Kanaka Durgamma

Kanaka Durgamma Official FB page of
Sri Durga MalleswaraSwamy varla Devastanams
Indrakeeladri
Vijayawada -1
web : www.kanakadurgamma.org
Kishna Dt
Andhra Pradesh

Official FB page of
Sri Durga MalleswaraSwamy varla Devastanams
Indrakeeladri
Vijayawada -1
web : www.kanakadurgamma.com
Kishna Dt
Andhra Pradesh

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ -  దసరా 2024 పూజా వివరములుCan Book at www.kanakadurg...
15/09/2024

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ -
దసరా 2024 పూజా వివరములు

Can Book at www.kanakadurgamma.org in online.
Or can get at Devasthanam Counter.

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(12-09-2024):  15 రోజ...
12/09/2024

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(12-09-2024):

15 రోజులకు నగదు: రూ. 82,03,392/- లు,

కానుకల రూపములో
- బంగారం: 145 గ్రాములు,
- వెండి: 1 కేజీల 870 గ్రాములు
భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.

విదేశీ కరెన్సీ:
USA - 136 డాలర్లు,
ఇంగ్లాండ్ - 20 పౌండ్లు,
కేనెడా - 40 డాలర్లు,
కువైట్ - 0.25 దినార్స్,
స్కోట్లాండ్ - 10 పౌండ్లు,
హోంకాంగ్ - 20 డాలర్ లు,
కతార్ - 51 రియాల్స్,

ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారు, డీప్యూటీ ఈవో లీలా కుమార్ గారు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

online నందు e - హుండీ ద్వారా రూ.1,03,034/-లు భక్తులు చెల్లించుకున్నారు.

శ్రీ అమ్మవారి సేవలో...
కార్యనిర్వహణాధికారి.

12-09-2024:శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:   దసరా మహోత్సవములు -2024 పురస్కరించుకొన...
12/09/2024

12-09-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
దసరా మహోత్సవములు -2024 పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నందున దేవస్థానం నందు నిర్వహించు ప్రత్యేక పూజలు ప్రత్యేక కుంకుమార్చనలు, చండీ యాగం, శ్రీచక్ర నవావరణార్చన తదితర పూజలు, వేద సభ, అర్చక సభ మరియు ఇతర వైదిక కార్యక్రమములు గురించి ఈరోజు ఆలయ కార్యనిర్వాహనాధికారి కే ఎస్ రామరావు గారు వారి కార్యాలయం నందు ఆలయ వైదిక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, అన్ని విషయముల పై కూలoకుశముగా చర్చించి, వైదిక సిబ్బందికి పలు సూచనలు చేశారు.

16/08/2024

“పవిత్రో త్సవములు” కార్యక్రమముల వివరములు :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
“పవిత్రో త్సవములు” కార్యక్రమముల వివరములు :
 ది.17-08-2024, శనివారము(శ్రావణ శుద్ధ త్రయోదశి) : సా.4:00 గం.లకు ఉదక శాంతి
 ది.18-08-2024, ఆదివారం (శ్రావణ శుద్ధ చతుర్దశి) : ఉ.3:00 గం.లకు “సుప్రభాతం, స్నపనాభిషేకం, అనంతరం “పవిత్ర మాలధారణ”, ఉ.గం.09-00ల నుండి సర్వదర్శనం ప్రారంభం.
కార్యక్రమములు జరుగు ప్రదేశము : చండీ హోమం యాగశాలనందు
 ది. 18-08-2024 ఆదివారం : ఉ9:00 గం.ల నుండి ఉ11:00 గం.ల వరకు గణపతిపూజ మండపారధన, అగ్నిప్రతిష్టాపన సర్వప్రాయశ్చిత్త విధి తత్తత్ దేవతారాధన
 సా.4:00 గం.ల నుండి సా.6:00 గం.ల వరకు మూల మంత్రం హవనములు, వేద పారాయణలు, హారతి, మంత్రం పుష్పము.
 ది: 19-08-2024, సోమవారము : ఉ.8:00 గం.ల నుండి ఉ.11:00 గం.ల వరకు మండపారధన, సర్వ ప్రాయశ్చిత్త విధి తత్తత్ దేవతారాధన
 సా.4:00 గం.ల నుండి సా.6:00 గం.ల వరకు మూల మంత్ర హవనములు, వేద పారాయణలు, హారతి, మంత్రం పుష్పము.
 ది:20.08.2024, మంగళవారం : ఉ.8:00 గం.ల నుండి ఉ.10:00 గం.ల వరకు మండపారధన, సర్వ ప్రాయశ్చిత్త విధి తత్తత్ శాంతిక పౌష్టిక హోమములు, కూష్మాండబలి.
# # ఉ.10:30 గం.లకు “పూర్ణాహుతి”, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము కార్యక్రమము సమాప్తి.
 గమనిక :- ది.18.08.2024న ఉ.గం.03:00ని.లకు శ్రీ అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉ.09.00 గం.ల నుండి శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చెదరు.
ది.18.08.2024 నుండి ది.20.08.2024 వరకు నిర్వహించు పవిత్రోత్సవములు సందర్భముగా సదరు 3 రోజులు దేవస్థానము నందు జరుగు అన్ని ఆర్జితసేవలు (ప్రత్యక్షము & పరోక్షము ) నిలుపుదల చేయడమైనది. శ్రీ అమ్మవారికి నిర్వహించు అన్ని నిత్య కైంకర్యములను దేవస్థాన అర్చకులు మాత్రమే నిర్వహించెదరు.
శ్రీ అమ్మవారి సేవలో....
కె ఎస్ రామరావు,
డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వహణాధికారి.

https://www.youtube.com/live/PX1Oj1EI-d0?si=mTkPNLdf4r7PEbQf
24/05/2024

https://www.youtube.com/live/PX1Oj1EI-d0?si=mTkPNLdf4r7PEbQf

శ్రీమాతా వైభవము - పూజ్య గురుదేవులు, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు

15/05/2024

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 24, 25 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు

- దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'దుర్గామల్లేశ్వరస్వామి వైభవం' అంశంపై ప్రవచనం: ఈవో రామారావు
- సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష

- భక్తులకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించిన ఈవో రామారావు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ఏర్పాట్లు :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం విజయవాడ:
దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్బంగా వివిధ విభాగముల అధికారులతో ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు గారు సమావేశమై చేయవలసిన ఏర్పాట్లు, భక్తులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం తదితరముల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా ఈవో కె.ఎస్.రామరావు గారు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీలలో సాయంత్రం 06-08 గం.ల మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వైభవం గురించి అద్వితీయ ప్రవచనం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంనకు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరి, అందరూ విచ్చేయవలసినదిగా ఈవో గారు ఆహ్వానించారు.

21/04/2024

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం విజయవాడ:

- తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 24, 25 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు
- దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వరస్వామి వైభవం అంశంపై ప్రవచనం: ఈవో రామారావు
- భక్తులందరికీ ఆహ్వానం - ఈవో రామరావు
- సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష
- భక్తులకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించిన ఈవో రామారావు

దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు శ్రీ కనకదుర్గ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్బంగా వివిధ విభాగముల అధికారులతో ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు గారు సమావేశమై చేయవలసిన ఏర్పాట్లు, భక్తులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం తదితరముల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా ఈవో కె.ఎస్.రామరావు గారు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీలలో సాయంత్రం 06-08 గం.ల మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వైభవం గురించి అద్వితీయ ప్రవచనం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంనకు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరి, అందరూ విచ్చేయవలసినదిగా ఈవో గారు ఆహ్వానించారు.

07/04/2024

చైత్ర మాస బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు (19.04.2024 - 27.04.2024)

దేవస్థానం నందు స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర శుద్ధ చతుర్ధశి తత్కాల పౌర్ణమి వరకు అనగా ది.19.04.2024, శుక్రవారం నుండి ది27.04.2024, శుక్రవారము వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములను ఆగమోక్తముగా అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు, అందులో భాగముగా సదరు బ్రహ్మోత్సవ రోజులలో రోజుకొక వాహనముపై శ్రీ స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వాహనసేవ (నగరోత్సవము), కళ్యాణము రోజున సుప్రసిద్ధ కవులచే రాయబారం మరియు ది.25.04.2024 నుండి ది.27.04.2024 వరకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు తదితర కార్యక్రమములు నిర్వహించుటకు వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయించడమైనది.
కార్యక్రమముల వివరములు
ది.19.04.2024, శుక్రవారం : ఉ.గం.09-30 ని.లకు శ్రీ దుర్గామల్లేశ్వరులకు మంగళ స్నానములు, వధూవరులుగా అలంకరించుట. (శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునందు)
సా. గం.04-00ని.లకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ,అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం.
ది.20.04.2024, శుక్రవారం : ఉ. గం.08-00 ని.లకు మూల మంత్ర హవనములు
నుండి
ది.24.04.2024, అదివారం సా. నుండి గం.05-00ల నుండి గం. 06-00ల వరకు ఔపాసన,
ఉదయం వరకు బలిహరణ. తదుపరి హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ.

ది.22.04.2024, సోమవారం : రా. గం.08-00ల నుండి గం. 09-30ని.ల వరకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద “రాయబారము” (ఎదుర్కోలు ఉత్సవము). ప్రముఖ కవి పండితులచే కళ్యాణ వైశిష్టము తెలియజేయుట.

రా.గం.10-30 ని.లకు “శ్రీ దుర్గామల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవము” అత్యంత వైభవోపేతముగా జరుగును.

ది.23.04.2024, మంగళ వారం: ఉ. గం.09-00ని.లకు సదస్యము,వేద స్వస్తి, వేదపండితుల వేదాశీస్సులు
ది.24.04.2024,బుధవారం : ఉ.గం.10-00లకు “పూర్ణాహుతి”, ధాన్యకోట్నోత్సవము, వసంతోత్సవము,
అవభృత స్నానము, మూకబలి, ధ్వజావరోహణం, బ్రహ్మోత్సవములు సమాప్తి. సా. గం.04-00 ని.ల నందు- శ్రీ గంగా పర్వతి సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లకు ప్రవిత్ర కృష్ణ నది హంస వాహన తేపోతనము.(శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము నందు ఉతవాము ప్రారంభము
ది.25.04.2024, గురువారం : సా. గం.04-30 ని.ల నుండి - సాంస్కృతిక కార్యక్రమములు
రాత్రి గం. 07-30 ని.ల నుండి - ద్వాదశ ప్రదక్షిణలు
రా. గం. 08-30 ని.లకు - పవళింపు సేవ -పుష్ప యాగశయనోత్సవము
ది. 26.04.2024, శుక్రవారం : రా. గం. 09-00లకు - పవళింపు సేవ (ఏకాంత సేవ)
& ది.27.04.2024, శనివారం
వాహన సేవలు
ది.19.04.2024 సా. గం. 05-00లకు - వెండి పల్లకీ సేవ
ది.20.04.2024 సా. గం. 05-00లకు - రావణ వాహన సేవ
ది.21.04.2024 సా. గం. 05-00లకు - వెండి రధోత్సవము
ది.22.04.2024 సా. గం. 05-00లకు - నంది వాహన సేవ
ది.23.04.2024 సా. గం. 05-00లకు - సింహ వాహన సేవ

వాహన సేవల (నగరోత్సవం) యొక్క రూట్ వివరములు:
ది.19.04.2024 : వెండి పల్లకీ పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణ వీధి, కోమలావిలాస్ సెంటర్, సామారంగం చౌక్, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.20.04.2024 : రావణ వాహనముపై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, శ్రీనివాసమహల్, కోమలా విలాస్ సెంటర్, సామారంగం చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.21.04.2024 : వెండి రధము పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోఠి నగర్, శంకరమఠం, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.22.04.2024 : నంది వాహనముపై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, శ్రీనివాసమహల్, కోమలా విలాస్ సెంటర్, సామారంగం చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.23.04.2024 : సింహ వాహనము పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోఠి నగర్, శంకరమఠం, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.24.04.2024 : సాయంత్రం గం.04-00లకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద ఉత్యవముగా బయలుదేరి కనకదుర్గా నగర్ మీదుగా దుర్గా స్వాన ఘాట్ నకు చేరుకొని అనంతరం శ్రీ గంగా పర్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర కృష్ణా నది యందు హంస వాహన తెప్పోత్సవము నిర్వహించబడును.

కావున యావన్మంది భక్తులు పై తెల్పిన వైదిక కార్యక్రమముల యందు పాల్గొని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.

చైత్రమాస వసంత నవరాత్రోత్సవములు(ది.09.04.2024 నుండి ది.18.04.2024)- “వసంత నవరాత్రోత్సవములు” సందర్భముగా “ప్రత్యేక పుష్పార్...
07/04/2024

చైత్రమాస వసంత నవరాత్రోత్సవములు(ది.09.04.2024 నుండి ది.18.04.2024)
- “వసంత నవరాత్రోత్సవములు” సందర్భముగా “ప్రత్యేక పుష్పార్చనలు” - ప్రతీ రోజు ఉ. గం.09లకు

“ప్రత్యేక పుష్పార్చన - వివరములు”
వ.సం. తేది వారము తిది పూలు / పత్రములు పరిమాణము
1 09.04.2024 మంగవారము చైత్ర శుద్ధ పాడ్యమి మల్లె పూలు, మరువం 50కేజీలు , 10కేజీలు
2 10.04.2024 ఋధవారము చైత్ర శుద్ధ విదియ కనకాంబరాలు, గులాబీలు 30కేజీలు , 20కేజీలు
3 11.04.2024 గురువారము చైత్ర శుద్ధ తదియ చామంతి, ఇతర పువ్వులు 30కేజీలు , 20కేజీలు
4 12.04.2024 శుక్రువారము చైత్ర శుద్ధ చవితి మందార పువ్వులు, ఎర్ర కలువపూలు 1000నెం , 500నెం.
5 13.04.2024 శనివారము చైత్ర శుద్ధ పంచమి తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువం,ధవళం రకమునకు 10కేజీలు చొప్పున
6 14.04.2024 ఆదివారము చైత్ర శుద్ధ షష్టి కాగడా మల్లెలు, జాజులు, మరువం 30కేజీలు , 20కేజీలు,
20కేజీలు
7 15.04.2024 సోమవారము చైత్ర శుద్ధ సప్తమి ఎర్ర తామరలు, ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజులు 1000నెం , 20కేజీలు,
20కేజీలు
8 16.04.2024 మంగళవారము చైత్ర శుద్ధ అష్టమి చామంతి. సంపెంగలు 30కేజీలు , 2000నెం
9 17.04.2024 బుధవారము చైత్ర శుద్ధ నవమి కనకాంబరాలు, గులాబీలు 30కేజీలు , 20కేజీలు
10 18.04.2024 గురువారం చైత్ర శుద్ధ దశమి వివిధ రకముల పుష్పములు 50కేజీలు

ఆర్జిత సేవ పేరు : ప్రత్యేక పుష్పార్చనలు –
(కొండ పైన గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి మందిరము వద్ద)
ఉభయ రుసుము : రూ.2,500/-లు ( దంపతులకు ),అంతరాలయ దర్శనం
ప్రసాదములు : శేష వస్త్రం, రవిక, శ్రీ అమ్మవారి శ్రీచక్రపీఠం, పెద్ద లడ్డు – 1
సమయము : ఉ. గం. 09-00 ని.లకు ప్రారంభం
website : www.kanakadurgamma.org / దేవస్థాన ఆర్జిత సేవా టికెట్ కౌంటర్

వసంత నవరాత్రులు సందర్భంగా
నిలుపుదల చేయు ఆర్జిత సేవలు:
1. శ్రీ అమ్మ వారి ప్రదక్షిణలు: 09.04.2024 ఉగాది రోజు మాత్రమే
2. సుప్రభాత సేవ: 09.04.2024 ఉగాది రోజు మాత్రమే
3. వస్త్రాలంకరణ సేవ: 09.04.2024 ఉగాది రోజు మాత్రమే
4. ఖడ్గమాలార్చన : 09.04.2024 ఉగాది రోజు మాత్రమే
5. గణపతి హోమం: 09.04.2024 ఉగాది రోజు మాత్రమే
6. నవగ్రహ శాంతి హోమం: 09.04.2024 ఉగాది రోజు మాత్రమే
7. పల్లకి సేవ : 09.04.2024 ఉగాది రోజు మాత్రమే (వెండి రధోత్సవం ఉన్నందున)
8. రుద్రహోమం &
మృత్యుంజయ హోమం 09.04.2024 నుండి24.04.2024వరకు (16 రోజులు వసంత నవరాత్రులు & చైత్రమాస బ్రహ్మోత్సవములు కారణంగా) మాత్రమే
9. శాంతి కల్యాణం & పల్లకి సేవ: 19.04.2024 నుండి 27.04.2024( 9 రోజులు) మాత్రమే.

Sri Durga Malleswara Swamy Varla Devasthanam. Devotees can book online tickets for accommodation and Sevas on the Sri Durga Malleswara Swamy Varla Devasthanam website.

07/04/2024

మహానివేదన సమయంలో vip దర్శనాలు నిలుపుదల :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ:

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు ప్రతిరోజూ ఉ.11.45 గం.ల నుండి మ.12.15 గం. ల వరకు అమ్మవారి మహా నైవేద్యం నిమిత్తం దర్శనం ఆపడం అందరికీ విదితమే.

దేవస్థానం నందు జరుగుచున్న అభివృద్ధి పనులు మరియు వేసవి సెలవుల కారణముగా పెరుగుచున్న భక్తుల రద్దీ దృష్ట్యా సదరు సమయములో భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంటున్నందున భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు గాను, ఉదయం 11.30 గం.ల నుండి మధ్యాహ్నం 01.30 గం.ల లోపు అమ్మవారి దర్శనార్థం విచ్చేయు VIP లు, అన్ని డిపార్ట్మెంట్ ల వారు, వృద్దులు మరియు వికలాంగులకు దర్శనం నిలుపుదల చేయడమైనది. వీరు ఉదయం 11.30 గం. ల లోపు లేదా మధ్యాహ్నం 01.30 గం.ల అనంతరం మాత్రమే దర్శనంనకు విచ్చేసి దేవస్థానం వారికి సహకరించవలసినదిగా కోరడమైనది.

ఈ సమాచారమును భక్తులకు చేరుటకు గాను విస్తృత ప్రచారం కల్పించవలసినదిగా మీడియా మిత్రులను కోరడమైనది.

శ్రీ అమ్మవారి సేవలో..
కె ఎస్ రామరావు,
కార్యనిర్వాహణాధికారి.

Address

10-19-54/5, Bhraminstreet
Vijayawada
520001

Opening Hours

Monday 5am - 9pm
Tuesday 5am - 9pm
Wednesday 5am - 9pm
Thursday 5am - 9pm
Friday 5am - 9pm
Saturday 5am - 9pm
Sunday 5am - 9pm

Telephone

+919440011717

Alerts

Be the first to know and let us send you an email when Kanaka Durgamma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Kanaka Durgamma:

Share

Category