Sree Sita Ramachandra Devastanam

Sree Sita Ramachandra Devastanam Located in Patha Tiruvuru, Tiruvuru Mandal, Krishna District.

ముక్కోటిఏకాదశి  ఉత్తర ద్వార దర్శనం
12/01/2022

ముక్కోటిఏకాదశి ఉత్తర ద్వార దర్శనం

02/09/2019

గుక్కతిప్పుకోకుండా క్రిందదంతా చదవాలి :)

🥀
ఇట్లు దానవేంద్రుండు పరిగ్రుహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును,రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును,వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును ,తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నయి విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి హరి నిందు జూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రసస్తం బగు హస్తంబున సభామండప స్థంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలును మిణుగురులు సెదర జిటిలి పెటిలి పడి బంభాజ్యమానం బగు న మ్మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహా బలాహక వర్గ నిర్గత నిబిడ నిష్టుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన చట చ్చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానంబులై ఎగసి యాకాస కుహరాన్తరాళమ్బు నిరవకాసంబు సేసి నిండినం బట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవసంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా బ్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాన్కుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంభరాభర దౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినిధర కూర్మ కులశేఖరుండును దుగ్ద జలధి జాత శుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళున్డును ఘన ఘణాయమాన మణికిన్కినీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేసుండును , నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును , కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును , దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రయామాస , రక్షో రాజ వక్షో భాగ విసంకటక్షేత్ర విలేఖన చుంచులాంగాలాయమాన ,ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును , శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగా మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన , మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళున్డును , మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భుషితుండును , త్రివళియుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కన్ధరుండును ,ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశా సంచలితాధరుండును . శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును , కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజ్రుమ్భమాణ సప్తజిహ్వ జిహ్వా తులిత తరళ తరాయమాన విబ్రాజమాన జిహ్వుండును , మేరు మందర మహా గుహాన్తరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును , నాసికా వివర నిస్సర న్నిబిడ నిస్స్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును , పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సద్రుక్ష సమంచిత లోచనుండును , లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగా వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును శక్ర చాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును , ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును , సంధ్యారాగ రక్త దారధరమాలికా ప్రతిమ మహా బ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును ,సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును , నిష్కంపిత శంఖ పర్ణా మహోర్ద్వకర్ణుండును , మన్ధదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శికరాకార భాసుర కేసరుండును , పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తనూరుహున్డును , నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావత సార్వభౌమ ప్రముఖ ధిగిభరాజ కర్ణ కోటరుండును , ధవళ ధరాధర దీర్ఘదురవలోకనియ దేహుండును , దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపన్ధి యాతుదాన నికురుంబ గర్వాంధకారుండును , బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును , మహా ప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుం డావిర్భవిన్చినమ్ గనుంగొని..........
🥀
పోతన పోతనే... భాగవతం భాగవతమే... తెలుగు తెలుగే!! తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 🙏🙏💐💐

27/08/2019

దాశరథీ శతకం

🍁🍁🍁🍁

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ
కోదండకళాప్రచండ
భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ
నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.
34

భావం: యుద్ధమునందు భయంకరుడు, దుఃఖితులకు జుట్టము, ధనుర్విద్యయందును, భుజబలము నందును పేరు గన్న రాముని వంటి దేవుడింకొకడు లేడు. ఈ విషయము నేను లోకమునకు జాటెదను.

🍁🍁🍁🍁

శ్రీ సీతారామచంద్ర పాదపద్మాలకు ప్రణమిల్లుతూ....🙏

27/07/2019

శ్రీరామమంత్ర మహిమ

జయతు జయతు మంత్రం జన్మసాఫల్యమంత్రం

జననమరణభేదక్లేశ విచ్ఛేదమంత్రమ్

సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం

రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్

భావము; జన్మసాఫల్యమును కలుగజేయునదియు, జనన మరణ రూప సంసార దుఃఖమును, భేదభావమును నశింపజేయునదియు, సమస్త వేదములందును, శాస్త్రములందును ప్రతిపాదింపబడినదియు, రఘుపతిని గూర్చినట్టియు అయిన రామ, రామ అను మంత్రమునకు జయమగు గాక!

15/07/2019

దశావతారాల ఆవిర్భావం ఏమాసాలలో జరిగింది వారిజయంతి వివరాలు...

1 మత్స్యజయంతి ;-చైత్ర శుద్ధ పంచమి అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ లో వస్తుంది)

2 కూర్మజయంతి ;-జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్ లో వస్తుంది)

3 వరాహ జయంతి;-చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది.

4 నరసింహ జయంతి ;-వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష కాలంలో జరిగింది

5 వామన జయంతి;-భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్నంలో అభిజిత్ లగ్నంలో జరిగింది

6 పరుశురామ జయంతి;-వైశాఖ శుద్ధ తదియనాడు సాయంకాలం 6 నుండి 9 గంటల మధ్య జరిగింది

7 శ్రీరామ జయంతి ;- (శ్రీరామనవమి)శ్రీరాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నాం 12 గంటలకు కర్కాటలగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మిచాడు కావున శ్రీరామ నవమి ఎప్రియలో ఆచరించాలి.

8బలరామ జయంతి;-భాద్రపద శుద్ధ తదియ నాడు మధ్యాహ్నం అవతారం జరిగింది

9 శ్రీకృష్ణ జయంతి ;-శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి మధురలో రోహిణి నక్షత్రం వృషభలగ్నంలో జరిగింది(19-7-3227 బి .సి)

10 బుద్ధజయంతి వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు జరిగింది

11 కల్కిజయంతి;-వైశాఖ శుద్ధ తదియ ప్రదోష సమయంలో కల్కి అవతారము జరిగింది
ఆధార గ్రంధము సూర్య సిద్దాంతము.( ఇది ఈ గ్రంథ ఆధారంగా చెప్పబడినది కానీ ఈ ప్రస్తావన ఇంక ఎక్కడా లేదు).

04/07/2019

శ్రీరాముని అనుగ్రహానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా ?

ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందపడుతున్న ఆ పెద్దాయన పేరు జగర్లపూడి లక్ష్మీనారాయణ గారు.గొప్ప రామభక్తులు, సంగీతాభిమాని. ఉండేది హైదరాబాద్ లో.ఆయన కోరిక ప్రకారం,ఆయన కూతురు శ్రీమతి ప్రసన్నలక్ష్మి,ఆయనను సద్గురు శ్రీత్యాగరాజస్వామివారి ఊరు తిరువైయారు తీసుకు వెళ్ళారు.

ఆరోజు శివరాత్రి పర్వదినం.అక్కడ,కావేరీ తీరంలోని త్యాగయ్యగారి సమాధి దగ్గర,శివరాత్రి రోజు ఇరవైనాలుగు గంటలపాటు విద్వాంసులంతా చేరి,త్యాగరాజ కీర్తనలను(పాడిన కీర్తన పాడకుండా) పాడటం ప్రతియేడూ ఆనవాయితీ.త్యాగయ్యగారి ఎన్నో అపురూప రచనలు గానంచేశారు గాయక బృందం.ఆరోజు ఆ కార్యక్రమాన్ని శ్రవణం చేసి,తదుపరి మదురై చేరుకొని,అక్కడ మీనాక్షమ్మను దర్శించుకొన్నారు.త్యాగయ్యగారి తంబురా,పాదుకలు ఆ ఊరిలోని సౌరాష్ట్ర కాలనీలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉన్నాయని విని,అక్కడికి వెళ్ళారు.

అక్కడ అంతా గుజరాతీ వారే...త్యాగయ్యగారి తంబురా, వారి ప్రధాన శిష్యులైన వాలాజీపేట వేంకటరమణ భాగవతార్ గారికి సంప్రాప్తించింది.సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన వాలాజీపేటవారి కుటుంబం,ఔరంగజేబు కాలంలో,తమిళనాట మదురైకి వలస వచ్చింది.అందుచేత,మదురైలోని సౌరాష్ట్ర భవన్లో త్యాగయ్యగారి తంబురా,వాలాజీపేట వేంకటరమణ భాగవతులుగారి తంబురాలను ఒక అద్దాల బీరువాలో ప్రస్తుతం భద్రపరచారు.ఎవరైనా వస్తే, వాటిని మ్యూజియంలోని అపురూప వస్తువులుగా దర్శించవలసిందే..అలాగే జగర్లపూడివారి కుటుంబమూ వాటిని దర్శించారు.

అయితే..ఆ తంబురాను ఒక్కసారి తాకే అదృష్టం కలిగితే బాగుండునని ఎంతో ఆశపడ్డారు లక్ష్మీనారాయణగారు.కనులు మూసుకొని,త్యాగయ్యగారిని తలచుకొని,మనసులోనే తన కోరిక విన్నవించుకున్నారు.

ఇంతలో ఒక వయోవృద్ధులు అక్కడికి వచ్చి,లక్ష్మీనారాయణగారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఒక్క క్షణమాగి,'మీరు ఆ తంబురా చూస్తారా?' అంటూ తమిళంలో ప్రశ్నించి, అక్కడివారితో చెప్పి,తాళంచెవులు తెప్పించారు.తానే స్వయంగా బీరువా తాళాలు తీసి,త్యాగయ్యగారి తంబురాను చేతికిచ్చారు.
అంతా స్వప్నంలా కనబడింది లక్ష్మీనారాయణగారి కుటుంబానికి!... వెంటనే ఆనందంగా చేతిలోకి తంబురాను తీసుకొని,కళ్లకద్దుకొన్నారు.'ఎవరూ వినని వేలాది కృతులను సైతం త్యాగయ్యగారి నోట అతి దగ్గరగా విన్న ఆ తంబురా ఎంత పుణ్యం చేసుకుంది?...అది చేతిలో తీసుకోవటానికి నేనెంత పుణ్యంచేసుకున్నానో!'...తన జన్మ ధన్యమైనదని భావించారు లక్ష్మీనారాయణ గారు.

ప్రతిరోజూ ఆ రెండు తంబురాలకూ హారతి ఇస్తారు అక్కడివారు!
త్యాగయ్యగారు వ్రాసిన గేయనాటకాలు,ఇంకా అనేక వ్రాతప్రతులూ అక్కడ 'సౌరాష్ట్ర భవన్'లో రహస్యంగా భద్రపరచబడి ఉన్నాయని విన్న లక్ష్మీనారాయణగారికి, అవి మాత్రం చూపడానికి వారు నిరాకరించారు.'అవి ఇక్కడ లేవ'ని సమాధానం చెప్పారు.

త్యాగయ్యగారి పాదుకలను దర్శించి,నమస్కరించుకొన్నారు జగర్లపూడివారి కుటుంబం.

ఆ తరువాత తంబుర ఇచ్చిన వయోవృధ్ధుని కోసం ఎంతవెదకినా మరల దర్శనం కలుగలేదు....

మరి ఆ వచ్చిన వారు ఎవరైయ్యుంటారు ?

శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తతుల్యం
శ్రీ రామ నామ వరాననే

జై శ్రీరామ్

25/06/2019

శ్రీ రామ మంత్ర స్తొత్రం::

నిఖిల నిలయ మంత్రం నిత్య తత్వాఖ్య మంత్రం
భవకులహరమంత్రం భూమిజ ప్రాణ మంత్రం
పవనజ సుత మంత్రం పార్వతీ మోక్షమంత్రం
పశుపతి నిజమంత్రం పాతుమాం రామ మంత్రం ||

ప్రణవనిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం
ప్రకృతిపురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రం
ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం ||

దశరథ సుత మంత్రం దైత్య సమ్హార మంత్రం
విబుధ వినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రం
మునిగణ నుత మంత్రం ముక్తిమార్గైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామరామేతి మంత్రం ||

సంసార సాగర భయాపహ విశ్వ మంత్రం
సాక్షాన్ముముక్షు జన సేవిత సిద్ధ మంత్రం
సారంగ హస్తముఖ హస్తనివాస మంత్రం
కైవల్య మంత్రం అనిశం భజె రామ మంత్రం ||

జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ ఖేద క్లేశ విఛ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం ||

ఇహశ్లోక పంచకమిదం నిత్యహ్ పఠేత్
నిత్యం ప్రభాత సమయే పురుషహ ప్రబుదాహ
శ్రీ రామ కింకర జనేషు స ఏవ ముఖ్యో
భూత్వాప్రయాతి హరిలోక మానన్యలభ్యమ్ ||

22/06/2019

రోగ నిరోధక మంత్రాలు,...సాధనలు..

ఈ రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయి అని ఇప్పుడు వారు ఎగతాళి చేయవచ్చు, కానీ నిజం రోగ నిరోధక మంత్రాలు కచ్చితంగా ఉంటుంది , అసలు మంత్రం అనేది ఎలా నిర్మించ బడినది ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా పనిచేసే విధంగా నిర్మించ బడినది, మంత్రం చదివే టప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనో ధైర్యం, బలం లభిస్తుంది..

ఒకప్పుడు వైద్యులు ఔషధం తో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు, తెలు మంత్రం పాము మంత్రం తో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు.. ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము...

1. నారాయనీయం (ఇది గురువాయురు కృషుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన ) ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశించి పోతుంది ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, కృషుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది... చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..

2. వైద్యనాద్ స్త్రోత్రం శివయ్య గొప్ప వైద్యుడు కూడా పురాణ కాలం నుండి వైద్యంకోసం శువుని ఆరాధించే వారు, చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు ప్రదోష కాలంలో ఈ వైద్యనాద్ స్త్రోత్రం, శివ స్త్రోత్రలు పారాయనఁ ప్రతి రోజు చేయాలి, సోమవారం నాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అబీషేకం చేయాలి, ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలం లో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి హారతి ఇవ్వాలి ,కాసేపు ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించ మని వేడుకోవాలి, ప్రసాదం తినే టప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి.. తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి చెరువు అయినా పర్వాలేదు... అలా నిమర్జన చేయడంలోనే మీకు మీ బాధ నుండి చాలా ఉపశమనం లభిస్తుంది.. ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి మీకు పూర్తి 75గ్యం లభించాక శివాలయంలో అభేషేకం చేయించండి...

3. చిన్న చిన్న వి తరచూ వచ్చే జ్వరాలు , కీళ్ల నొప్పులు, ఊబకాయం , తిన్నది అరగక పోవడం, ఓల్లుకు పట్టక పోవడం, తరచు నీరసం లాంటి కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి ప్రదర్శన, హనుమాన్ చాలీసా రోజు చదవడం....

4. రాహుకాలం లో దుర్గ దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కళభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండదు,.

5. ఏ ఔషధం సేవిస్తున్న "ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.....

6.మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది ఎవరికి భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజుల్లో... అంటే రోజూ ఐదు తులసి ఆకులు తినండి, కాసేపు తులసికి దగ్గరగా కూర్చింది తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది, రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది , ఇలాగే ఆవు కూడా అవకాసం ఉన్న వారు కాసేపు గోసాలలో గడపండి..
{వైద్యం చేయించు కుంటూ ఇవి పాటిస్తే త్వరగా గుణం ఉంటుంది మానవ ప్రయత్నం మానకూడదు దైవ బలం వదులు కొకూడదు}

సేకరణ 🙏

22/06/2019

*దయచేసి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.*

రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్ . . అను అత్యంత ప్రసిద్ధమైన ఈ భజన " పండిత్ శ్రీ లక్ష్మణాచార్యుల ద్వారా రచించబడినది.

మనలో కొంత మంది పట్టభద్రులైన హిందూ విరోధుల హితాసక్తుల నుండి కొంత వరకు మార్పు చేయబడి, ఈశ్వర అల్లాతేరేనామ్, సబకోసన్మ తి దేభగవాన్ ,అని నాల్గు వాక్యములు చేర్చబడి పాడటమైనది.! గాంధీ కూడా దాన్నే అనుసరించారు.

ఆరోజు నుండీ కూడా హిందువుల మనోభావాల పై దెబ్బతీయడానికి అంకురార్పణ వేసినారు.

వాస్తవాంగా ఈ భజన మూలరూపం ఈవిధంగా యున్నది.

🌸 రఘుపతి రాఘవ రాజారామ్ ,
పతిత పావన సీతారామ్ ,
సుందర విగ్రహ మేఘశ్యామ్ ,
గంగా తుళసీ శాలీగ్రామ్ ,
భద్రగిరీశ్వర సీతారామ్,
భగత జనప్రియ సీతరామ్,
జానకీరమణా సీతారామ్,
జయ జయ రాఘవ సీతారామ్.🌸

ఇది వాస్తవమైన భజన.

సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి తెలిసేలా పంపండి. జై శ్రీరామ్

22/06/2019

నా రాముని గురించీ ఇంకా దళిత పేరు అడ్డు పెట్టుకుని,మతం మారి, కులాల గురించి మాట్లాడే కొంతమంది నీచ్, కమీనే, బోకు గొర్రె గాళ్ళకీ ఓ చిన్న వివరణ...

మా రాముడు క్షత్రీయుడు.....

రాముని చరిత్ర మాకందించింది బోయవాడు.
.. రాముని కి లోకజ్ఞానం నేర్పింది నిమ్న జాతి సుమంతుడు......

రాముని గురుపత్నీ అరుంధతీమాత మాదిగ స్త్రీ.....

రాముని నదిదాటించిన మిత్రుడు గుహుడు నిషాదుడు (జాలరి)..
...తన అకలి తీర్చిన కోయ జాతి స్త్రీని శబరి మాతా అన్నాడు మా రాముడు...

క్షుద్ర పక్షి జఠాయువు ని తోడబుట్టినదాన్ని గా స్వీకరించి మోక్షం ఇచ్చాడు మా రామచంద్రుడు.....

వనచరులనే (షెడ్యూల్ ట్రైబ్) సహచరులుగా చేసుకుని ధర్మ పరిరక్షణ చేశాడు రఘురాముడు......

సేతు నిర్మాణం నిర్వహించిన రాముని సలహా దారులు నలుడు,నీలుడు వడ్డెర కులస్థులు......

నీతి తప్పిన భ్రాహ్మాణుడి పై యుద్ధ తంత్రం రచించినది శ్రీ రామచంద్ర మూర్తి గురు తుల్యుడు శ్రీ ఆది జాంబవంతుడు మాదిగ జాతి వాడు...

యుద్ధం లో లక్ష్మణుడు కి ప్రాణ దానం చేసింది గిరిజనుడైన సుశేనుడు.....

రావణసంహారానికి సహకరించినది భ్రాహ్మాణుడు.......

ధర్మ సూక్ష్మం రామునికి గుర్తు చేసినది చాకలి వ్యక్తి.......

పట్టాభిషేకానికి బంగారు సీతను తయారు చేసింది విశ్వ కర్మలు.......

మా సనాతన ధర్మం లో ఉన్న సర్వజాతి సమానత్వానికి ఇదే నిదర్శనం....... 'చెప్పు తినే కుక్క చెరకు తీపెరుగునా' ? అన్నట్లుగా ,విదేశీ కుక్క బిస్కెట్లు తిని విదేశీయుల చంకలు నాకే వారికి మా హిందూ ధర్మం మీద మొరగే వాళ్ళకి ఏం తెలుస్తుంది...ఏమైనా అంటే ఎప్పుడో ఏళ్ళ క్రితం ఉన్న అంటరానితనం గురించి పదే,పదే మాట్లాడుతూ ఉంటారు...హిందూ ధర్మంలో హిందువుగా పుట్టి మతం మారి మళ్ళీ కన్న తల్లి లాంటి ధర్మాన్నే తిట్టేవాళ్ళకి ఏం తెలుస్తుంది,ఏం చెప్తాం వాళ్ళకి???

Address

Tiruvur
521235

Website

Alerts

Be the first to know and let us send you an email when Sree Sita Ramachandra Devastanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category