27/08/2026
ఆగష్టు 25 న నైట్స్ ఆఫ్ కొలంబస్ సంస్థ సుప్రీమ్ నైట్ పాట్రిక్ ఈ. కెల్లీని గృహస్థక్రిస్తవుల మరియు క్రైస్తవ కుటుంబాల సేవా విభాగానికి అధికారిగా పోప్ లియో నియమించారు.
ఈ నియామకం డెన్వర్, కొలరాడోలో ఇటీవల జరిగిన నైట్స్ ఆఫ్ కొలంబస్ 144వ సుప్రీమ్ కన్వెన్షన్‌కు నెల రోజులు కూడా పూర్తికాకముందే జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న వారికి పోప్ లియో సందేశం పంపిస్తూ, వారి సేవలను అభినందించి, భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో కొనసాగాలని ప్రోత్సహించారు.
అమెరికాలో కాథలిక్ చర్చి అభివృద్ధికి నైట్స్ ఆఫ్ కొలంబస్ సంస్థ విశేషంగా సేవలందిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు Fr. Michael McGivneyని పోప్ ఫ్రాన్సిస్ 2020 అక్టోబర్‌లో ధన్యుడిగా ప్రకటించారు.
నైట్స్ ఆఫ్ కొలంబస్ ఒక సేవా సంస్థగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. 2025లోనే స్థానిక ప్రాంతాలలో 4.8 కోట్లకు పైగా సేవా గంటలు అందించడంతో పాటు, 20 కోట్ల డాలర్లకు పైగా సహాయం చేసింది.
వాటికన్‌లోని కొన్ని పునరుద్ధరణ కార్యక్రమాలకు కూడా సహకరించింది. అలాగే కుటుంబాలకు జీవిత బీమా సేవలను అందిస్తోంది.
పాట్రిక్ ఈ. కెల్లీ 1983లో యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో నైట్స్ ఆఫ్ కొలంబస్‌లో చేరారు. 2021లో ఈ కథోలిక సేవా సంస్థకు సుప్రీమ్ నైట్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈయన అమెరికా నేవీలో 20 సంవత్సరాలకు పైగా సేవలందించారు. న్యాయం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీలతో పాటు వివాహం మరియు కుటుంబ అధ్యయనాల్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
తన నియామకంపై పాట్రిక్ కెల్లీ స్పందిస్తూ, **1882లో ధన్యుడు మైఖేల్ మెక్‌గివ్నీ స్థాపించినప్పటి నుంచి, గృహస్థక్రిస్తవులను విశ్వాసంలో బలోపేతం చేయడం, కాథలిక్ కుటుంబ జీవితానికి మద్దతు ఇవ్వడం, జీవన విలువలను పెంపొందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
కెల్లీ సైనిక, ప్రభుత్వ సేవల్లో కూడా పనిచేశారు. మతాంతర సంభాషణ, ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో ఆయనకు అనుభవం ఉంది. అమెరికా ప్రభుత్వం మరియు హోలీ సీ మధ్య సమన్వయ అధికారిగా కూడా సేవలందించారు.