04/12/2022
🎻🌹🙏కలియుగ వరదుడు అయ్యప్ప....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేసి తరించవచ్చని మన పెద్దలు చెప్పేరు.
🌸భగవన్నామ స్మరణ చేయమని చెప్పడం సులువే కానీ ఏకాగ్రతతో, భక్తి తన్మయత్వంతో చేయడం అంత సులువైన పనికాదు.
🌿 మానవాళిలో భక్తితత్పరతను పెంచడానికి మన మహర్షులు పూజలు, భజనలు చేయమని, తరచు దేవాలయాలకు, పుణ్యతీర్ధాలకు వెళ్ళమని ఆదేశించారు.
🌸 దైవభక్తిని పెంపొదించడానికి కొన్ని రకాల దీక్షలను ప్రతిపాదించి, భక్తితో దీక్ష చేసి యాత్రలకు వెళ్ళమన్నారు.
🌿 దీక్షాకాలంలో పాటించవలసిన కొన్ని నియమాలను చెప్పి భక్తి శ్రద్ధలతో కనీసం మండలకాలం (41 రోజులు) దీక్ష చేసి యాత్రకు వెళ్ళి రమ్మన్నారు.
🌸దీక్షలన్నిటిలో స్వామి అయ్యప్ప దీక్ష తలమానికమైనది. దీక్షా నియమావళి ఎంతో పవిత్రమైనదే కాకుండా ఆరోగ్యదాయకమైనది.
🌿 భక్తిచింతనతో పరవశించిపోతారు. అయ్యప్ప స్వామి దీక్ష చేయదలచిన వారు ముందుగా గురుస్వామి ద్వారా మెడలో తులసీమాలను కానీ రుద్రాక్ష మాలను కానీ ధరిస్తారు.
🌸 మాలకు అయ్యప్పస్వామి ప్రతిమ వున్న బిళ్ల తగిలించడం వలన దీనిని ముద్రమాలగా వ్యవహరిస్తారు. నలుపు లేక కాషాయం రంగు దుస్తులను దీక్షా వస్త్రాలుగా స్వీకరించి
🌿 స్వామివారి ఎదుట దీక్షాకాలం 41 రోజులు నియమ నిష్టలు భక్తిశ్రద్ధలతో పాటించి ఇరుముడితో శబరిమల యాత్రకు వస్తామని ప్రతిజ్ఞచేసి మొక్కుకుంటారు.
🌸 మాలా ధారణ జరిగినది లగాయతూ ముఖ క్షవరం చేసుకోరు. తెల్లవారుజామున, సాయంత్రం పూట చన్నీటితో స్నానం చేసి నుదుట విభూది, చందనం, కుంకుమ అలంకరించుకొని దీపారాధన చేసి స్వామివారికి పూజ చేసి శరణాలు చెప్పుకుంటారు.
🌿 కాళ్ళకు చెప్పులు ధరించరు. పూజానంతరం ఏదో ఒక దేవాలయాన్ని దర్శిస్తారు. లేకుంటే భజన కార్యక్రమాలెక్కడున్నా వెళ్ళి భజనలో పాల్గొంటారు.
🌸స్వామి దీక్ష చేసేవారు అసలిత బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై దిండులేకుండా చాపపైనే నిద్రిస్తారు. ఒక పూట భోజనం, రాత్రివేళ అల్పాహారం స్వీకరించి నిత్యం దైవనామ స్మరణం చేస్తూ వ్యావహారిక విషయాలకు దూరంగా ఉంటారు.
🌿శుచిశుభ్రత పాటిస్తూ కాళ్ళు, చేతులు కడగనిదే ఇంట్లోకి కానీ. దేవాలయానికి కానీ వెళ్ళరు. దానధర్మాలు విరివిగా చేస్తారు.. అసత్యం పలుకరు. స్త్రీలనందర్నీ దేవతా స్వరూపులుగా భావించి గౌరవిస్తారు.
🌸 అర్ధాంగిని కూడా దీక్షా సమయంలో జగన్మాతగా తలచి ఆమె భక్తితో చేసే సేవలను స్వీకరిస్తారు. బ్రహ్మచర్య వ్రతం పాటించడం వలన వేరే గదిలో నిద్రిస్తూ, సజ్జన సాంగత్యంతో భక్తిని పెంపొందించుకొని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తారు.
🌿 మద్యమాంసాదులు సేవించడం, పొగత్రాగడం, తాంబూలం కూడా దీక్షాకాలంలో నిషేదమే.
🌸దీక్షా నియమావళిని భక్తిశ్రద్ధలతో పాటించడం వలన మంచి క్రమశిక్షణ అలవడి, ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఒక సన్యాసి జీవితంలా గడపడం వలన.
🌿 తెలియకుండానే శరీరంపై మమకారం తగ్గుతుంది. దీక్షలతో అంతస్తు, హెూదా అన్నీ మరచి లక్షాధికారులు, బిక్షాధికారులు కూడా కలసి ఒకేరకం దుస్తులు (నలుపు, కాషాయం) ధరించి భజనలు, పూజలు చేస్తూ సహపంక్తి భోజనాలు చేస్తారు.
🌸 గొప్ప, బీద తారతమ్యం కనిపించదు. స్వాములు ఒకరినొకరు ఎదురైనప్పుడు 'స్వామిశరణం' అని నమస్కరించుకొని పలుకరించు కుంటారు. కొందరు పాదాభివందనం కూడా చేయడానికి వెనుకాడరు.
🌿మాల ధరించి దీక్ష చేస్తున్న స్వాము లందరూ అయ్యప్ప స్వామితో సమానంగా భావిస్తారు. తత్వమసి సిద్ధాంతం అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ.
🌸 తనలో అయ్యప్పస్వామిని దర్శిస్తూ ఎదుటివారిలో కూడా అయ్యప్పస్వామిని దర్శించడం ఈ దీక్షలో గొప్పతనం.
🌿స్త్రీలకు 10 నుండి 50 సంవత్సరముల వయసు ఉన్నవారికి శబరిమల యాత్రకు అనుమతించరు. పది సంవత్సరముల లోపు బాలికలు, యాభై పైపడి బహిష్టు ఆగిన స్త్రీలకే అయ్యప్ప దీక్ష, శబరిమల యాత్ర చేయడానికి అర్హత ఉంది.
🌸కఠిన బ్రహ్మచర్యం, స్త్రీలకు బహిష్టు ఆటంకం వలన మండల కాలం దీక్ష సాగదని, అడవులలో, కొండలలో నడచి వెళ్ళే కష్టతరమైన యాత్రని స్త్రీలకు యాత్ర నిషేధించినట్లు కనిపిస్తుంది.
🌿స్త్రీలు పవిత్రంగా శుచి శుభ్రత పాటిస్తూ పూజలు, భజనలలో పాల్గొని భక్తితో సేవలు చేసి తరించవచ్చు.
41 రోజులు దీక్ష పూర్తయ్యాక గురుస్వామి ఇరుముడి కట్టి తన వెంట శబరిమల యాత్రకు తీసుకువెళ్తారు.
🌸 ఇరుముడి అంటే రెండు గల సంచిలో ముందు భాగంలో స్వామివారికి పూజాద్రవ్యాలు, నెయ్యి నింపిన కొబ్బరికాయ (మకాయ)ను ఉంచుతారు.
🌿సంచి వెనక భాగంలో ఆహారం పదార్థాలతో నింపి కట్టిన మూటనే ఇరుముడి అంటారు. ఇరుముడి తలపై లేనిదే శబరిమలలో 18 మెట్లు ఎక్కనివ్వరు.
🌸 మండల దీక్ష చేసి ఇరుముడితో వచ్చినవారికే 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకొనే భాగ్యం కలుగుతుంది.
🌿 అడవులలో కొండలపై తలపై ఇరుముడితో నడచి అయ్యప్పస్వామి దర్శించుకున్న వారి జన్మ తరిస్తుంది. స్వామి శరణం! స్వామియే శరణమయ్యప్ప....స్వస్తీ..
🚩🌞🌹🙏🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿