09/10/2013
ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ అలంకారం ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్ ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాభ్యాం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశమ్॥ దసరాలో ఆశ్వయుజ శుద్ధసప్తమి నాడు దుర్గమ్మను శ్రీలలితాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ. బ్రహ్మవిష్ణుమహేశ్వరులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది. దుర్గమ్మ సన్నిధిలో శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠితమైన శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా ఈ లలితాత్రిపురసుందరీదేవే. పూర్వం దుర్గమ్మ ఆలయంలో శంకరాచార్యులు శ్రీచక్రయంత్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి వరకు ఉగ్రస్వరూపంతో చండీదేవిలా ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంతో దర్శనమిస్తోంది. అందుకని ఇక్కడి శ్రీచక్రానికి నిత్యం లలితా ఆష్టోత్తరం, లలితా సహస్రనామాలతో కుంకుమపూజ చేస్తారు. లలితాసహస్రనామ స్తోత్రంలో వర్ణించిన విధంగా ‘సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా’ అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటూ నిలబడి లలితా పరాభట్టారికను వింజామరతో సేవిస్తున్నట్లుగా అలంకారం చేస్తారు. మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకుగడను ధరించి, శివుని వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి. ఈ అమ్మ వారికి ప్రీతికరమైన ప్రసాదం గారెలు,పులిహోర. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. మంత్రము: “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” అనే మంత్రము 108 మార్లు జపించవలెను. రోజూ శుభోదయాన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ.. లలితా సహస్రనామావళి చెప్పుకొంటే అనుకొన్న కార్యాలు నెరవేరుతాయి..దయామయి సౌశీలవతి అయిన ఆ పరాశక్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ...జై శ్రీ మాత్రేనమహా... "ఈ ప్రపంచం అంతా 'త్రిపురం'. పురం అంటే చోటు అని అర్థం. ........... ........ మనమున్నచోటు నడిమి భాగం. దానికి పైన ఊర్థ్వలోకాలు. క్రింద అధోలోకాలు. ఈ ఊర్థ్వ, మధ్య, అధో లోకాలు .. మూడు లోకాలు. అలాగే భూత, భవిష్యత్, వర్తమానాలు. వ్యాపించిన గుణాలు .. సత్త్వ, రజస్తమో గుణాలు. జరిగే పనులు సృష్టి, స్థితి, లయలు... ముగ్గురు వేల్పులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు. ఓంకారం మూడు అంగాలు... అ, ఉ, మ. వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు... ఋక్, యజు, స్సామములు. ఇలా అన్నీ "త్రి" పురాలే.. ఇక మనలో .. భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులు మూడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు. యోగపరమైన నాడులు మూడు... ఇడ, పింగళ, సుషుమ్న. ఇలా బైటా, లోపలా ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే. ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే...'త్రిపుర సుందరి'...... ........ 'పురా' అంటే.......... 'పూర్వము' అని కూడా అర్థం...ఈ మూడు చోట్లు (ముల్లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు వగైరాలు) కలుగక పూర్వమే ఉంది ఆ 'సౌందర్యం'.......... .......ముందున్నదీ, నిండినదీ అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం. అందుకే అది 'లలిత'. జీవరాశి అంతా ఆ శక్తినే ఆశ్రయించుకున్నది.. ఆశ్రయ శక్తినే 'శ్రీ' అంటారు. ... చైతన్యంకన్నా నిజమైన 'ఐశ్వర్యం' ఏముంది ? చైతన్యమేలేకుంటే శోభ, కాంతి ఉండవు.. అందుకే 'సౌందర్యలహరి'యే 'శ్రీమాత'.." ....................(... బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి కలం నుండి వెలువడిన "...ఏష ధర్మః సనాతనః" గ్రంధం నుండి.) ఆ జగన్మాతను ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా ఆరాధిస్తున్నాము... లలితా దేవి నైవేద్యం::దద్ధోజనం (పెరుగు అన్నం) :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: శ్రీ లలితాష్టోత్తర శతనామ స్తోత్రమ్::::::: సింధూరారుణ విగ్రహం త్రిణయానాం మాణిక్య మౌలిస్పర త్తా రానాయక శేఖరం స్మితముఖి మాపీన వక్షో రుహమ్ పాణిభ్యా మతిపూర్ణ రత్న చషకం రక్తో త్పలం బిభ్రతీం సౌమాం రత్న ఘటస్త రక్త చరనాం ధ్యాయే త్పరామంభికామ్ || ఓం రజతాచల శృంగా గ్ర మధ్య స్థాయై నమః ఓం మిహాచల మహావంశ పావనాయై నమః ఓం శంకరార్దాంగ సౌందర్య శరీరాయై నమః ఓం లసన్మ రత స్వచ్చ విగ్రహాయై నమః ఓం మహాతిశయ సౌందర్య లావణ్యా యై నమః ఓం శశాంక శేఖర ప్రాణ వల్లభాయై నమః ఓం సదానంద దశాత్మైక్య స్వరూపాయై నమః ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః ఓం కస్తై ఊరీ తింకో ల్లాస నిటలాయై నమః ఓం భస్మరే ఖాంకిత లసన్మ స్తకాయై నమః 10 ఓం వికచాంభోరుహ దళ లోచనాయై నమః ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః ఓం లసత్కాంచ వ తాటంక యుగళాయై నమః ఓం మణి దర్పణ వంకాశ కపోలాయై నమః ఓం సుపక్వదాడి మీబీజ రదనాయై నమః ఓం తాంబూల పూరిత స్మేర వదనాయై నమః ఓం కంబు పూగ సమచ్చాయ నమః ఓం స్థూలముక్తా ఫలోదార సుహారాయై నమః ఓం గిరీ శబద్ద మాంగళ్య మంగళాయై నమః ఓం పద్మ పాశాంకుళ లసత్క రాబ్జా యై నమః || 20 || ఓం పద్మ కైరవ మందార సుమాలిన్యై నమః ఓం సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమః ఓం రమణీయచ తుర్భాహు సంయుక్తాయై నమః ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమః ఓం బృహన్నితంబ విలసజ్జ ఘనాయై నమః ఓం సౌభాగ్య జాత శృంగార మధ్య మాయై నమః ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమః ఓం పారిజాత గుణాధ క్యపదాబ్జా యై నమః ఓం సుపద్మ రాగ సంకాశ చరణాయై నమః || 30 || ఓం కామకోటి మహాపద్మ పిఠ స్థాయై నమః ఓం శ్రీ కంఠ నేత్ర కుముద చంద్రి కాయై నమః ఓం సచామర రమావాణీ వీజితాయై నమః ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః ఓం భూతే శాలింగ నోధ్బూత పులకాంగ్యై నమః ఓం అనంగ జన కాపాంగ వీక్షణాయై నమః ఓం బ్రహ్మొ పేంద్ర శిరోరత్న రంజితాయై నమః ఓం శచీ ముఖ్యామర వధూ సేవితా యై నమః ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః ఓం అమృతాది మహాశక్తీ సంవృతా యై నమః || 40 || ఓం ఏకాత పత్ర సామ్రాజ్య దాయికాయై నమః ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః ఓం దేవర్ష భి: స్తూయమాన వైభవాయై నమః ఓం కలశోద్భ వదుర్వాస పూజితాయై నమః ఓం మత్తే భవక్తరు షడ్వక్తరు వత్స లాయై నమః ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్యైత్య నమః ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః ఓం మత్త హంసవధూ మందగ మనాయై నమః ఓం వందారుజన సందోహ వందితాయై నమః || 50 || ఓం అంతర్ముఖజనానంద సంయుక్తా యై నమః ఓం పతివ్ర తాంగ నాభీష్ట ఫలదాయై నమః ఓం అవ్యాజ కరుణా పూర పూరితాయై నమః ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తా యై నమః ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః ఓం రత్న చింతామణి గృహ మధ్య స్థాయై నమః ఓం హానివృద్ధ గుణాధ క్యర హితాయై నమః ఓం మహాపద్మాటవీ మధ్యభాగ స్థాయై నమః ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తి నాం సాక్షి భూత్యై నమః ఓం మహాపాపౌఘు పాపానాం వినాశిన్యై నమః || 60 || ఓం దుష్ట భీతి మహాభీ తి భంజనాయై నమః ఓం సమస్త దేవద నుజ ప్రేరకా యై నమః ఓం సమస్త హృదయాంభోజ నిలయా యై నమః ఓం అనాహత మహాపద్మ మంది రాయై నమః ఓం సహస్రార సరోజాత వాసితా యై నమః ఓం పునరా వృత్తి రహిత పుర స్ధాయై నమః ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమః ఓం లోపాముద్రార్చిత నమః ఓం సహస్ర రతి సౌందర్య శరీరాయై నమః || 70 || ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధదా యై నమః ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమః ఓం శ్రీ సుధాబ్ది మణి ద్వీపమధ్యగాయై నమః ఓం దక్షాధ్వర వినిర్బేద సాధనాయై నమః ఓం శ్రీనాధ సోదరీ భూత శోభితాయై నమః ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః ఓం సర్వో పాధ వినిర్ముక్త చైతన్యాయై నమః ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమః ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమః || 80 || ఓం శ్రీ షోడ శాక్షరి మంత్ర మధ్య గా యై నమః ఓం అనా ద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః ఓం భక్త హంస పరి ముఖ్య వియోగా యై నమః ఓం మాతృ మండల సంయుక్త లలితా యై నమః ఓం భండ దైత్య మహసత్త్వనాశనా యై నమః ఓం క్రూరభండ శిరఛ్చేద నిపుణా యై నమః ఓం ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదా యై నమః ఓం చండ ముండ నిశుంభాది ఖండనా యై నమః ఓం రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణా యై నమః ఓం మహిషా సుర దోర్విర్య నిగ్రహ యై నమః || 90 || ఓం అభ్రకేశ మహొత్సాహకారణా యై నమః ఓం మహేశ యుక్త నటన తత్సరా యై నమః ఓం నిజ భర్త్య ముఖాంభోజ చింత నా యై నమః ఓం వృషభధ్వజ విజ్ఞానభావనా యై నమః ఓం జన్మ మృత్యుజరారోగ భంజన యై నమః ఓం విదే హ ముక్తి జ్ఞాన సిద్దదా యై నమః ఓం కామ క్రోధాది షడ్వర్గ నాశనా యై నమః ఓం రాజరాజార్చిత పద సారోజా యై నమః ఓం సర్వ వేదాంత సంసిద్ద సుత త్త్యా యై నమః ఓం వీర భక్త విజ్ఞాన నిధానా యై నమః || 100 || ఓం ఆశే ష దుష్ట దనుజసూదనా యై నమః ఓం సాక్షాచ్చ్రీ దక్షిణా మూరి మనోజ్ఞా యై నమః ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమా యై నమః ఓం దక్ష ప్రజా పతి సుతావే షాడ్యా యై నమః ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమః ఓం నిత్య యౌవన మాంగల్య మంగళా యై నమః ఓం మహాదేవ సమాయుక్త శరీరా యై నమః ఓం మహాదేవరత్యౌత్సుకమహదేవ్యై నమః ||108 || ఓం చతుర్వింశతి తత్వైక స్వరూపాయై నమః ఓం శ్రీ లలితాంబికాయై నమః :::::ఇతి శ్రీ లలితాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్::::: Sunder Raj Priya రాగం శ్రీ - తాళం ఖండ ఏకమ్ (నవావరణ మంగళ కీర్తనమ్) పల్లవి శ్రీ కమలాంబికే శివే పాహి మాం లలితే శ్రీ-పతి వినుతే సితాసితే శివ సహితే సమష్టి చరణమ్ రాకా చంద్ర ముఖీ రక్షిత కోల ముఖీ రమా వాణీ సఖీ రాజ యోగ సుఖీ (మధ్యమ కాల సాహిత్యమ్) శాకాంబరి(శాకంభరి)శాతోదరి చంద్ర కలా ధరి శంకరి శంకర గురు గుహ భక్త వశంకరి ఏకాక్షరి భువనేశ్వరి ఈశ ప్రియ-కరి శ్రీ-కరి సుఖ-కరి శ్రీ మహా త్రిపుర సుందరి —