Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanams Tirumala Tirupati Devasthanams (TTD) is an independent trust which manages the temples including the Tirumala Venkateswara Temple in Andhra Pradesh.

25/08/2026

Dr. Sridhar Jyothi, Ophthalmologist from Leeds, UK, shares his experience with Srivari Vaidya Seva and encourages fellow doctors and aspiring medical professionals to come forward and serve devotees through their expertise.

Be a part of this noble service.
Register for Srivari Vaidya Seva:
https://online.ttdevasthanams.ap.gov.in/frmSSPFHome.aspx

25/08/2026

పవిత్రోత్సవాలు రెండో రోజు – పవిత్ర మాలల సమర్పణ

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం అనంతరం పవిత్ర మాలల సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పవిత్ర మాలలతో విశేషంగా అలంకరించిన స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.

25/08/2026

Om Namo Venkatesaya

Tirumala Darshan Update | 25-08-2026

Waiting Compartments: 14
Approx. Sarvadarshanam Time
(without SSD Tokens): 8 Hours

Tirumala Statistics | 24-08-2026

Total Pilgrims: 77,085
Tonsures: 33,766
Hundi Kanukalu: ₹4.61 Crore
Laddu Sales: 3.84 Lakh
Annaprasadam: 1.96 Lakh
Ashwini Hospital: 3,058

Tirumala Accommodation Update | 25-08-2026Offline accommodation registration at *CRO, Tirumala:₹50 & ₹100 Rooms: 104 ava...
25/08/2026

Tirumala Accommodation Update | 25-08-2026
Offline accommodation registration at *CRO, Tirumala:
₹50 & ₹100 Rooms: 104 available / 1,400 total
₹1,000 & ₹1,523 Rooms: 15 available / 50 total
Availability is subject to change. Devotees are advised to carry their original Aadhaar card or printed copy

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం సరికాదుతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుత...
25/08/2026

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం సరికాదు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది.

టీటీడీ ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రతతో, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోంది.

లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేయడం జరుగుతోంది. ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ టీటీడీ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోంది. ఈ విధానంలో లడ్డూ తయారీలో వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశమే ఉండదు. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

అయితే, కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదు.

శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా, ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతోంది.

శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతను కాపాడటానికి టీటీడీ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
పత్రికా ప్రకటన
తిరుమల, 2026 ఆగస్టు 24

TTD Appeals to DevoteesTTD cautions devotees against believing or sharing unverified videos alleging contamination in Sr...
25/08/2026

TTD Appeals to Devotees

TTD cautions devotees against believing or sharing unverified videos alleging contamination in Srivari Laddu Prasadam.

Srivari Laddu Prasadam is prepared under strict hygiene, purity and quality-control measures. Devotees are requested to rely only on official TTD information and report any suspicious matter to TTD authorities.


24/08/2026

పవిత్రోత్సవాలు రెండో రోజు – పవిత్ర మాలల సమర్పణ

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం పవిత్ర మాలలను సమర్పించారు.

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమంలో పవిత్ర మాలలతో విశేషంగా అలంకృతులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

24/08/2026

పవిత్రోత్సవాలు రెండో రోజు – స్నపన తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహించారు.

OmNamoVenkatesaya

పవిత్రోత్సవాలు రెండో రోజు – పవిత్రమాలల సమర్పణతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం రెండో రోజుకు...
24/08/2026

పవిత్రోత్సవాలు రెండో రోజు – పవిత్రమాలల సమర్పణ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం అనంతరం రంగురంగుల పవిత్రమాలలను శాస్త్రోక్తంగా సమర్పించారు. భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగిన ఈ పవిత్రోత్సవ విశేషాలు చిత్రాల్లో...

24/08/2026

పవిత్రోత్సవాలు – తొలిరోజు

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన పవిత్రోత్సవాల్లో భాగంగా తొలిరోజు పవిత్ర ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం, వైదిక కార్యక్రమాలు, విశేష సమర్పణలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Address

Tirumala
517504

Alerts

Be the first to know and let us send you an email when Tirumala Tirupati Devasthanams posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Tirumala Tirupati Devasthanams:

Shortcuts

Share