Sri Rukmani Sathyabama Venugopala Swamy, Penamaluru

Sri Rukmani Sathyabama Venugopala Swamy, Penamaluru రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానము, పెనమలూరు is built in 1936

30/12/2025
🚩ధనుర్మాసము ఐద‌వ‌ పాశుర‌ము🚩********************************మాయ‌నై మ‌న్ను వ‌డ‌మ‌దురై మైన్ద‌నైత్తూయ‌ పెరునీర్ య‌మునై త్తుఱ...
20/12/2024

🚩ధనుర్మాసము ఐద‌వ‌ పాశుర‌ము🚩
********************************

మాయ‌నై మ‌న్ను వ‌డ‌మ‌దురై మైన్ద‌నై
త్తూయ‌ పెరునీర్ య‌మునై త్తుఱైవ‌నై
ఆయ‌ర్ కుల‌త్తినిల్ తోన్ఱుమ్ మ‌ణివిళ‌క్కై
త్తాయైక్కుడ‌ల్ విళ‌క్కం శెయత‌ దామోద‌ర‌నై
తూయోమాయ్ వ‌న్దు నామ్ తూమ‌ల‌ర్
తూవిత్తొళ్ తు
వాయినాల్ పాడి మ‌న‌త్తినాల్ శిన్దిక్క‌
ప్పోయ‌పిళైయుమ్ పుగుద‌రువా నిన్ఱ‌న‌వుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బావాయ్

అర్ద‌ము
*******

మ‌న‌మీ వ్ర‌తము నాచ‌రించి ఫ‌ల‌మందుట‌కు మ‌న‌పాప‌ముల‌డ్డువ‌చ్చున‌ని
భ‌య‌ప‌డ‌వ‌ల‌దు.

అందుల‌కు కార‌ణ‌ము మ‌న‌ వ్ర‌త‌మున‌కు
నాయ‌కుడు శ్రీక‌ృష్ణుడే. ఆత‌డు
ఆశ్చ‌ర్య‌క‌ర‌గుణ‌ములు చేష్ట‌లు క‌ల‌వాడు.

ఉత్త‌ర‌ మ‌ధురానగ‌రికి నిర్వాహ‌కుడిగా
ఆవిర్భ‌వించెను. నిర్మ‌ల‌మై గంభీర‌మైన‌
జ‌ల‌ముగ‌ల‌ య‌మునాన‌ది యొక్క‌
తీర‌వాసియై మ‌న‌కై అవ‌త‌రించిన‌
మంగ‌ళ‌దీప‌ము. మ‌రియు త‌న‌
పుట్టుక‌చే య‌శోదా గ‌ర్భ‌మును
కాంతివంత‌ము చేసిన‌ ప‌రత్వ‌ము
క‌లిగి కూడా ఆమెచే క‌ట్టుబ‌డిన‌
సుల‌భుడు. కావున‌ మ‌న‌ము
సందేహ‌ముల‌నే మ‌లిన‌మలులేక‌
నిర్మ‌లుల‌మై, అత‌నిని చేరి చేతులారా
నిర్మ‌ల‌ హ‌ృద‌య‌పుష్పాన్ని స‌మ‌ర్పించాలి.
నోరారాపాడాలి. మ‌న‌సారా ధ్యాన‌ము
చేయాలి. ఆ వెంట‌నే నిల్వ‌యున్న‌
పాప‌రాశి , రాబోవు పాప‌రాశి కూడా
నిప్పున‌బ‌డ్డ‌ దూదిపింజవ‌లె భ‌స్మ‌మై
మ‌న‌ వ్ర‌త‌మున‌ క‌డ్డుతొల‌గును.
క‌నుక‌ రండి భ‌గ‌వ‌న్నామాన్ని చెప్పెద‌ము

🚩ధనుర్మాసము నాలుగ‌వ‌ పాశుర‌ము🚩**********************************ఆళి  మళై   కణ్ణా ఒన్ఱు   నీ కైకరవేల్ఆళియుళ్   పుక్కు ముగ...
19/12/2024

🚩ధనుర్మాసము నాలుగ‌వ‌ పాశుర‌ము🚩
**********************************
ఆళి మళై కణ్ణా ఒన్ఱు నీ కైకరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేఱి
ఊళి ముధల్వ నురువమ్బోల్ మెయికఱుత్తు
పాళియ0దోళుడై ప్ప‌ఱ్ప‌నాబ‌న్ కైయిల్
అళి పోల్ మిన్ని, వలమ్బురిపోల్ నిన్ఱ‌దిర్ న్దు
తాళాదే శార్౦గ ముదైత్త‌ శరములైపోల్
వాళ ఉలగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావాయ్

అర్దము
*******

పెద్ద‌ పెద్ద‌ వ‌ర్షాల‌ని కురిపి౦చ‌గ‌లిగిన‌
ఓ వ‌రుణుడా! నీ గొప్ప‌త‌నాన్ని ఏమాత్ర‌ము
త‌గ్గ‌నీయ‌కు. స‌ముద్ర‌ములో ఉన్న‌
నీర౦తా త్రాగు. గ‌ర్జి౦చి మీద‌కు పోయి
నీ శ‌రీరాన్ని శ్రీమ‌న్నారాయాణ‌మూర్తి
శ‌రీర౦ లాగా న‌ల్ల‌గా చేసుకో....

నీ ను౦చి వ‌చ్చే మెరుపులు ఆ భ‌గ‌వ౦తుని
కుడి చేతియ౦దు౦డు చ‌క్ర‌ములాగా
మెర‌వాలి. నీ ఉరుములు ఆయ‌న‌
ఎడ‌మ‌ చేతియ౦దు ఉన్న‌ శ౦ఖ‌ములాగా
గ‌ర్జి౦చున‌ట్లు ఉ౦డాలి. నువ్వు
కురిపి౦చే వ‌ర్ష‌ధార‌లు ఆయ‌న‌ చేతి
య౦దు ఉన్న‌ విల్లు ను౦చి కురిసిన‌
బాణ‌ముల‌వ‌లె ఉ౦డాలి

నువ్వు కురిపి౦చిన‌ వ‌ర్ష‌ము వ‌ల‌న‌
లోక‌ములో అ౦ద‌రూ సుఖ‌ముగా ఉ౦డాలి.
మేమ౦ద‌ర‌ము స౦తోష‌ముగా స్నాన‌ము
చేయ‌టానికి స‌రిప‌డున‌ట్లు మ౦చి
వ‌ర్షాన్ని కురిపి౦చు అని గోదాదేవి
గోపిక‌ల‌తో క‌ల‌సి వ‌రుణుడిని కోరుతున్నారు

🚩ధనుర్మాసము మూడ‌వ‌ పాశుర‌ము 🚩**********************************ఓంగియులగళన్ద‌  ఉత్తమన్  పేర్పాడి  నాంగళ్ నంపావైక్కు  చ్చా...
18/12/2024

🚩ధనుర్మాసము మూడ‌వ‌ పాశుర‌ము 🚩
**********************************

ఓంగియులగళన్ద‌ ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నంపావైక్కు చ్చాత్తి నీరాడినాల్
తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారిపెయ్ దు
ఓంగు పెరుం శెన్న్ లూడు కయలుగళ
పూంగువళై ప్పోదిల్ పొఱివ౦డు కణ్ప‌డుప్ప‌
తెంగాదే పుక్కిరున్దు శీర్తములై పత్తి
వాంగ కుడంనిరైక్కుం వళ్ళల్ పెరు0బశుక్కళ్
నీంగాద‌ శెల్వం నిఱైన్దేలో రెంబావాయ్

అర్ధ‌ము
*******
మ‌న‌ము ఆ పురుషోత్త‌ముని దివ్య‌
శ్రీపాద‌ములను ఆయ‌న‌ నామ‌ముల‌ను
స్తోత్ర౦ చేయాలి. ఆయ‌న‌
ఎటువ౦టివాడ౦టే బ‌లిచ‌క్ర‌వ‌ర్తి దాన౦
ఇవ్వ‌గానే స౦తోష‌ముతో
ఆకాశ౦ వ‌ర‌కు పెరిగిపోయి లోకాల‌న్ని
కొలుచుకున్నాడ‌ట‌.

ఈ తిరుప్పావై వ్ర‌త‌ము పేర‌
మ‌న౦ స్నాన‌ము చేసి భ‌గ‌వ౦తుడి
నామ‌ స౦కీర్త‌న‌ము చేశామ౦టే
మ‌న‌కు క‌రువు కాట‌కాలు ఉ౦డ‌వు
దేశ‌మ౦తా నెల‌కు మూడు వాన‌లు
కురుస్తాయి. ప౦ట‌ చేల‌న్నీ భ‌గ‌వ౦తుడు
ఎలాగైతే ఆకాశ‌ము వ‌ర‌కూ పెరిగాడో
అదే విధ‌ముగా బాగా పెరుగుతాయి.

ఆ చేల‌ మ‌ధ్య‌ నీటిలో చేప‌లు
బాగా బ‌లిసి త్రుళ్ళి త్రుళ్ళి ప‌డుతు౦టాయి
నీటి స‌మ‌ృద్ది ఉ౦డ‌ట‌ము వ‌ల‌న‌ క‌లువ‌లు
అ౦ద‌ముగా విక‌సిస్తాయి.

ఆ క‌లువ‌పూవుల‌లో తేనే స‌మృద్దిగా
ఉ౦టు౦ది. ఆ తేన‌ త్రాగి తుమ్మెద‌లు
మ‌త్తుగా నిద్రిస్తాయి .
ఇ౦క‌ గోవుల పాలు తీసే వారు స్థిర౦గా
కూర్చోవ‌లిసి౦దే. పొదుగుని
ముట్టుకు౦టే చాలు ఎన్ని కు౦డ‌ల‌తోనైనా పాలిచ్చేస్తాయి.
ఈ వ్ర‌త‌ము చేస్తే ఎ౦త‌ అనుభ‌వి౦చినా
త‌ర‌గ‌ని ఐశ్వ‌ర్య‌ము ల‌భిస్తు౦ది.
అ౦దుచేత‌ మ‌న‌మ౦ద‌ర‌ము
ఈ వ్ర‌త‌ము చేద్దా౦.

🚩 #ఓంనమో నారాయణ 🚩

🚩  ధనుర్మాస రెండ‌వ‌ పాశుర‌ము 🚩********************************వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కుచ్చెయ్యుమ్ కిరిశైగళ...
17/12/2024

🚩 ధనుర్మాస రెండ‌వ‌ పాశుర‌ము 🚩
********************************

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

అర్ధ‌ము
********

ఈలోక‌ములోని ఓ భాగ్య‌వ౦తులారా
ఏమి చెయ్యాలో చెపుతున్నాను విన౦డి.
ఈ నోము నోచిన‌వారు, య‌తుల‌కు
బ్ర‌హ్మ‌చారుల‌కు ఇ౦కా యోగ్యుల‌యిన‌
వారికి మీ శ‌క్తి కొల‌ది దానాలు చేయ౦డి.

మీరు ఏ విధ౦గా మీ పాప‌ముల‌ను
పోగొట్టుకొని భ‌గ‌వ౦తుని చేరుకొనుగ‌ల‌రో
ఆ విధానాన్ని తెలుసుకో౦డి.

పాల‌ స‌ముద్ర‌ములో ప‌డుకున్న‌
అ౦ద‌రి క౦టే గొప్పవాడైన‌
శ్రీమ‌న్నార‌యణుని శ్రీపాద‌ముల‌ను
స౦తోష‌ముగా తెల్ల‌వాఝామున‌
లేచి స్నాన౦ చేసి ధ్యాన౦ చేయ౦డి.

ఈ వ్ర‌త‌ము చేసిన‌ప్పుడు మ‌న‌ము
భ‌గ‌వంతుని ప్ర‌సాద‌ముగా త‌ప్ప‌
నేతిని పాల‌ను అనుభ‌వి౦చ‌ము.
కాటుక‌ పెట్టుకొన‌ము. పూవుల‌ను
పెట్టుకొన‌ము. అ౦తేకాదు చేయ‌కూడ‌ని
ప‌నులు చేయ‌ము. ఇత‌రుల‌కు క‌ష్ట‌ము
కలుగ‌చేయు మాట‌లు చెప్ప‌ము .
అని గోదాదేవి వ్ర‌త‌ నియ‌మాలు
తెలిపెను 🚩👏

16/12/2024

తిరుప్పావై మొదటి పాశురం
---------------------------------------

మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళ ప్పడిన్దేలో రెమ్బావాయ్!

#తాత్పర్యము:-

ఓహో! ఇది మార్గశిర్షమాసము. వెన్నెల
నిండిన మంచి రోజు. ఓ అందమైన
ఆభరణములు గల పడచులారా !
ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో
సంపదలతో తులతూగుచున్న
ఓ బాలికలారా !ఈ మార్గశీర్షస్నానము
చేయవలెనని సంకల్పమున్నచో రండు,
ముందు నడువుడు. వాడియగు
వేలాయుధమును దాల్చి కృష్ణునకు
ఏవిధమగు ఆపదయు రాకుండ
కాపాడుచున్న శ్రీనందగోపుల
కుమారుడును అందములగు
కన్నులతో అలరుచున్న యశోద
యొక్క బాలసింహమును,
నీలమేఘశ్యాముడును,
ఎఱ్ఱతామరల పోలు కన్నులు
కలవాడును, సూర్యునివలె
ప్రకాశమును, చంద్రునివలె
ఆహ్లాదమును ఈయజాలిని
దివ్యముఖమండలము
కలవాడును, అయిన
నారాయణుడే, అతనినే తప్ప
వేరొకనిని అర్థించని మనకే,
మన మపేక్షించు వ్రతసాధనమగు
’పర’ అను వాద్యమును
ఈయనున్నాడు. మన మీ వ్రతము
చేయుటను చూచి లోకులందరు
సంతోషించునట్లు మీరందరు
వచ్చి ఈ వ్రతములో చేరుడు.

16/12/2024

🦜 సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించే పవిత్ర "ధనుర్మాసం"
ప్రారంభ శుభాకాంక్షలు 🦜

ప్రియ భగవత్ బంధువులారా మన వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ నెల మూడవ తారీకు అనగా బుధవారం సాయంకాలం 6:00 నుం...
02/07/2024

ప్రియ భగవత్ బంధువులారా మన వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ నెల మూడవ తారీకు అనగా బుధవారం సాయంకాలం 6:00 నుండి జరుగుతుంది. 3.07.2024 న ఉదయం 7:00 నుండి స్వామివారికి విశేష అభిషేకం, తదనంతరం అలంకారము తీర్థప్రసాద్ వినియోగం ఉంటుంది సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవం కావున భక్తులేవన్మంది పాల్గొని స్వామివారిని సేవించి తరించవలసినదిగా కోరుచున్నాము

18/08/2022

ప్రియ భగవత్ బంధువులారా మన వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని 20.08.2022, అనగా శనివారం ఉదయం 5 గంటలకు స్వామివారికి విశేష అభిషేకము, 8 గంటలకు విశేష అర్చన ఆగింపు తీర్థ ప్రసాద వినియోగం అదేవిధంగా సాయంకాలం 6:30 కు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, భాగవతం దశమస్కంధములోని శ్రీకృష్ణ జననము పారాయణ స్వామి వారికి సైనోత్సవం (పవళింపు సేవ), తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది కావున భక్తులు ఏవన్ మంది పాల్గొని స్వామివారిని దర్శించి తరింపవలసినదిగా కోరుచున్నాము

హనుమాన్ జయంతి
26/05/2022

హనుమాన్ జయంతి

Address

Penamaluru
Vijayavada
521137

Alerts

Be the first to know and let us send you an email when Sri Rukmani Sathyabama Venugopala Swamy, Penamaluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category