Disciples of Christ Mission

Disciples of Christ Mission A Mission with a Vision to fulfill the Great Commission!

Motivated by the Love of Christ and empowered by the Holy Spirit, DISCIPLES OF CHRIST MISSION exists to Make everyone a true Disciple to Christ, through the mobilizing, equipping, and coordinating o This is God’s work for His glory, we had the privilege to be part of His incredible plan by sharing the Love of God in 6 Hill Top Tribal Villages of G.L.Puram Mandal, and 7 villages of Jiyyammavalasa M

andal basing at Thadikonda Village in Vizianagaram District and Angallu, Kurabalakota, Diguva Boyapalle, Thummachetlapalle, Kantevaripalle, Yerraballi, Bayareddlapalle, Boodalavaripalle Villages of Chittoor District of Andhra Pradesh.

24/12/2025

నేను క్రిస్మస్ పండుగను జరుపుకోవడం మానేసాను! ఎందుకంటే...

👉 ఈ పదం గానీ, ఈ పండుగను గూర్చిన ప్రస్తావన గానీ బైబిల్ లో ఎక్కడా లేదు కనుక!
👉 యేసు క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఈ పుట్టిన రోజు పండుగ ప్రశ్నార్థకం చేస్తుంది గనుక! ఆది అంతం లేని వాడికి ఒక పుట్టిన రోజును ఆపాదించడం ఆయన దైవత్వాన్ని శంకింపజేయడమే అవుతుంది! నేడు అనేకమంది క్రైస్తవేతరులు, ముఖ్యంగా ముస్లిం సోదరులు క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించడానికి/ఒప్పుకోకపోవడానికి ఈ పండుగ ఒక ప్రధాన కారణం అవుతుంది కనుక!
👉 అసలు యేసు క్రీస్తు ఈ కాలంలో పుట్టనే లేదు అని బైబిల్ ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కావున సాధారణ మనుష్యులకు ఆపాదించినట్టు ఆయనకు ఒక పెట్టుడు పుట్టిన రోజు ఆపాదించడం తప్పు కనుక!
👉 క్రొత్త నిబంధన కాలపు అన్యులకు నాలుగు విషయాలను నిషేధించమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అందులో విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటకుండా వుండడం ఒకటి! ఈ పండుగ విగ్రహ సంబంధమైన అపవిత్రతతో కూడిన ఒక అన్యమత ఆచారం నుండి తీసుకుని క్రైస్తవీకరించబడింది కనుక!
👉 నాకు సువార్త ప్రకటించడానికి ఒక ప్రత్యేకమైన మిష/సాకు/రోజు/పండుగ అవసరం లేదు! నేను ప్రతీ రోజు సువార్తను ప్రకటించాలి/ప్రకటించమని ఇతరులను ప్రోత్సహించాలి అనే స్పృహను కలిగియున్నాను. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రచురపరచడం ప్రతీ రోజు చెయ్యాలి అనేది జ్ఞాపకం వుంచుకోవడానికి ఆది సంఘం ప్రతీ రోజు ఇంటింటా రొట్టె విరిచింది! ఒక విధంగా సంవత్సరం పొడువునా నా జీవితం సువార్త పత్రికలా వుండాలి అనే ప్రయత్నం చేస్తున్నాను కనుక!
👉 నేను క్రీస్తు ప్రభువును కలిగియున్నాను కనుక నాకు ఒక పెట్టుడు పండుగ ద్వారా వచ్చే కృత్రిమ ఆనందం అవసరం లేదు! నేను ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించగలను/ఆనందించమని ప్రోత్సహిస్తాను. అదే నాకు బైబిలు నేర్పించింది... చివరికి కష్ట సమయంలో కూడా!
👉 సువార్త సారాంశంలో పుట్టుక గురించి చెప్పమని లేదు... ఆయన మరణ పునరుత్థానం గూర్చి ప్రకటిస్తే చాలు కనుక!
👉 రక్షకుడు పుట్టాడు అనే ఆనందం రక్షించబడిన వాడికి మాత్రమే వుంటుంది, అది రక్షించబడినది మొదలు మరణించే వరకు/ఆయన రాకడ వరకు ఎల్లప్పుడూ వుంటుంది కనుక!
👉 కొందరు క్రిస్మస్ కు ఒక తప్పుడు నిర్వచనం (రోమన్ కాథలిక్ వారు ఇచ్చింది) Christ/క్రీస్తు + Mass/ఆరాధన అని, ఆ రోజు క్రీస్తును ఆరాధిస్తున్నాము అనే కుంటి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు! నిజమైన క్రీస్తు ఆరాధికుడు ప్రతీ క్షణం, ప్రతీ రోజు క్రీస్తును ఆరాధిస్తూనే వుంటాడు. అసలు క్రీస్తును ఆరాధించడం అంటే అదొక కార్యక్రమం కాదు, జీవిత విధానం అనే స్పృహను కలిగియున్నాను కనుక! పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవడమే యుక్తమైన సేవ/ఆరాధన – రోమా 12:1-2.
👉 క్రిస్మస్ అనే పదం ఒక అబద్ధం, క్రిస్మస్ చెట్టు అబద్ధం, క్రిస్మస్ తాత/ సాంటా క్లాస్ అబద్ధం, కారల్స్ అబద్ధం, క్రిస్మస్ స్పిరిట్ అబద్ధం, క్రిస్మస్ ఆరాధన అబద్ధం, మొత్తం పండుగే అబద్ధం గనుక! ప్రకటన 22:15 కుక్కలును, మాంత్రికులును, వ్యభిచారులును, నరహంతకులును, విగ్రహారాధకులును, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
👉 క్రిస్మస్ పండుగ పేరున దుబారా ఖర్చులు చేయడం, ప్రపంచంలో ఘోరమైన వర్తకం చేసుకుంటున్న వారిని ప్రోత్సహించడం నాకు ఇష్టం లేదు కనుక! ప్రపంచం యావత్తూ ఈ పండుగకు పెట్టే సొమ్ముతో ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించవచ్చు!
👉 కొందరు మేము ఈ పండుగ సందర్భంగా పేదలకు సహాయం చేస్తున్నాము అని కుంటి సాకులతో సమర్ధించుకోవడాన్ని నేను ఒప్పుకోను. చేసేది గోరంత, చెప్పుకునేది/చూపించుకునేది కొండంత! నీకు రెండు వుంటే ఒకటి పేదలకు ఇవ్వు అని యేసయ్య బోధించింది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయమని కాదు! ఎల్లప్పుడూ పేదలను జ్ఞాపకం చేసుకుంటూ... దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, అవసరతలో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేస్తూనే వుండాలి. అదే నిజమైన భక్తి అని నేను నమ్ముతున్నాను కనుక!
👉 పాత నిబంధన దినాలలో కానీ క్రొత్త నిబంధన దినాలలో కానీ పుట్టిన రోజులు చేసుకునే ఆచారం దైవ భక్తి గలవారికి లేనేలేదు కనుక. అది కేవలం అన్యులలో మాత్రమే వుంది. నేను చేసుకున్నా, నేను నమ్మే దేవుడికి చేసినా నేను క్రైస్తవుడనే కాకుండా పోతాను కనుక!

ప్రవీణ్ కంటి మహంతి, మదనపల్లె

23/12/2025

9.ఇన్ని కారణాలు చెప్పినా కూడా ఈ ఆచారం నుండి బయటకు రాలేని కొందరు మహానుభావులు రోమా 14 వ అధ్యాయాన్ని అడ్డం పెట్టుకొని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు! సరే అసలు ఆ లేఖనాలని ఒకసారి పరిశీలిద్దాం. రోమా14:5-6 ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఈ వాక్యభాగం యొక్క సందర్భం ఏమిటో ముందు చూద్దాం. ఎందుకంటే వ్యాఖ్యాన సూత్రాలలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది *సందర్భం!* సంఘములో ఒక విశ్వాసి మరొక విశ్వాసితో ఏవిధంగా మెలగాలి అనే సందర్భంలో వ్రాయబడినది. అందులో ముఖ్యంగా భోజనపు అలవాట్లు గూర్చి మాట్లాడుతూ, అదే విధంగా దినములను గూర్చి కూడా రెండు వచనాలలో ప్రస్తావించడం జరిగింది అందులో మరి ముఖ్యంగా ఒక బలహీనుడు అయిన విశ్వాసి విషయంలో పరిపక్వత కలిగిన విశ్వాసి ఎలా ప్రవర్తించాలో చెప్తూ పౌలు గారు వ్రాసిన సందర్భం లోనిది. ఆత్మీయ పరిపక్వత చెందిన ఒక విశ్వాసిగా నీకంటే విశ్వాసంలో బలహీనుడు అయిన మరొక విశ్వాసి మనస్సాక్షి ఆహారపు అలవాట్ల విషయంలో, లేదా మంచి రోజుల విషయంలో బలహీనమైన విశ్వాసి యొక్క వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది గానీ, సార్వత్రికంగా ఈ లేఖనాన్ని తీసుకుని ఒక వాక్య విరుద్ధమైన, బబులోనులో పుట్టి, రోమన్ కాథలిక్ వారి వలన క్రీ. శ. 360 లో క్రైస్తవీకరించబడిన ఒక అన్య మతాచారం నుండి పుట్టిన ఈ క్రిస్మస్ పండుగ ఆచారానికి ఏమాత్రం సంబంధం లేని విషయం!

Address

# 1-36, Thadikonda (V), Gummalakshmipuram (M&P)
Vizianagram City
535523

Alerts

Be the first to know and let us send you an email when Disciples of Christ Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Disciples of Christ Mission:

Shortcuts

Share