శ్రీశ్రీశ్రీ సచ్చిదానoద సరస్వతీ తాండవ కాశీ క్షేత్రం, తపోవనము, తుని

  • Home
  • India
  • Tuni
  • శ్రీశ్రీశ్రీ సచ్చిదానoద సరస్వతీ తాండవ కాశీ క్షేత్రం, తపోవనము, తుని

శ్రీశ్రీశ్రీ సచ్చిదానoద సరస్వతీ తాండవ కాశీ క్షేత్రం, తపోవనము, తుని Sri Sri Sacchidananda Saraswati Swamiji -Tapovanam, Tuni ⭐

తెలంగాణ బ్రాహ్మణ అఫిషియల్ మరియు వృత్తి నిపుణుల సంక్షేమ అసోసియేషన్, హైదరాబాద్ వారు  మిక్కిలి భక్తిభావంతో  సిద్ధి పొందిన ప...
15/03/2026

తెలంగాణ బ్రాహ్మణ అఫిషియల్ మరియు వృత్తి నిపుణుల సంక్షేమ అసోసియేషన్, హైదరాబాద్ వారు మిక్కిలి భక్తిభావంతో సిద్ధి పొందిన పరమహంస పరివ్రా జకచార్య శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి, ధర్మపురి, తుని పీఠాధిపతుల దివ్య ఆశీస్సులందిస్తున్న చిత్రంతో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం మనోహరంగా ప్రచురించారు.

ఈ పుస్తకాన్ని 14.3.2026 న స్వామివారి ప్రథమ మాసోత్స్వం సందర్భంగా రిటైర్డ్ ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శర్మ గారు తపోవనం లో ఆవిష్కరించారు.

శ్రీ స్వామి వారి పట్ల అసోసియేషన్ అధ్యక్షులు సుశీల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తదితర సభ్యులు చూపిన భక్తి భావం ప్రశంసనీయం అన్నారు.

స్వామి వారు సిద్ధి పొందినా ఆయన ఆశీస్సులు సదా ఉంటాయని, ఆశయాలు కొనసాగిస్తామన్నారు.

🙏 శ్రీ శ్రీ  సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి మాసారాధన ఆహ్వానం 🙏​ధర్మపురి శ్రీ మఠం మరియు తుని తపోవనం పీఠాధిపతులు, బ్రాహ్మీ...
11/03/2026

🙏 శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి మాసారాధన ఆహ్వానం 🙏

​ధర్మపురి శ్రీ మఠం మరియు తుని తపోవనం పీఠాధిపతులు, బ్రాహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి పవిత్ర మాసారాధన కార్యక్రమానికి భక్తులందరికీ ఇదే మా సాదర ఆహ్వానం.

​ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము.

​📅 కార్యక్రమ వివరాలు:
​సందర్భం: ఫాల్గుణ ఏకాదశి
​తేదీ: శనివారం, మార్చి 14, 2026
​వేదిక: తాండవ కాశీ క్షేత్రం, తుని తపోవనం
​స్వామి వారి బోధనలను, వారి ఆశయాలను స్మరించుకుంటూ ఈ పవిత్ర కార్యక్రమంలో అందరం భాగస్వాములమవుదాం.

🌺Invitation to the Sacred Maasaradhana of Sri Sri Sachidananda Saraswati Swamiji🌺

🙏 ​We cordially invite all devotees to participate in the divine Maasaradhana Program of the late Brahmi-bhuta Sri Sri Sachidananda Saraswati Swamiji, the Peethadhipathi of Dharmapuri Sri Matham and Tuni Tapovanam.

​Join us in this spiritual gathering to offer our prayers and seek the blessings of the Guru.

​📅 Event Details:
​Occasion: Phalguna Ekadashi
​Date: Saturday, March 14, 2026
​Location: Tandava Kashi Kshetram, Tuni Tapovana

​Let us come together to honor the legacy and teachings of Swamiji at this sacred venue.

🌺🌼🌺
01/03/2026

🌺🌼🌺

శ్రీ గురుభ్యోనమః 🙏 రేపే శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవం!​పరమహంస పరివ్రాజకులు, ధర్మపురి శ్రీ మఠం మరియు తుని తపోవనం పీఠాధీశ...
23/02/2026

శ్రీ గురుభ్యోనమః 🙏 రేపే శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవం!

​పరమహంస పరివ్రాజకులు, ధర్మపురి శ్రీ మఠం మరియు తుని తపోవనం పీఠాధీశ్వరులు, బ్రహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి ఆరాధన కార్యక్రమం రేపు (ఫాల్గుణ శుద్ధ నవమి) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతోంది.

​🗓️ తేదీ: 25-02-2026 (బుధవారం)
📍 స్థలం: తాండవ కాశీక్షేత్రం, శ్రీ సచ్చిదానంద తపోవనం, తుని, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్..

​భక్తులందరూ ఈ పవిత్ర ఆరాధన మహోత్సవంలో పాల్గొని, గురుదేవుల కృపకు మరియు ఆశీస్సులకు పాత్రులు కాగలరని మనవి.
ఓం నమః శివాయ!

శ్రీ గురుభ్యోనమః 🙏హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో ఆదివారం నాడు బ్రహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి ...
23/02/2026

శ్రీ గురుభ్యోనమః 🙏
హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో ఆదివారం నాడు బ్రహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి 'సంస్మృతి సభ' అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. మంత్రులు, ప్రముఖులు, మరియు ఎందరో భక్తులు విచ్చేసి గురుదేవులకు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవుల ఆశీస్సులు సదా మనందరిపై ఉండుగాక! ఓం శాంతి!

🙏🌺🙏
22/02/2026

🙏🌺🙏

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా...
21/02/2026

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు తపోవనం ఆశ్రమాన్ని సందర్శించి బృందావనం ప్రాంతంలో విశేష పూజలు నిర్వహించారు.

మఠాధిపతులవారితో శ్రీ చరణులకు ఉన్న అనుబంధాన్ని వారి శిష్యులతో పంచుకున్నారు.


వరంగల్ భక్తమండలి తరపున ఆహ్వానం - (హైదరాబాద్ లో)​ఓం నమః శివాయ 🙏మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్...
20/02/2026

వరంగల్ భక్తమండలి తరపున ఆహ్వానం - (హైదరాబాద్ లో)

​ఓం నమః శివాయ 🙏

మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి "సంస్మృతి సభ" ఈ ఆదివారం (22-02-2026) ఉదయం 10:00 గంటలకు హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో జరగనుంది.

​స్వామివారికి భక్తిపూర్వకంగా నివాళులర్పించే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వరంగల్ భక్తమండలి తరపున భక్తులందరికీ సవినయ ఆహ్వానం. దయచేసి అందరూ విచ్చేసి గురు కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.

శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవ ఆహ్వానం 🙏​పరమహంస పరివ్రాజకులు, ధర్మపురి శ్రీ మఠం మరియు తుని తపోవనం పీఠాధీశ్వరులు, బ్రహ్మీభ...
20/02/2026

శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవ ఆహ్వానం 🙏
​పరమహంస పరివ్రాజకులు, ధర్మపురి శ్రీ మఠం మరియు తుని తపోవనం పీఠాధీశ్వరులు, బ్రహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామివారి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడుతున్నది.

​🗓️ తేదీ: 25-02-2026 (ఫాల్గుణ శుద్ధ నవమి)
📍 స్థలం: తాండవ కాశీక్షేత్రం, శ్రీ సచ్చిదానంద తపోవనం, తుని.

​భక్తులందరూ ఈ పవిత్ర ఆరాధన కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి దివ్య ఆశీస్సులు మరియు కృపకు పాత్రులు కాగలరని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ!

​Invitation to Sri Swamiji's Aradhana Programme 🙏

​We cordially invite all devotees to attend the Aradhana Programme of Paramahamsa Parivrajakacharya, Dharmapuri Sri Matham and Tuni Tapovanam Peethadhipati, Bramhibhootha Sri Sri Sri Sacchidananda Saraswati Swamiji.
​🗓️ Date: 25th February 2026 (Phalguna Shuddha Navami)

📍 Venue: Sri Sacchidananda Tapovanam, Tandavakashi Kshetram, Tuni.

​Please join us in offering our prayers and seeking Swamiji's divine blessings. Om Namah Shivaya!

Address

Sri Saccidananda Saraswathi
Tuni
533401

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీశ్రీశ్రీ సచ్చిదానoద సరస్వతీ తాండవ కాశీ క్షేత్రం, తపోవనము, తుని posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category