06/09/2021
simhachalam...
సింహాచలం : శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయం - ఆధ్యాత్మిక సౌరభాల గుబాళింపు - జస్టిస్ శేషసాయి
వ్రతాలు, పూజలకు ఏర్పాటుచేసిన కొత్త మండపం, కళ్యాణ మండపంపై ప్రశంసల జల్లు కురిపించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి. కొత్త మండపాన్ని లక్ష్మీనారాయణ వ్రతం , ఇతర సేవలకోసం ఉపయోగించడం అద్భుతంగా ఉందన్నారు. కళ్యాణ మండపాన్ని, అందులోని స్వామివారి వాహనాలను అందంగా తీర్చిదిద్దారంటూ కొనియాడారు. కరోనా కష్టకాలంలోనూ ఆలయంలో జరుగుతున్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు... ఈఓ సూర్యకళ దగ్గరుండి వివరించారు. " ఆధ్యాత్మికతతో నిండిన ఈ పవిత్ర ఆలయ దర్శనంతో నా జన్మ ధన్యమైన భావన కలుగుతోంది" అంటూ జస్టిస్ శేషసాయి ... విజిటర్స్ బుక్ లో రాశారు. దేవస్థానం సమీపంలోకి వచ్చినవెంటనే ఆధ్యాత్మిక , సాంస్కృతిక సౌరభాలు గుభాళిస్తున్నాయన్నారు. ఇంతకు ముందుకూడా దేవస్థానానికి వచ్చానని ... జస్టిస్ శేషసాయి తెలిపారు
వెంకటరావు సింహాచలం