు). ఆరోగ్యపరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి.
ఉగాది పచ్చడిలో ఆరోగ్యం..
వేప పూవు ఉగాది పచ్చడిలోని ప్రధాన ద్రవ్యం. దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు. అవి అందించే ఆరోగ్యం ఏంటో చూద్దాం.

🌸 *తీపి* 🌸

వాత, పిత్త హరిణి. తీపి శరీరానికి అవసరమైన బలాన్ని అందించి పోషిస్తుంది. తల్లి పాలను వృద్ధిపరుస్తుంది. దప్పిక, మూర్ఛలను తగ్గిస్తుంది. మంటలనుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది.

🌺 *పులుపు* 🌺

వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. గుండెకు మేలు చేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. శుక్రాన్ని తగ్గిస్తుంది. రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజితం చెందిస్తుంది.

🌸 *ఉప్పు* 🌸

వాతహరిణి. మలబద్ధకాన్ని నివారించి ఆకలిని పెంపొందిస్తుంది. కఫాన్ని, కంటి ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. శుక్రనాశకంగా పనిచేస్తుంది.

🌺 *కారం* 🌺

ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది. రుచిని పుట్టిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. కాని ఎక్కువగా తీసుకుంటే రస రక్తాది ధాతువులు దెబ్బతింటాయి.

🌸 *చేదు* 🌸

కఫహారం, పిత్తాహారం, క్రిమిహారం, జ్వరహారం. విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలలోని దోషాలను తగ్గిస్తుంది. దప్పికను, దురదలను, మంటలను పోగొడుతుంది. చర్మవ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తుంది.

🌺 *వగరు* 🌺

శేలష్మ, రక్త, పిత్తాల బాధను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది. అధిక స్రావాలను ఆపుతుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్రకణాలను నష్టపరుస్తుంది.

🔻 *బెల్లం (తీపి):* జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్నిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది.

🔻 *కొత్త చింతపండు (పులుపు):* తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది. విరేచనకారకం, వాపును ఐక్యం చేస్తుంది.

🔻 *ఉప్పు:* కఫహారం, విషాహారం, మలమూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది.

🔻 *మిరియాలు (కారం):* కఫవాతహారం, ఆకలిని పెంచుతుంది. శుక్రకణ నాశిని.

🔻 *వేపపూవు (చేదు):* కఫ పిత్తాదులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దగ్గు, వ్రణాలు, జ్వరానికి చాలా మంచిది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

🔻 *పచ్చిమామిడి (వగరు):* కషాయరసం కలిగినది. విరేచనాలను తగ్గిస్తుంది. బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.

ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి, నూతన సంవత్సరంతోపాటు నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.
🙏🙏🙏🙏🙏

02/04/2022

*🥭ఉగాది నుండే తెలుగు సంవత్సరము మొదలవుతుంది🥭*

తెలుగు వారు జరుపుకొనే పండగ లలో ముఖ్య మైనది. ఉగాది నుండే తెలుగు సంవత్సరము మొదలవుతుంది . ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం పరిపాటి . ఇది ఇంగ్లీష్ డేట్స్ ప్రకారము రాదు . చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపు కొంటాము .

సంవత్సర కాలగణనలో ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ వారి వారి పద్ధతుల్ని ఏర్పరచుకున్నాయి. భారతదేశంలో ప్రధానంగా ఒకే సనాతన సంస్కృతి ఉన్నప్పటికీ, ఆచారవ్యవహారాల్లో సంప్రదాయాల్లో కొద్దిపాటి భేదాలు కనిపిస్తుంటాయి. ఉత్తర దక్షిణ భారతదేశంలో కొన్ని వైవిధ్యాలున్నా- ప్రధాన జ్యోతిశ్శాస్త్రం, గణనసూత్రం ఒక్కటే.

ఉత్తరాదిలో బార్హస్పత్యమానం, దక్షిణాదిన సౌర, చాంద్రమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. తెలుగు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చాంద్రమానాన్ని అవలంబిస్తారు.

చంద్రమానం ప్రకారం చైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తయ్యే సంవత్సరానికి ఈరోజు (చైత్రశుద్ధ పాడ్యమి) ఆది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. 'ఉగం' అంటే 'నక్షత్ర గమనం' అనే అర్థం ప్రకారం ఏడాదిని 'ఉగం'గానూ, దాని తొలిదినాన్ని 'ఉగాది'గానూ వ్యవహరిస్తారు. అదేవిధంగా రెండు అయనాలు ఉన్న సంవత్సరాన్ని 'యుగం' అంటే, మొదటిరోజున 'యుగాది' అనవచ్చు. దాన్ని 'కల్వాది'గా కూడా కొన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ తిథినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని వాటి కంఠోక్తి. వసంత రుతువులో 'తొలి'తనం, శిశిరంలో 'చివరి' లక్షణం ప్రకృతిలో ప్రత్యక్షమయ్యే గమనం. ఈ రెంటి నడుమ ఏడాదికాలాన్ని పరిగణించడం చక్కని ప్రాకృతిక సమన్వయం. అరవై సంవత్సరాల పేర్లు సూర్య విజ్ఞానాన్ని సూచిస్తున్నవే.

*🥭ఉగాది కథ తెలుసుకుందామా?*

ఆంగ్లంలో నెలల పేర్లు చెప్పమంటే జనవరి నుంచి డిసెంబర్‌ వరకు చెబుతారు. అలాగే తెలుగు నెలలు వేరే ఉన్నాయని తెలుసుగా? వాటిని చైత్రం నుంచి ఫాల్గుణం వరకు చెప్పాలి. కాలాన్ని కొలవడంలో వేర్వేరు పద్ధతులను ఉపయోగించడం వల్లనే ఈ తేడాలు ఉంటాయి. సూర్యుని గమనం ఆధారంగా సౌరమానం, చంద్రుడి గమనం ఆధారంగా చాంద్రమానం వాడుకలో ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం తెలుగు నెలల్లో చివరిదైన ఫాల్గుణ మాసం పూర్తయ్యాక తిరిగి చైత్రమాసం మొదలవుతుంది. ఆ తొలిరోజునే 'ఉగాది'గా పరిగణిస్తారు. అంటే ఆంగ్ల క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాది జనవరి 1తో మొదలైతే, మన తెలుగు క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాది ఉగాది తో ఆరంభ మవుతుందన్నమాట.

పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. యుగానికి ఆది యుగాది అయితే, వాడుకలో అదే ఉగాదిగా మారిందని చెపుతారు. ఈ రోజుతోనే వసంత రుతువు మొదలవుతుంది.

ఉగాది పుట్టుక వెనుక మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. సృష్టిబాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కోరాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టున్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇస్తాడు. ఇదే మొదటి దేవుని విగ్రహమని అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేసిన బ్రహ్మ, ఆతర్వాత దాన్ని సూర్యుని కోరిక మేరకు అతనికి ఇచ్చాడు. సూర్యుడు తన కొడుకైన మనువుకు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఇచ్చారు. అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడి కోరికపై రాముడు దాన్ని ఇచ్చాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దాన్ని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహమే శ్రీరంగనాథస్వామి అని చెబుతారు. ఆ సంఘటన కూడా ఉగాదినాడే సంభవించిందంటారు.

ఉగాదిని మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్‌, సింధీ ప్రజలు చేసుకుంటారు. మహారాష్ట్ర లో ఉగాదిని గుడిపడ్వా అని, మణిపూర్‌లో సాజిబు చేరోబా అని, సింధీ ప్రజలు చేత చాంద్‌ అని పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది పచ్చడిని బేవు-బెల్లా అంటారు.

ఉగాది రోజు అమ్మ ఆరు రుచులతో కూడిన పచ్చడి చేస్తుంది కదా?x దానర్థం ఏమటంటే జీవితంలో సుఖ, సంతోషాలు, కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలనేదే! ఆరు రుచుల్లో తీపి సంతోషానికి, చేదు బాధకి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకు, వగరు ఆశ్చర్యానికి.
🙏🙏🙏🙏🙏

🌻🌻🌻🌻🌻దేవుని పాదాలపై పూలు పెట్టేందుకు గుడికి వెళ్ళకు,ముందుగా నీ  ఇంటిని ,మనసుని  దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపు......
24/09/2021

🌻🌻🌻🌻🌻
దేవుని పాదాలపై పూలు పెట్టేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా నీ ఇంటిని ,మనసుని దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపు......

దేవుని ముందుదీపాలు వెలిగించేందుకు గుడికి వెళ్ళకు,ముందుగా పాపం, గర్వం, అహంభావాల చీకటిని నీ హృదయం నుండి తొలగించుకో....

తల వంచి ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా నీ తోటి వారి ముందు వినయంగా
ఉండడం నేర్చుకో,....

మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,...నువ్వు అన్యాయము చేసిన వారికి క్షమాపణ చెప్పుకో....

నీవు చేసిన పాపాలకు క్షమించమనిఅడిగేందుకు గుడికి వెళ్ళకు,ముందుగా నిన్ను గాయపరిచిన వారిని హృదయ పూర్వకంగా క్షమించధము నేర్చుకో....

అప్పుడ
మన హృదయమే దేవాలయము అవుతుంది..ఆ దేవుడు నీలోనే కొలువై నీకు ఏమి ,ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు.
🌻🌻🌻🌻🌻

10/09/2021

*సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |*
*సర్వసిద్ధిప్రదాతారం వందేహం* *గణనాయకమ్* ...🙏🙏🙏

*ఆ గణపతి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి విజయాలు* *సాధించాలని సుఖ సంతోషాలతో* *ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. సభ్యులందరికీ* ....

*💐💐వినాయక చవితి శుభాకాంక్షలు* 💐💐

🙏🙏 మహా గణపతులు 108 రూపాలలో🙏🙏

1. ఏకాక్షర గణపతి
ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్

3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13. క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||

18. ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం

22.మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23.త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24. వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25. ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27. సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28. గురు గణపతి
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30. అర్క గణపతి
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31. కుక్షి గణపతి
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32. పుష్టి గణపతి
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33. వామన గణపతి
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34. యోగ గణపతి
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35. నృత్య గణపతి
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36. దూర్వా గణపతి
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37. అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||

39.విద్యా గణపతి
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40. సరస్వతీ గణపతి
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41. సంపత్ గణపతి
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42. సూర్య గణపతి
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46. గాయత్రి గణపతి
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47. చింతామణి గణపతి
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49. వికట గణపతి
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50. వరద గణపతి
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51. వశ్య గణపతి
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53. కుబేర గణపతి
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54. రత్నగర్భ గణపతి
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56. సర్వసిద్ధి గణపతి
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57. భక్త గణపతి
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58. విఘ్న గణపతి
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59. ఊర్ధ్వ గణపతి
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60. వర గణపతి
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61. త్ర్యక్ష్యర గణపతి
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62. క్షిప్రప్రసాద గణపతి
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63. సృష్టి గణపతి
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64. ఉద్దండ గణపతి
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65. డుండి గణపతి
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66.ద్విముఖ గణపతి
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67. త్రిముఖ గణపతి
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:

69. గజానన గణపతి
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71. భువన గణపతి
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73. శ్వేతార్క గణపతి
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే

74. ఆధార గణపతి
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75. భూతరోగ నివారణ గణపతి
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77. ద్వాదశభుజవీర గణపతి
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78. వశీకర గణపతి
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79. అఘౌర గణపతి
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80. విషహర గణపతి
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82. సర్వ సమ్మోహన గణపతి
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83. ఐశ్వర్య గణపతి
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||

84. మాయావల్లభ గణపతి
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85. సౌభాగ్య గణపతి
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86. గౌరి గణపతి
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87. ప్రళయంకర్త గణపతి
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88. స్కంద గణపతి
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89. మృత్యుంజయ గణపతి
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90. అశ్వ గణపతి
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92. బ్రహ్మవిద్యా గణపతి
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93. శివ అవతార గణపతి
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94. ఆపద గణపతి
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95. జ్ఞాన గణపతి
గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97. మహాసిద్ధి గణపతి
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98. గణపతి
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100. భద్ర గణపతి
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101. సులభ గణపతి
వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102. నింబ గణపతి
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104. విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105. ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106. సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107. సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108. సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో
విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||

☘️ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పూచిన  సింధూర...
25/08/2021

☘️ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పూచిన సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.☘️

🕉️🕉️🕉️🕉️🕉️మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను  ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యా...
24/08/2021

🕉️🕉️🕉️🕉️🕉️
మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో సోమవారం ... మంగళవారం ... శుక్రవారం ...శనివారం... పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు

పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమ శివుని పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు.
శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడు.

ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.

మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.
🕉️🕉️🕉️🕉️🕉️
హర హర మహాదేవ
🕉️🕉️🕉️🕉️🕉️

20/08/2021
🙏ఓం శ్రీగురుభ్యోనమః🙏🌹శ్రీరస్తు శుభమస్తుఅవిఘ్నమస్తు🌹🌹పంచాంగం🌹   తేదీ:10.8.2021🌹మంగళవారం🌹🌹భౌమ్యవాసరే🌹🌹శ్రీ ప్లవ నామసంవత్సర...
10/08/2021

🙏ఓం శ్రీ
గురుభ్యోనమః🙏

🌹శ్రీరస్తు శుభమస్తు
అవిఘ్నమస్తు🌹

🌹పంచాంగం🌹

తేదీ:10.8.2021
🌹మంగళవారం🌹
🌹భౌమ్యవాసరే🌹

🌹శ్రీ ప్లవ నామ
సంవత్సరం🌹
దక్షిణాయనం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిధి : విదియ సా6.13
తదుపరి తదియ
తదుపరి పుబ్బ
యోగం : పరిఘము రా10.29
తదుపరి శివం
కరణం : బాలువ ఉ6.38
తదుపరి కౌలువ సా6.13
తదుపరి తైతుల
వర్జ్యం : సా6.54 - 8.30
దుర్ముహూర్తం : ఉ8.17 - 9.07
రా10.57_11.42
అమృతకాలం: ఉ8.32 - 10.39
తె4.27నుండి
రాహుకాలం : మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:
ఉ9.00 - 10.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం: 5.44 సూర్యాస్తమయం: 6.28

🌹 నేటి మాట 🌹

🌹దేవాలయంలో
ఈశ్వరుడికి
యాపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టి పండ్లను భక్తులకు పంచిపెడితే
సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు.🌹

🌹ధన్యవాదములు🌹

🌹సర్వేజనా సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు.🌹

🌹ఓం శాంతి శాంతి శాంతి హి🌹

🐂 గో సేవ చేద్దాం గోపూజ చేద్దాం గోమాతను రక్షించుకుందాం 🐂

🦚 జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ 🦚

🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏

Address

80 Feet Road
Warangal
506002

Opening Hours

Monday 6am - 5pm
Tuesday 5am - 5pm
Wednesday 6am - 5pm
Thursday 6am - 5pm
Friday 6am - 5pm
Saturday 5am - 5pm
Sunday 6am - 5pm

Telephone

+916304017812

Website

Alerts

Be the first to know and let us send you an email when Abhay_anjaneya_swamy_temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category