Tirumala Tirupati Devasthanam - TTD

Tirumala Tirupati Devasthanam - TTD Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirumala Tirupati Devasthanam - TTD, Hindu temple, Tirumala.

కావలి నియోజకవర్గం కొండబిట్ర్రగుంట లోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారికి టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చ...
28/03/2021

కావలి నియోజకవర్గం కొండబిట్ర్రగుంట లోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారికి టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు

SWARNA RATHOTSAVAM HELD       The procession of Swarna Ratham held in Tirumala on the day of Vaikuntha Ekadasi between 9...
25/12/2020

SWARNA RATHOTSAVAM HELD

The procession of Swarna Ratham held in Tirumala on the day of Vaikuntha Ekadasi between 9am and 11am.
The golden chariot is pulled by women devotees including women employees of TTD with religious fervour.
The processional deities of Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi seated on the chariot took out celestial ride along the four-mada streets to bless the devotees who converged in the galleries.
The entire hills reverberated to the chanting of Govinda Namas.
TTD Chairman Sri YV S***a Reddy Garu, EO Dr KS Jawahar Reddy Garu and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

నేటి నుంచి శ్రీ‌వారి క‌ళ్యాణోత్స‌వ సేవా టిక్కెట్లుగురువారం నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుద...
06/08/2020

నేటి నుంచి శ్రీ‌వారి క‌ళ్యాణోత్స‌వ సేవా టిక్కెట్లు
గురువారం నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఆగష్టు7 నుంచి 31వ తేది వరకు సంబంధించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను గురువారం విడుదల చేయనున్నట్లు తిరుమల టీటీడీ అధికారులు తెలియజేశారు. అయితే ఈ కల్యాణోత్సవ సేవలో భక్తులు ఆన్ లైన్ లో పాల్గొననున్నారు.

ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభం కానుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లును కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ స్పష్టం చేసింది. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తుల ఇంటికి పంపిణీ చేయబోతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

IMPORTANT FESTIVALS OF TTD FOR THE CALENDAR YEAR 2020
16/07/2020

IMPORTANT FESTIVALS OF TTD FOR THE CALENDAR YEAR 2020

Om Namo Nrayana
15/07/2020

Om Namo Nrayana

గోవింద నామాలుశ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందాభక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందానిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ...
09/07/2020

గోవింద నామాలు
శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా
వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః

Address

Tirumala
517504

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirumala Tirupati Devasthanam - TTD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category