Sri Varaha Lakshmi Narasimha Swamy Vari Devasthanam

Sri Varaha Lakshmi Narasimha Swamy Vari Devasthanam Welcome to the Official Page of Sri Varaha Lakshmi Narasimha Swamy Vari Devasthanam, Simhachalam, Visakhapatnam, Andhra Pradesh

The exact age of the temple is not known, but it contains an inscription, dated as far back as 1098-99 A.D. of the Chola king Kulottunga-I, who conquered the Kalinga territories, and it must thus have been a place of importance even by that period. Another inscription shows that a queen of the Velanandu chief Gonka III (1137-56)covered the image with gold a third says that the Eastern Ganga king N

arasimha. I built the central shrine,the mukhamandapam,the natyamandapam, and the enclosing verandah in black stone in the later half of 13th century and other grants inscribed on its walls (the Government Epigraphist's lists for 1899 give not less than 125 such inscriptions) make it a regular repository of the history of the district. The Simhachalam temple still contains in inscriptions left here by Sri krishna Devaraya of Vijayanagara empire recounting his successes and relating how he and his queen presented the yod with necklace of 991 pearls and other costly gifts. Architecturally the temple apparently deserves high praise. This temple contain a square shrine surmounted by a high tower, a portico in front with a smaller tower above it, a square sixteen pillared mandapam (called the mukhamandapam) facing this, and an enclosing verandah, all made of dark granite richly and delicately carved with conventional and floral ornament and scenes from the Vaishnavite puranas. Some of the carvings are mutilated (by Muhammadan conquerors, it is said). One of the pillars is called the kappa stambham or 'tribute pillar'. It is credited with great powers of curing diseases and granting children. In the verandah is a stone car with stone wheels and prancing stone horses. Outside this inner enclosure there is the excellent natyamandapam on the north side of the temple, where the god's marriage is performed. This is supported by 96 pillars of black stone, arranged in sixteen rows of six each, which are more delicately carved than any others in the temple, are all different in the details of their design, and yet avoid incongruity of effect by adhering to one general type - especially in their capitals, which are usually of the inverted - lotus shape. The deity is kept covered with an unctuous preparation of sandal paste. Once a year i.e, on akshaya thritheeya day (3rd day of Vaisakhamasam) this sandal paste will be removed in a ceremony at the festival called Chandanayatra (Chandanotsavam) and Nija roopa darsanam of Swamy Vari will be provided to devotees. It is the most important festival in this temple

24/04/2025
శ్రీశ్రీశ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, సింహాచలంప్రెస్ నోట్ఈనెల 30.04.2025న తేదీన జరిగే చందనోత్సవం సందర్భంగా శ...
23/04/2025

శ్రీశ్రీశ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, సింహాచలం
ప్రెస్ నోట్
ఈనెల 30.04.2025న తేదీన జరిగే చందనోత్సవం సందర్భంగా శ్రీ స్వామి వారి
నిజరూప దర్శనమునకు విచ్చేసిన భక్తులు సౌకర్యార్థం దర్శనం టిక్కెట్లు లభించు వివరములు.
1. తేది.24.04.2025న నుండి టిక్కెట్ల విక్రయము ప్రారంభించబడును.
2.
రూ..300/-లు, రూ.1000/-లు టిక్కెట్లు తీసుకొను భక్తులు కొండపైన దేవస్థానం పాత
పి. ఆర్.ఒ ఆఫీసు వద్ద మరియు ఈ క్రింది తెలిపిన బ్యాంక్ బ్రాంచ్ ల నందు,
దరఖాస్తులు తీసుకొని ఆధార్ నెంబరుతో పూర్తి చేసి టిక్కెట్లు నేరుగా పొందవచ్చును.

కార్యాలయందేవస్థానంకార్యనిర్వహణాధికారి వారిశ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిప్రెస్ నోట్సింహాచలంశ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి...
22/04/2025

కార్యాలయం
దేవస్థానం
కార్యనిర్వహణాధికారి వారి
శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి
ప్రెస్ నోట్
సింహాచలం
శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా,
హిరణ్యాక్షుని సంహరించిన వరాహావతారము, హిరణ్యకశిపుని సంహరించిన నారసింహావతారముల
యొక్క కలయికతో శ్రీస్వామి వారు ఇచ్చట శ్రీవరహలక్ష్మీనృసింహావతారముగా వెలసినారు.
శ్రీస్వామి వారు 364 రోజులు సుగంధ భరిత చందనములో యుండి ఒక్క దినము అనగా వైశాఖ
శుద్ధ తదియ రోజున మాత్రమే నిజరూప దర్శనముతో భక్తులకు దర్శన మొసగును. ఈ
దినమును "చందనయాత్ర"గా పేర్కొందురు. చందన యాత్ర రోజున శ్రీస్వామి వారిపై ఉన్న
చందనమును తొలగించి ఆరోజు తెల్లవారుఝాము నుండి రాత్రి వరకు శ్రీస్వామి వారి నిజరూప
దర్శన భాగ్యమును భక్తులకు కల్పించబడును. అదే రోజు రాత్రి సహస్రఘఠాభిషేకము జరిపించి,
శ్రీస్వామి వారికి చందన సమర్పణ చేయుదురు. చందనయాత్ర రోజున చందన సమర్పణకు
అవసరమైన చందనం చెక్కల అరగతీతను తేది.24.04.2025 ఉదయం గం||6.30 లకు
ప్రారంభించబడును. కావున భక్తులకు శ్రీ స్వామి వారి దర్శనం ఉదయం గం ||7.30 ల తరువాత
లభించును. రెండవ విడత చందన సమర్పణ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున, మూడవ విడత
చందన సమర్పణ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మరియు నాల్గవ విడత చందన సమర్పణ ఆషాడ పౌర్ణమి
రోజున జరుగును.
కావున పైన తెలియబరచిన వివరముల ప్రకారం సదరు విషయములు మీ యొక్క
దినపత్రిక / టి.వి. ఛానల్స్ ద్వారా భక్తులందరకు తెలియజేయవలసినదిగా కోరడమైనది.
Kommula S***a Rao

🙏🙏🙏🙏🙏కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయంశ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంసింహాచలంప్రెస్ నోట్శ్రీవరాహలక్ష్మీనృసిం...
21/04/2025

🙏🙏🙏🙏🙏
కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం
శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం
సింహాచలం
ప్రెస్ నోట్
శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా,
తేది.27.04.2025 న చైత్ర శుద్ధ అమావాస్య (గంధం అమావాస్య) సందర్భముగా
తేది.26.04.2025 సాయంత్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి రాత్రి
అంతయు కొండదిగువ వరాహ పుష్కరిణి (చెరువు) వద్ద మరియు కొండపైన జాగరము
ఉండి తేది.26.04.2025న పుష్కరిణి చెరువు నందు స్నానమాచరించి కొండపైకి
చేరుకొని శ్రీ స్వామి వారి దర్శనము చేసుకొని వెళ్ళు ఆచారము కలదు. అత్యధి సంఖ్యలో
భక్తులు శ్రీ స్వామి వారి దర్శనార్ధం విచ్చేయుదురు.
శ్రీ స్వామి వారి దేవాలయం నందు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి
తిరునక్షత్రం సందర్భముగా తేది.28.04.2025 నుండి తేది.02.05.2025 వరకు
నిర్వహించబడును. సదరు తిరునక్షత్ర మహోత్సవము శ్రీ స్వామి వారి సన్నిధిలో రాత్రి
ఆరాధనతో పాటు తిరునక్షత్ర సేవాకాలము, విశేష ఉత్సవము జరుపవలసియున్నది.
సాయంత్రం గం.. 7.00 ల వరకు మాత్రమే భక్తులకు దర్శనము లభించును. మరియు
తేది.29.04.2025 మూర్తి కళావహనం సందర్భముగా
గం..6.00లకు దర్శనములు నిలుపుదల చేయబడును.
మరియు తేది.27.04.2025 నుండి తేది. 02.05.2025 వరకు శ్రీ స్వామి
వారి దేవాలయం నందు జరుగు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయడమైనది.
Kommula S***a Rao
Executive Officer

20/04/2025

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలం
స్వామి వారికిచందనం అరగదీతకు చందనంచెక్కలు సిద్ధం
ఇ ఓ, కె. సుబ్బారావు

20 ఏప్రిల్ 2025

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామికి
ఈనెల 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.
ఈ నేపధ్యంలో... వైశాఖ శుద్ధ తదియ నాడు అప్పన్న నిజరూప దర్శనం రోజు రాత్రికి తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని .. ఆ తర్వాత వచ్చే వైశాఖ ,జ్యేష్ఠ ,ఆషాఢ పౌర్ణమిల లో మూడేసి మణుగుల చొప్పున ఏడాదిలో నాలుగు విడతల కింద 12 మణుగుల చందనాన్ని(500కేజీ లు) స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నేపథ్యంలోచందన సమర్పణకు అవసరమైన చందనం చెక్కల అరగతీతను తేది.24.04.2025 ఉదయం గం||6.30 లకు ప్రారంభించబడును కావున చందన సమర్పణ కి అవసరమగు చందనపు చెక్కలను ఆదివారం ఆలయ ఈవో కె . సుబ్బారావు స్థానాచార్యులు, టి పి రాజగోపాల్ ఆధ్వర్యంలోఅర్చక వర్గం, ఆలయ సహాయకార్య నిర్వహణ అధికారి నక్కాన ఆనంద్ కుమార్ పర్యవేక్షణాధికారి జీవివి ఎస్కే ప్రసాద్ ఆలయ సిబ్బంది చందన సమర్పణకు గాను అవసరమగు చందన చెక్కలను సిద్ధం చేయించారు.

10/04/2025

అప్పన్న స్వామి కళ్యాణం అద్భుతం..ప్రత్యేక విద్యుత్ కాంతులు
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు... సింహగిరిపై కళ్యాణ కాంతులు
కాసేపు ఉరుములు మెరుపులతో సందడి చేసిన వరుణుడు
పుష్పమాల అలంకరణలు వెన్నెల వెలుగులు
సింహగిరిని కాంతుల పరజా పరిచినట్టు
వెలుగులతో నింపేసాయి.అప్పన్న స్వామి
రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
అంతకు ముందర వధూవరుల పరిచయ
కార్యక్రమం ఎదురు సన్నహాక కార్యక్రమం
నయన మనోహరంగా నిర్వహించారు.భక్తులకు విందు భోజనాలు ఎక్కడికి అక్కడ
అందరూ దర్శించుకునే విధంగా ప్రత్యేక LED
స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల
ప్రతినిధులు భక్తులకు సేవలు అందించారు.

శ్రీశ్రీశ్రీ వరాహాలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంస్వామి వారి కళ్యాణానికి సర్వం సిద్ధం                     ...
07/04/2025

శ్రీశ్రీశ్రీ వరాహాలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం

స్వామి వారి కళ్యాణానికి సర్వం సిద్ధం

ఈ ఓ కె .సుబ్బారావు

తేదీ 7 ఏప్రిల్ 2025

ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి వార్షిక కళ్యాణం మహోత్సవాన్ని మంగళవారం 8 వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి నాందిగా సోమవారం ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానాచార్యులు డాక్టర్ టి పి రాజగోపాల్ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఇంజనీరింగ్ అధికారులు తో కలిసి రథసారథి లక్ష్మణ్ రావు వారి యొక్క సిబ్బందితో రథం సిద్ధం చేశారు .
నేడుసింహగిరిపై స్వామి వారి వార్షిక కళ్యాణం ఉత్తర రాజగోపురం నకు ఎదురుగా గల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసే భారీ వేదిక మీద పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము వైదికులు శాస్త్రోత్తముగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారు గోవిందరాజు స్వామి శ్రీదేవి భూదేవిల ఉత్సవ మూర్తులను శోభయమానముగా అలంకరించి వేదికపై అధిష్ఠంపచేసి విష్వక్సేన పూజ పుణ్యా వచనము యజ్ఞోపవీతాధారణ జీలకర్ర బెల్లం మాంగల్య ధారణ తలంబరాలు తదార ఘటాలు ఈ ఉత్సవంలో భక్తులకు ఆనందాన్ని కల్పిస్తాయి అంతకుముందు కొట్నాల ఉత్సవము ద్వారా వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు

ఈ రథోత్సవానికి దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆలయ కార్యనిర్వహణాధికారి కె .సుబ్బారావు స్థానాచార్యులు శ్రీ మాన్ టీ పి రాజగోపాల్ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు ఇతర అధికారులు వైదిక పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు ఈ కళ్యాణములో పాలుపంచుకుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందజేస్తారని ఈవో కె సుబ్బారావు తెలియజేశారు.
ముఖ్యముగాస్వామి వారి కళ్యాణము తిలకించే భక్తుల కోసం ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం, శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులు వీక్షించుటకు వివిధ ప్రదేశాల్లో ఎల్ ఈ డి స్క్రీన్ లను ఏర్పాటు చేయుట,
ఎదుర్కోలు ఉత్సవము జోడు భద్రములు వద్ద జరుగును ఎదురెదురుగా శ్రీ స్వామివారికి అమ్మవార్లకు విడివిడిగా వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవము రాత్రి 6:30 నుండి 7:30 వరకు జరుగును .రథోత్సవము ఎదురు సన్నహోత్సవం పూర్తయిన పిదప స్వామివారి అలంకరణ పూర్తి చేసుకుని రాత్రి 8:30 నుండి సాంప్రదాయ పద్ధతిన రథోత్సవమును ప్రారంభమగును .

రథోత్సవంలో పాల్గొనే భక్తులు బారికెడల వెలుపల నుండి మాత్రమే స్వామి వారి రథోత్సవాన్ని వీక్షించవలెను ,భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానం వారికి పోలీసు వారికి సహకరించవలసిందిగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కె సుబ్బారావు కోరారు.

భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవం తిలకించుటకు అధిక సంఖ్యలో విచ్చేయుదురు కావున భక్తుల సౌకర్యార్థము వివిధ ప్రదేశాల్లో చలువ పందిర్లు ఏర్పాటు చేయడమైనది.

భక్తుల సౌకర్యార్థము కొండపై మజ్జిగ సదుపాయం ఏర్పాటు చేయడమైనది.

స్వామివారి వార్షిక కళ్యాణం సందర్భంగా కళ్యాణం రోజున భక్తుల సౌకర్యార్థము ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 5000 మందికి సహపంక్తి భోజనము ఏర్పాటు చేయబడును మరియు రాత్రి 5,000 మందికి స్వీటు తో స్వామివారి పెళ్లి భోజనము ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో తెలియజేశారు

శ్రీ స్వామివారి కల్యాణం రోజున భక్తులను కొండ దిగువ నుండి కొండపైకి , కొండపైనుండి కొండ క్రింద కు తీసుకొని వెళ్ళుటకు కళ్యాణం పూర్తయి రాత్రి సుమారు ఒంటిగంట వరకు నిరంతరము దేవస్థానం బస్సులు అందుబాటులో ఉంటాయని ఆలయ కార్య నిర్వహణ అధికారి తెలియజేశారు

భక్తులకు ఎక్కడ ఏ అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం మెడికల్ క్యాంపులు అంబులెన్స్ ఏర్పాటు చేయడమైనది

ముఖ్యంగా మీడియా వెహికల్స్ శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, రథోత్సవం ,మరియు కళ్యాణ మహోత్సవము కవరేజ్ కొరకు వచ్చు మీడియా వెహికల్స్ ముందుగా వచ్చి జోడుభద్రముల వద్ద పార్కింగ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది

శ్రీ స్వామివారి కళ్యాణం అనంతరము భక్తులకు ప్రసాదం కౌంటర్ల వద్ద సుమారు 8 కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ముత్యంతో కూడిన తలంబ్రాలు పంచబడును.

తేది. 08-04-2025, మంగళవారం

ఉ॥ 4-00 గం॥లకు
: సుప్రభాత సేవ, ఆరాధన, విశేష హోమములు, బాలభోగము, బలిహరణం, మంగళాశాసనం

ఉ॥ 7-30 గం॥లకు
: దర్శనములు
ఉ॥ 11-30 గం||ల నుండి మ॥ 12-30 గం॥ల వరకు మహా రాజభోగము (దర్శనములు నిలుపుదల చేయబడును)

మ॥ 2-30 గం||ల నుండి మ॥ 3-00 గం॥ల వరకు మధ్యాహ్న విరామం

మ॥ 3-00 గం||ల నుండి మ॥ 3-30గం॥ల వరకు
: కొట్నాల ఉత్సవం

సా॥ 4-00 గం॥ల నుండి రా॥ 6-30గం॥ల వరకు
: ఆరాధనం, విశేష హోమములు, గ్రామ బలిహరణం, ధ్వజారోహణం

రా॥ 6-30 గం॥ల నుండి రా॥ 7-30 గం॥ల వరకు
: ఎదురు సన్నాహ మహోత్సవం, బంగారు తోళిక్కినియాన్ పై తిరువీధి సేవ, ముత్యాల పల్లకిలో అమ్మవార్ల సేవ

రా॥ 7-30 గం॥ల నుండి రా॥ 8-00 గం॥ల వరకు

: రధం పై శ్రీ స్వామివారి అలంకరణం

రా॥ 8-15 గం॥ల నుండి రా॥ 9-30 గం॥ల వరకు : రథోత్సవం

రా॥ 8-30 గం||ల నుండి మ॥ 10-00గం॥ల వరకు దర్శనములు

రా॥ 10-00 గం॥ల నుండి మ॥ 10-30 గం॥ల వరకు: కళ్యాణ వేదికపై శ్రీ స్వామివారి అలంకరణం

10-30 : శ్రీ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవము ప్రారంభం

కావున భక్తులు స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాత్రులు కాగలరని ఆలయ ఈవో కె.సుబ్బారావు తెలియజేశారు

సదా స్వామివారి సేవలో

కార్యనిర్వహణాధికారి
సింహాచలం దేవస్థానం

Address

SimhachalamDevasthanam
Visakhapatnam
530028

Opening Hours

Monday 6:30am - 9pm
Tuesday 6:30am - 9pm
Wednesday 6:30am - 9pm
Thursday 6:30am - 9pm
Friday 6:30am - 9pm
Saturday 6:30am - 9pm
Sunday 9:30am - 9pm

Telephone

+919398734612

Alerts

Be the first to know and let us send you an email when Sri Varaha Lakshmi Narasimha Swamy Vari Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Varaha Lakshmi Narasimha Swamy Vari Devasthanam:

Share