శ్రీ భీమునిఅడుగు పుణ్యక్షేత్రం

  • Home
  • India
  • Tamballapalle
  • శ్రీ భీమునిఅడుగు పుణ్యక్షేత్రం

శ్రీ భీమునిఅడుగు పుణ్యక్షేత్రం గ్రూప్ నంధు భీముని అడుగు పుణ్యక్షేత?

🚩*శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం*🚩నవరాత్రులలో మొదటి రోజున భక్తులందరూ అమ్మ వారిని మనసారా శ్రద్దాభక్తుల తో అర్చించుక...
24/09/2025

🚩*శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం*🚩

నవరాత్రులలో మొదటి రోజున భక్తులందరూ అమ్మ వారిని మనసారా శ్రద్దాభక్తుల తో అర్చించుకుని అద్భుతమైన అనుభూతిని పొంది జన్మధన్యం చేసుకుంటారు.

దేవీనవరాత్రులలో ఈ రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అని పెద్దలు చెపుతారు. దేదీప్యంగా విరాజిల్లే అమ్మ వారి అలంకారం 'శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం’.

త్రిపురత్రయంలో ప్రధమ శక్తి స్వరూపిణి ఈ దేవత. ఈ రోజున నిర్మలమైన ముద్దులొలికే ముచ్చటైన బాలామణి రూపాన పూజలందు కుంటుంది.
సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జగన్మాతే ఈ బాలాత్రిపుర సుందరీదేవి!
త్రిపురాంతకం అనబడే ఒక శైవక్షేత్రం లో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు. త్రిపురాసురుడనే ఒక భీకర రక్కసుని అంతమొందించి భక్తుల కొంగు బంగారం చేయడానికి త్రిపురేశ్వరుడు మరియు త్రిపురసుందరీ దేవి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు.
బాలా త్రిపుర సుందరి దేవి అంటే

త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.

అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.

ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి.
ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.

మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.

హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.

శ్రీ బాలాత్రిపుర సుందరీ గాయత్రీ ధ్యాన శ్లోకం:-

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే!
కామేశ్వర్యై చ ధీమహీ
తన్నోబాలా ప్రచోదయాత్!!

పూజా ఫలితం:- అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధ్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.

ఈ అవతారంలో అమ్మ అభయ హస్త ముద్ర కలిగి అక్షర మాలను ధరించి వుంటుంది. దేదీప్యమానమైన ఈ దివ్యమంగళ రూపాన్ని మనః ఫలకం పై నిలుపుకుని, ఆరాధిస్తే భక్తుల మనస్సుని, బుద్ధిని తేజోవంతం చేస్తుంది. శ్రీ చక్రం లోని ప్రధమ దేవత ఈ రూపం! సమస్త కళలకు అధినేత ఈ దేవత. ఏ కళ లో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మన మీద పడాలి. ఈ బాలాత్రిపురసుందరీ దేవి ఆరాధన లో భాగంగానే నవరాత్రులలో బాల పూజ విశిష్ట స్థానం పొందింది.
*'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాల త్రిపురసున్దర్యై నమః'* అని వీలైనన్ని సార్లు జపించుకుంటే చాలా శుభప్రదం!

20/09/2025

#ఆహార దోషం*

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి
1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం
3. స్ధాన దోషం
4. గుణ దోషం
5. సంస్కార దోషం.
ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి.

*1. అర్ధ దోషం:*
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు.భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకవ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతోవున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుద్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.
తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుద్ధి కలిగిందని, రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే మలంగా విసర్జించబడినతర్వాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆడబ్బును తిరిగిచ్చేసాడు. శిష్యుడిని “ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?” అని అడిగాడు.

శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు” అని తలవంచుకొన్నాడు.

*ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.

*2. నిమిత్త దోషం:*
మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు. ఆహారంమీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి.

*భీష్మాచార్యులవారు కురుక్షేత్రయుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసేవరకు అంపశయ్యమీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుడు వున్నారు.ఆదిత్యయోగీ.
వారికి భీష్ముడు మంచిమంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. “ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించి నప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?” అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు, “అమ్మా! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను. నా స్వీయబుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాతరక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నాబుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను” అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం' ఏర్పడుతుంది.

*3. స్ధాన దోషం:*
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుద్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు.

*దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ప్రేమఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు.
ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను” అని అన్నాడు.

*కనుక మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

*4. గుణ దోషం:*
మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

*5. సంస్కారదోషం:*
ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది..*

|| సర్వం - శివార్పణం II
ఇదే నాకు తెలిసిన శివతత్వం

శ్మశాన వాసి:-
ప్రతీ ప్రాణి చివరి గమ్యం ఒకటే – స్మశానం. దాన్ని తెలుసుకున్న రోజు లోభం, దురాశ తగ్గిపోతాయి.
మనం బ్రతికే విధానమే మారిపోతుంది.

పులిచర్మం, బూడిద అలంకారాలు:- నిజమైన గౌరవం వస్తువుల వల్ల కాదు, గుణాల వల్ల వస్తుంది.

ధర్మరక్షకుడు:-
సంహారం చేసే వాడు కూడా సత్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టడానికే చేస్తాడు. మన నిర్ణయాలు ఎప్పుడూ సత్యం - ధర్మం ఆధారంగానే ఉండాలి. అప్పుడు కఠినంగా కనిపించినా అవి సరైనవే అవుతాయి.

విశ్వానికి యోగమార్గం చూపిన మొదటి గురువు:-
శాంతి బయట కాదు. మన లోపలే ఉంది. ప్రతిరోజూ కొద్ది క్షణాలైనా మనసును నిశ్చలంగా ఉంచితే మన జీవితానికి ఓ దారి దొరుకుతుంది.ఆదిత్యయోగీ.

బిల్వప్రియుడు:-
బిల్వదళం అర్పించినా ఆయన సంతోషిస్తాడు. భక్తి అంటే ఆర్భాటం కాదు. చిన్నది అయినా మనస్పూర్తిగా ఇచ్చిందే నిజమైన సమర్పణ.

ముక్కోపి:-
ముక్కోపి అన్నారని కోపిష్టి అనుకోను నేను కోపం మన చేతిలోని శక్తి, దాన్ని అవసరానికే వాడాలి. అప్పుడే ఆ కోపానికి కూడా విలువ. ఆ కోపాన్ని నియంత్రించడమే యోగం.
ఆ రెండు తెలిసిన వాడే శివుడు.

నాదస్వరూపుడు:-
ప్రతి ఆరంభానికి ఒక నాదం ఉంటుంది. మాటలు, శబ్దాలు మన మనసును నిర్మించగల శక్తిని, కలిగి ఉంటుందని నమ్ముతాను నేను - వాటిని జాగ్రత్తగా వాడాలి.

అర్థనారీశ్వరుడు:-
నీ మనసులో నాకు చోటెక్కడ అని ఆ తల్లి అడిగితే.... తన మనసున్న చోటనే ఇచ్చాడు. తనలో సతికి సగబాగాన్ని ఇచ్చాడు.

మనలో మగాడు అనే అహం చచ్చిపోవడానికి ఇంతకన్నా ఏం కావాలి.

మనం ఆయానకన్నా గొప్ప వాళ్ళమా..!

అభయదాత:-
ఎవరు ఆశ్రయం కోరినా శరణాగతి ఇస్తాడు.

శక్తి అంటే భయపెట్టడం కాదు, రక్షించడం. మనకన్నా బలహీనులను కాపాడగలిగితేనే మన బలానికి అర్థం.

🚩ప్రశ్న: - లలిత సహస్ర నామాల ను ఎవరు రాశారు.మొదట గా ఎవరు ఎవరికి చెప్పారు.🚩సమాధానం:- బ్రహ్మాండపురాణం ఉత్తరభాగం లోని లలితాక...
19/09/2025

🚩ప్రశ్న: - లలిత సహస్ర నామాల ను ఎవరు రాశారు.మొదట గా ఎవరు ఎవరికి చెప్పారు.🚩

సమాధానం:- బ్రహ్మాండపురాణం ఉత్తరభాగం లోని
లలితాక్యానము లోని విషయాలతో ఈ పోస్ట్ పెడుతున్నాను.

ముల్లోకాలలో విస్తరించి ఉన్న మహా గొప్పదైన పర్వతం
మేరు పర్వతం. ఈ మేరుపర్వతాన్ని చూసి అసూయ చెందిన వింధ్యుడు తాను కూడా మేరుపర్వతం కంటే గొప్పవాడు కావాలి అని భావించాడు.తనకేం తక్కువ స్వయంగా పరమశివుడు నా పై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు .నేను మేరుపర్వతం కంటే గొప్పవాన్ని .అని తనకు ఉన్న వరంతో ఎత్తు పెరగడం ఆరంభించాడు.అతడు పెరిగిన ఎత్తు వల్ల సృష్టి నడవడం ఆగిపోయింది.ఒక వైపు చీకటి ,ఇంకోవైపు మండే ఎండ,ఒక వైపు వరదలు,ఇంకో వైపు తీవ్ర కరువులు ఏర్పడ్డాయి .
ఈ అపద ఎలా తొలగుతుంది .ఇప్పుడు సృష్టి నీ ఎవరు రక్షిస్తారు అని భావించిన దేవతలు .కాశి లో నివసించే కుంభసంభవుని ఆశ్రయించారు.ఆయన దేవతల కోరిక మన్నించి బయలుదేరాడు.

తన భార్య తో కలిసి వింధ్య పర్వత పాదాన్ని చేరాడు.వెంటనే వింధ్యుడు ఆయనకు నమస్కరించి కిందకు వంగాడు.అప్పుడు ఆయన ఇలా అన్నాడు మేము దక్షిణ దేశ యాత్రలు చెయ్యాలి అనుకుంటున్నాము.మేము తిరిగి వచ్చేవరకు ఇలాగే వంగి ఉండు అని దాంతో కుంభసంభవుని ఆజ్ఞ ను మన్నించి వింధ్యుడు అలాగే ఉండిపోయాడు.

ఆగము అంటే కొండ అస్త్యుడు అంటే అణిచివాడు.
కొండను అణిచిన వాడు కాబట్టి ఆ రోజు నుంచి ఆ మహర్షి నీ అగస్త్యుడు అని కీర్తించారు దేవతలు.
ఆయన చాలా గొప్పవాడు.పార్వతి పరమేశ్వరులు ఆయనను తమ మూడవ కొడుకు గా భావిస్తారు.
అలాంటి అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్రలు చేస్తూ
దక్షిణ భారత దేశం లో ఉన్న ఏకైక మోక్ష పురము
కాంచీ పురాన్ని చేరుకున్నాడు.

అక్కడ ఉన్న ఏకామ్రేశ్వర,కామాక్షిఅమ్మవారిని,
వరదరాజ స్వామినీ దర్శించుకున్న అగస్త్యునికి అక్కడే హయగ్రీవ స్వామి దర్శనం అయింది.అప్పుడు అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామి నీ అనేక విధాలుగా స్తుతించి.మానవులను ఉన్నతులను చేసే లలితాదేవి యొక్క సహస్రనామాలు తనకు ఉపదేశించమని కోరాడు.

అప్పుడు హయగ్రీవస్వామి ఇక్కడ కాదు .బ్రహ్మపుత్ర నది తీరం లో మణికూట పర్వతం పై ఉన్న నా ఆలయం వద్దకు రా అని చెప్పి అదృశ్యం అయిపోయాడు.

*****

హయగ్రీవ స్వామి మణిద్వీపానికి వెళ్ళి లలితా దేవి తో ఇలా అన్నాడు అమ్మా నీ యొక్క
సహస్రనామాలను నాకు ఉపదేశించూ అని కోరగా అమ్మవారు .కొన్ని రోజుల సమయం తరువాత ఉపదేశిస్తాను అని చెప్పింది.

తర్వాత అమ్మవారు మణిద్వీపం లోని సభామండపం లో ఒక సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు వివిధ బ్రహ్మాండలకు చెందిన త్రిమూర్తులు, ఋషులు, ఇంద్రులు,అష్టదిక్పాలకులు సకల దేవతలు వచ్చారు.
అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు నేను హయగ్రీవునికి నా సహస్ర నామాలను ఇస్తాను అని చెప్పాను .కానీ ఇప్పటివరకు నాకు సహస్రనామాలు లేవు వాటిని ఎవరూ రచిస్తారు అని అడుగగా.
ఇంతమంది లో ఒక్కరు కూడా మాట్లాడరు.
సభ మొత్తం నిశబ్దం గా ఉండిపోతుంది.
అప్పుడు శ్రీ మహా విష్ణువు లేచి ఇలా అంటాడు.
అమ్మా ఇక్కడ ఉన్న ఎవరికి నీ సహస్ర నామాలు రచించే శక్తి లేదు .నీ నామాలను నువ్వు తప్ప ఇంకెవ్వరూ రాయలేరు కాబట్టి నువ్వే నీ నామాలను చెప్పి మమ్మల్ని అనుగ్రహించు అని.

అప్పుడు అమ్మవారి నుంచి ఎనిమిది మంది దేవతలు ఉద్భవించారూ.వారినే
వసిన్యాధివాగ్దేవతలు అంటారు.అమ్మవారు వారికి సహస్రనామాలను రచించే బాధ్యత ను అప్పగించగా వారు అప్పవారి సహస్ర నామాలు రచించి ఇస్తారు.

తర్వాత అమ్మవారు హయగ్రీవుని కి ఆ సహస్రనామాలను ఇస్తుంది.
అందుకే లలితాసహస్ర నామస్తోత్రం లో వసిన్యాధి వాగ్దేవతా ఋషిః అని ఉంటుంది.

*****

హయగ్రీవ స్వామి ఆజ్ఞ మేరకు మణికూట పర్వతం చేరిన అగస్త్య లోపాముద్రదేవి దంపతులకు హయగ్రీవ స్వామి లలితా సహస్ర నామాలను ఉపదేశిస్తాడు.భక్తి కలిగిన ఎవరైనా ఈ అమ్మవారి నామాలను పటించవచ్చు.
హయగ్రీవుడు అగస్త్య మహర్షి కి లలిత సహస్ర నామాలు ఉపదేశించిన పర్వతాన్ని ఇప్పుడు టోజో అనే పేరుతో పిలుస్తున్నారు. ఇప్పటికీ అక్కడ హయగ్రీవ స్వామి ఆలయం ఉంది.

సమాధానం : లలితాసహస్రనామాలను
వసిన్యాధివాగ్దేవతలు లలితాసహస్ర నామస్తోత్రం ను రచిస్తే.
స్వయంగా లలితా దేవి మొదట హయగ్రీవుని కి ఇచ్చింది.

శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

07/11/2024

Address

Tamballapalle
517350

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ భీమునిఅడుగు పుణ్యక్షేత్రం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category