24/08/2026
ఇళ్ల మధ్యలో క్రైస్తవ ఆరాధనలు జరిగించే వారు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు/ సూచనలు:
- మీరు వాడే సౌండ్ సిస్టం కచ్చితంగా 85 dB( డేసిబల్స్) మించకుండా చూసుకోండి.
- మీరు పెట్టే సౌండ్ 4 బాక్సులు 100W మించకుండా చూసుకోండి.
- పైన వాడే 2 Horns /బాకాలు 45W మించకుండా చూసుకోండి.
- పాటలు పాడేటప్పుడు ఆరాధన జరిగించేటప్పుడు *విపరీతమైన సౌండ్* మ్యూజిక్ కొరకు ఉపయోగించకకుండా, సాధ్యమైనంత వరకు పాటలు పాడే వారి *గాత్రము, స్వరము, మరియు సాహిత్యము* వినేవారికి అర్థమయ్యేలా చూసుకోండి.
- ఉపదేశము ఇచ్చేటప్పుడు సంఘము వెలుపల వారికి హెచ్చరికలు కాక సంఘములోని వారికి ఆత్మీయమైన హెచ్చరికలు ఉండేలా చూసుకోండి.
- మందిరము చుట్టుపక్కల నివసించే ప్రజలు నుండి ఏమైనా అభ్యంతరములు ఉన్నట్లయితే.. వారితో గొడవలు పడక, సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించి సమాధానాన్ని వెతకండి.
- రాజకీయ పలుకుబడి ఇతర వ్యవస్థలు ఉపయోగించి సమాధానాలు ఎప్పటికీ తెచ్చుకోలేమని గ్రహించండి.
- గృహ సముదాయాల మధ్య ఆరాధనలు నడుపు వారు- ఇంటి యజమానుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందండి.
- స్వంత ఇంటిలో ఆరాధన నడుపువారు తప్పకుండ కోలని డవలపమెంటు సొసైటీ లో సభ్యులు అయ్యి, మీ ఇంటిలో జరిగించు ఆరాధన విషయం తెలియపరచండి. మెంబర్షిప్ ఫీజు తప్పకుండ చెల్లించండి. అవకాశం ఉంటే ఏదైనా పదవి కూడా చేపట్టండి.
- మందిరానికి వచ్చేవారు తాము గత 4/5 సంవత్సరాల నుండి ఇదే మందిరానికి వచ్చు వారమని, మాకు ఈ మందిరము అవసరమని, మేము సభ్యులమని, ఒక ధ్రువీకరణ పత్రము వ్రాసి, వారి చిరునామాలు, ఫోన్ నెంబరు లతో అందరి సంతకాలు సేకరించి ఉంచుకోండి.
- మందిర పరిసర ప్రజల నుండి వారి సహకారం తో తమ ఆరాధన వలన వారికి ఏ ఇబ్బంది కలుగుటలేదని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమ్మతి పొంది ఉండండి.
- ఇంటి పరిసరాలలో వాహనాలను నిలుపునప్పుడు తప్పక వాలంటీర్లను ఉపయోగించి, క్రమ పద్ధతిలో ఆ రహదారిలో ప్రయాణములకు, ఇతర వాహకులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా నిలుపు నిలుపుదల చేసేలా చూడండి. ( ఎవరి ఇంటి ముందు, గేటు ముందు, అప్పటికే నిలిపిన వాహనాలకు అడ్డుగా, ఆటంకంగా, వాదనలకు దిగకుండ)
- మందిర పరిసరాలలో ఎటువంటి చెత్త, మురుగు నీరు, ప్లాస్టిక్ పేపర్లు మరియు ఆహార పదార్ధముల వ్యర్ధాలు ఉండకుండా ప్రతిరోజు శ్రద్ధ వహించండి.
- అపార్ట్మెంట్ లలో ఆరాధన చేయువారు తప్పకుండ AC, సౌండ్ ప్రూఫ్ చేసుకొని తలుపులు మూసుకొని ఉంచేలా చూసుకొండి.
- తప్పకుండ టాయిలెట్స్, సంఘస్థులు కు మంచినీటి సదుపాయాలు ఉండేలా చూడండి.
- పిల్లలు, పురుషులు బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా హెచ్చరికలు ఇవ్వండి.
- మందిర సమయాలు ఖచ్చితంగా అనుసరించి, రాత్రి సమయాల్లో ఆరాధనలు చేయునపుడు పైన బాకాలు, బయట బాక్స్ లు ఉపయోగించకుండా చూడండి.
- పరీక్షలు, పిల్లలు, రోగులు, వృద్ధులు, వాతావరణం మొదలైన పరిస్థితులు అవగాహనతో సంఘ సమయాలు ఉపయోగించండి.
- అభ్యంతరాలు ఇప్పటికకే ఉండి, ఆపాలని ఒత్తిడి ఉన్నట్లయితే.. క్రైస్తవ నాయకులు, సంస్థల, న్యాయ పోరాటాలు తాత్కాలిక విజయాలు ఇవ్వగలవు కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వలేరని గుర్తించండి.
- పోలీస్, న్యాయ, రెవన్యు అధికారులు వారి సహకారం తప్పకుండ తీసుకొని, వివాదరహిత పరిష్కారం వెదకండి.
- సంఘస్థులలో మీకు వ్యతిరేక వర్గము ఉన్నట్లయితే వారితో మీరు, మీ కుటుంబం, తప్పకుండ సమాధానపడుటకు ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండండి.
- సంఘస్థుల యువత సంఘ సమయాలలో బయట తిరగడం, ఆటోలలో, బండ్లుమీద, ఉండకుండా చూసుకొండి.
- సంఘానికి కొత్తగా వచ్చేవారి పట్ల పెద్దలతో మాట్లాడించి నాయకులు తప్పకుండ వారిని కలుసుకొని, పరిచయం అయ్యేలా చూసుకొండి.
- సంఘ యవ్వన బిడ్డలు, మ్యూజిక్, క్వయర్ వారు ఆరాధన సమయాలలో/ తర్వాత బయట తిరగడం, వెలుపటి వారిని కలుసుకోవడం, లాంటివి జరుగకుండా, చుట్టుప్రక్కల నివసించేవారికి అభ్యంతరకరముగా ఉండకూడదని బోధించి, జాగ్రత్తగా చూసుకొండి.
- సేవకులు కుటుంబం సాధ్యమైనంత వరకు పరిసరాలలో ప్రజల అవసరతలు గమనించి మనవంతు సహాయం, సహకారం ఇస్తూ, చేస్తూ (వస్తువులు, మాట, పని, ఇతర డవలప్మెంట్ అవసరాలు, ఆర్ధిక, ఆరోగ్య, చదువు, కెరియర్, ఆటలు, పారిశుధ్య, పరిశుభ్రత మొ.. విషయాలలో) మనవంతు ప్రధమ సహాయం ఉండేలా చూసుకొండి.
# సంఘం అనగా నాలుగు గోడల మధ్యలో ఉండేది కాదు, నలుగురు మధ్యలో వుండేదని, నలుగురు కొరకు బ్రతికేదని, నలుగురిని రక్షించేదని గ్రహించగలరు. #