05/02/2023
Atleast 1 in 68
పత్రికా ప్రకటన॥ విశాఖ పట్టణం ॥ 05.02.23
ఉత్తరాంధ్రా ముస్లిం సమాజానికి అన్ని పార్టీలు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి!
-ముస్లిం రాజకీయ చైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్.
విభాజిత ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం సమాజ ఆర్ధిక పరిస్థితి పురోగతి వైపు కాకుండా వెనక్కి వెళుతుంది. అందులో ముఖ్యంగా 25 ఎళ్లు పై బడి ఒక్క ప్రజాప్రతి కూడా లేని ఈ కోస్తాంధ్రా ముస్లిం ప్రజల దుస్థితి వర్ణనాతీతం, 30 ఎళ్ల క్రితం కాకినాడ నుండి కాంగ్రెస్ ఒక ముస్లిం లాయర్ కి సీటు ఇచ్చింది ఆయన రెండవ స్థానం లో నిలిచారు. అలాగే 28 ఎళ్లగా క్రితం వైజాగ్ లో ముస్లిం MLA ని గెలిపించారు.
ఆ తరువాత లోకల్ బాడి ఎలెక్షన్సలో మినహా శాసనసభల్లో గాని పార్లమెంటులో గాని అవకాసం లేకుండా విస్మరించాయి అన్ని పార్టీలు.
30 ఎళ్ల క్రితమే ఈ తీర ప్రాంతంలో ముస్లిం నాయకులను టిడిపి, కాంగ్రేసు లాంటి జనబలం ఉన్న పార్టీలు సీట్లు కేటాయించినపుడు ఇప్పటికి అంటే 30 ఎళ్ల తరువాత జనాభా శాతం పెరుగుతుంది అలాగే నాయకులు పెరగాలి.
కాని అలా జరగలేదు పార్టీలు మాత్రం ముస్లింల ఓట్లను మాత్రమే పరిగణించి, ఓటు బ్యాంకుగా మాత్రమే ముస్లింలను చూస్తుంది తప్ప నాయకత్వాన్ని చట్ట సభల్లో స్ధానాలకు దూరం చేసింది.
అది కుట్ర లేక యాదృచ్ఛికమ అనేది చర్చనీయాంశంగా చూడకుండా ఇప్పటికైనా ఆలస్యం కాకుండా అన్ని పార్టీలు ముస్లిం సమాజానికి తగిన గుర్తింపు అవకాసాలను మెరుగు పర్చాలి అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్వ జిల్లాల ప్రకారంగా జిల్లాకోక్కటి చెప్పున కనీసం నాలుగు శాసనసభ స్థానాలను ముస్లింలకు కేటాయించి తీరాలని మా సంస్థ మిడియా ద్వారా పార్టి అధినేతలను కోరుతుంది.
ఏ పార్టి అయితే రాష్ట్రంలో ఎక్కువ శాతం మస్లింలకు ప్రాతినిధ్యం కల్పిస్తుందో వారిని గెలిపించుదునేందుకు ముస్లిం రాజకీయ చైతన్య వేదిక కృషి చేస్తుందని ఈ సంధర్భంగా తెలుపుకుంటుంది.
రాయలసీమలో కర్నూలు, కడప,మదనపల్లి నియోజకవర్గాల మినహా పిలేరు, నంద్యాలా, బనగానపల్లి,హిందపూర్, రాయచోటి, ఇలా అనేక నియోజక వర్గాల్లో ముస్లింల జనాభా 40-60% వరుకు ఉన్నారు.
అలాగే నెల్లూరు నుండి విజయవాడ వరకు ముస్లిం ఓటు బ్యాంకు 30-40% ఉంది, కనీసం అలాంటి చోట్ల పార్టీలు ముస్లిం నేతలకు అవకాసం ఇచ్చినా 15 కు పైగా శాసనసభ్యులు 3 పార్లమెంట్ సభ్యులు మనకు దక్కుతారు.
అందుకే జనాభా దామాషా దృష్ట్యా చూసుకున్న ముస్లింలు దాదాపు 10% రాష్ట్రంలో ఉన్నారు 18 శాసన సభ, 3 పార్లమెంట్ స్థానాలు కల్పించ వచ్చు అలాగే లోకల్ బాడి మరియు శాసనమండలిలో కూడా ఈ ప్రాతినిధ్యం అమలు చేయగ ముస్లిం సమాజం రాష్ట్రంలో బాగా పురోగతి చెంది వారికి సామాజిక ఆర్ధిక న్యాయం చేసిన వారు అవుతారు.
అలాగే గెలిచిన నాయకులకు ఎప్పుడు కూడా మైనారిటీ మంత్రి శాఖ మాత్రమే కాకుండా మిగిలిన శాఖలను కూడా ఇచ్చి సామాజిక న్యాయం చేయాలి అని ముస్లిం రాజకీయ చైతన్య వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్ కోరడం జరిగింది
ముస్లిం సమాజాన్ని రాజకీయాలకు దురం చేస్తున్న కపట నాయకులను బిజేపి ఆరి ఎస్స్స్ అడుగుజాడల్లో నడిచే పార్టీలను ముస్లింలు ఎన్నటికీ మద్దతు ఇవ్వరు కావంటే మెము స్వతంత్ర అభ్యర్థులను బరిలో దింపి చందాలు వెసుకోని గెలిపించుకుంటాం.
ఈ కార్యక్రమంలో విజయనగరం , విశాఖ , శ్రీకాకుళం, బోబ్బిలి,అనకాపల్లి , తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గాల ముస్లిం నాయకులు పాల్గొన్నారు.