Madhura Krishnamurthy Shastry

Madhura Krishnamurthy Shastry Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhura Krishnamurthy Shastry, 17-14-6/1, KRISHNA NAGAR, SEETAM PET, Visakhapatnam.

20/12/2025

#కాలానుగుణంగా_పంచాంగాలలో_సంస్కారాలు_అవసరమా?
#అలా_చేస్తే_సిద్ధాంత_గ్రంధాలకు_ద్రోహం_చేసినట్టా??

#వరాహమిహిరాచార్యుకు పూర్వమందు #ప్రద్యుమ్నాచార్యులు, #విజయ_నంద్యాచార్యులు గ్రంథములను చేసినట్లు, వారి గ్రంథములవలన సాధించబడిన #కుజ, #బుధ, #గురు, #శనులు వారు చెప్పినట్లు #దృక్సిద్ధముగ నుండకపోవుటవలన ఆప్పటి కాలములోని ప్రజలు నిరుత్సాహులైయున్నట్లు, తాను గ్రహించి, వానిని సవరించి (దృక్సిద్ధమునకు సరిపోవునట్లు చేసి) ఆ భగ్నోత్సాహులైన ప్రజలకు సంతుష్టిని కలిగించేటట్లుగ దృక్సిద్ధ ప్రతిపాదక గ్రంథమును తాను రచించినట్లు ఈ క్రింది శ్లోకమువలన ధ్రువబడుచున్నది.

[ #పంచసిద్ధాంతికోపసంహారః]
#ఆవంత్యకః_సమాసా(చ్ఛి)ష్యహితార్థం_స్ఫుటాంకసమం |
#చక్రే_వరాహమిహిరః_తారాగ్రహకారికాతంత్రం || 61
||
#ప్రద్యుమ్నభూమితనయే_జీ(వే)(సౌరెఽథ వి) #జయనందికృతే |
#బుధే (చ భగ్నొ) [త్సాహః] #స్ఫుటమిదం #కరణం_భజతాత్ || 62 ||

( #పంచ_సిద్ధాంతిక అ18 శ్లో 61-62)

దీనివలన వరాహునకు పూర్వమున పూర్వాచార్యులచే చేయబడిన గ్రంథములు తన కాలమునకు #దృక్సిద్ధ ప్రతిపాదక ములుగ లేవని తాను గ్రహించి, దృక్సిద్ధమునకు సరిపడునట్లు సంస్కరించి తను గ్రంథమును చేసియున్నానని వ్రాయుటవలన మన కాలములో కూడ మనకు ప్రాచీనములో వ్రాయబడిన గ్రంథములు #దృక్సిద్ధములుగ లేనప్పుడు, మన కాలమునకు సరిపడునట్లు సంస్కరించుకొని #దృక్సిద్ధ ప్రతిపాదక గ్రంథములను సిద్ధముచేసుకొని వాని ననుసరించి #దృక్సిద్ధ_గణితములను చేసుకొనవలయునని సులభముగ బోధపడుచున్నది.

16/10/2024

1980 జనవరి 20, 21, 22, తేదీలలో రాజమండ్రి శ్రీరామకృష్ణ మిషన్ టౌన్ సెంటరులో వేదశాస్త్ర పరిషత్తు (రాజమండ్రి) వారు శ్రీ పీసపాటి సూర్యప్రకాశంగారి కార్య దర్శిత్వమున పంచాంగములలో గల భిన్నత్వములను గురించి, ఏకముఖ పంచాంగి ప్రకటనమును గురించి, పంచాంగ గణితములలో గల భేదాభిప్రాయ విమర్శనమును గురించి చర్చించి, శాస్త్రీయమైన తీర్మానమును రాబట్టుకు జ్యోతిశ్శాస్త్ర సభల నేర్పాటుచేసిరి. ఈ సభకు

శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి ఎం. ఎ. పి. హెచ్ డి. (సెక్రటరీ ధర్మ ప్రతి స్థానముతిరుపతి) గారు ఛైర్మన్గాను,

శ్రీమురారీ లాల్ శర్మ- జ్యోతిషాచార్య- (జ్యోతిష విభాగా ధ్యక్షులు సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయము కాశి)

శ్రీ వ్రజకిశోర్ (జ్యోతిష విభాగాధ్యక్షులు శ్రీకామేశ్వర సింహ సంస్కృత విశ్వ విద్యాలయము – దర్శంగా.)

శ్రీరామచంద్రర— · జ్యోతిషాచార్య, విద్యావారిధి (పంచాంగ విభాగాధ్యక్షులు— శ్రీకామేశ్వర సింహ సంస్కృత విశ్వ విద్యాలయము)

వారు సభా విషయములపై తీర్మానముల నిచ్చుటకు,

శాస్త్ర రత్నాకర శ్రీడోంగ్రే వీరేశ్వర శాస్త్రి (సికింద్రాబాదు)

శ్రీలంకవెంకటరామసోమయాజులు (నేదునూరు)

శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశశాస్త్రి (ప్రిన్సిపాల్ ఓరియంటల్ కాలేజి. రాజమండ్రి)

గారు అనేకమంది ఇతర విద్వాంసులు శాస్త్ర పరిశీలకులుగ ఆహ్వానింపబడినారు.
పండితులకు ఇచ్చిన చర్చనీయాంశములు ఈ క్రింద వ్రాయబడుచున్నది.

1. నిరయన పంచాంగ గణితములు భిన్న భిన్నములుగ నున్నవి. వానియందుసంపూర్ణముగ దృక్సిద్ధమే గ్రాహ్యమాః తిధులకు ఒక విధముగను (సూర్యసిద్ధాంతాను సారం) ప్రత్యక్ష మునకు దృక్సిద్ధ గణితము చేయివలెనా? మొదలగునవి.

2. అయనాంశల విచారణ. అయనా భావకాల నిర్ణయము, ఆయనగతి

3. రైవతచైత్ర పక్షఛాయార్క సంస్కృత కరణార్క పక్షములచే సాధించబడిన అయనాంశములలో ఏది గ్రాహ్యము

4. బాణవృద్ధి రసక్షయతిధులు గ్రాహ్యములాః దృక్సిద్ధ తిధులు గ్రాహ్యములా ?

5. చంద్ర సంస్కారములను చేయుటలో గ్రహించదగు విధానము ఏది?
అను 5 ముఖ్య విషయములు గురించి విమర్శించి విభిన్న పద్ధతులలో గలపై తేడాలను పండితులు విమర్శించి శాస్త్రీయ మైన మార్గమునొకదానిని నిర్ణయించవలసి యున్నదని సభా ప్రారంభమున పండితులకు తెలుపబడి యున్నది.

11/10/2024

వరాహమిహిరాచార్యుల #పంచసిద్ధాన్తిక అనే గ్రంధములో పౌలిశ సిద్ధాంత విచారణలో (3వ అధ్యాయం)లో ఇట్లు వివరించెను.
#కాలపేక్షా_విదయః_శ్రితాః_స్మార్తాశ్చ_తదపచారణ_ప్రాయశ్చిత్తీభవతి #ద్విజోయతోతోధిగమ్యేదమ్_స్ఫుటగణిత_విదిహలబ్గా(బా)ధర్మార్ధయశాంసి #దినకరాదీనామ్_కుకరణకారస్సత్యం_సమతే_నరకం_క్రుతావాసా॥
#(పంచసిద్ధాంతిక ఐ ఎన్ కుప్పన్నశాస్త్రిగారి ఆంగ్లవ్యాఖ్య)
శ్రాతస్మార్తాది సమస్తకర్మలు కాలానుగుణముగ చేయదగినవి. వానికి అపచారము జరిగినచో ప్రాయశ్చిత్తమును చేసుకొనవలయును. స్ఫుట (స్పష్టమైన ప్రత్యక్షతుల్యమైన) గణితవేత్తయగు విద్వాంసుడు (సరియైన కర్మార్ఘకాలమును నిరూపించేవాడు) ధర్మార్ధ యశస్సులను పొందగలడు. కుకరణ (తప్పు గణిత) కారుడు అర్హకాల నిరూపణ చేయని వాడు నరకములో నివసించి దుఃఖమును పొందువాడగునని భావము.

 #పంచాంగములు_వాటి_సంస్కరణలు_1ఈ మధ్య కొందరు పండితులు ఒకో కర్మకి ఒకో పంచాంగం వాడాలి అంటూ అంటున్నారు.శాస్త్రంలో సిద్ధాంత గ్...
02/10/2024

#పంచాంగములు_వాటి_సంస్కరణలు_1
ఈ మధ్య కొందరు పండితులు ఒకో కర్మకి ఒకో పంచాంగం వాడాలి అంటూ అంటున్నారు.శాస్త్రంలో సిద్ధాంత గ్రంధాలలో ఎలా ఉంది అనే విశ్లేషణ ఒక #పంచాంగములు_వాటి_సంస్కరణలు అనే ధారావాహికంగా ఉంచాలనే సంకల్పంతో మా గురువులనుండి తెలుసుకున్న ప్రామాణిక విషయాలను ప్రారంభం చేస్తున్నాను.
#బీజ_సంస్కారములు_చేయవలెనని_సిద్ధాంత_గ్రంధాలలో_ఎక్కడ_ఉన్నది?

అన్ని సిద్ధాంతాలకి మూలమైన #సూర్య_సిద్ధాంతం నుండి ప్రారంభ చేసుకుందాము

ఏడవదియగు వైవస్వతమన్వంతరములో జరుగుచున్న 28 వ మహాయుగములో మొదటిదగు కృత యుగాంతమున .. శ్రీ సూర్యునిచే మయాసురునకు ఈ సిద్ధాంతముపదేసింపబడినది.

దానిలో సూర్యాంశ పురుషుడు మయాసురునితో నీక్రింద వ్రాసినవిధముగ చెప్పియున్నాడు.

#శ్రుణుష్వైకమనాః_పూర్వం_యదుక్తం_జ్ఞానముత్తమం|
#యుగేయుగే_మహర్షిణాం_స్వయమేవ_వివస్వతా ।

ఓ మయాసురా ! పూర్వమందు నూర్యునిచే స్వయముగ మహర్షులకు ప్రతి యుగమందు చెప్పబడిన యుత్తమ జ్ఞానమును చెప్పుచున్నాను. నీవు ఏకమనస్కుడవై వినుము.

ఇట్లు చెప్పుటవలన మయాసురునకు కొన్ని సందేహములు గలిగినవి.
(1) శాస్త్రములుప్తమగుటచే ప్రతి యుగమందు చెప్పవలసివచ్చినదా! లేక శాస్త్రోక్త ప్రకారము తిధి, గ్రహణములు ఉదయాస్తమయములు మొదలగు గణిత విషయములన్నియు సకాలమందు చెప్పిన ప్రకారము జరుగకపోవుటవలన ప్రతీ యుగమందు చెప్పవలసివచ్చినదా? అని సందిగ్ధ మనస్కుడైన మయాసురుని చూచి సూర్యాంశపురుషుకు అతని సందేహములను పోగొట్టుటకు గాను ఈక్రింద వ్రాసినవిధముగ చెప్పినాడు.

#సూర్య_సిద్ధాంతం_మధ్యమాధికారం_9శ్లోకం

#శాస్త్రమాద్యం_తదేవేదం_యత్పూర్వం_ప్రాహ_భాస్కరః ।
#యుగానాం_పరివర్తేన_కాలభేదోఽత్ర_కేవలః ॥

#రంగనాధ_వ్యాఖ్యానం
నను ప్రతియుగం సూర్యోక్తస్యైక్యాభావాత్ త్వయా కిం యుగీయశాస్త్రముపదిశ్యతే । అన్య- థైకదోక్త్యా యుగే యుగే ఇత్యస్యానుపపత్తేరిత్యత ఆహ । ఇదం మయా తుభ్యం వక్ష్యమాణం జ్యోతిఃశాస్త్రం తత్ సూర్యోక్తం । ఏవకారాత్ సూర్యోక్తాభిన్నత్వేన త్వాం ప్రతి అనువాదో న క్వచిత్ స్వకల్పనాంతరేణేత్యర్థః । ఆద్యం ప్రాక్కాలే సూర్యేణోక్తం । నను ఆసన్యుగీయసూర్యోక్తస్యాపి పూర్వకాలోక్తస్యాద్యత్వసంభవ ఇత్యతస్తత్పదాపేక్షితమాద్యపద- వివరణరూపమాహ । యదితి । శాస్త్రం సూర్యః పూర్వం ప్రథమం యస్మాత్ పూర్వమనుక్తమిత్యర్థః । ప్రాహ ప్రకర్షేణ విస్తరేణ మునీన్ ప్రతి ఉక్తవాన్ । తథా చ ప్రథమాతిరేకే కారణాభావాత్ ప్రథమస్య విస్తృతత్వాచ్చానంతరోక్తం పూర్వోక్తే గతార్థతయా సంక్షిప్తముపేక్ష్య ప్రథమ- యుగీయ శాస్త్రముపదిశ్యత ఇతి భావః । నను తర్హి అనంతరయుగీయశాస్త్రాణాం సూర్యోక్తానాం వైయర్థ్యప్రసంగ ఇత్యత ఆహ । యుగానామితి । మహాయుగానాం పరివర్తేన పున: పునరావృత్యా అత్ర సూర్యోక్తశాస్త్రేషు కేవలం స్వభిన్నాభావస్తన్మాత్రామిత్యర్థః । #కాలభేదః_కాలకృతమంతరం । పూర్వశాస్త్రకాలాదనంతరశాస్త్రకాలో భిన్న ఇత్యేషు శాస్త్రేషు భేదో న శాస్త్రోక్తరీతిభేద ఇత్యర్థః । తథా చ #కాలవశేన_గ్రహచారే_కించిద్వైలక్షణ్యం_భవతీతి_యుగాంతరే_తత్తదంతరం_గ్రహచారేషు_ప్రసాధ్య_తత్కాలస్థితలోకవ్యవహారార్థం శాస్త్రాంతరమివ కృపాలురుక్తవానితి నానాంతరశాస్త్రాణాం వైయర్థ్యం । ఏవంచ మయా వర్తమానయుగీయసూర్యోక్త- శాస్త్రసిద్ధగ్రహచారమంగలీకృత్యాద్యసూర్యోక్తశాస్త్రసిద్ధం గ్రహచారం చ ప్రయోజనాభావాదుపేక్ష్య తదుక్తమేవ త్వాం ప్రతి ఉపదిశ్యత ఇతి భావః । ఏవంచ యుగమధ్యేఽప్యవాంతరకాలే గ్రహచారేషు అంతరదర్శనే తత్తత్కాలే తదంతరం ప్రసాధ్య గ్రంథాంస్తత్కాలవర్తమానాభియుక్తాః కుర్వంతి । #తదిదమంతరం_పూర్వగ్రంథే_బీజమిత్యామనంతి । పూర్వగ్రంథానాం లుప్తత్వాత్ సూర్యర్షి- సంవాదోఽపీదానీం న దృశ్యత ఇతి తదప్రసిద్ధిః ఆగమప్రామాణ్యాచ్చ న ఆశంకయా ॥ 9॥

ఈ పైన వ్రాయబడిన శ్లోకము దాని వ్యాఖ్యాసమును చూచినయెడల గ్రహ గతులు మొదలగువానిలో అంతరము ( #బీజము) కలుగుననియు, దానిని గ్రహగతులలో సంస్కరించ వలెననియు అట్టి కాలాంతర సంస్కృత గ్రహములవలననే #దృష్టాదృష్టవిచారణమును చేయకుండా #సర్వకర్మల_అర్హ_కాలములను సాధించవలెననియు ఆ కాలములందే #నిత్యనైమిత్తికాది సకల కర్మలను ఆచరించవలెననియు స్పష్టపడుచున్నది.

మరియు ఈ శ్లోకమునకు పూర్వశ్లోకముపకు సంగతి విషయమై ఆలోచించితే ఇంతకంటే స్పష్టముగ #కాలాంతర_సంస్కృత_గ్రహములచే సాధించబడిన కాలములయందే #నిత్యనైమిత్తికాది_సకల_కర్మలును ఆచరించవలెనుగాని కాలాంతర సంస్కారముచే సంస్కరించబడని గ్రహములచే సాధించబడినస కాలములయందు నిత్యనైమిత్తికాది సకల కర్మలు ఆచరించి కూడదనియు స్పష్టపడుచున్నది. ( #సర్వత్ర_దృక్సిద్ధమునున_గ్రహించవలెను. #దృగ్విసంవాదమును_గ్రహించకూడదనియు_స్పష్టమగుచున్నది.) పూర్వోత్తరశ్లోకములకు సమన్వయమును ఆలోచించుకుంటే #శాస్త్రమాద్యం అను శ్లోకమునకు సరియైన ఆర్థము స్ఫురించును గాని లేకపోతే విపరీతార్ధము స్ఫురించును.

కాబట్టి గ్రహములను #తాత్కాలిక_దృక్సిద్ధములనుగా సాధించుకొనవలెననియు,
ఆ #తాత్కాలిక_దృక్సిద్ధ గ్రహముల వలన సాధించబడిన కాలములందే #నిత్యనైమిత్తికాది_సకల_కర్మలను ఆచరించవలెననియు చెప్పుటకింతకంటె ప్రమాణ మేమి కావలయును ? ఈ విషయము ముందు విశేషముగ విమర్శ చేయబడును.
(సశేషం)
#సంకలన_గొడవర్తి_సంపత్కుమార్_అప్పలాచార్య

19/09/2024
 ుక్రవారం_నాటి_చంద్ర_ దర్శనం_నిషేధముఆ రోజు రాత్రి చంద్రున్ని చూడరాదు #పూర్వదినే_సాయాహ్నమారభ్య_ప్రవృత్తాయాం_చతుర్థ్యాం_వి...
03/09/2024

ుక్రవారం_నాటి_చంద్ర_ దర్శనం_నిషేధము

ఆ రోజు రాత్రి చంద్రున్ని చూడరాదు

#పూర్వదినే_సాయాహ్నమారభ్య_ప్రవృత్తాయాం_చతుర్థ్యాం_వినాయకవ్రతాభావేపి పూర్వేద్యురేవ_చంద్రదర్శనే_దోష_ఇతి_సిధ్యతి।

#ప్రథాత్ర_చంద్రదర్శననిషేధః
అత్ర చతుర్థ్యాం చంద్రదర్శనే మిథ్యాభిదూషణం దోషస్తేన చతుర్థ్యాముదితస్య పంచమ్యాం- దర్శనం వినాయక వ్రతదినేఽపి న దోషాయ । పూర్వదినే సాయాహ్నమారభ్య ప్రవృత్తాయాం చతుర్థ్యాం వినాయకవ్రతాభావేఽపి పూర్వేద్యురేవ చంద్రదర్శనే దోష ఇతి సిధ్యతి । చతుర్థ్యాముదితస్య న దర్శనమితి పక్షే త్వవశిష్టపంచ షణ్ముహూర్తమాత్రచతుర్థీ దినేఽపి నిషేధాపత్తిః । ఇదానీం లోకాస్త్వేకతరపక్షాశ్రయేణ వినాయకవ్రతదినే ఏవ చంద్రం న పశ్యంతి న తదయకాలే దర్శ- నకాలే వా చతుర్థీ సత్త్వాసత్త్వే నియమేనాశ్రయంతి ।

పూర్వదినమందు సాయంకాలము మొదలుకొని ప్రవర్తిం చిన చతుర్థియందు వినాయకవ్రతములేకున్నను నా రాత్రి చంద్రదర్శనము నిషిద్ధమని లభించును.

శుక్లచతుర్థిలో చంద్రునిజూచిన నీలాపనిందలు కలుగును .

కావున ఈ రాత్రికి చంద్ర దర్శనం చేయకపోవటం శ్రేష్టము,

అథ చంద్రదర్శనే మంత్రజపః
దర్శనే జాతే తద్దోషశాంతయే ।
"సింహః ప్రసేనమవధీత్సిహో జాంబవతా హతః ।
సుకుమారక మారోదీస్తవ హ్యేష స్యమంతకః” ఇతి శ్లోకజపః కార్యః ।

అనివార్యముగా దర్శనమయినచో నాదోషముపోవుటకు
శ్లో॥ #సింహః_ప్రసేనమవధీ_స్సింహో_జాంబవతా_హతః,
#సుకుమారకమారోదీస్తవ_హ్యేషస్యమంతకః'
అను శ్లోక మంత్రము జపింపవలెను.

#గొడవర్తి_సంపత్కుమార్_అప్పలాచార్య

 #శ్రావణ్యాం_శ్రవణే_పూర్వం_|  #జాతో_హయశిరా_హరిః_  #తస్మిన్_దినే_విశేషేణ_| #పూజా_కార్యాబుధైర్విభోః||తాత్పర్యం:-. మునుపొకన...
19/08/2024

#శ్రావణ్యాం_శ్రవణే_పూర్వం_|
#జాతో_హయశిరా_హరిః_
#తస్మిన్_దినే_విశేషేణ_|
#పూజా_కార్యాబుధైర్విభోః||
తాత్పర్యం:-. మునుపొకనాడు శ్రవణ నక్షత్రయుత పూర్ణిమాదినమున శ్రీ మహా విష్ణువు హయశీర్షుడుగ సాక్షాత్కరించెను. కావున ఆ దినమున శ్రీహయగ్రీవ స్వామి పూజాధ్యాన స్తోత్రాదులను సజ్జనులు విశేషముగ నొనర్పవలెను.

#ఉదితే_పూర్ణచంద్రే_తు_।
#కార్యస్తత్ర_మహోత్సవః|
#నృత్తగీతైశ్చవాదిత్రైః_త్రయీఘోషైశ్చ_ సంతతైః॥
తాత్పర్యం:-శ్రావణ పూర్ణిమా దినమున చంద్రోదయముకాగానే, నృత్య గీత వాద్యములతో,ఎడతెగని వేదపఠనముతో నీయుత్సవమాచరించవలయును.

#దినాని_దశవా_పంచ_|
#త్రీణి_వాయది_వాతథా_|
#పూజయేచ్చ_జగన్నాథం_|
#నృత్తగీతాదిభిర్యుతం||

తాత్పర్యం:-ఈ రీతిగా జగదీశ్వరుడగు శ్రీహయగ్రీవస్వామి పూజావ్రతమును పదిదినములు, ఐదుదినములు, మూడుదినములుగాని, అవకాశములేనిచో నొక్క దినమునగాని ఆరచించవలెను.

 #రక్షాబన్ధన_నిర్ణయం #భద్రాలో_రక్షాబన్ధన_చేయరాదా? #సప్రామాణిక_వివరణ
17/08/2024

#రక్షాబన్ధన_నిర్ణయం
#భద్రాలో_రక్షాబన్ధన_చేయరాదా?
#సప్రామాణిక_వివరణ

16/04/2024
11/01/2023

సౌరాది సర్వ సిద్ధాంత సమ్మతములైన ఛాయార్క-సంస్కృత కరణార్కనీతములైన
అయనాంశ రీత్యా
మకర సంక్రమణ (12.01.2023)
శుభాకాంక్షలు.

కేవలం  #మధురకృష్ణమూర్తిశాస్త్రి గారి గురుపరంపరలో మాత్రమే ఈ పద్ధతిని పాటిస్తూ సంక్రాంతి దినాలు మూడు రోజులు ముందుగా ఆచరిస్...
11/01/2023

కేవలం #మధురకృష్ణమూర్తిశాస్త్రి గారి గురుపరంపరలో మాత్రమే ఈ పద్ధతిని పాటిస్తూ సంక్రాంతి దినాలు మూడు రోజులు ముందుగా ఆచరిస్తున్నారు ,అధికమాసాలు తేడాగా వ్రాస్తున్నారు అనుకుంటే పొరపాటే.పంజాబ్ కి చెందిన శక్తిధర దత్త గారు కూడా ఇదే అభిప్రాయం వెల్లిబుచ్చారు.కావాలంటే గమనించవచ్చు

Address

17-14-6/1, KRISHNA NAGAR, SEETAM PET
Visakhapatnam
530002

Alerts

Be the first to know and let us send you an email when Madhura Krishnamurthy Shastry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Madhura Krishnamurthy Shastry:

Share