Telugu Baptist Church Vadlamudi

Telugu Baptist Church Vadlamudi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Baptist Church Vadlamudi, Church, Vadlamudi.

03/11/2024
*✝️పరిశుద్ధమైన జనము✝️**GOSPEL LIGHT 05-09-2021* మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తెలుగు బాప్టిస్టు సంఘ విశ్వాసులు అందరిక...
05/09/2021

*✝️పరిశుద్ధమైన జనము✝️*
*GOSPEL LIGHT 05-09-2021*

మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తెలుగు బాప్టిస్టు సంఘ విశ్వాసులు అందరికీ మిత్రులందరికీ పరిశుద్ధ ఆదివారపు శుభవందనాలు!

*సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా౹*
*నిర్గమకాండము 19:6*

ప్రియదేవుని బిడ్డలారా, నేడు మీరు దేవునికి పరిశుద్ధమైన జనముగా ఉండాలని ప్రభువు మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, "..మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు'' నిర్గమకాండము 19:6.

చీకటి సమయాలలో దేవుని మహిమాన్వితమైన ముఖకాంతిని మీపై నిరంతరం ప్రకాశింపజేస్తాడని గుర్తుంచుకోండి. ఆయన తగిన సమయములో మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. మీరు సర్వోన్నతుడైన దేవునికి పరిశుద్ధ జనముగా ఉండటము వలన ఎత్తైన ఎతున్తకు ఎదగాలని మీ పట్ల ఆయన కోరిక కలిగియున్నాడు.

ఇటువంటి ఆశీర్వాదములను పొందుకొనుటకు మీరు వేచియున్నారా? మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏవైన సరే, ఆశీర్వాదములను పొందలేదని మీరు నమ్మకాన్ని కోల్పోయారా? మీరు ఎదుర్కొంటున్న అవమానమును భరించలేకపోవుచున్నారా?

ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడే యేసు వైపు మీ దృష్టిని మరలించండి. హాగరు ఎడారిలో తన కుమారుని దాహాన్ని తీర్చడానికి కేవలం కొన్ని గ్లాసుల మంచి నీటి కోసం అలమంటించెను.

కానీ, సమృద్ధిగా నీటి సరఫరాను ఇచ్చు ఒక నీటిబుగ్గను చూచునట్లుగా దేవుడు ఆమె కళ్ళను తెరిచాడు. అదే దేవుడు నేడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మీరు దేని నిమిత్తము నిరాశపడవద్దు!

ప్రియులారా, దేని నిమిత్తము మీరు నిరాశపడవద్దు, మీ నమ్మకాన్ని కోల్పోవద్దు, సంతానము లేని జంటలు దేవుడిచ్చే బహుమతియైన పిల్లలతో ఆశీర్వదింపబడతారు. బైబిల్లో హన్నా కన్నీటి ప్రార్థనను విన్న దేవుడు నేడు ప్రభువు కొరకు నిలబడే శక్తివంతమైన సంతతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

మీ పిల్లలను మరియు మీ సంతతి సంతతి దేవుని మహిమ కోసం నక్షత్రాల వలె ప్రకాశించుట మీరు చూచెదరు. ఒకవేళ మీ పిల్లలు మీకు అవిధేయులుగా ఉన్నారా? లేక అంగవైకల్యం ఉన్న పిల్లలతో ఉంటూ కన్నీరు కార్చుచున్నారా?

నిరాశపడవద్దు, దేవుడు మీ కన్నీళ్లను తుడిచివేసి, మీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడని నేను మిమ్మల్ని ధైర్యపరచుచున్నాను. కాబట్టి, ధైర్యముగా ఉండండి. మన ప్రభువు ఆశించిన రీతిగా మీరు పరిశుద్ధమైన జీవితమును జీవించుచున్నారా?

ఈ క్షణము మొదలుకొని మీ దుష్ట మార్గములను వదలుకొని, నీతి మార్గములో నడుచుటకు సహాయము చేయునట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క దివ్యమైన సహాయము కొరకు ప్రార్థించండి. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో పరిశుద్ధ జీవితమును జీవించగలరు.

మీ శరీరములను ఆయనకు సజీవయాగముగా సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా, సమస్త జనములలో మిమ్మల్ని దేవునికి యాజక రూపకమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జనము గాను మార్చి, అనేకులకు దీవెనకరముగా మారుస్తాడు.

*🛐ప్రార్ధన:* మహా ఘనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు' అని లేఖనము సెలవిచ్చినట్లుగా, నేడు మాకు కూడ ఈ పరిశుద్ధమైన జీవితమును అనుగ్రహించుము.

దేవా, నీవు మా పట్ల చూపించిన ప్రేమ ఎనలేనిది. కాబట్టి, మేము కూడ నీ ప్రేమను పొందుకొని జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా పట్ల నీవు కలిగియున్న ఉద్దేశమును మాకు కనుపరచుము. ఒకవేళ మేము వంకర మార్గములో వెళ్లుచున్నట్లయితే, నేడు నీవు మమ్ములను సరియైన మార్గములో నడిపించుము.

దేవా, నేడు మా పాపములను నీ కుమారుని పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి మమ్మును పరిశుద్ధ జనముగా మార్చుము. తద్వారా మేము నీ యొద్ద గుప్తములై యున్న సమస్త ఆశీర్వాదములను పొందుకొనుటకు సహాయము చేయుము.

మా ద్వారా అనేకులు ఆశీర్వదింపబడునట్లు చేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక!

దైవాశీర్వాదాలతో!!

*క్రీస్తు పరిచర్య లో నిరంజన్ పాస్టర్ 9949787221*
💐💐✝️💐💐✝️💐💐✝️💐💐

Address

Vadlamudi
522213

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Baptist Church Vadlamudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category