అనంత పద్మనాభ స్వామి దేవాలయం-అనంతగిరి

  • Home
  • India
  • Vikarabad
  • అనంత పద్మనాభ స్వామి దేవాలయం-అనంతగిరి

అనంత పద్మనాభ స్వామి దేవాలయం-అనంతగిరి Ananthagiri, Sri Ananth Padmanabha temple must visit for short weekend break and can be visited in a single day on a picnic tour . Temple providing rooms..

 #మనదేవాలయాలు_మనసంపద  #మనదేవాలయాలు  #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి  భగవత్ బందువులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు...
09/09/2021

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి


భగవత్ బందువులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు!

#వినాయకచవితిపూజా

వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూడా సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి.

వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టిపాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి.

దానిలో కొన్ని అక్షతలు, పూలువేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నియమ ప్రకారం పూజ, దీపారాధన, నైవేద్యాలు సమర్పించుకోవాలి.

అలాగే పత్రి పూజతో వినాయకుడి అనుగ్రహం పొందండి. 21 పత్రాలతో పూజ చేయడం ద్వారా నేత్ర, మూత్ర, చర్మ సంబంధిత రోగాలు దూరమవుతాయి.వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి.

#వినాయకచవితి వ్రత కథ, పూజా విధానం:

భక్తి అంటే కూర్చుని భజన చేయడం, లేకపోతే పేరును తలచుకోవడమో, పారాయణ చేసుకోవటం, సత్సంగాలు చేసుకొవడం మాత్రమే కాదు. మనం ఏ పని చేసినా ప్రతి అడుగు భగవంతుని వైపుకు వేయాలి. ఏ రకంగా వేస్తే భగవంతుని వైపుకి చేరుతామో అది "భక్తి". అది మన జీవితంలో ఒక భాగం కావటం కాదు, మన జీవితమే దాంట్లో భాగం కావాలి. మనం ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా అది ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు ఏదైనా సరే భగవంతున్ని కేంద్రంగా చేసుకుపోవాలి,అదే నిజమైన భక్తి.
చిన్నారి దేవుళ్ళ పండుగ
వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానం, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం. వివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకటి, మూడు, ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసి, పూజలో వుంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు.

#పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

ప్రతీవారు తమ ఇంట్లో స్వామిని పూజిస్తారు. వినాయక వ్రతం, పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించారు. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత..

పసుపు గణపతిని పూజించాలి వినాయక చవితి రోజున చేయుటకు వినాయక వ్రతము ప్రముఖ శుభకార్యం కాబట్టి ముందు పసుపుతో చేసిన గణపతి పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపల్లెములో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతి తమలపాకుతో పాటు ఉంచవలెను. కొబ్బరి నూనే లేదా ఆవునేతితో దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.

శ్రీ మహాగణాధిపతియే నమః: శ్రీ గురుభ్యోనమః: హరి: ఓం

శ్లో:-. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‖ 1 ‖

మంత్రం:- ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా:
పశో వదంతి శమోమండేషమూర్జంయాహానా ధేనుర్వాగస్మానం
పసుష్టుతైతు అయ ముహూర్త స్సుముహూర్తో అస్తు.


‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి
సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’

శ్లోకం: యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి.

పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

#పూజావిధానం
ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం

ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి:-.
గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి.

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సితారామాభ్యాం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు

భూతోచ్చాటన:-
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే అనే మంత్రాన్ని చదువుతూ అక్షతలు వెనుక వేసుకొవాలి.

ప్రాణాయామం:
ఓం భూః, ఓం భువః, ఓగ్ సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.

సంకల్పము:-
సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే , శ్రీ మహా విష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ ............... .నామా సంవత్సరము, దక్షిణాయేనే, వర్షరుతుడు, భధ్రపదమాసే, శుక్లప క్షేత్రం, చతుర్థ్యం.................. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ ............ గోత్ర: ......... .నామధేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం , ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవత క దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ( అని సంకల్పం చేసి ) ( కలశంలోని నీరు ముట్టుకొనవలెను )

శ్లో : కలశస్య ముఖే విష్ణు : కంఠే రుద్రస్సమాశ్రిత:| మూలే తత్రస్థితో బహ్మ మధ్యే మాతృగణా స్సౄతా: కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా | ఋగ్వేదోధయర్వేద స్సామవేదో హ్యధర్వణ:| అంగైశ్చ సహిత స్సర్వే కలశాంబు సమాశ్రితా:|| ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరషిచ్యతే ఉక్ధైర్యజ్ఞేషు వర్ధతే , ఆపోవా ఇదగ్ం సర్వం| విశ్వభూత న్యాప: ప్రాణావా ఆప: పశవ ఆపో౭న్నమాపో౭ మృత మామస్సమ్రాడాపో విరాడాప స్వరాడా పశ్చందాగ్ శ్యాపో జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాప స్సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం . గంగేచయమునేచైవ గోదావరి సరస్వతీ| నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు|| ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్ధం మమ దురతక్షయ కారకా:|| కలశోదకేన దేవత, ఆత్మానం, పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య. (కలశములోని నీరు పుష్పముతో గణపతి పైన, పూజద్రవ్యముల పైన చల్లవలెను.

ప్రాణ ప్రతిష్ట (పుష్పముతో పసుపు గణపతి తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను. అసునీ తేపునరస్మాసు చక్షు : పునః : ప్రాణ మినహనో దేహి భోగమ్| జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమంతే మృడయాన స్వస్తి ఓం అమృతం వై ప్రాణా: అమృతమాప: ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే|| స్థిరోభవ,వరదోభవ,సుముఖోభవ,సుప్రసన్నోభవ,స్థిరాసనం కురు|| . ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం| జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్.

షోడశోపచార పూజ
ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ.. ఆవాహయామి:

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం.. ఆసనం సమర్పయామి:

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం.. ఆర్ఘ్యం సమర్పయామి:

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.. పాద్యం సమర్పయామి:

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో.. ఆచమనీయం సమర్పయామి:

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే.. మధుపర్కం సమర్పయామి:

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత.. పంచామృత స్నానం సమర్పయామి:

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే.. శుద్దోదక స్నానం సమర్పయామి:

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ..వస్త్రయుగ్మం సమర్పయామి:

రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక.. యజ్ఞోపవీతం సమర్పయామి:

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం.. గంధాన్ సమర్పయామి:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే.. అక్షతాన్ సమర్పయామి:

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.. పుష్పాణి పూజయామి:

అథాంగ పూజ.. పుష్పాలతో పూజించాలి
గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ

ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి,
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి,
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి,
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి,
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి,
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి,
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి,
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి,
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

అష్టోత్తర శతనామ పూజావళి
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.. ధూపమాఘ్రాపయామి
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే.. దీపందర్శయామి।

నైవేద్యం:-

బెల్లము వండిన ప్రసాదం మీద నీరు చల్లి చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.

ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్.
(నీళ్ళు పుష్పంతో చల్లి ఓం సత్యం త్వర్తేన పరిషించామి. పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి.)
ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా
(క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.) మధ్య మధ్య పానీయం సమర్పణమి.

శ్రీ మహాగణాధిపతియే నమః: తాంబులం సమర్పణమి. (కర్పూరం వెలిగించి గంట మ్రోగించాలి)

శ్రీ మహాగణాధిపతియే నమః: ఆనందకర్పూర నీరాజనం సమర్పణమి .

శ్లో : యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు|న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప | మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.మనస్పూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోవాలి.
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్.
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ.. నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

వినాయక వ్రత కథ
వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని, సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్య, తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి ‘రుషివర్యా, మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి’ అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు... వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

‘ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ విజయాలనూ వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి’ అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరం, ఉత్తమం, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగానీ, వెండితోగానీ లేదా మట్టితోగానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, రకమునకు ఇరవైఒకటి చొప్పున నివేదించాలి.

అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది’అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే... తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితోబాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పసాగాడు.

పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు.

గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి... ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లాడు.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.
దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు....ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు...గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు.

తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు.

రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.
శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి.
అలా వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు.
శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు.
చవితి రోజున చంద్రుణ్ణి చూడడం దోషం, చవితి చంద్రుడు ఈ రోజునుండే ఆకాశంలో విహరిస్తాడు. ఎవరైనా చెంద్రుడిని పొరపాటున చూసినచో ఈ మంత్రం జపము చేయడం చాలా మంచిది.

సింహః ప్రసేన మవదీత్, సింహో జాంబవంతాహతః,
సుకుమారక మారోధి, స్తవహ్యేశ స్యమంతకః
‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
ఉద్వాసన :
మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి:
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే
యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ||
పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.
మంగళ హారతులు

వెండి పళ్ళెరములోన వేవేల ముత్యాలు
కొండలుగ నీలములు కలియబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని
దండిగా నీకిత్తు ధవళారతి
IIజయమంగళం నిత్య శుభమంగళంII

పువ్వులను నిను గొల్తు పుష్పాల నిను గొల్తు
గంధాన నినుగొల్తు కస్తూరిని
ఎప్పుడును నిను గొల్తు ఏకచిత్తంబున
పర్వమున దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

ఏకదంతంబును ఎల్ల గజవదనంబు
వాలైన తొండంబు వలపు కడుపు
జోకయిన మూషికము సొరది నెక్కాడెడు
భవ్యమున దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

మంగళము మంగళము మార్తండతేజునకు
మంగళము సర్వజ్ఞవందితునకు
మంగళము ముల్లోక మహితసంచారునకు
మంగళము దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

మోదుగము వుండ్రాళ్ళు
ముద్ద పప్పుతో నెయ్యియు
ఆదిగాగల తేనే అమృతాన్నముల్
ఆదరంబుగ తృప్తి తానారగింపుచును
పర్వమున దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

ఓ బొజ్జ గణపతి! ఓర్పుతో రక్షించి
కాచి నన్నేలు మీ కరుణతోను
మాపాలగలవని మహిమీదనెల్లపుడు
కొనియాడి మ్రొక్కెదను కోర్కెదీర
IIజయమంగళం నిత్య శుభమంగళంII

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మన దేవాలయ లు గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://www.facebook.com/groups/2185637145027700/?ref=share

మన దేవాలయాలు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.సమాచారం అందరితో షేర్ చేయండి.

https://t.me/joinchat/GfLCAnisG1gSQZkc

14/09/2020

మనసా, వాచా, కర్మణా భక్తితో హిందూ దేవాలయాల కోసం సేవ చేస్తున్న మమ్ములను ప్రోత్సహించండి!
ప్రతి ఒక్కరు తప్పకుండా మనదేవాలయాలు యూట్యూబ్ ఛానల్ ని SUBSCRIBE చేయండి
https://rb.gy/uza6vh

06/06/2020

ప్రతి నిత్యం దేవాలయాల సమాచారం కోసం

facebook.com/manatemples/

ని లైక్ చేయండి,follow అవ్వండి,share చేయండి

Manatemples.in is a website which gives complete information of temples of Telangana and Andhra Pradesh.

temples






పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ..
23/10/2019

పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ..

“మన దేవాలయాలు” Manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక| (E-Magazine). April సంచిక మాస పత్రిక అందుబాటులో ఉంది...
05/04/2019

“మన దేవాలయాలు” Manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక| (E-Magazine). April సంచిక మాస పత్రిక అందుబాటులో ఉంది. కావలసిన వారికి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది .మిత్రులందరూ ప్రతి ఒక్కరు పుస్తకాన్ని కొనుగోలు చేసి సంస్థ కు,సంస్థ లో పని చేస్తున్న ఉద్యోగులకు సహాయ పడగలరు.

నమస్కారం,

“మన దేవాలయాలు” Manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక |(E-Magazine) (రెండు) . ఏప్రిల్ సంచిక అందుబాటు లో ఉన్నాయి. కావాల్సిన వారు నన్ను సంప్రదించగలరు.

ప్రతి ఒక్కరు పుస్తకం కోనుగోలు/Subscription చేసి సంస్థకు,సంస్థ లో పని చేస్తున్న చిన్న ఉద్యోగులకు సహాయపడగలరు .

నెలసరి చందా : Rs 25/-
సంవత్సర చందా : Rs 300/- + 100 ( పోస్టల్ charges)

Net Banking Details:
C. Venkata Giri Chary,
STATE BANK OF INDIAA/C No 20136630291,
Ifsc Code: SBIN0012655

Paytm /G-Pay No: 9866933582

Note: Request to all.Please contribute small amount to book for running successfully.Every penny which you contribute will help us to reach more people and more information about our temples and traditions.

గమనిక:-
మన చరిత్రను ,మన సంస్కృతిని మన దేవాలయాలను ,మన ధర్మాన్ని కాపాడే భాద్యత మనదే.మన ఆచార సంప్రాదయలకు మనమే ప్రాచరకార్తలం అవుదాం . మనసంస్కృతి,మన చరిత్ర , మన ఆచార సంప్రదాయాల్లో ఉన్న విశిష్టత ను ప్రపంచానికి చాటి చెప్పేల ప్రచారం చేద్దాం. ప్రతి ఒక్కరు పుస్తకము కానీ E-Magazine ను తీసుకోని సంస్థ కు ఆర్థికంగా సహాయ పడగలరు అని మనవి.

ఇట్లు,
మీ శ్రేయోభిలాషి
వెంకట గిరి చార్యులు(Girish Servetheneedy)
Whatsapp:-91-9866933582 .

భగవత్ బంధువులందరికీ www.manatemples.net మహా శివరాత్రిశుభాకాంక్షలు .రెండు రాష్ట్రాల్లో ఉన్న స్వయంభు మరి పురాతన శైవ క్షేత్...
03/03/2019

భగవత్ బంధువులందరికీ
www.manatemples.net
మహా శివరాత్రి
శుభాకాంక్షలు .
రెండు రాష్ట్రాల్లో ఉన్న స్వయంభు మరి పురాతన శైవ క్షేత్రాల వివరాలు జిల్లా వారిగా!!

మన దేవాలయాలు” Manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక |(E-Magazine) (రెండు) . ఫిబ్రవరి సంచిక అందుబాటు లో ఉన్...
07/02/2019

మన దేవాలయాలు” Manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక |(E-Magazine) (రెండు) . ఫిబ్రవరి సంచిక అందుబాటు లో ఉన్నాయి. కావాల్సిన వారు నన్ను సంప్రదించగలరు.

ప్రతి ఒక్కరు పుస్తకం కోనుగోలు చేసి సంస్థకు,సంస్థ లో పని చేస్తున్న చిన్న ఉద్యోగులకు సహాయపడగలరు .

Subscription తీసుకున్న వారికి ఫిబ్రవరి సంచిక తో పాటు జనవరి, డిసెంబర్ ,సంచికలు ఉచితంగా పంపబడును.

నమస్కారం,“మన దేవాలయాలు” Manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక |(E-Magazine) (రెండు) . జనవరి సంచిక అందుబాటు...
06/01/2019

నమస్కారం,

“మన దేవాలయాలు” Manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక |(E-Magazine) (రెండు) . జనవరి సంచిక అందుబాటు లో ఉన్నాయి. కావాల్సిన వారు నన్ను సంప్రదించగలరు.

ప్రతి ఒక్కరు పుస్తకం కోనుగోలు చేసి సంస్థకు,సంస్థ లో పని చేస్తున్న చిన్న ఉద్యోగులకు సహాయపడగలరు .

Subscription తీసుకున్న వారికి జనవరి సంచిక తో పాటు డిసెంబర్,నవంబర్ సంచికలు ఉచితంగా పంపబడును.

నెలసరి చందా : Rs 25/-
సంవత్సర చందా : Rs 300/-

Net Banking Details:
C. Venkata Giri Chary,
STATE BANK OF INDIA
A/C No 20136630291,
Ifsc Code: SBIN0012655

Paytm /G-Pay No: 9866933582

Note: Request to all.Please contribute small amount to book for running successfully.Every penny which you contribute will help us to reach more people and more information about our temples and traditions.

గమనిక:-
మన చరిత్రను ,మన సంస్కృతిని మన దేవాలయాలను ,మన ధర్మాన్ని కాపాడే భాద్యత మనదే.మన ఆచార సంప్రాదయలకు మనమే ప్రాచరకార్తలం అవుదాం . మనసంస్కృతి,మన చరిత్ర , మన ఆచార సంప్రదాయాల్లో ఉన్న విశిష్టత ను ప్రపంచానికి చాటి చెప్పేల ప్రచారం చేద్దాం. ప్రతి ఒక్కరు పుస్తకము కానీ E-Magazine ను తీసుకోని సంస్థ కు ఆర్థికంగా సహాయ పడగలరు అని మనవి.

ఇట్లు,
మీ శ్రేయోభిలాషి
వెంకట గిరి చార్యులు(Girish Servetheneedy)
Whatsapp:-91-9866933582 .

Address

Ananthagiri
Vikarabad
501501

Opening Hours

Monday 7:30am - 1pm
4pm - 8:30pm
Tuesday 7:30am - 1pm
4pm - 8:29pm
Wednesday 7:30am - 1pm
4pm - 8:30pm
Thursday 7:30am - 1pm
4pm - 8:30pm
Friday 7:30am - 1pm
4pm - 8:30pm
Saturday 7:30am - 1pm
3pm - 8:30pm
Sunday 7:30am - 1pm
3pm - 8:30pm

Telephone

+919052550053

Website

Alerts

Be the first to know and let us send you an email when అనంత పద్మనాభ స్వామి దేవాలయం-అనంతగిరి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share