His Ministries India

His Ministries India when life gives you a hundred reasons to cry,remember that God has given you a thousand reasons to smile.

His Ministries India is to develop a strong fellowship of Christians longing for a Christian Community to further develop their Faith and sense of belonging. We desire to support and encourage the Christian Communities, Organizations and Churches and their ministries, helping to bring them into the 21st Century by Sharing Christ With Each Other and The World.

29/08/2026

మనుషులు మనల్ని లెక్కలోనుండి తీసివేయొచ్చు, మన ఉనికినే గుర్తించకపోవచ్చు. అయితే దేవుడు ఎవరినీ మరిచిపోడు. మనుషుల దృష్టిలో మనం లెక్కలో లేకపోయినా, ఆయన దృష్టిలో మనం ఎప్పటికీ గుర్తింపు పొందినవాళ్లమే.ఆయన మనలను ఆశీర్వదించాలనుకుంటే, ఎవరి అంగీకారం, ఎవరి సహాయం, ఎవరి గుర్తింపూ అవసరం లేదు. ఆయన కృప ఒక్కటే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నేనంటూ ఉన్నానని కనీసం గుర్తించలేదు అని మనుషుల గుర్తింపుపై ఆధారపడవద్దు. దేవుడు మన పక్కన ఉన్నాడు ఆయన నన్ను మరచిపోలేదు అని గుర్తు పెట్టుకుంటే చాలు ❤️🙌
నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను హెబ్రీ13:5

28/08/2026

మౌనంగా,న్యాయంగా నడిచేవారిని దేవుడు తగిన సమయంలో గొప్ప చేస్తాడు . (1 పేతు 5:6) ఎందుకు మౌనంగా ఉండాలి అంటే మనకు ఎదురైన అన్యాయం తాత్కాలికం కాబట్టి, కానీ దేవుని న్యాయం శాశ్వతం. ఆయన ప్రతీ ఒక్కరి క్రియలను చూస్తున్నాడు. కచ్చితంగా తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును (కీర్త75:7)🙌❤️

27/08/2026

“పాపం నుండి దేవుని వైపు మనిషిని నడిపించే ఏకైక మార్గం యేసుక్రీస్తే. మనిషి వెదికే ప్రతి నిజమైన సమాధానం ఆయనలోనే ఉంది. ఈ తాత్కాలిక జీవితానికి అర్థాన్ని ఇచ్చేవాడే కాదు,శాశ్వత జీవితానికి మార్గాన్ని తెరిచేవాడు కూడా ఆయనే.ఎందుకంటే యేసు క్రీస్తు కేవలం ఒక మార్గాన్ని చూపించేవాడు కాదు;
ఆయనే మార్గం, సత్యం, జీవం.”
నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు-యేసు క్రీస్తు
యోహా 14:6 ❤️

26/08/2026

మనం దేవుని పిల్లలం, అందుకే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ ఎప్పుడూ మారదు, తగ్గదు. మనుషులం అయిన మనమే, మనం ప్రేమిస్తున్న వారికోసం ఏదైనా చెయ్యటానికి సిద్ధపడతా ఉంటామే, మరి మన కోసం ప్రాణమే పెట్టిన ఏసయ్య మన గురించి ఏమీ చెయ్యకుండా చూస్తూ ఊరుకుంటాడా????? అది ఏ విషయం అయినా కూడా ఆలోచించు. 🙏❤️

తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?
రోమీయులకు 8:32

25/08/2026

కృప అంటే మనం అర్హులం కాబట్టి దేవుడు ఇచ్చింది కాదు; మన అర్హతకు మించినదాన్ని, మన బలహీనతల మధ్య కూడా దేవుడు మనకు ఇచ్చిన వరం. “అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను.” 1 కొరిం15:10

24/08/2026

“మీది నాది ఒకే రక్తం… ఒకే ఇంటిపేరు…
మీ గురించే 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాను…”
అంటూ బాధనంతా ముఖంలో చూపిస్తూ, తేనె లాంటి మాటలు చెప్పేవారు కొందరు ఉంటారు. అయితే వారి మాటలు వేరు, వారి అంతరార్థం వేరు. ఎందుకంటే కొన్ని బంధాలు ప్రేమ కోసం కాదు, అవసరం కోసం మాత్రమే. ఎందుకంటే మనం వారి ప్రక్కన లేకపోతే వారు పడిపోతారు కాబట్టి అందుకే ఆ అవసరం ఉన్నంతకాలం మన చుట్టూ తిరుగుతారు. అవసరం తీరిపోయాక, “వీరు బ్రతికి ఉన్నారా? లేదా?” అని కూడా పట్టించుకోరు. అంతేకాదు, మన ముందే ప్రేమగా మాట్లాడి, మన వెనుక మనల్ని చెడ్డ చేస్తూ ఉంటారు కూడా.
అందుకే జాగ్రత్త… తియ్యటి మాటలను బట్టి మనుషులను నమ్మకు. వారి మాటలకంటే వారి ప్రవర్తనను గమనించు.
ప్రతి ఆప్యాయత నిజమైనది కాదు.
ప్రతి బంధం స్వచ్ఛమైనది కాదు.
ప్రతి “నేను నీతోనే ఉన్నాను” అనే మాట వెనుక నిజమైన ప్రేమ ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరి మాటలకూ పొంగిపోకు…
ఎవరి ప్రవర్తనతోనూ కృంగిపోకు. మనుషుల మాటలకంటే దేవుని మాటకు విలువ ఇవ్వు. మనుషులకు కాదు దేవునికి మాత్రమే లోబడి ఉండు.ఎందుకంటే మనుషులు మారవచ్చు…
బంధాలు మారవచ్చు…
అవసరాలు మారవచ్చు…
కానీ నిన్ను ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు మాత్రం మారడు. ❤️ “మనుష్యులను నమ్ముకొనుట కంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.”కీర్త118:8

23/08/2026

ఏ అండ లేని వారిని లోకం చిన్నచూపు చూస్తుంది. “వారికేం చేసినా, వారినెలా చూసినా అడిగేవారు ఎవరున్నారు? మనం ఏం చేసినా పర్వాలేదులే ” అని అనుకుంటుంది. అయితే మనుషుల ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు ఎంత వ్యత్యాసమో…….
అండ లేనివారిని చూసి దేవుడు
“వారికి ఎవరూ లేరు” అనుకోడు…“వారికి నేనున్నాను” అంటాడు. అందుకే తండ్రిలేని వారి పక్షంగా, విధవరాండ్ర పక్షంగా తానే నిలబడతానని దేవుడు చెబుతాడు. మనుషుల అండ కనిపించకపోయినా, దేవుని అండ వారికి ఉంది. కాబట్టి వారి వెనుక ఎవరూ లేరని వారిని బలహీనులుగా భావించకండి. “వారికి ఎవరూ లేరు” అనుకోవద్దు… వారి ఏడ్పును వినే దేవుడు ఉన్నాడు.
వారి వెనుక మనిషి లేకపోవచ్చు…
కానీ వారికోసం నిలబడే దేవుడు ఉన్నాడు. ❤️“తండ్రిలేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయాధిపతియు దేవుడే.”కీర్త 68:5

23/08/2026

నీ మనశ్శాంతిని కోల్పోయేంత అవకాశం ఎవరికీ ఇవ్వకు. నీ హృదయం విలువైనది… దాన్ని ప్రతి ఒక్కరి మాటలకు, ప్రవర్తనకు తాకట్టు పెట్టకు. అంటే, ప్రతి వ్యక్తి చేసే పనికి, మాట్లాడే మాటకు మన హృదయాన్ని అప్పగించకూడదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మాట్లాడారని, ఏదైనా చేశారని మన హృదయాన్ని కలవరపెట్టుకుంటూ ఉంటే, వారి ప్రతి మాటకు మనలో కోపం, ఆవేశం మంటల్లా చెలరేగుతూనే ఉంటాయి. ఒకరి ప్రవర్తనకు మన హృదయం స్పందిస్తూ ఉంటే, మనశ్శాంతిని కోల్పోయేది చివరికి మనమే. గుర్తుంచుకో… నీ హృదయం నుండి రావలసినవి మంటలు కాదు జీవధారలు. విషపు మాటలు, కోపం, ద్వేషం, ప్రతీకారం నీ హృదయం నుండి ప్రవహించకూడదు. అందుకే అనవసరమైన వ్యక్తుల ప్రవర్తనను పదేపదే గుర్తు చేసుకుంటూ నీ హృదయంలోకి తీసుకురాకు. వారిని ఎప్పటికీ మార్చలేవు, కానీ వారి ప్రవర్తన నీ మనశ్శాంతిని దోచుకోకుండా నీ హృదయాన్ని మాత్రం కాపాడుకో. నీ హృదయం దేవుడు ఇచ్చిన అమూల్యమైన స్థలం. దాన్ని ప్రతి ఒక్కరికీ అద్దెకు ఇవ్వకు. 😊 నీ హృదయంలో మంటలు రగిలించే వాళ్లకు నీ మనశ్శాంతిని అస్సలు అప్పగించకు.❤️
*నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి, అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23

21/08/2026

“వారు కట్టుకొనిన ఇండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొనిన వాటిని వేరొకరు అనుభవింపరు.” — యెషయా 65:22 ఈ వాక్యం శ్రమపడుతున్నవారిని, నష్టపోయినవారిని, అన్నీ పోగొట్టుకున్నవారిని చూసి నిందించడానికి కాదు. ఒక మనిషి జీవితంలో కష్టాలు ఉన్నాయని చూసి, అతని విశ్వాసాన్ని గానీ, దేవునితో అతని సంబంధాన్ని గానీ తీర్పు చెప్పే హక్కు మనకు లేదు. యోబు జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు అతని స్నేహితులు కూడా అతనినే తప్పుపట్టారు. కానీ చివరికి దేవుడు వారి మాటలను సమర్థించలేదు. కాబట్టి బాధలో ఉన్నవారిని ప్రశ్నించకుండా, వారి పక్కన నిలబడటం; తీర్పు చెప్పకుండా, వారి కోసం ప్రార్థించడం; నిందించకుండా,
ధైర్యం చెప్పడం మన బాధ్యత.
ఎందుకంటే వారికి కావలసింది
తీర్పు కాదు — దయ కావాలి.
ప్రశ్నలు కాదు — ప్రార్థన కావాలి.
నింద కాదు — చేయి అందించాలి. ❤️
ఎందుకంటే ఈ రోజు కన్నీళ్లలో ఉన్న వారి కథ అక్కడితో ముగిసిపోలేదు. వారి జీవితంలో దేవుడు ఇంకా రాయాల్సిన అధ్యాయాలు ఎన్నో………..🙏

20/08/2026

కొంతమంది మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ప్రేమను ఒలకబోస్తారు; మాటల్లో తీపి, ముఖంలో చిరునవ్వు. కానీ ఆ మనిషి ఎదురుగా లేనప్పుడు మాత్రం అతని గురించి చెడు మాటలు మాట్లాడి, అతనికి గోతులు తవ్వడం మొదలుపెడతారు. వారిది ప్రేమ కాదు… కపటం. అయితే, జాగ్రత్త ‼️ దేవుడు మన పెదవుల మాటలను మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా చూస్తాడు.
అందుకే యేసయ్య ఇలా చెప్పారు: “మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండవలెను; వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది.” మత్త5:37
మనిషి ఎదురుగా ఒకలా, అతను వెళ్లిపోయిన తర్వాత మరోలా ఉండటం దేవునికి ఇష్టమైన జీవితం కాదు. అందుకే మనిషి ఎదురుగా ప్రేమ చూపించి, అతను వెళ్లిపోయిన తర్వాత అతనికి గోతులు తవ్వే జీవితం కాకుండా ఎదురుగానైనా, వెనుకగానైనా ఒకే హృదయంతో, ఒకే మాటతో, నిజాయితీగా జీవించే మనుషులుగా ఉండాలి.
మనిషి మన ముఖాన్ని మాత్రమే చూస్తాడు… కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు.ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి.🙏❤️

Address

HIS Ministries
Tadepalligudem
534101

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Telephone

+918688305335

Alerts

Be the first to know and let us send you an email when His Ministries India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to His Ministries India:

Shortcuts

Share