03/10/2026
దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు రమ్మంటావా? వద్దంటావా?
నీ తలుపు ఆయన కోసం తెరిచి ఉంచుతావా?
లేక నీ బిజీ జీవితంలో ఆయనకు చోటు లేదంటావా?
యేసు నీ ఇంటికి వచ్చినప్పుడు…
ఆయన కేవలం నీ ఇంటి తలుపు తట్టడానికి రాడు; ఆ ఇంటిలో ఉన్న నీ పరిస్థితిని మార్చడానికి వస్తాడు.
యేసు జక్కయ్య ఇంటికి వెళ్లాలని కోరుకున్నాడు.
లూకా 19:5“జక్కయ్యా,….నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది.” అనగానే జక్కయ్య యేసయ్యకు తన ఇంటి తలుపు తెరిచాడు. ఆ ఆహ్వానం కేవలం యేసును తన ఇంట్లోకి ఆహ్వానించడమే కాదు అది జక్కయ్య జీవితంలో ఒక కొత్త మార్పుకు ఆరంభమైంది.
మరి ఈరోజు యేసు నీ ఇంటికి కూడా రావాలనుకుంటున్నారు. ఆయన కోసం నీ తలుపు తెరిచి ఉందా????