Arunachalam అరుణాచలం

Arunachalam అరుణాచలం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arunachalam అరుణాచలం, Religious organisation, Tiruvannamalai.

ఓం నమో భగవతే శ్రీ రమణాయ"ఈ దేహమే నేను" అని అనుకున్నంతకాలము రాగమూ-ద్వేషమూ వుంటాయి. అప్పుడు పని చేయడం కూడా కష్టంగానే కనపడుత...
24/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

"ఈ దేహమే నేను" అని అనుకున్నంతకాలము రాగమూ-ద్వేషమూ వుంటాయి. అప్పుడు పని చేయడం కూడా కష్టంగానే కనపడుతుంది.

'ఈ దేహము నేను కాదు" అని 'సాధన' అనే వంకతో ఏ పనీ చెయ్యకుండా కూర్చుంటే, మనసు మాత్రం ఊరకే నిలకడగా ఉండగలదా?

ఓం నమో భగవతే శ్రీ రమణాయ             ఒక కలెక్టర్ :   భగవాన్! శ్రీమద్భగవద్గీతలో "స్వధర్మం, ఇతర ధర్మము లన్నింటికన్నా శ్రేయస...
24/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఒక కలెక్టర్ :
భగవాన్! శ్రీమద్భగవద్గీతలో "స్వధర్మం, ఇతర ధర్మము లన్నింటికన్నా శ్రేయస్కరం; పరధర్మం భయంకరమైనది” అన్నారు. స్వధర్మానికి అంత శ్రేష్టత ఏమి?

మహర్షి :
ఎవరైనాసరే, ఒక్కటేయైన ఆత్మను ఆధారంగా గ్రహించి, ఆత్మ నుండి చలించరాదు. 'స్వ' అంటే 'ఆత్మ' అని, 'పర' అంటే 'అనాత్మ(ఆత్మకానిది)' అని అర్థం.

స్వధర్మము అంటే ఆత్మస్థితి. ఆత్మ(స్వధర్మ)స్థితిలో ఎటువంటి కలతా, భయమూ ఉండదు. తనకు వేరుగా రెండవవాడు ఉంటేనే తంటాలు. ఆ రెండవది లేదు కనుక భయ కారణమూ లేదు.

ఇప్పుడున్న స్థితిలో వ్యక్తి అనాత్మ(ఆత్మ కానిది) ధర్మాన్ని, ఆత్మధర్మము అన్న భ్రాంతితో బాధపడుతున్నాడు. ఆత్మను తెలుసుకొని ఆత్మలోనే ఉండిపోతే అప్పుడు భయం అంతమౌతుంది. ఇక సందేహాలు మొలకెత్తవు.

ఓం నమో భగవతే శ్రీ రమణాయ    ఆత్మలేని క్షణము అంటూ లేదు. నాకు ఆత్మానుభవం కాలేదని ఏపాటి సందేహమున్నా, ఆ తలపును తొలగించుకోవడాన...
23/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఆత్మలేని క్షణము అంటూ లేదు. నాకు ఆత్మానుభవం కాలేదని ఏపాటి సందేహమున్నా, ఆ తలపును తొలగించుకోవడానికి ప్రయత్నం చేయవలెను. తలపులుపోతే మిగిలేది ఆత్మయే.

ఉదాహరణకు ఎవరికైనా చోటు ఇవ్వవలసి వస్తే అక్కడ ఉంచిన వస్తువులను తీసివేస్తే చాలు. చోటును సరిక్రొత్తగా సృష్టించవలసిన అవసరం లేదు కదా!

ఓం నమో భగవతే శ్రీ రమణాయ   14 సంవత్సరాలు గడియారంలోని ముళ్ళువలె మహర్షికి నిరంతరంగా సేవచేసి, ఆత్మసాక్షాత్కారం పొందిన అన్నామ...
23/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

14 సంవత్సరాలు గడియారంలోని ముళ్ళువలె మహర్షికి నిరంతరంగా సేవచేసి, ఆత్మసాక్షాత్కారం పొందిన అన్నామలై స్వామి ఇలా అనేవారు......

అక్షరమణమాలలో భగవాన్ రమణులు ఈ అరుణగిరి శక్తిని గురించి చెప్తూ "ఓ అరుణాచలా! అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లు నువ్వు నన్ను ఆకర్షించి నీలో కలిపేసుకున్నావు!" అని అన్నారు.

కాబట్టి ఆత్మనిష్ఠలో నెలకొని ఉన్న భగవాన్ రమణుల వంటి జ్ఞాని కూడా సాధకులను ఆకర్షించే అరుణగిరి వంటి అయస్కాంతమే.

అయస్కాంతం ఇనుముని సహజంగా ఆకర్షించినట్లు అరుణగిరి సాధకులను తన దగ్గరికి ఆకర్షించుకుని తన చుట్టూ తిరిగేలా చేస్తుంది. అరుణగిరికి ఉన్న శక్తి ఎలాంటిది అంటే "ప్రదక్షిణం చెయ్యాలనుకున్న వారిని తనంతట తానే ఆకర్షిస్తుంది."

ఒక తమిళ యోగి వ్రాసిన ఒక పద్యంలో "పువ్వు పరిమళించి సుగంధం వెదజల్లుతున్నప్పుడే మకరందం గ్రోలడానికి మధుపం(తుమ్మెద) వస్తుంది. అసలు ఆ పువ్వు వికసించకపోతే? - సుగంధం, మకరందం, మధుపం ఏమీ ఉండవు" అంటారు.

ఓం నమో భగవతే శ్రీ రమణాయ    సాధన మార్గంలో సాధకుడు జీర్ణాశయ మొదలగు శరీర అవయవాలను తొందర పెట్టకూడదు. అందుకై మితంగా హితంగా సర...
22/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

సాధన మార్గంలో సాధకుడు జీర్ణాశయ మొదలగు శరీర అవయవాలను తొందర పెట్టకూడదు. అందుకై మితంగా హితంగా సరియైన ఆహారమును నియమించుకోవలెను. యోగ సాధనకు హాని కలిగించే పదార్థాలను దగ్గరకు రానీయరాదు.

ఏదైనా ఉత్తమ దేవతామూర్తి యందుగాని, మంత్రమునందుగాని లక్ష్యాన్ని ఉంచి దానియందే మనస్సును నిశ్చలం చెయ్యివలెను. అప్పుడు మనస్సుకు సూక్ష్మమును గ్రహించు నేర్పు అలవడి లక్ష్యము నందే మనసు నిమగ్నం కాగలదు.

ఓం నమో భగవతే శ్రీ రమణాయ   ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలను గురించి ఎంత చెప్పినా ప్రయోజనం లేదనే భావనతోనే, ఎక్కువమంది ఆశ్రమవాస...
22/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలను గురించి ఎంత చెప్పినా ప్రయోజనం లేదనే భావనతోనే, ఎక్కువమంది ఆశ్రమవాసుల ముందు తాను ఈ విషయాలు మాట్లాడనని" కొందరి ముఖ్య సేవకులకు, మహర్షి సెలవిచ్చేవారు.

ఓం నమో భగవతే శ్రీ రమణాయ   మహర్షి యొక్క పాఠశాల స్నేహితుడికి, మహర్షికి జరిగిన సంభాషణ ఇలా.....         స్నేహితుడు :భగవాన్ !...
21/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

మహర్షి యొక్క పాఠశాల స్నేహితుడికి, మహర్షికి జరిగిన సంభాషణ ఇలా.....

స్నేహితుడు :
భగవాన్ ! నీకు మధురలో ఉండగా జ్ఞానోదయం అయిందన్నమాట! అవునా!

మహర్షి :
నేను ఏదో పుస్తకం చదువుకుంటుండగా ఓసారి ఊరకనే 'అరుణాచలం' నా స్మృతిలోకి వొచ్చింది. ఇక అంతే. నా వొళ్ళంతా మంటలెత్తినట్టయింది. ఆ నిమిషం నుంచి నేను సమాధిలో వున్నాను. నేను మీతో ఆడుకుంటో, మాట్లాడుతో వున్నా, సమాధిలోనే వున్నాను.

ఓం నమో భగవతే రామకృష్ణాయఒక భక్తురాలు :అమ్మా! అంతా కర్మఫలితం మూలంగానే జరుగుతుందా! శారదా దేవి :కర్మఫలం కాకపోతే మరేమిటి? ఎంత...
21/08/2026

ఓం నమో భగవతే రామకృష్ణాయ

ఒక భక్తురాలు :
అమ్మా! అంతా కర్మఫలితం మూలంగానే జరుగుతుందా!

శారదా దేవి :
కర్మఫలం కాకపోతే మరేమిటి? ఎంతో అప్రమత్తంగా జీవించాలి. ప్రతి కర్మకూ ఫలం ఉంటుంది. పరులకు దుఃఖం కలిగించడమో లేదా వారిపట్ల దురుసుగా వ్యవహరించడమో మంచిది కాదు.

ఓం నమో భగవతే శ్రీ రమణాయఉత్తమ దేవతా విగ్రహాలను ఆరాధించేవారు, ఆరాధన కొనసాగించవచ్చు. దానివల్ల మనసు ఏకాగ్రమౌతుంది. అంతట సర్వ...
21/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఉత్తమ దేవతా విగ్రహాలను ఆరాధించేవారు, ఆరాధన కొనసాగించవచ్చు. దానివల్ల మనసు ఏకాగ్రమౌతుంది. అంతట సర్వం సరి అవుతుంది.

ఓం నమో భగవతే శ్రీ రమణాయప్రశ్న :భగవాన్! భక్తి, దేహాన్ని మరపింప చేస్తుందా?మహర్షి :దేహం గురించి నీకు చింత ఎందుకు? భక్తిని అ...
20/08/2026

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ప్రశ్న :
భగవాన్! భక్తి, దేహాన్ని మరపింప చేస్తుందా?

మహర్షి :
దేహం గురించి నీకు చింత ఎందుకు? భక్తిని అభ్యసించు. అదే చాలు. దేహము ఏమైపోతుందో అని విచారపడకు.

Address

Tiruvannamalai
606603

Website

Alerts

Be the first to know and let us send you an email when Arunachalam అరుణాచలం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share