Sri Kanakadurga Temple

Sri Kanakadurga Temple Vijayawada Kanaka Durga Temple www.durgamma.com
Kanakadurgamma Temple situated on the banks of river krishna,Indrakeeladri, Vijayawada.
(1259)

Sri Kanakadurgamma (kanaka durga) is swayambu(self-manifested). It is one of the largest temples in India. and 2nd largest temple in Andhra Pradesh. Temple commonly called as Vijayawada Kanaka Durgamma Temple,in the Krithayuga goddess Durga killed Mahishasura who was a disaster for World. Then goddess Durga shined on the Keela mountain with eight arms in the form of MAHISHASURA MARDINI as she had

given boon to keela. On this mountain, goddess Durga had been glowing with the lighting of crores of suns, with golden colour. Since that, Indra and all the deities praised her chanting "KANAKA DURGA" and they had been worshipping her daily.

10/09/2024
31/08/2024

ఘాట్ రోడ్ నిలుపుదల :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

గత 2 రోజులుగా తీవ్ర వర్షము పడుట కారణముగా ఘాట్ రోడ్ నందు కొండ చరియలు విరిగి పడుచున్నందున భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ నందు భక్తులకు మరియు భక్తుల వాహనములకు ప్రవేశం నిలుపుదల చేయడమైనది.

మరియు తీవ్ర వర్షముల వలన మరియు నగరంలో కూడా ఆంక్షలు నడుస్తున్నందున భక్తులు అమ్మవారి దర్శనమునకు లిఫ్ట్ మార్గం వైపు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించ బడుచున్నది.

యావన్మంది భక్తులు సదరు విషయం ను గమనించి దేవస్థానం వారితో సహకరించమనవి.

శ్రీ అమ్మవారి సేవలో..
కె ఎస్ రామరావు,
డిప్యూటీ కలెక్టర్ &
కార్యనిర్వాహణాధికారి

16/08/2024

“పవిత్రో త్సవములు” కార్యక్రమముల వివరములు :

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

“పవిత్రో త్సవములు” కార్యక్రమముల వివరములు :
 ది.17-08-2024, శనివారము(శ్రావణ శుద్ధ త్రయోదశి) : సా.4:00 గం.లకు ఉదక శాంతి
 ది.18-08-2024, ఆదివారం (శ్రావణ శుద్ధ చతుర్దశి) : ఉ.3:00 గం.లకు “సుప్రభాతం, స్నపనాభిషేకం, అనంతరం “పవిత్ర మాలధారణ”, ఉ.గం.09-00ల నుండి సర్వదర్శనం ప్రారంభం.

కార్యక్రమములు జరుగు ప్రదేశము : చండీ హోమం యాగశాలనందు
 ది. 18-08-2024 ఆదివారం : ఉ9:00 గం.ల నుండి ఉ11:00 గం.ల వరకు గణపతిపూజ మండపారధన, అగ్నిప్రతిష్టాపన సర్వప్రాయశ్చిత్త విధి తత్తత్ దేవతారాధన
 సా.4:00 గం.ల నుండి సా.6:00 గం.ల వరకు మూల మంత్రం హవనములు, వేద పారాయణలు, హారతి, మంత్రం పుష్పము.
 ది: 19-08-2024, సోమవారము : ఉ.8:00 గం.ల నుండి ఉ.11:00 గం.ల వరకు మండపారధన, సర్వ ప్రాయశ్చిత్త విధి తత్తత్ దేవతారాధన
 సా.4:00 గం.ల నుండి సా.6:00 గం.ల వరకు మూల మంత్ర హవనములు, వేద పారాయణలు, హారతి, మంత్రం పుష్పము.
 ది:20.08.2024, మంగళవారం : ఉ.8:00 గం.ల నుండి ఉ.10:00 గం.ల వరకు మండపారధన, సర్వ ప్రాయశ్చిత్త విధి తత్తత్ శాంతిక పౌష్టిక హోమములు, కూష్మాండబలి.
# # ఉ.10:30 గం.లకు “పూర్ణాహుతి”, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము కార్యక్రమము సమాప్తి.

 గమనిక :- ది.18.08.2024న ఉ.గం.03:00ని.లకు శ్రీ అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉ.09.00 గం.ల నుండి శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చెదరు.

ది.18.08.2024 నుండి ది.20.08.2024 వరకు నిర్వహించు పవిత్రోత్సవములు సందర్భముగా సదరు 3 రోజులు దేవస్థానము నందు జరుగు అన్ని ఆర్జితసేవలు (ప్రత్యక్షము & పరోక్షము ) నిలుపుదల చేయడమైనది. శ్రీ అమ్మవారికి నిర్వహించు అన్ని నిత్య కైంకర్యములను దేవస్థాన అర్చకులు మాత్రమే నిర్వహించెదరు.

శ్రీ అమ్మవారి సేవలో....
కె ఎస్ రామరావు,
డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వహణాధికారి.

https://www.youtube.com/live/PX1Oj1EI-d0?si=mTkPNLdf4r7PEbQf
24/05/2024

https://www.youtube.com/live/PX1Oj1EI-d0?si=mTkPNLdf4r7PEbQf

శ్రీమాతా వైభవము - పూజ్య గురుదేవులు, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు

15/05/2024

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 24, 25 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు

- దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'దుర్గామల్లేశ్వరస్వామి వైభవం' అంశంపై ప్రవచనం: ఈవో రామారావు
- సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష

- భక్తులకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించిన ఈవో రామారావు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ఏర్పాట్లు :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం విజయవాడ:
దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్బంగా వివిధ విభాగముల అధికారులతో ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు గారు సమావేశమై చేయవలసిన ఏర్పాట్లు, భక్తులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం తదితరముల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా ఈవో కె.ఎస్.రామరావు గారు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీలలో సాయంత్రం 06-08 గం.ల మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వైభవం గురించి అద్వితీయ ప్రవచనం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంనకు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరి, అందరూ విచ్చేయవలసినదిగా ఈవో గారు ఆహ్వానించారు.

శ్రీ గంగా దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వెండి రధోత్సవం :  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, ...
21/04/2024

శ్రీ గంగా దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వెండి రధోత్సవం :

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

తేది.19.04.2024 నుండి ది.27.04.2024 వరకు జరుగు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములలో భాగముగా ఈరోజు అనగా ది.21.04.2024 న ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారి ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించిన అనంతరం కోలాటలు, మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ స్వామి, అమ్మవార్లు వెండి రధంపై మహా మండపము నుండి వెండి రధముపై బయలుదేరి కనకదుర్గా నగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోఠి నగర్, శంకరమఠం, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా తిరిగి మహా మండపమునకు చేరుకున్నారు. ఈ మార్గం లో ఎంతో మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని, పూజలు నిర్వహించుకొని అమ్మవారి, స్వామి వారి కృపా కటాక్షలకు పాత్రులయ్యారు.

21/04/2024

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం విజయవాడ:

- తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 24, 25 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు
- దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వరస్వామి వైభవం అంశంపై ప్రవచనం: ఈవో రామారావు
- భక్తులందరికీ ఆహ్వానం - ఈవో రామరావు
- సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష
- భక్తులకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించిన ఈవో రామారావు

దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు శ్రీ కనకదుర్గ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్బంగా వివిధ విభాగముల అధికారులతో ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు గారు సమావేశమై చేయవలసిన ఏర్పాట్లు, భక్తులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం తదితరముల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా ఈవో కె.ఎస్.రామరావు గారు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీలలో సాయంత్రం 06-08 గం.ల మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వైభవం గురించి అద్వితీయ ప్రవచనం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంనకు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరి, అందరూ విచ్చేయవలసినదిగా ఈవో గారు ఆహ్వానించారు.

19/04/2024

చైత్ర మాస బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు (19.04.2024 - 27.04.2024)

దేవస్థానం నందు స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర శుద్ధ చతుర్ధశి తత్కాల పౌర్ణమి వరకు అనగా ది.19.04.2024, శుక్రవారం నుండి ది27.04.2024, శుక్రవారము వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములను ఆగమోక్తముగా అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు, అందులో భాగముగా సదరు బ్రహ్మోత్సవ రోజులలో రోజుకొక వాహనముపై శ్రీ స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వాహనసేవ (నగరోత్సవము), కళ్యాణము రోజున సుప్రసిద్ధ కవులచే రాయబారం మరియు ది.25.04.2024 నుండి ది.27.04.2024 వరకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు తదితర కార్యక్రమములు నిర్వహించుటకు వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయించడమైనది.
కార్యక్రమముల వివరములు
ది.19.04.2024, శుక్రవారం : ఉ.గం.09-30 ని.లకు శ్రీ దుర్గామల్లేశ్వరులకు మంగళ స్నానములు, వధూవరులుగా అలంకరించుట. (శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునందు)
సా. గం.04-00ని.లకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ,అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం.
ది.20.04.2024, శుక్రవారం : ఉ. గం.08-00 ని.లకు మూల మంత్ర హవనములు
నుండి
ది.24.04.2024, అదివారం సా. నుండి గం.05-00ల నుండి గం. 06-00ల వరకు ఔపాసన,
ఉదయం వరకు బలిహరణ. తదుపరి హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ.

ది.22.04.2024, సోమవారం : రా. గం.08-00ల నుండి గం. 09-30ని.ల వరకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద “రాయబారము” (ఎదుర్కోలు ఉత్సవము). ప్రముఖ కవి పండితులచే కళ్యాణ వైశిష్టము తెలియజేయుట.

రా.గం.10-30 ని.లకు “శ్రీ దుర్గామల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవము” అత్యంత వైభవోపేతముగా జరుగును.

ది.23.04.2024, మంగళ వారం: ఉ. గం.09-00ని.లకు సదస్యము,వేద స్వస్తి, వేదపండితుల వేదాశీస్సులు
ది.24.04.2024,బుధవారం : ఉ.గం.10-00లకు “పూర్ణాహుతి”, ధాన్యకోట్నోత్సవము, వసంతోత్సవము,
అవభృత స్నానము, మూకబలి, ధ్వజావరోహణం, బ్రహ్మోత్సవములు సమాప్తి. సా. గం.04-00 ని.ల నందు- శ్రీ గంగా పర్వతి సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లకు ప్రవిత్ర కృష్ణ నది హంస వాహన తేపోతనము.(శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము నందు ఉతవాము ప్రారంభము
ది.25.04.2024, గురువారం : సా. గం.04-30 ని.ల నుండి - సాంస్కృతిక కార్యక్రమములు
రాత్రి గం. 07-30 ని.ల నుండి - ద్వాదశ ప్రదక్షిణలు
రా. గం. 08-30 ని.లకు - పవళింపు సేవ -పుష్ప యాగశయనోత్సవము
ది. 26.04.2024, శుక్రవారం : రా. గం. 09-00లకు - పవళింపు సేవ (ఏకాంత సేవ)
& ది.27.04.2024, శనివారం

వాహన సేవలు
ది.19.04.2024 సా. గం. 05-00లకు - వెండి పల్లకీ సేవ
ది.20.04.2024 సా. గం. 05-00లకు - రావణ వాహన సేవ
ది.21.04.2024 సా. గం. 05-00లకు - వెండి రధోత్సవము
ది.22.04.2024 సా. గం. 05-00లకు - నంది వాహన సేవ
ది.23.04.2024 సా. గం. 05-00లకు - సింహ వాహన సేవ

వాహన సేవల (నగరోత్సవం) యొక్క రూట్ వివరములు:

ది.19.04.2024 : వెండి పల్లకీ పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణ వీధి, కోమలావిలాస్ సెంటర్, సామారంగం చౌక్, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.

ది.20.04.2024 : రావణ వాహనముపై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, శ్రీనివాసమహల్, కోమలా విలాస్ సెంటర్, సామారంగం చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.

ది.21.04.2024 : వెండి రధము పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోఠి నగర్, శంకరమఠం, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.

ది.22.04.2024 : నంది వాహనముపై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, శ్రీనివాసమహల్, కోమలా విలాస్ సెంటర్, సామారంగం చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.

ది.23.04.2024 : సింహ వాహనము పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోఠి నగర్, శంకరమఠం, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.

ది.24.04.2024 : సాయంత్రం గం.04-00లకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద ఉత్యవముగా బయలుదేరి కనకదుర్గా నగర్ మీదుగా దుర్గా స్వాన ఘాట్ నకు చేరుకొని అనంతరం శ్రీ గంగా పర్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర కృష్ణా నది యందు హంస వాహన తెప్పోత్సవము నిర్వహించబడును.

కావున యావన్మంది భక్తులు పై తెల్పిన వైదిక కార్యక్రమముల యందు పాల్గొని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.

- Executive Officer

జై దుర్గా భవాని 🙏  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడ నందు  దసరా 2023 ప్రత్యేక పూజలు, దర్శనములు  http...
12/09/2023

జై దుర్గా భవాని 🙏

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడ నందు దసరా 2023 ప్రత్యేక పూజలు, దర్శనములు https://kanakadurgamma.org/ నందు అందుబాటులో కలవు అని తెలియజేయడమైనది.

ఇట్లు
అమ్మవారి సేవలో…
కార్యనిర్వహణాధికారిణి

Sri Durga Malleswara Swamy Varla Devasthanam. Devotees can book online tickets for accommodation and Sevas on the Sri Durga Malleswara Swamy Varla Devasthanam website.

జై దుర్గా భవాని 🙏అయ్యా! శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడ దసరా 2023 ప్రత్యేక పూజలు https://kanakadur...
01/09/2023

జై దుర్గా భవాని 🙏
అయ్యా!
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడ దసరా 2023 ప్రత్యేక పూజలు https://kanakadurgamma.org/ నందు అందుబాటులో కలవు అని తెలియజేయడమైనది.
ఇట్లు
అమ్మవారి సేవలో…
కార్యనిర్వహణాధికారిణి

Address

Indrakeeladri
Vijayawada
520001

Opening Hours

Monday 4am - 10pm
Tuesday 4am - 10pm
Wednesday 4am - 10pm
Thursday 4am - 10pm
Friday 4am - 10pm
Saturday 5am - 10pm
Sunday 4am - 5:45pm
6:15pm - 10pm

Telephone

18004259099

Alerts

Be the first to know and let us send you an email when Sri Kanakadurga Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Kanakadurga Temple:

Share

Category