ఆధ్యాత్మిక సమాచారం

ఆధ్యాత్మిక సమాచారం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ఆధ్యాత్మిక సమాచారం, Hindu temple, Tirupati.

🙏🌺ఏ వరమైన ఆలోచించకుండా ఇచ్చే నా తండ్రి బోలా  శంకరుడు🌺🙏🌺ఒకనాడు మహా పార్వతి దేవి అమ్మవారు ఏమి స్వామి మనకు కైలాసం ఉంది కదా ...
16/08/2026

🙏🌺ఏ వరమైన ఆలోచించకుండా ఇచ్చే నా తండ్రి బోలా
శంకరుడు🌺🙏
🌺ఒకనాడు మహా పార్వతి దేవి అమ్మవారు ఏమి స్వామి మనకు కైలాసం ఉంది కదా మీరెందుకు స్మశానంలో ఉండారు అంటుంది ఆ తల్లి అప్పుడు శివుడు దేవి నాది నాది అన్నవాడు ఎంతో సంపాదించి చివరకు మరణిస్తే భార్య గడప వరకే వస్తుంది స్నేహితులు బంధువులు బిడ్డలు స్మశాన వరకు వచ్చి వెళ్ళిపోతారు కానీ ఆ జీవి ఎక్కడ వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉంటే
నేను రా నీకు తండ్రిని అందుకే దేవి ఈ స్మశానం లో ఉన్నాను ఎంత మంచి మనసు స్వామి మీరు అందుకే మిమ్మల్ని బోలా శంకరుడు అంటారు వరములు అడిగితే ఆలోచించకుండా ఇస్తారు స్వామి ఓం నమశ్శివాయ
ఓం నమశివాయ 🌺

🌺నిరంతరమూ
అత్యంత పవిత్రమైన
నీటితో గంగమ్మ తల్లి
అభిషేకస్తున్నా
ఒక చెంబుడు నీళ్లు
భక్తులు పోస్తే
పులకించిపోతావు
ఆదరిస్తావు
అక్కున చేర్చుకుంటావు
వాళ్ళ భక్తికి మురిసిపోతావు
ఆర్తికి ఆనందిస్తావు 🌺

🌺తండ్రి ప్రేమ ఇలానే ఉంటుందా మహాదేవా??
శివయ్యా నీవే దిక్కయ్యా🌺
#శ్రీమహాలక్ష్మి
#ఓంనమోనారాయణ
#ఓంనమఃశివాయ

💥"సూర్యుడు + నవగ్రహాలు + వేంకటేశ్వరుడు = గ్రహ దోషాలు తొలగుతాయి! జీవితం వెలుగుతో నిండిపోతుంది! ☀️🙏"**ఓం సూర్యనారాయణాయ నమ ...
16/08/2026

💥"సూర్యుడు + నవగ్రహాలు + వేంకటేశ్వరుడు = గ్రహ దోషాలు తొలగుతాయి! జీవితం వెలుగుతో నిండిపోతుంది! ☀️🙏"
**ఓం సూర్యనారాయణాయ నమ | ఓం నమో వేంకటేశాయ **

☀️ సూర్యుడు = నవగ్రహాలకు అధిపతి
🪐 నవగ్రహాలు = జీవితాన్ని ప్రభావితం చేస్తాయి
🙏 వేంకటేశ్వరుడు = అన్ని దోషాలను తొలగించేవాడు
🍁నవగ్రహాలకు అధిపతి సూర్యుడు...
వేంకటేశ్వరుడి అనుగ్రహంతో గ్రహ దోషాలు తొలగుతాయి! ✨

🍂పురాణ రహస్యం:
☀️ సూర్యనారాయణుడు = నవగ్రహాలకు రాజు, ఆత్మకు ప్రతీక
🪐 నవగ్రహాలు = జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహాలు
🙏 వేంకటేశ్వరుడు = అన్ని గ్రహ దోషాలను తొలగించేవాడు
"సూర్యుడి ఆశీస్సు లేకపోతే... గ్రహాలు శుభం ఇవ్వవు
వేంకటేశ్వరుడి కృప లేకపోతే... గ్రహ దోషాలు తొలగవు!"

✨ ఈ మూడు దైవాల అనుగ్రహం వల్ల:
✅ గ్రహ దోషాలు తొలగుతాయి ✅ ఉద్యోగంలో విజయం లభిస్తుంది
✅ ఆరోగ్యం మెరుగవుతుంది ✅ వివాహ సమస్యలు పరిష్కారమవుతాయి
✅ మానసిక శాంతి కలుగుతుంది ✅ సంతాన ప్రాప్తి కలుగుతుంది

🙏 ఎప్పుడు పూజించాలి:
☀️ ఆదివారం - సూర్యనారాయణుడికి ప్రీతి,
శనివారం - నవగ్రహ శాంతికి,
🙏 శనివారం - వేంకటేశ్వరుడి అనుగ్రహానికి
"ఆదివారం సూర్యుడిని, శనివారం వేంకటేశ్వరుడిని పూజిస్తే... నవగ్రహాలు అనుగ్రహిస్తాయి!"

️ 🔥ఈ రోజు ప్రార్థన:
"ఓ సూర్యనారాయణా! నాకు ఆరోగ్యం, తేజస్సును ప్రసాదించు.
ఓ నవగ్రహులారా! మీ అనుగ్రహాన్ని కరుణించండి.
ఓ వేంకటేశా! నా గ్రహ దోషాలను తొలగించి, నన్ను అనుగ్రహించు!"

✨👇 కామెంట్ చేయండి:
"జై సూర్యనారాయణా ☀️ జై నవగ్రహాలు జై బాలాజీ "
మీకు ఏ గ్రహం వల్ల సమస్యలు ఉన్నాయని భావిస్తున్నారు?

"ఈ పోస్ట్‌ను షేర్ చేసి, మీ కుటుంబానికి గ్రహ శాంతిని, వేంకటేశ్వరుడి అనుగ్రహాన్ని అందించండి! ✨"





🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻సోమవారం,ఆగష్టు.17,2026శ్రీ పరాభవ నామ సంవత్సరందక్షిణాయనం- వర్ష ఋతువుశ్రావణ మాసం - శుక్ల పక్షంతిథి:పం...
16/08/2026

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం,ఆగష్టు.17,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
శ్రావణ మాసం - శుక్ల పక్షం
తిథి:పంచమి సా6.58 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:హస్త ఉ6.47 వరకు
యోగం:సాధ్యం ఉ7.56 వరకు
కరణం:బవ ఉ7.00 వరకు
తదుపరి బాలువ సా6.58 వరకు
వర్జ్యం:మ3.06 - 4.45
దుర్ముహూర్తము:మ12.29 - 1.19
మరల మ3.00 - 3.50
అమృతకాలం:రా1.04 - 2.44
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.23
సింహ సంక్రమణం రా11.13
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

బ్రహ్మంగారి సజీవ సమాధి వెనుక ఉన్న ఈ విషయం మీకు తెలుసా?మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు, సజీవ ...
16/08/2026

బ్రహ్మంగారి సజీవ సమాధి వెనుక ఉన్న ఈ విషయం మీకు తెలుసా?

మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు, సజీవ సమాధి ప్రాంగణంలోకి వెళ్లి స్వామివారి సజీవ సమాధిని దర్శించుకుంటాం. మనకు కనిపించే విధంగా స్వామివారి సజీవ సమాధి తూర్పుముఖంగా ఉంటుంది. అక్కడే స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తాం.

అయితే, అక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.

స్వామివారి సజీవ సమాధి వెనుక ఒక అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. స్వామివారు సజీవ సమాధిలోకి ప్రవేశించే సమయంలో వెలిగించిన ఆ జ్యోతి అప్పటి నుంచి దాదాపు 400 సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూ వస్తోందని భక్తుల విశ్వాసం.

అదే విధంగా సజీవ సమాధిని తూర్పుముఖంగా దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు స్వామివారి పాదాలు కనిపిస్తాయి. భక్తులు అక్కడే కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు చెల్లించుకుంటారు.

ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.

స్వామివారు సజీవ సమాధిలో తూర్పుముఖంగా కాకుండా ఉత్తరముఖంగా తపోనిష్ట వహించారని చెబుతారు. అయితే కొంతమంది భక్తులు మనం దర్శనం చేసుకునే తూర్పుముఖాన్నే చూసి, స్వామివారు కూడా తూర్పుముఖంగానే సజీవ సమాధిలో తపస్సు చేశారని భావిస్తూ ఉంటారు. కానీ సజీవ సమాధి నిర్మాణాన్ని, స్వామివారి పాదాల దిశను గమనిస్తే స్వామివారు ఉత్తరముఖంగా తపోనిష్ట వహించారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఇది ఒక విషయం.

ఇంకొక ముఖ్యమైన విషయం మనం భక్తులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

మనలో కొందరు బ్రహ్మంగారిని పరమ దైవంగా భావిస్తారు. మరికొందరు అవతారమూర్తిగా కొలుస్తారు. ఇంకొందరు తమ గురుదేవులుగా భావిస్తారు. ఎవరి భావన ఎలా ఉన్నా, బ్రహ్మంగారు మనకు నిజంగా దైవం అయితే, మన గురుదేవులు అయితే, ఆయన బాగోగులను, ఆయన సజీవ సమాధి ప్రాంగణంలో జరుగుతున్న విషయాలను కూడా ఒక భక్తుడిగా గమనించాల్సిన బాధ్యత మన మీద ఉండాలి కదా?

భక్తి అంటే కేవలం వెళ్లి దర్శనం చేసుకోవడం, కానుకలు సమర్పించడం, స్వామివారిని చూసి సంతోషంగా తిరిగి రావడం మాత్రమేనా?

భక్త కన్నప్పను మనం గుర్తు చేసుకోవాలి. పరమశివుడికి ఆకలి వేస్తుందని భావించి ఆయనకు మాంసాన్ని సమర్పించాడు. చివరకు తన కన్నును కూడా అర్పించాడు అని చరిత్ర చెబుతుంది. కన్నప్పకు శివుడిపై ఉన్న ప్రేమ, తన దైవం పట్ల ఉన్న బాధ్యత అంతటి గొప్పది.

అలాగే మన గురుభక్తికి ఉదాహరణగా సిద్ధయ్య స్వామివారిని గుర్తు చేసుకోవాలి.

బ్రహ్మంగారి గౌరవాన్ని కాపాడటానికి సిద్ధయ్య స్వామివారు తన గురుదేవుల తరఫున నిలబడ్డారు. సిద్ధవటం నవాబు ఫర్మా జారీ చేసి బ్రహ్మంగారిని పిలిపించినప్పుడు, “నా గురుదేవులు వెళ్లాల్సిన అవసరం లేదు. నేనే వెళ్లి మాట్లాడతాను” అనే భావంతో సిద్ధవటం నవాబు కోటకు వెళ్లి తన గురుభక్తిని చాటుకున్నారని చెబుతారు.

అది కదా గురుభక్తి అంటే!

మరి మనం ఈ కాలంలో బ్రహ్మంగారి భక్తులుగా ఏం చేస్తున్నాం?

స్వామివారిపై ప్రేమతో, భక్తితో వెళ్తున్నాం. దర్శనం చేసుకుంటున్నాం. కానుకలు వేస్తున్నాం. సజీవ సమాధిని దర్శించుకున్నామని సంతోషపడుతున్నాం. ఇవన్నీ మంచివే. కానీ బ్రహ్మంగారి బాగోగులు చూడటం, ఆయన కీర్తి ప్రతిష్టలను కాపాడటం, ఆయన పేరు మీద ఉన్న పవిత్ర ప్రదేశంలో తప్పులు జరుగుతుంటే ప్రశ్నించడం కూడా మన బాధ్యత కాదా?

స్వామివారి సజీవ సమాధి ప్రాంగణంలో ఏదైనా తప్పు జరుగుతుంటే ఒక భక్తుడిగా మనకు ఆగ్రహం రావాలి. అన్యాయం కనిపిస్తే ప్రశ్నించాలి. ధర్మానికి విరుద్ధంగా ఏదైనా జరుగుతుంటే మాట్లాడాలి.

ఎదుట ఎంతటి పెద్ద వ్యక్తి ఉన్నా సరే, “నేను బ్రహ్మంగారి భక్తుడిని” అని చెప్పుకునే ధైర్యంతో ప్రశ్నించే తెగింపు మనలో ఉండాలి.

ఎందుకంటే మనం కొలిచే బ్రహ్మంగారు కూడా అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండే వ్యక్తి కాదు. నవాబుల పాలనలోనే నవాబులకే జ్ఞానబోధ చేసిన ధీరోదాత్తుడు మన స్వామివారు.

అలాంటి మహానుభావుడిని గురుదేవులుగా భావించే మనం ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి?

కేవలం సజీవ సమాధికి వెళ్లి నమస్కరించడం మాత్రమేనా?

లేదా ధర్మం కోసం నిలబడటం, అన్యాయాన్ని ప్రశ్నించడం, గురుదేవుల గౌరవాన్ని కాపాడటం కూడా నేర్చుకోవాలా?

ఒక్కసారి మన ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన విషయం ఇది.

మనకు బ్రహ్మంగారు పరమ దైవం. బ్రహ్మంగారు మన పరమ గురుదేవులు. ఆయన సజీవ సమాధి దర్శనం మనకు ఎంతో పవిత్రమైనది.

కాబట్టి సజీవ సమాధికి వెళ్లినప్పుడు కేవలం “నేను స్వామివారిని దర్శించుకున్నాను” అని సంతోషపడటం మాత్రమే కాకుండా, “నా గురుదేవుల పవిత్ర స్థలంలో ఏం జరుగుతోంది? నా గురుదేవుల గౌరవం కాపాడబడుతోందా?” అని కూడా ఆలోచించే భక్తి మనకు రావాలి.

ఎందుకంటే బ్రహ్మంగారి భక్తుడు అంటే కేవలం స్వామివారి పేరు చెప్పేవాడు కాదు… ధర్మం వైపు నిలబడేవాడు. అన్యాయాన్ని ప్రశ్నించేవాడు. తన గురుదేవుల గౌరవం కోసం అవసరమైతే ఎంతటి వారినైనా ప్రశ్నించే ధైర్యం ఉన్నవాడు.

అలాంటి భక్తులుగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది.

బ్రహ్మంగారిని నిజంగా ప్రేమిస్తే… ఆయనను కేవలం దర్శించుకోవడం కాదు, ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలి.
సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణారవిందార్పణమస్తూ 🙇‍♂️

15/08/2026
.         🚩🔱 !! "जय श्री सोमनाथ महादेव" !! 🔱 🚩                 🚩 !! श्री सोमनाथ महादेव मंदिर  !! 🚩                (प्रभा...
15/08/2026

. 🚩🔱 !! "जय श्री सोमनाथ महादेव" !! 🔱 🚩
🚩 !! श्री सोमनाथ महादेव मंदिर !! 🚩
(प्रभास ,पाटन ,वेरावल सौराष्ट्र गुजरात )
"जय श्री सोमनाथ ज्योतिर्लिन्गं नमो नमः
सोमनाथ महादेव आज(श्रावण शुक्ल तृतीया)
संध्या आरती श्रृंगार दर्शन ७:००' PM
शनिवार (१५/०८/२०२६)

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻ఆదివారం,ఆగష్టు.16,2026శ్రీ పరాభవ నామ సంవత్సరందక్షిణాయనం- వర్ష ఋతువుశ్రావణ మాసం - శుక్ల పక్షంతిథి:చవ...
15/08/2026

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం,ఆగష్టు.16,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
శ్రావణ మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి రా7.00 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఉత్తర ఉ6.22 వరకు
యోగం:సిద్ధం ఉ9.10 వరకు
కరణం:వణిజ ఉ7.16 వరకు
తదుపరి భద్ర రా7.00 వరకు
వర్జ్యం:మ2.55 - 4.32
దుర్ముహూర్తము:సా4.42 - 5.32
అమృతకాలం:రా12.41 - 2.18
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.23
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

🍂"కోపమే ప్రేమగా మారిన రూపం... లక్ష్మీనరసింహుడు! శ్రావణంలో ఆయన + వేంకటేశ్వరుడి అనుగ్రహం = రక్షణ ఖాయం! ✨"🌈**శ్రీ లక్ష్మీనర...
15/08/2026

🍂"కోపమే ప్రేమగా మారిన రూపం... లక్ష్మీనరసింహుడు! శ్రావణంలో ఆయన + వేంకటేశ్వరుడి అనుగ్రహం = రక్షణ ఖాయం! ✨"

🌈**శ్రీ లక్ష్మీనరసింహాయ నమః | ఓం నమో వేంకటేశాయ **
శ్రావణ మాసం - నరసింహుడి కృపకు ప్రత్యేకం! 🔥
లక్ష్మీనరసింహుడు = భక్తుల రక్షకుడు, కోప స్వరూపుడు
వేంకటేశ్వరుడు = భక్తుల పాలిటి కల్పవక్షం, శాంత స్వరూపుడు
ఈ ఇద్దరూ ఒకరే... రెండు రూపాలు!

💫 పురాణ రహస్యం:
ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహుడిగా అవతరించాడు...
కలియుగ భక్తులను రక్షించడానికి వేంకటేశ్వరుడిగా కొలువయ్యాడు!
"కోపం లేనిదే రక్షణ లేదు
కరుణ లేనిదే అనుగ్రహం లేదు!"

🔥శ్రావణ మాస విశేషం:
నరసింహుడిని పూజిస్తే → భయం తొలగుతుంది
🙏 వేంకటేశ్వరుడిని పూజిస్తే → కోరికలు తీరుతాయి
✨ రెండింటినీ పూజిస్తే → సంపూర్ణ రక్షణ!

💥ఈ మాసంలో చేయండి:
శనివారం నరసింహుడికి అర్చన
శనివారం వేంకటేశ్వరుడికి దర్శనం
🕉️ "ఉగ్రం వీరం మహావిష్ణుం" జపం
"ఓం నమో వేంకటేశాయ" కీర్తన

🍂ప్రార్థన:
"ఓ లక్ష్మీనరసింహా! నన్ను శత్రువుల నుండి కాపాడు.
వేంకటేశా! నాకు నీ అనుగ్రహాన్ని కరుణించు.
ఈ శ్రావణ మాసంలో మీ ఇద్దరి రక్షణ నాపై ఉండాలి!"

🍁👇 కామెంట్ చేయండి:
"జై నరసింహా 🦁 జై బాలాజీ "
మీకు ఇష్టమైన నరసింహుడి రూపం?
ఉగ్ర నరసింహుడు?
శాంత నరసింహుడు?
యోగ నరసింహుడు? 🧘
కామెంట్‌లో రాయండి! 👇



















Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆధ్యాత్మిక సమాచారం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category