Sree Durga Malleswara Swami Varla Devastanam, Indrakeeladri

Sree Durga Malleswara Swami Varla Devastanam, Indrakeeladri Sri Durga Malleswara Swamy Varla Devasthanam
(796)

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ -  దసరా 2024 పూజా వివరములుCan Book at www.kanakadurg...
15/09/2024

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ -
దసరా 2024 పూజా వివరములు

Can Book at www.kanakadurgamma.org in online.
Or can get at Devasthanam Counter.

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(12-09-2024):  15 రోజ...
12/09/2024

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(12-09-2024):

15 రోజులకు నగదు: రూ. 82,03,392/- లు,

కానుకల రూపములో
- బంగారం: 145 గ్రాములు,
- వెండి: 1 కేజీల 870 గ్రాములు
భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.

విదేశీ కరెన్సీ:
USA - 136 డాలర్లు,
ఇంగ్లాండ్ - 20 పౌండ్లు,
కేనెడా - 40 డాలర్లు,
కువైట్ - 0.25 దినార్స్,
స్కోట్లాండ్ - 10 పౌండ్లు,
హోంకాంగ్ - 20 డాలర్ లు,
కతార్ - 51 రియాల్స్,

ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారు, డీప్యూటీ ఈవో లీలా కుమార్ గారు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

online నందు e - హుండీ ద్వారా రూ.1,03,034/-లు భక్తులు చెల్లించుకున్నారు.

శ్రీ అమ్మవారి సేవలో...
కార్యనిర్వహణాధికారి.

12-09-2024:శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:   దసరా మహోత్సవములు -2024 పురస్కరించుకొన...
12/09/2024

12-09-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
దసరా మహోత్సవములు -2024 పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నందున దేవస్థానం నందు నిర్వహించు ప్రత్యేక పూజలు ప్రత్యేక కుంకుమార్చనలు, చండీ యాగం, శ్రీచక్ర నవావరణార్చన తదితర పూజలు, వేద సభ, అర్చక సభ మరియు ఇతర వైదిక కార్యక్రమములు గురించి ఈరోజు ఆలయ కార్యనిర్వాహనాధికారి కే ఎస్ రామరావు గారు వారి కార్యాలయం నందు ఆలయ వైదిక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, అన్ని విషయముల పై కూలoకుశముగా చర్చించి, వైదిక సిబ్బందికి పలు సూచనలు చేశారు.

10/09/2024
31/08/2024

ఘాట్ రోడ్ నిలుపుదల :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

గత 2 రోజులుగా తీవ్ర వర్షము పడుట కారణముగా ఘాట్ రోడ్ నందు కొండ చరియలు విరిగి పడుచున్నందున భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ నందు భక్తులకు మరియు భక్తుల వాహనములకు ప్రవేశం నిలుపుదల చేయడమైనది.

మరియు తీవ్ర వర్షముల వలన మరియు నగరంలో కూడా ఆంక్షలు నడుస్తున్నందున భక్తులు అమ్మవారి దర్శనమునకు లిఫ్ట్ మార్గం వైపు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించ బడుచున్నది.

యావన్మంది భక్తులు సదరు విషయం ను గమనించి దేవస్థానం వారితో సహకరించమనవి.

శ్రీ అమ్మవారి సేవలో..
కె ఎస్ రామరావు,
డిప్యూటీ కలెక్టర్ &
కార్యనిర్వాహణాధికారి

16/08/2024

“పవిత్రో త్సవములు” కార్యక్రమముల వివరములు :

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

“పవిత్రో త్సవములు” కార్యక్రమముల వివరములు :
 ది.17-08-2024, శనివారము(శ్రావణ శుద్ధ త్రయోదశి) : సా.4:00 గం.లకు ఉదక శాంతి
 ది.18-08-2024, ఆదివారం (శ్రావణ శుద్ధ చతుర్దశి) : ఉ.3:00 గం.లకు “సుప్రభాతం, స్నపనాభిషేకం, అనంతరం “పవిత్ర మాలధారణ”, ఉ.గం.09-00ల నుండి సర్వదర్శనం ప్రారంభం.

కార్యక్రమములు జరుగు ప్రదేశము : చండీ హోమం యాగశాలనందు
 ది. 18-08-2024 ఆదివారం : ఉ9:00 గం.ల నుండి ఉ11:00 గం.ల వరకు గణపతిపూజ మండపారధన, అగ్నిప్రతిష్టాపన సర్వప్రాయశ్చిత్త విధి తత్తత్ దేవతారాధన
 సా.4:00 గం.ల నుండి సా.6:00 గం.ల వరకు మూల మంత్రం హవనములు, వేద పారాయణలు, హారతి, మంత్రం పుష్పము.
 ది: 19-08-2024, సోమవారము : ఉ.8:00 గం.ల నుండి ఉ.11:00 గం.ల వరకు మండపారధన, సర్వ ప్రాయశ్చిత్త విధి తత్తత్ దేవతారాధన
 సా.4:00 గం.ల నుండి సా.6:00 గం.ల వరకు మూల మంత్ర హవనములు, వేద పారాయణలు, హారతి, మంత్రం పుష్పము.
 ది:20.08.2024, మంగళవారం : ఉ.8:00 గం.ల నుండి ఉ.10:00 గం.ల వరకు మండపారధన, సర్వ ప్రాయశ్చిత్త విధి తత్తత్ శాంతిక పౌష్టిక హోమములు, కూష్మాండబలి.
# # ఉ.10:30 గం.లకు “పూర్ణాహుతి”, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము కార్యక్రమము సమాప్తి.

 గమనిక :- ది.18.08.2024న ఉ.గం.03:00ని.లకు శ్రీ అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉ.09.00 గం.ల నుండి శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చెదరు.

ది.18.08.2024 నుండి ది.20.08.2024 వరకు నిర్వహించు పవిత్రోత్సవములు సందర్భముగా సదరు 3 రోజులు దేవస్థానము నందు జరుగు అన్ని ఆర్జితసేవలు (ప్రత్యక్షము & పరోక్షము ) నిలుపుదల చేయడమైనది. శ్రీ అమ్మవారికి నిర్వహించు అన్ని నిత్య కైంకర్యములను దేవస్థాన అర్చకులు మాత్రమే నిర్వహించెదరు.

శ్రీ అమ్మవారి సేవలో....
కె ఎస్ రామరావు,
డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వహణాధికారి.

https://www.youtube.com/live/PX1Oj1EI-d0?si=mTkPNLdf4r7PEbQf
24/05/2024

https://www.youtube.com/live/PX1Oj1EI-d0?si=mTkPNLdf4r7PEbQf

శ్రీమాతా వైభవము - పూజ్య గురుదేవులు, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు

15/05/2024

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 24, 25 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు

- దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'దుర్గామల్లేశ్వరస్వామి వైభవం' అంశంపై ప్రవచనం: ఈవో రామారావు
- సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష

- భక్తులకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించిన ఈవో రామారావు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ఏర్పాట్లు :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం విజయవాడ:
దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్బంగా వివిధ విభాగముల అధికారులతో ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు గారు సమావేశమై చేయవలసిన ఏర్పాట్లు, భక్తులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం తదితరముల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా ఈవో కె.ఎస్.రామరావు గారు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీలలో సాయంత్రం 06-08 గం.ల మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వైభవం గురించి అద్వితీయ ప్రవచనం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంనకు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరి, అందరూ విచ్చేయవలసినదిగా ఈవో గారు ఆహ్వానించారు.

22/04/2024

ఆహ్వానం :
దుర్గ గుడిలో చైత్ర మాస బ్రహ్మోత్సవములు 4 వ రోజు :

తేది.22-04-2024:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

తేది.19.04.2024 నుండి ది.27.04.2024 వరకు జరుగు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములలో భాగముగా
- ఈరోజు అనగా ది.22.04.2024 న స్వామి అమ్మవార్లు
- సాయంత్రం గం.05-00లకు నంది వాహనముపై శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, శ్రీనివాసమహల్, కోమలా విలాస్ సెంటర్, సామారంగం చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరుకుంటారు.

- రా. గం.08-00ల నుండి గం. 09-30ని.ల వరకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద “రాయబారము” (ఎదుర్కోలు ఉత్సవము). ప్రముఖ కవి పండితులచే కళ్యాణ వైశిష్టము తెలియజేయుట.

- రా.గం.10-30 ని.లకు “శ్రీ దుర్గామల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవము” అత్యంత వైభవోపేతముగా జరుగును.

23-04-2024 - ఉ.05.55am - ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం..

ఈ కార్యక్రమంలలో అందరూ పాల్గొని కార్యక్రమాలను దిగ్విజయం చేసి, అమ్మవారి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేయడమైనది.

శ్రీ అమ్మవారి సేవలో...
కె ఎస్ రామరావు,
-డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వాహనాధికారి.

21/04/2024

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం విజయవాడ:

- తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 24, 25 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు
- దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వరస్వామి వైభవం అంశంపై ప్రవచనం: ఈవో రామారావు
- భక్తులందరికీ ఆహ్వానం - ఈవో రామరావు
- సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష
- భక్తులకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించిన ఈవో రామారావు

దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు శ్రీ కనకదుర్గ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్బంగా వివిధ విభాగముల అధికారులతో ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు గారు సమావేశమై చేయవలసిన ఏర్పాట్లు, భక్తులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం తదితరముల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా ఈవో కె.ఎస్.రామరావు గారు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీలలో సాయంత్రం 06-08 గం.ల మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వైభవం గురించి అద్వితీయ ప్రవచనం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంనకు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరి, అందరూ విచ్చేయవలసినదిగా ఈవో గారు ఆహ్వానించారు.

జై దుర్గా భవాని 🙏అయ్యా! శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడ దసరా 2023 ప్రత్యేక పూజలు https://kanakadur...
01/09/2023

జై దుర్గా భవాని 🙏
అయ్యా!
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడ దసరా 2023 ప్రత్యేక పూజలు https://kanakadurgamma.org/ నందు అందుబాటులో కలవు అని తెలియజేయడమైనది.
ఇట్లు
అమ్మవారి సేవలో…
కార్యనిర్వహణాధికారిణి

Address

Indrakeeladri
Vijayawada
520001

Opening Hours

Monday 5am - 11pm
Tuesday 4am - 9pm
Wednesday 5am - 11pm
Thursday 4am - 9pm
Friday 5am - 9pm
Saturday 5am - 11pm
Sunday 5am - 11pm

Telephone

9440011717

Alerts

Be the first to know and let us send you an email when Sree Durga Malleswara Swami Varla Devastanam, Indrakeeladri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sree Durga Malleswara Swami Varla Devastanam, Indrakeeladri:

Share

Category