20/08/2026
[8/19, 21:55] +91 94930 75953: 🌺🙇🏻♀️🙇🏻♂️🕊️✝️🕊️🙇🏻♀️🙇🏻♂️🌺
📕 *420 రోజుల్లో బైబిల్* 📖
*దేవుని వాక్యము సజీవమై బలము కలదై ఉన్నది*
*రోజు : 397*
*తేది : 20/08/2026 (బుధవారం)*
*ఫిలిప్పీయులకు 3–4 & కొలస్సీ 01.*
*ప్రార్ధించు, పఠించు, ధ్యానించు మరియు పంచు.*
🙏🏻🙇🏻♀️🙇🏻♂️📖📖🧎🏻♀️🧎🏻👨👨👦👦👩👩👧👧🙏🏻
[8/20, 07:41] +91 94930 75953: 💕💕💕💕💕💕💕
*420రోజుల బైబిల్ స్టడీ*
*కంఠతా వాక్యము*
*కొలొస్సయులకు 1:17*
*ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.*
💕💕💕💕💕💕💕
[8/20, 07:41] +91 94930 75953: *420/397 రోజుల బైబిలు అధ్యయనము. ఫిలిప్పీ 3–4 & కొలస్సీ 1.*
*🏃🏻♂️పందెం గెలుపొందుదము రండి*
గొప్ప వ్యక్తులయొక్క ఉన్నతికి వారు సాధించిన ఘనతకు వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనవలెనని, తద్వారా తాము వారి అంతటి వారము కాగలమని ఆశించు కొందరు గొప్ప వ్యక్తులను సలహాలు, సూచనలు, వారి విజయగాధల రహస్యాలు అడిగి తెలుసుకొనగోరుదురు. ఆరోగ్యంగా మీలా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని ఓ ప్రముఖుడిని అడిగితే ఆయన రోజుకు 8 గ్లాసుల మంచి నీళ్లు త్రాగమని సలహాఇచ్చాడట. అదే సలహాను ఇప్పటికీ అనేకులు పాటిస్తూ ఉండడం గమనించవచ్చు. ఒక విజయగాధ అనేకులకు ప్రయోజనకరమైనట్లే పౌలు విజయగాధ క్రైస్తవ విశ్వాసులకు ఎంతో ఉపయుక్తముగా ఉన్నది అని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు.
పౌలు కూడా తన తదనంతరం ఎప్పటికీ సంఘానికి, విశ్వాసులకు కావలసిన తగు ఉచిత సూచనలు ఇచ్చాడు. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో తన ఆత్మకధను ఫిలిప్పీయుల ఆధ్యాత్మిక సంపూర్ణతకు, వారి క్షేమాభివృద్ధికి తెలియజేస్తున్నాడు. దానిలో భాగంగా *1. తన గతం (ఫిలిప్పీ 3:1-11), 2. తన ప్రస్తుతం (ఫిలిప్పీ 3: 12-16), 3. తన వర్తమానం (ఫిలిప్పీ 3:17-21) తెలియజేశాడు.*
క్రైస్తవ జీవితాన్ని గెలుపొందుటకు సైన్యములో చేరిన సైనికునివలె దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించాలి అని, నీవే దేవుని ఆలయము అని మనుష్యుడు ఏమి విత్తులో, ఆ పంటనే కోతురని తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. చివరగా పందెములో పాల్గొనే ఆటగాడు బహుమానం పొందుటకు పరుగెత్తుటకు ప్రోత్సహిస్తున్నాడు.
క్రీస్తును విశ్వసించుట ద్వారా దేవుని పిల్లలుగా ఉన్న మనపై పందెంలో పరుగెత్తే బాధ్యత ఉంది. ఇది దేవుడు మనకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించుటయే.
మన స్వంతరక్షణను కాపాడుకొనుటకు మనలో కార్యసిద్ధిని కలుగజేయువాడు దేవుడే. దేవుడు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే మనము బహుమతిని పొందగలం. మనము విఫలమైతే బహుమానాన్ని పొందుకోము, కానీ మన పౌరసత్వాన్ని కోల్పోము. *(1 కొరింది 3:11-15 చదవండి)*
*➡️ పందెమునందు గెలుపొందుటకు మరియు వాగ్ధాన ప్రతిఫలాన్ని పొందేందుకు అవసరమైనవి ఏమిటి?*
*1. స్వీయ-సంతృప్తి చెందకపోవడం (3:12-13ఎ):*
చాలా మంది క్రైస్తవులు ఇతరులతో తమను పోల్చుకుని సంతృప్తి చెందుతూ వుంటారు, సాధారణంగా పురోగతి సాధించని వారితో. పౌలు తనను తాను ఇతరులతో పోల్చుకుని పందెము ఆపలేదు. క్రీస్తును మాత్రమే మాదిరిగా పెట్టుకుని పందెం కొనసాగించాడు. పరిణతి చెందిన వారు నిజాయితీగా తమను తాము అంచనా వేసుకుంటారు. మెరుగైన పనిచేయడానికి నిరంతర కృషి సల్పుతూనే వుంటారు పౌలులా. స్ముర్ణ క్రైస్తవులు తమ ఆధ్యాత్మికను తప్పుగా అంచనా వేశారు *ప్రక 2:9.* సమ్సోను తను పూర్వపు శక్తిని కల్గియున్నానని తలంచి మోసపోయాడు. వాస్తవానికి శక్తి అతని నుండి వెళ్ళిపోయింది (న్యాయా 16:20).
స్వీయ మూల్యాoకనం ఒక్కోసారి ప్రమాదకరమైన విషయం కావచ్చు. ఎందుకంటే ఈ రెండుదశల్లో మనం తప్పుచేయవచ్చు (1) ఇతరుల కంటే మనల్ని మనము ఉత్తమముగా మార్చుకోవడం (2) మనం నిజంగా ఉన్నదానికంటే అధ్వాన్నంగా మారడం.
ఆధ్యాత్మిక పురోభివృద్ధికి దైవిక ఉషయాల్లో తృష్ణ/ సంతృప్తి చెందకపోవడం చాలా అవసరం. దుప్పి నీటి వాగులకొఱకు ఆశపడినట్లు పౌలులా తృష్ణ అవసరం.
*▪️2. భక్తి (3:13బి):*
స్వనీతి పరుడైన ధనికుడైన యువ అధికారికి ఒక్కటి కొదువగా ఉంది అని యేసు చెప్పారు. మార్తను మరియ వలె ఉత్తమమైన దానిని చేపట్టమని సెలవిచ్చారు. కీర్తనాకారుడు 27:4 లో యెహోవా ప్రసన్నతను చూచుటకు, ధ్యానించుటకు చిరకాలం ఆయన మందిరములో నివసించు ఒక్క వరమును ఇమ్మని అడిగితిని అని అంటున్నాడు.
విశ్వాసి గొప్ప లాభసాధకమైన దైవభక్తిలో క్రైస్తవ పరుగుపందాన్ని మానక పరుగెత్తాలి. విజేతలైన వారు గురిని చూస్తూ పరుగెత్తాలి, గురిలేని పరుగు వ్యర్థం. నెహెమ్యా నేను చేయుపని గొప్పది, దానిని విడిచి రాజాలనని చెప్పెను (నెహెమ్యా 6:3). ద్విమస్కులై యుండకుడి అని యాకోబు 1:8 హెచ్చరిస్తోంది. ఏకాగ్రత శక్తియొక్క రహస్యం. నదికి ఆనకట్ట కడితే శక్తి ఉత్పాదకతకు మూలం అవుతుంది, లేనిచో చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చిత్తడి చేస్తుంది. ఆ ఆనకట్టే భక్తి.
*3. దిశ: (3:13సి)* రక్షింపబడని వ్యక్తి గతంచే నియంత్రించబడతాడు, కానీ పందెమందు ఉన్న క్రైస్తవుడు భవిష్యత్తు వైపు చూస్తాడు. నాగటిమీద చేయి పెట్టి దున్ను వ్యక్తి వెనక్కి తిరిగిచూస్తే ముప్పే *లూకా 9:62.* వాహనం నడిపేవాడు ముందుకే చూసి గమ్యాన్ని చేరుకోవాలి, లేకపోతే ఘోరమైన ప్రమాదం, తీవ్రగాయాలు తధ్యం. వెనుక ఉన్నవాటిని మరచిపోవాలి. బైబిలు పరిభాషలో మరచిపోవడం అంటే ఆ గతం ప్రభావంలో ఇంకా ఉండకూడదు అని అర్ధం. దేవుడు మన దోషములు, పాపములు మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు *హెబ్రీ 10:17.* ఆయనకు జ్ఞాపకశక్తి లేదని దాని అర్ధం కాదు, ఆయన మనలను క్షమించేశాడు అని దాని అర్ధం. భవిష్యత్తు కొఱకు జీవించడం ద్వారా మనం గతాన్ని మార్చలేము, కానీ మనం దాని అర్ధాన్ని మార్చగలం.
*4. నిర్ణయం /సంకల్పం (3:14):* వేగిరపడడం అనగా తీవ్రమైన ప్రయత్నాన్ని సూచిస్తుంది. వేటను ఆత్రంగా కొనసాగించడం అను దానికి గ్రీకులు దీనిని వాడారు. సంఘాన్ని హింసించుటలో చూపిన అదే ఉత్సాహం, మార్పునొందిన తర్వాత క్రీస్తును సేవించుటలో కొనసాగిస్తున్నాను *(ఫిలి 3:6)* లో పౌలు సూచించాడు. క్రైస్తవులు తమ గురిని ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఉంచితే అంత అద్భుత విజయాన్ని సాధిస్తారు.
తను పందెములో ఉన్నప్పుడు క్రీస్తే నాయందు కార్యాభివృద్ది చెయ్యాలి అని క్రైస్తవ ఆటగాడు చెప్పాలి *ఫిలి2:12-13.* ఆయన లేకుండా మన ఫలింపు ఉండదు (యోహాను 15:5). ఒలింపిక్స్ లో ఇచ్చే పుష్ప గుచ్ఛం వాడిపోతుంది, కానీ యేసు ఇచ్చే జీవకిరీటం వాడిపోదు. బహుమానం పొందుటకొరకే పరుగెత్తాలి. పౌలు బహుమతి కొరకే పరుగెత్తాడు, బహుమతి పొందగలనని నిశ్చయతను పొందుకున్నాడు (3:14).
*5. క్రమశిక్షణ (3:15-16):* పందెమందు పాల్గొని కష్టపడి గెలిస్తే సరిపోదు; నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. గ్రీసులో ఆటలలో నియమ నిబంధనలు కఠినంగా ఉండేవి. ఏదైనా నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ ఆటగాడు అనర్హుడిగా ప్రకటిస్తారు. అతడు తన రోమా పౌరసత్వాన్ని కోల్పోడు కానీ, అతడు బహుమతిని పొందుకునే అర్హతను కోల్పోతాడు. ఫిలిప్పీయులు వాక్యమును గుర్తుంచుకొని, దాని ప్రకారం నడువవలసిన ప్రాముఖ్యతను పౌలు నొక్కిచెప్పాడు. ఆధ్యాత్మిక నియమాలు నిర్ధేశించబడ్డాయి. జింథోర్ఫ్ 1912 లో క్రీడలలో హీరోగా వర్ణించబడ్డాడు, రెండు బంగారు పతకాలను సాధించాడు. కానీ నియమము తప్పి సెమీ ప్రొఫెషనల్ బేస్బాల్ ఆడినట్లు ధృవీకరింపబడింది. అందుకుగాను అతని పతకాలు, ట్రోఫీ వెనక్కి తీసుకోబడ్డాయి, మరియు అతని ఒలింపిక్ విజయాల రికార్డుల నుండి తొలగించబడ్డాయి, నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. (1985 లో ఒలింపిక్ కమిటీ ద్వారా పతకాలు పునరుద్ధరించబడ్డాయి). మనకు ఇట్టి వీలులేదు.
పరుగు పందెములోప్రవేశించే ఎవరైనా శిక్షణలో కఠినమైన స్వీయ నియంత్రణను అభ్యసిస్తారు *ఫిలి 3:25.*
బైబిలు చరిత్రలో గొప్పగా పరుగును ప్రారరంభించిన వ్యక్తులతో నిండి ఉన్నది, కానీ వారు దేవుని నియమాలను ఉల్లంఘించినందున చివరికి విఫలమయ్యారు. కానీ వారు తమ రక్షణను కోల్పోలేదు, కానీ ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నారు (1 కొరింది 3:15). లోతు *ఆది 19,* సమ్సోను *న్యాయాధిపతులు 16,* సౌలు *1 సమూ 28:31,* అననీయ మరియు సప్పీరా *అపో.కా 5.* వీరికి జరిగింది మనకు జరుగవచ్చు, కనుక
*హెబ్రీయులకు 12:1–2* "ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము."
క్రీస్తునందు మీ సహోదరి,
శ్రీదేవి పాల✍🏻
[8/20, 07:41] +91 94930 75953: *420/397 రోజుల బైబిలు అధ్యయనము. ఫిలిప్పీ 3-4 & కొలోస్సీయులకు 1.*
*యూనీకేలో వసించిన విశ్వాసం*
యూనీకే ఈమె ఒక యూదురాలు. ఈమె భర్త గ్రీసు దేశస్థుడు. 2 తిమోతి 1:5 లో ఒక్కమారే ఈమె పేరు పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడింది. ఈమె తల్లి లోయి, ఈమె కుమారుడు తిమోతి. ఈమె విశ్వాసము ఈమె తల్లినుండి వచ్చింది, ఈమె తన విశ్వాసాన్ని కుమారుడైన తిమోతిలో నింపింది. ఎంతో చక్కటి ఆధ్యాత్మిక ఆరోగ్యకర కుటుంబం వీరిది. భర్త గురించి ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ అతడు అన్యుడై యుండవచ్చును అని వాక్యాధారం ద్వారా తెలుసుకోవచ్చును *అపో. కా. 16:1,3.* తల్లులే పిల్లలకు మంచి గురువులని, సత్ప్రవర్తన, దుర్మార్గత తల్లిని బట్టియే పిల్లలు నేర్చుకుంటారని, పిల్లలను బాల్యము నుండే క్రమములో పెట్టకపోతే అది కుటుంబానికి నరకప్రాయంగా ఉంటుందని మనకు బైబిలు గ్రంధములో కథనాల ద్వారా, వార్తా పత్రికల ద్వారా, మీడియా ద్వారా ఎన్నో యదార్ధ సంఘటనల ద్వారాను ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నాము. అట్టి విధమైన ప్రమాదాల్లో మన కుటుంబాలు పడకుండా ఉండాలంటే మనం ఈమె నుండి విలువైన పాఠాలను నేర్చుకోవాల్సిందే. ఈమె మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠములు చాలా విలువైనవి, అవి మనకు, మన కుటుంబానికి, సంఘానికి, మన పిల్లలకు ఎంతో ఉపయుక్తముగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.
*యూనీకేలోని విలక్షణమైన సుగుణాలు:*
*1️⃣ ఈమె నిష్కపటమైన విశ్వాసం కలది:* 2 తిమోతి 1:5.
మందిరము ద్వారా, మందిరములో ఉన్న వ్యక్తుల ద్వారానో, దేవుని నుండి ఎట్టి విధమైన లాభాపేక్షను ఆమె ఆశించక క్రీస్తు తన స్వంత రక్షకుడని విశ్వసించి, ఆయన కొరకు హృదయమార శ్రమించింది ఈ తల్లి. తన తల్లి తనలో ఉంచిన విశ్వాసమే, ఆమె తన కుమారునిలో కార్యసాధకం చేసింది. అన్యుడైన తండ్రి ప్రభావము కుమారుడిలో పడలేదు. తానే కుమారునికి మాదిరిగా నిలిచి చూపించింది. తద్వారా తిమోతి నమ్మకమైన, మంచిసాక్షము కల్గిన యవ్వనుడుగా, ప్రముఖ సువార్తికుగా, అపో. పౌలుకు సహకారుడుగా, ఉజ్జీవకరమైన పాత్రగా, దేవుని చేతిలో అమూల్యమైన బలమైన సాధనంగా, అనేకులను దేవుని వైపుకు త్రిప్పిన వాడుగా చేయబడ్డాడు. తల్లి ప్రభావం పిల్లల మీద ఎంతగానో ప్రభావితం చేయబడుతుంది అనుటకు నమ్మకమైన మంచి సాక్ష్యం తిమోతి.
*2️⃣ బాల్యము నుండి తన కుమారునికి దేవుని లేఖనములను నేర్పింది:* 2తిమోతి 3: 14-15.
*ద్వితియోపదేశకాండము 6:6–7* నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
బాల్యము నుండి లోకజ్ఞానం, అబద్దాలు, మోసాలు, ద్వేషం, అసూయ ఇతరులపై, ఇంటివారిపై పిల్లలకు నేర్పక లేఖనాలను తన బిడ్డకు నేర్పుతూ వచ్చింది ఈ తల్లి. మొదటగా తల్లులమైన మనము దేవుని లేఖనాలను చక్కగా ఎరిగివుంటే, వాటిని వినుట, చదువుట, ధ్యానించుట, కంఠత పెట్టుట, నడచుకొనుట చేసి, మన పిల్లలకు వాటియందు తర్ఫీదును చిన్ననాటి నుండే ఇస్తే వారు పెద్దవారైనప్పుడు మార్గం తొలగినడువరు *సామెతలు 22:6.* వారికి వంకరచూపులు, వంకరనడతలు రాక తిన్నగా, క్రమంగా, బుద్దిగా నడుచుకోవడం చేస్తారు.
*కీర్తనలు 119:9* యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?
*సామెతలు 31:26* జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.
చిన్ననాటి నుండే వారికి ఎవరు ఎట్టి నడతవలన నష్టపోయారో, ఎలా ఉంటే దేవునికి ఇష్టులముగా వుంటామో, మన జీవితాలను దేవునికి సమర్పించడం ద్వారా కలిగే ఆశీర్వాదం ఎంతటిదో వారికి అర్ధము అగునట్లు జ్ఞానము కలిగిన కృపగల ఉపదేశాన్ని చెబుతూ రావాలి. హన్నా తన కుమారుడైన సమూయేలుకు బాల్యమునుండే లేఖనాలను నేర్పింది. అందుకే బాలుడైన సమూయేలు సేవకు సమర్పింప బడినప్పుడు అక్కడనే మ్రొక్కి ప్రతిష్టింపబడ్డాడు *1సమూ 1:28.* యోకెబెదు తన ముగ్గురు పిల్లలకు లేఖనాలను నేర్పింది. అందుకే వారు ముగ్గురూ మంచి నాయకులుగా ఎదిగి దేవుని ప్రజలను బానిసత్వం నుండి విడిపించుటలో గొప్ప సాధనాలుగా వాడబడ్డారు.
*3️⃣ దైవజనునికి తన కుమారుడ్ని అప్పగించింది:*
యూనీకే తన కుమారుడిని దైవజనుడైన పౌలుకు సమర్పించింది. దైవజనులు పౌలును పోలియున్నవారుగా మంచి సేవాభారం ఉన్నవారిగా ఉన్నచో మన పిల్లలను దేవుని మార్గంలో, దేవుని కొరకు ప్రకాశించే వారిగా చేయగలరు. హన్నా తన కుమారుడిని దేవుని సేవకొఱకు దైవజనుడైన ఏలికి అప్పగించింది. సమూయేలు ప్రవక్తగా, దీర్గదర్శిగా, న్యాయాధిపతిగా, దేవుని స్వరం విని ఆ ప్రకారం చేసే నిందారహితుడుగా, ప్రజలందరికీ సరైన మార్గదర్శిగా ఉపయోగించబడ్డాడు.
యవ్వనంలో వారిబలం, వారి సమయం, వారి తలాంతులు దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఉపసయోగించడం ఎంత ఆశీర్వాదకరం. లేనిచో మన యౌవ్వనస్థులను మ్రింగివేయడానికి మరణం, సాతాను కాచుకుని కూర్చున్నారు.
*యిర్మియా 9:21* వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.
నేటి దినాల్లో దేవుని సేవ అన్నను, దేవుని సేవకు సమర్పించు కోవడం అన్నను అది ఎంతో అధమమైన పనిగా ఎంచి చదువురాని, ఎందుకు పనికిరాని వారిని చివరికి దేవుని సేవైనా చేసి బ్రతుకు అని తల్లి దండ్రులు తమ పిల్లలకు చెప్పడం శోచనీయం. దైవజనులైన బిల్లీ గ్రాహం గారు ఎంతో శ్రేష్ఠమైన పనిలో నేను ఇప్పటికే ఉన్నాను అని అమెరికా అధ్యక్షపదవిని సైతం తృణీకరించారు. దైవజనుడైన భక్తసింగ్ గారు భారతదేశపు మొట్టమొదటి అగ్రికల్చరల్ ఇంజనీరు అయినప్పటికీ, ఎంతో ఆస్తి పాస్తులను వదులుకుని సర్వోత్తమైన మార్గం క్రీస్తు అని, ఉత్తమమైన పని దేవుని సేవ అని దానిని ఎంపిక చేసుకున్నారు. ఎన్నో సంఘాలు దేశ విదేశాల్లో కట్టి గొప్పసేవను చేశారు. వీరు ఇరువురు ఎంతో గొప్ప సేవను చేసి దేశవిదేశాల్లో ప్రభువుకొఱకు లెక్కలేని ఆత్మలను సంపాదించి, మంచి, మాదిరికరమైన దైవ సేవకులని పేరు ప్రఖ్యాతులు గావించారు. *దేవుని నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి కృతార్థులగుదురు* అని వాక్యం సెలవిచ్చినట్లు ఆయన సేవ చేయువారికి ఏమియు తక్కువ కాదు.
పౌలు భక్తుడికి అత్యంత ఆనందమును కలుగజేయు ఆత్మీయ కుమారుడిగా తిమోతి ఉంటున్నాడు. పౌలు నా నమ్మకమైన కుమారుడు, నా ప్రియకుమారుడు, నా నిజమైన కుమారుడని తిమోతిని ఎన్నో మార్లు తన పత్రికల్లో మెచ్చుకున్నాడు. తిమోతి వాస్తవంగా పౌలుకు కుమారుడు కాకపోయినప్పటికీ పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు అవమానముగా భావించి అందరూ విడిచివెళ్లిపోయిననూ అట్టి పరిస్థితిలో కూడా పౌలుకు ఎంతో ఆదరణను కలుగజేసి, పౌలు ఇచ్చిన హెచ్చరికలను పత్రికల ద్వారా అందుకుని గైకొని సంఘములను బలపరచిన వారిలో తిమోతి ప్రముఖుడు. తిమోతి పేరిట రెండు పుస్తకాలు పరిశుద్ధ గ్రంధములో చోటుచేసుకోవడం ఎంత ధన్యకరం. ప్రభువు నందు మన ప్రయాస ఎన్నటికీ వ్యర్ధముకాదని ఎరిగి స్థిరులమును, అనునాంగులును, కదలని వారుగా ఉందాం.
*4️⃣ యూనికే గెలుచుకుంది:* యూనీకే అనగా గెలుపు అని అర్ధం. ఆత్మ సంబంధ పోరాటాల్లో అపవాదితో, దురాత్మ సమూహాలతో, చీకటి శక్తులతో, ఈలోక నాధులతో వీరోచితంగా ప్రార్ధనల్లో పోరాడి, శ్రమించి (పిల్లవాని బాల్య దినముల నుండే) వాక్యంచే పెంచి ప్రభువు కొరకు గెలుచుకుంది. పౌలు భక్తుడు మంచిపోరాటము పోరాడితిని నా పరుగును తుదముట్టించితిని అని చెప్పుచున్నాడు. ఈ లోకంలో మనకు ఎన్ని విధాలుగా ఆత్మీయ శత్రువులు ఉన్ననూ దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొని, ఆత్మద్వారా శక్తిని పొందుకొని జయించాలి.
*రోమీయులకు 8:37* అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
యోసేపు జీవితం ముగిసిపోయిందని ఎందరో అనుకున్నారు కానీ ప్రతి సమయంలో, ప్రతి అనానుకూల పరిస్థితి ఆతనికి విజయసోపానాలుగా మార్చబడి రాజమార్గాన్ని, అత్యున్నత పదవిని పొందుకొనుటకు మార్గాన్ని వేసింది. యోబు అపవాదితో పోరాడి గెలుపొంది మునుపటి కంటే రెండురెట్ల దీవెనలు అధికంగా పొందుకున్నాడు. శోధనలు మనకు విజయసోపానాలుగా మార్చుకొనుటకు మనలో ఉన్న విశ్వాసము కార్యసాధకం చేస్తుంది.
దేమా లోకమును ప్రేమించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు, అలెక్సంద్రు అను కంచరివాడు పౌలుకు చాల కీడుచేశాడు. కానీ యూనీకే కుమారుడు ఆమె పెంపకం వలన పౌలుకు ప్రియకుమారుడుగా అన్ని సమయాల్లో దేవుడ్ని, పౌలును, తల్లిని, అవ్వను సంతోషపెట్టు వాడుగా ఉన్నాడు. తిమోతిని గురించి లూకా కూడా ప్రస్తావిస్తూ *అపో.కా. 16:2* లో లుస్త్రలోను, ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచిపేరు పొందినవాడు అని వ్రాశాడు.
యూనీకే తాను గెలిచి, కుమారుడ్ని గెలుపొందేటట్లు చేసింది.
పిల్లలు చేయిదాటిపోయి మాట వినక, దుర్మార్గులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, మానసిక రోగులు, తమ ప్రాణాలు తీసుకునే వారు, ఇతరుల ప్రాణాలు తీసేవారుగా అయ్యాక చింతించి, ఆవేదన చెంది మనం మానసిక రోగులము, దేవుని నుండి వెనుదిరుగు వారము కాకముందే మేల్కొని చిన్ననాటి నుండే మన పిల్లల విషయమై ప్రార్ధనల్లో పోరాడి వారిని సక్రమ మార్గంలో పెట్టుటకు మనలను పెట్టుబడిగా పెట్టి దేవునిలో మన పిల్లలను గెలుచుకుందాం. దైవజనులు, దేవుని సంఘము, దేవుడు, సమాజము, స్వంత ఇంటి వారికి మన బిడ్డల ద్వారా ఆనందాన్ని కలిగించుటకు శ్రమిద్దాం. యూనీకే మాదిరిని అనుసరిద్దాం.
విశ్వాసమే మన విజయం క్రీస్తేసుతో మన విజయం, శోధన బాధలలో, అగ్నిపరీక్షలలో దైవశక్తియే మనకు విజయం, ఘన విజయం.
క్రీస్తునందు మీ సహోదరి,
శ్రీదేవి పాల✍🏻
[8/20, 07:41] +91 94930 75953: *Spiritual walk*
*philpians 3 rd chapter*
*~~~~~~~~~~~~~~~~~~~~~*
*📘420 రోజుల బైబిలు అధ్యయనం📘*
*20/8/2026*
*~~~~~~~~~~~~~~~~~~~~~*
*ఆధ్యాత్మిక నడక*
*ఫిలిప్పీయులకు 3వ అధ్యాయం*
🍞🍹🍞🍹🍞🍹🍞
ఫిలిప్పీయులు 3:17లో, పౌలు విశ్వాసులను తన మాదిరిని మరియు క్రీస్తు బోధనల ప్రకారం జీవించే వారి మాదిరిని అనుసరించమని కోరుతున్నాడు. ఇది కేవలం ఒక మనిషిని అనుకరించాలనే పిలుపు కాదు, యేసుక్రీస్తు ద్వారా వెల్లడైన సత్యంలో నడవాలనే పిలుపు.
*🙇🏻♀️📚👨🏼🎓ఒకప్పుడు బెన్యామీను గోత్రానికి చెంది, హెబ్రీయుడై అంకితభావంతో ఉన్న పరిసయ్యుడైన పౌలు మోషే ధర్మశాస్త్రాన్ని లోతుగా అర్థం చేసుకున్నాడు. పరిసయ్యుడిగా, అతను ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవాడు.*
*_🕍🕎యేసు కాలంలో, సమాజమందిర నాయకులైన పరిసయ్యులు, వారి ప్రయోజనాలకు తగిన విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. మత్తయి 23:23లో యేసు విమర్శించినట్లుగా, వారు ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన విషయాలను - న్యాయం, దయ మరియు విశ్వాసం - విస్మరించారు, అదే సమయంలో మతపరమైన ఆచారాలు మరియు బాహ్య ఆచారాలను గట్టిగా పట్టుకున్నారు._*
_✝️🎯☝️అయితే, పునరుత్థానమైన క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు పౌలుకు ప్రతిదీ మారిపోయింది. ఆ క్షణంలో, యేసు నిజమైన దేవుడని, ఆయనను తెలుసుకోవడం అంటే అతీతమైన జ్ఞానాన్ని కలిగి ఉండటమని అతను గ్రహించాడు. అప్పటి నుండి, పౌలు తన గత గుర్తింపులన్నింటినీ - పరిసయ్యుడిగా తన గుర్తింపు మరియు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించడం సహా - చెత్తగా (లేదా పేడగా) పరిగణించాడు, ఎందుకంటే అవి క్రీస్తుతో జీవితంతో పోల్చినప్పుడు వాటికి శాశ్వతమైన విలువ లేదు._
*పౌలు పరివర్తన ప్రాధాన్యతలలో పూర్తి మార్పును తెచ్చిపెట్టింది:*
*🎯1. దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం:* _పౌలు తన జీవితంలో దేవుని పిలుపును నెరవేర్చడానికి తన సొంత ప్రజలు, మత నాయకులు మరియు రాజుల నుండి కూడా బాధలు, తిరస్కరణ మరియు హింసను స్వీకరించాడు._
*🎯2. చర్చిలను స్థాపించడం:* _అతను అనేక చర్చిలను నాటడానికి మరియు బలోపేతం చేయడానికి శ్రమించాడు, విశ్వాసులను ప్రోత్సహించాడు మరియు తన బోధన మరియు లేఖల ద్వారా తప్పుడు బోధనలు మరియు తప్పుడు పనులను సరిదిద్దాడు_
*🎯3. క్రీస్తును అనుకరించడం:* _పౌలు యేసును తన ఆదర్శంగా చేసుకున్నాడు, నమ్మకంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఇతరులు కూడా అదే చేయాలని ప్రోత్సహించాడు._
*🎯4. అన్ని పరిస్థితులలోనూ సంతృప్తి:* _దురాశ మరియు లోక కోరికల ప్రమాదాలను అర్థం చేసుకుని, పౌలు ప్రతి పరిస్థితిలోనూ సంతృప్తి చెందడం యొక్క రహస్యాన్ని నేర్చుకున్నాడు, అది అవసరంలో ఉన్నా లేదా సమృద్ధిగా ఉన్నా._
*🎯5. పునరుత్థానంలో నిరీక్షణ:* _క్రీస్తు లేపబడినట్లే, మృతులలో నుండి పునరుత్థానంలో పాలుపంచుకోవడమే పౌలు అంతిమ లక్ష్యం. ఈ నిరీక్షణ అతని జీవితాన్ని మరియు సందేశాన్ని రూపొందించింది._
*✝️🩷పౌలు సున్నతి మరియు ఆచార శుద్ధీకరణ వంటి ఆచారాలను కూడా తిరస్కరించాడు, దేవుడు ఆత్మ అని మరియు నిజమైన ఆరాధన "ఆత్మలో మరియు సత్యంలో" ఉండాలి అని గుర్తించాడు (యోహాను 4:24). అతనికి, ఆధ్యాత్మిక జీవితం బాహ్య ఆచారాల గురించి కాదు, కానీ ఆత్మ ద్వారా దేవునితో లోతైన, అంతర్గత సంబంధం.*
_☝️పౌలు వంటి ప్రతి విశ్వాసిని దేవుడు ఒక దైవిక ఉద్దేశ్యం కోసం ఎంచుకున్నాడు. ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం మన ప్రాథమిక అన్వేషణగా ఉండాలి. మన ఆధ్యాత్మిక నడక యేసు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి, బాహ్య ఆచారాలపై కాకుండా అంతర్గత పరివర్తనపై దృష్టి పెట్టాలి. పౌలు వలె, మన అంతిమ లక్ష్యం నీతిమంతుల పునరుత్థానం అయి ఉండాలి, దీనిని *1 కొరింథీయులు 15:23 లో చెప్పబడింది: "ప్రతి ఒక్కరూ ప్రథమ ఫలమైన క్రీస్తు; తరువాత, ఆయన వచ్చినప్పుడు, ఆయనకు చెందినవారు."*_
*💡క్రీస్తు కోసం జీవించడం, ఆత్మలో నడవడం, పరీక్షలలో నమ్మకంగా ఉండటం మరియు శాశ్వతమైన బహుమతిపై మన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా పౌలు మాదిరిని మనం అనుసరిద్దాం. మరియు మనం కూడా పౌలు వలె, దేవుని కృప అన్ని పరిస్థితులలోనూ సరిపోతుందని నమ్ముతూ సంతృప్తి చెందడం నేర్చుకుందాం.*
*_షర్మిలా బూర్గుల✒️_*
అనువాదం:శ్రీదేవి పాల.
[8/20, 07:41] +91 94930 75953: ✝️ *మాదిరిని అనుసరించండి* ✝️ ఫిలిప్పీయులు3,4 ✝️
సహోదరులారా, *మీరు నన్ను పోలి నడుచుకొనుడి*; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. ఫిలిప్పీయులు 3:17.
🔹 అపొస్తలుడైన పౌలు ఎటువంటి మాదిరి గురించి మాట్లాడుతున్నాడు? అలా జీవించిన వారు ఎవరు? ఫిలిప్పీలోని సంఘానికి ఆయన రాసిన లేఖలో, *క్రీస్తుతో ఐక్యం కావడం* నుండి మనకు ఏదైనా ప్రోత్సాహం ఉంటే, మనం *ఒకే మనసుతో, అదే ప్రేమతో, ఆత్మతో మరియు ఒకే మనస్సుతో* ఉండాలి. 2:2. సంఘము యొక్క సారాంశం 2:6-8లో వ్రాయబడిన క్రీస్తు యొక్క సారాంశం వలె ఉండాలి.
🔹యేసుక్రీస్తును తమ ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించిన ఎవరికైనా *క్రీస్తు యేసుకు ఉన్న అదే వైఖరి* ఉండాలి. 2:5-8.
ఎవరైనా *యేసు* లా ఉండాలనుకుంటే* (దేవుని స్వభావములో ఉండి, తనను తాను శూన్యముగా చేసికొని, మానవుని పోలికలో సృష్టించబడినవాడు), వారు వినయంతో ఇతరులను తమ కంటే ఎక్కువగా విలువైనదిగా పరిగణించాలి. వారు తమ ప్రయోజనాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రయోజనాలను కూడా చూడాలి. వారు *యేసువలె* సేవకుని స్వభావాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, వారు స్వార్థ ఆశయంతో లేదా వ్యర్థమైన అహంకారంతో ఏమీ చేయరు. 2:3,4, 6,7.
🔹ప్రేమ ఇతరుల హృదయంలో కనిపించాలి మరియు అనుభూతి చెందాలి. తిమోతి మరియు ఎపఫ్రొదితు పౌలు మరియు ఫిలిప్పీ సంఘముతో సహా ఇతరుల సంక్షేమం పట్ల నిజమైన ఆసక్తిని కనబరిచారు. వారు ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధను కలిగి ఉన్నారు మరియు ప్రభువు ప్రజలను చేరుకోవడానికి మరియు ఒకరికొకరు ఆయన ప్రేమను పంచుకోవడానికి వారాలు మరియు నెలలు ప్రయాణించారు. 2:19-30. ఈ రోజు మనం ఇతరులకు ప్రేమను చేరుకోవడానికి సరికొత్త సాంకేతికతను కలిగి ఉన్నాము. ఎక్కడికైనా చేరుకోవడానికి మనం వారాలు, నెలలు ప్రయాణించాల్సిన అవసరం లేదు. మనం మన స్వంత ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నామా లేదా ఇతరుల ప్రయోజనాలను కూడా పరిశీలిస్తున్నామా? 2:4, 21. మనం ఇతరులను వ్యక్తిగతంగా ఎంత తరచుగా ప్రేమలో కలుస్తాము? మనం అనుసరించే నమూనా ఏమిటి?
🔹ఎవరైనా *యేసు వలె* మరణానికి విధేయులుగా మారడానికి సిద్ధంగా ఉంటే, (అది సిలువపై మరణం కానవసరం లేదు), వారు కనీసం తమ గొణుగుడు మరియు ఫిర్యాదులను చంపి, వారు నిర్దోషులుగా మరియు స్వచ్ఛంగా మారవచ్చు. 2:8,14. ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు. మా సంగతేమిటి? ప్రజలు తమ మనస్సును పూర్తిగా భూసంబంధమైన విషయాలపై ఉంచి, వారి కీర్తి వారి అవమానంలో ఉన్న సంస్కృతికి మనం ఎలా ప్రతిస్పందిస్తాము? 3:18-20. పౌలు క్రీస్తును తెలుసుకోవాలనుకున్నాడు మరియు ఆయన మరణంలో ఆయనలా మారాలని కోరుకున్నాడు. అతను తన లాభాన్ని క్రీస్తు కొరకు నష్టంగా భావించాడు. 3:8,10. క్రీస్తు నిమిత్తము మనం నష్టమని భావించేది ఏదైనా ఉందా?
🔹🔸🔹🔸🔹🔸🔹
*దేవుడు ఆశీర్వదిస్తాడు!*🙂
సంగీత థామస్.
అనువాదం బ్రదర్ జాయ్
[8/20, 07:41] +91 94930 75953: *దేనినిగూర్చియు చింతపడకుడి*_ (ఫిలిప్పీ 4:6).
*ఆందోళన అనేది విశ్వాసిలో కనిపించకూడదు.* మన కష్టాలు, బాధలు అనేక రకాలుగా మన మీదకు రావచ్చు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు.
👉 *ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రి మనకున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించినట్టే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో మనలను కాచి కాపాడడమే ఆయనకు ఆనందం.*
కాబట్టి *“దేనిని గూర్చియు చింతపడకుడి. గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.”*
👉 *“దేనిని గూర్చియు”* అనేది అన్నిటికీ వర్తిస్తుంది.
*నీ ఇల్లు తగలబడిపోతున్నదా?*
*భార్యాపిల్లలు మృత్యుముఖంలో ఉన్నారా?*
*ఇంత పెద్ద విషయాల నుండి చిన్న చిన్న విషయాల దాకా, అన్నిటినీ దేవుని వద్దకు తీసుకురా.ఎంత అల్పమైన విషయాలైనా సరే, ఏదైనా సరే ఫర్వాలేదు.*
రోజంతా మన పరిశుద్ధ జనకునితోను, యేసు ప్రభువుతోను సహవాసంలో ఉండాలి.
*రాత్రివేళ హటాత్తుగా మెలకువ వస్తే మన మనస్సు తనంతట తానే ఆయన వైపుకి తిరగాలి.*
👉 *నిద్రలేని రాత్రుళ్ళలో మనల్ని వేధించే సమస్యలను ఆయన ముందుంచాలి.*
*మన కుటుంబం, వ్యాపారం, వృత్తి, ఏదైతే మనల్ని విసిగిస్తున్నదో దాని విషయం ప్రభువుతో మాట్లాడాలి.*
*"ప్రార్థనా విజ్ఞాపనలతో”* అంటే ఆసక్తిగా, పట్టుదలగా, దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెట్టాలి.
*"కృతజ్ఞతా స్తుతులతో”* అంటే ఎప్పుడూ ముందుగా కృతజ్ఞతాస్తుతుల పునాది వెయ్యాలి.
👉 మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనలను దేవుడు నరకం నుండి తప్పించాడన్న సత్యం మాత్రం ఎప్పుడూ ఉంది కదా. తన పరిశుద్ధ వాక్కును, తన కుమారుణ్ణి మనకు ఇచ్చాడు కదా. తన ప్రశస్థమైన వరం, పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు కదా. ఆయనకు వందనాలు చెల్లించడానికి మనకు కారణాలకేమీ కొదువ లేదు. దీనిలో మనం ఆసక్తి కలిగి ఉందాం.
*సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి మీ మనస్సునీ, మీ హృదయాన్నీ యేసుక్రీస్తులో ఉంచుతుంది.* ఇది ఎంత దీవెనకరమైనదీ, వాస్తవమైనదీ, విలువైనదీ అంటే ప్రయోగాత్మకంగా దానిలోనికి ప్రవేశించి చూడాలి. ఎందుకంటే అది మన జ్ఞానానికి అందదు. ఈ విషయాలను హృదయంలో భద్రం చేసుకుందాం. మనం ఆత్మలో నడవడం అలవాటు చేసుకుంటే తత్ఫలితంగా ఆయనకు గొప్ప మహిమను ఆపాదించినవాళ్ళం అవుతాం.
*రోజుకు రెండు మూడుసార్లు నీ హృదయం ఏదైనా విషయం గురించి దిగులుగా ఉందేమో పరీక్షించి చూసుకోవాలి. అలా ఉన్నదని తెలిసినట్టయితే దానిలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చూసుకోవాలి.*
*దైవాశ్శీసులు!!!*
సేకరణ బ్రదర్ జాయ్