Mizpah Worship Center

Mizpah Worship Center Powerful Sermons from Various Pastors, Blissful Worship from Various Worship leaders.

31/07/2023
31/07/2023
31/07/2023
31/07/2023
31/07/2023
31/07/2023
10/01/2022

*JANUARY 10th MONDAY*
*MIZPAH WORSHIP CENTER*
*TODAY DEVOTION*

*సువార్త భారం నీకుందా?*

*అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ*. కొరింథీ 9:16

*సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడనుకాను.* రోమా 1:16

*సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి*. యెషయా 52:7

నశించిపోతున్న ఆత్మలపట్ల భారము కలిగి ప్రార్ధించకపోవడం, ప్రకటించకపోవడం. గొప్ప ఆధ్యాత్మిక నేరం.

🔸దున్నబడని భూములన్నీ దున్నబడాలి!
🔸ఆధ్యాత్మిక లోయలన్నీ పూడ్చబడాలి!
🔸వక్రమార్గాలన్నీ సక్రమవ్వాలి!
🔸కరకు మార్గాలన్నీ నునుపవ్వాలి!

అయితే, ఆ పని చేసేదెవరు? యేసు అనే పేరు తెలియని ప్రజలు ఎందరో వున్నారు! ఆ ప్రేమను ప్రకటించేవారు మాత్రం కొందరే వున్నారు! కోత విస్తారం. కోసేవారు మాత్రం కొదువుగా నున్నారు! కోయగలవా? కోసేవారిని ప్రోత్సహించగలవా?

🔹ముల్లును ముల్లుతోనే తీయాలని,
🔹వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని,
🔹బైబిల్ పట్టుకున్నవారిని బైబిల్ తోనే మోసం చెయ్యాలని,
🔹దేవుని రాజ్య సువార్తను ప్రకటించాల్సిన దేవుని పిల్లలనే సువార్తకు అడ్డుబండలుగా మార్చాలనే సాతానుగాడి ప్లాన్ బాగా సక్సస్ అయ్యింది.

నేటిదినాల్లో సువార్త పరిచర్యకు ప్రోత్సహించాల్సిన సేవకులే నీకు పిలుపు ఉందా? సువార్త కొరకు దేవుడు నిన్ను పిలిచాడా? లేకుంటే నీవు సువార్త చేయడానికి వీల్లేదంటూ, ప్రోత్సహించాల్సినవారే అడ్డుబండలగా మారే పరిస్థితి. కానీ అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే? మేము పిలువబడ్డాము అనే చెప్పుకొనే ఆ సేవకులు, దేవుని పిలుపుకు లోబడలేక, వారికి నచ్చినట్లుగా జీవిస్తూ, సాక్ష్యాన్ని కోల్పోయి, ఎవరైనా ఆత్మల పట్ల భారం కలిగి సువార్తపనిచేస్తుంటే వారి కాళ్లకు గుదిబండలువేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన పిల్లలే, మేమెందుకు సువార్త ప్రకటించాలి? అది పాస్టర్ల పని అంటూ తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు. తాను చెడిన కోతి వనమంతా చెరిపినట్లు, కొందరు యవ్వనబిడ్డలు ప్రభువు కోసం జీవించలేక, వారు భ్రష్టులై, తన తోటివారిని వారివలే చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఓ యౌవనుడా! నీ కోసమే ఈ మాటలు వ్రాయడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నారు. నీవు సువార్తను గురించి సిగ్గుపడేవాడవైతే, సిగ్గుతో తలదించుకుని వుండు. అయితే, తీర్పు దినమునుండి తప్పించుకోలేవనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దు.

*నేనెందుకు సువార్తను ప్రకటించాలి అని ప్రశ్నించే స్థితికి నీవు చేరుకున్నావంటే? దానికి కారణం? *

👉 నీకు యెహోవా ఉత్తముడు అని రుచిచూచిన అనుభవం లేదేమో? (కీర్తనలు 34:8)
👉 నీకు ప్రభువు దయాళుడు అని రుచిచూచిన అనుభవం లేదేమో? (1పేతురు 2:1)
👉 రక్షణ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నీకు లేదేమో? (2 తిమోతి 2:4)
👉 నీకు సమర్పణ జీవితం లేదేమో? (రోమా 12:1) సమర్పణ అంటే ఏమిటో తెలుసా? శరీరేచ్ఛలను చంపుకొని, ప్రభువు కొరకు జీవించడం.

ఇట్టి అనుభవాలు నీ జీవితంలో వుంటే, ఆయన గురించి మాట్లాడకుండా వుండడం నీవల్ల కానేకాదు. నేనెందుకు సువార్త ప్రకటించాలి అని ప్రశ్నిస్తున్నావంటే, నీవు ఒప్పుకున్నా, ఒప్పకపోయినా ఇట్లాంటి అనుభవాలు నీ జీవితంలో లేవన్నమాట. సందేహం లేనేలేదు.

*ప్రియ స్నేహితా! * ప్రేమతో చివరిగా నీకొక్కసారి మనవి చేస్తున్నాను. సువార్తను గురించి ప్రశ్నించే స్థితిలో నీవున్నావంటే, అది నీవు క్రైస్తవుడవై నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సినపని. వెలిగింపబడిన క్రొవ్వొత్తి అనేకమందికి వెలుగివ్వాలి. అట్లానే, క్రీస్తు ప్రేమతో వెలిగింపబడిన నీవు, అనేకులకు సువార్త వెలుగును పంచాలి. ప్రకటించే కృపావరమును ప్రభువు నీకివ్వకపోతే, ప్రార్ధించే కృపావరముతో నశించిపోతున్న ఆత్మలపట్ల భారముకలిగి ప్రార్ధించు. అన్నింటికంటే మించి, నీ జీవితాన్నే ఒక సువార్తగా నీ స్నేహితుల ముందుంచు. అంతేగాని, సువార్తను గురించి ప్రశ్నించడమంటే మునికోలకు ఎదురు తన్నడమే అవుతుంది జాగ్రత. అది నీ జీవితానికి ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు. సువార్తను అడ్డగించినవారెందరో కాలగర్భంలో కలసిపోయారు. కానీ, సువార్త ప్రజ్వరిల్లుతూనే వుంది. నీవునూ వారిలో ఒకడివి కాకూడదు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. అనేకులను ప్రభువు చెంతకు నడిపించు! ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Don't miss it.........
02/03/2021

Don't miss it.........

Address

, Velpur, Tanuku Mandal, West God
Tanuku
534222

Telephone

+918555846879

Website

Alerts

Be the first to know and let us send you an email when Mizpah Worship Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share