14/11/2023
🕉️🕉️🕉️💐🕉️🕉️🕉️ఓం శ్రీ బాలగురప్ప స్వామినే నమ: లంకిపల్లివారిపల్లి, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లాలో నెలకొని ఉన్న శ్రీబాలగురప్ప స్వామి వారి కొలువు నిమిత్తం తేది 16.11.2023 గురువారం శోభకృత్ నామ సంవత్సరం కార్తీక మాస శుద్ద తదియ మూలా నక్షత్రం అందు ఉదయం 7.30 గంటల నుండి 9.30 గంటల సమయంలో దేవ దేవున్ని బద్రపరచి న పెట్టె ను కొలువు కొరకు స్వాగతం పలుకుతూ దించడం ..నిర్ణయించడం జరిగింది కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. 🙏🙏🙏🙏 అదే రోజున స్వామి వారిని జ్యోతి నిదర్శనాల కోసమై బండకొండ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి(ఎర్ర వారి పాలెం దగ్గర) వెళ్లి అక్కడ జ్యోతి నిదర్శనం కోసమై సాయంత్రం 3గం!! గంటలకు ఆ దేవదేవుడు లంకె పల్లి వారి పల్లి నుండి బయలుదేరి బండకొండ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం చేరుకుంటారు ఆపై రాత్రి అక్కడే నిద్ర చేసి ఆ మరుసటి రోజు ఉదయం జ్యోతి నిదర్శనాలను చూసి ఆపై కొలుపుకు అంకురార్పణం జరుగుతుంది ఎందుకంటే పురాణా కాలము నుండి ఎన్నో దుష్ట శక్తులు ,మంత్రగాళ్లు, దేవుడిని కదలనియకుండా ఎన్నో ఇబ్బందులు జరిగేవట అలాంటివన్నీ జరుగుకుండా కట్టుదిట్టంగా ఆ దేవదేవుడు ఆ సిద్దేశ్వర స్వామీ ఆలయం వద్ద భక్తాదులను ఆశీర్వదించి పూర్తి స్థాయిలో ఆ యాత్ర చేయవలసినటువంటి ప్రదేశాలని సందర్శిస్తూ.. పూజలు అందుకుంటూ... సస్యశ్యామలంగా తిరిగి రావాలని సంకల్పంతో ఈ స్వామి వారు బండకొండ నుండి యాత్ర మొదలవుతుంది🙏🙏🙏🙏. 🌹🌹🌹 మొట్టమొదటిగా ...17.11.23 న సంధ్యా సమయాన చిన్న గొట్టిగల్లు దగ్గర ఉన్నటువంటి ,,,,రాయపాటి వారి పల్లి,,, చేరుకుంటారు. అక్కడి నుండి దేవదేవుడు రాయపాటి వారి పల్లి కెళ్ళి ఆ రాత్రి ఆ ఊరు యందు 🕉️🕉️లంకిపల్లి వారి ఇంట🕉️🕉️బస చేస్తారు ఆపై ఏ ఊరికి అయితే వెళ్లాలో ఆ ఊర్లలో సమాచారం అందించబడుతుంది ఆ దేవదేవుడికి ఎదురుచూపులు చూస్తూ ఆనందంగా ..సంకల్ప పూర్వకంగా ఆ భగవంతుడు పూజలు అందుకుంటూ తిరిగి లంకపల్లి వారి పల్లి తన స్థానం చేరుకుంటారు జై శ్రీ బాల గురప్ప స్వామినే నమః!! ఓం నమశ్శివాయ !!ఓం నమశ్శివాయ!! ఓం నమశ్శివాయ🕉️🕉️🕉️🕉️🕉️🕉️