Fifth Gospel Ministries.

Fifth Gospel Ministries. To Empower every believer to become a fifth Gospel

10/01/2024

కీర్తనలు 6:9
యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
The LORD hath heard my supplication; the LORD will receive my prayer.

" ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన వాక్యం మాట్లాడుతుంది నీవు ఎంతో దుఃఖంతో, కన్నీటితో ప్రార్ధిస్తున్నా దేవుడు నా మొఱ్ఱ వినడం లేదేమో అని అనుకుంటున్నావా?.. కానీ దేవుడు మాట్లాడుతున్నారు కదా విననేరకుండునట్లు నా చెవులు మందం కాలేదు, నీ ప్రార్ధన నాకు వినబడింది, నీ ప్రార్ధనను అంగీకరించి ఉన్నాను "ఆమెన్ 🙏🙏🙏🙏

05/01/2024

కీర్తనలు 3:6
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.
I will not be afraid of ten thousands of people, that have set themselves against me round about.

" ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన వాక్యం మాట్లాడుతుంది నీ మీదకు సమస్యలు, శోధనలు ఒక్కసారిగా నీ మీదకు దండేత్తివచ్చిన భయపడకు వాటిని అణగదద్రోక్కకలిగిన శక్తివంతుడైన దేవుడు నీకు తోడైయున్నాడు"ఆమెన్ 🙏🙏🙏🙏

11/12/2023

కీర్తనలు 107:20
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను.
He sent his word, and healed them.

" ఈ సమయంలో జీవం కలగిన దేవుడు మాట్లాడుతున్నారు, ఈ రోజు అనేకమైన అనారోగ్య సమస్యలు గుండా నీవు వెళ్లొచ్చు, డాక్టర్స్ కూడా నీకు చెప్పొచ్చు ఇవి నయం కానీ రోగం అని , అది ఏమైనా కానీ.. దేవుడు మాట్లాడుతున్నారు కదా నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే..నాకు సమస్తమును సాధ్యమే, అసాధ్యమైనది అంటు నాకు ఏమైనా ఉందా..?? "ఆమెన్ 🙏 🙏🙏

11/11/2022

కీర్తనలు 5: 3
యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

Psalm 5: 3
My voice shalt thou hear in the morning, O LORD; in the morning will I direct my prayer unto thee, and will look up.

" ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు నీవు దేని గూర్చి అయితే చింతిస్తూ ప్రార్ధన చేస్తున్నావో ఆ ప్రార్ధన నాకు వినపడింది, నేను నీ ప్రార్ధనను సఫలం చేస్తాను.. నీవు దేనిని గూర్చి చింతించకు " ఆమెన్ 🙏🙏🙏🙏

09/11/2022

కీర్తనలు 3: 4
ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తర మిచ్చును.

Psalm 3: 4
I cried unto the LORD with my voice, and he heard me out of his holy hill. Selah.

" విరిగి నలిగినా హృదయంతో చేసే ప్రార్ధన దేవుడు ఎన్నడూ అలక్ష్యం చేయడు, త్రోసివేయడు ఆయన సన్నిధిలో హన్నా చేసిన కన్నీటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చారు.. హన్నా కన్నీటిని చూసిన దేవుడు మన కన్నీటిని కూడా చూచున్నాడు. మన దుఃఖమును నాట్యంగా మార్చగల దేవుడు " ఆమెన్ 🙏🙏🙏🙏

08/11/2022

కీర్తనలు 1: 3
అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

Psalm 1: 3
And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season; his leaf also shall not wither; and whatsoever he doeth shall prosper.

" మోడీబారిన జీవితం,నిరాశ నిష్పృహ, ఫలవంతం లేని జీవితాలు, ప్రతి ప్రయత్నం విఫలం అని చింతిస్తున్న మనతో జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు " ఎడారి లాంటి మీ బ్రతుకులను జలములు ప్రవహించు నదులు వలె చేస్తాను, మీ ప్రతి ప్రయత్నం సఫలం చేస్తాను నా యందు మీ నిరీక్షణ ఎన్నడూ ఎన్నడును సిగ్గు పడనీయదు " ఆమెన్ 🙏🙏🙏🙏

05/11/2022

యిర్మియా 1: 8
​​వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.

Jeremiah 1: 8
Be not afraid of their faces: for I am with thee to deliver thee, saith the LORD.

" మనం అనేకమైన విషయాలు గూర్చి భయపడుతుంటాం అవి ఎవరికీ చెప్పుకోలేము, వాటి నుండి ఎప్పుడు విడుదల కలుగుతుందా అని చింతిస్తుంటాం కానీ జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నారు " నీవు నీ పరిస్థితులు చూసి భయపడకు వాటి అన్నిటిలోనుండి విడిపించ గల శక్తిగల దేవుడను నేను నీకు తోడై ఉన్నాను " ఆమెన్ 🙏🙏🙏🙏

04/11/2022

యెషయా 58: 14
నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను..

Isaiah 58: 14
Then shalt thou delight thyself in the LORD; and I will cause thee to ride upon the high places of the earth..

" మనం చేసే పనిలో క్రింది వారిగా ఉండొచ్చు, మన పరిస్థితులను బట్టి మనుష్యుల ఎదుట తక్కువ వారిగా ఉండొచ్చు కానీ జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలము లలో ఉంచుతాను. నిన్ను తలగా నియమించుదును గాని తోకగా ఉంచను, నీవు నా యందు ఆనందిస్తావు " ఆమెన్ 🙏🙏🙏🙏

03/11/2022

యెషయా 58: 11
నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

Isaiah 58: 11
Thou shalt be like a watered garden, and like a spring of water, whose waters fail not.

" మనం అనుకుంటాం మన పరిస్థితులు ఎప్పటికి మారవు ఇలానే ఉంటాయి, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడవు, ఆశీర్వాదమే ఉండదు అని అనుకుంటాం కానీ జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నారు " నీ పరిస్థితులు మార్చగల దేవుడునైయున్నాను నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు, ఇక ఎన్నడు కరువును చూడవు నిన్ను క్షామ కాలంలో కూడా క్షేమంగా ఉంచుతాను "ఆమెన్ 🙏🙏🙏🙏

02/11/2022

యెషయా 58: 9
నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును.

Isaiah 58: 9
Then shalt thou call, and the LORD shall answer; thou shalt cry, and he shall say, Here I am.

" మనం బాధలలో ఉన్నప్పుడు ఎవరినినైనా పిలిస్తే పట్టించుకోని మనుషులు ఉంటారు.. కానీ మనం పిలిస్తే ( ప్రార్ధన చేయగా ) సమాధానం ఇచ్చేది జీవం కలిగిన యేసయ్య ఒక్కరే ఆయనే మాట్లాడుతున్నారు కదా నీవు మొఱ్ఱ పెట్టగా నేను ఉన్నాను, నిజంగా ఆయనకు మొఱ్ఱ పెట్టువారికి సమీపంగా ఉన్నారు "ఆమెన్ 🙏🙏🙏🙏

01/11/2022

యెషయా 54: 4
భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు.

Isaiah 54: 4
Fear not; for thou shalt not be ashamed: neither be thou confounded; for thou shalt not be put to shame:

" మనకు ఉన్నా పరిస్థితులు,శోధనలు, సమస్యలను బట్టి నలుగురిలో అవమానకరంగా బాధగా ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నారు " భయపడకు నీవు సిగ్గుపడనక్కరలేదు నీకు అవమాన ప్రతిగా ఘనతను ఇస్తాను, నీ విచారంలు కొట్టివేసి నీ నోటి నిండా నవ్వును కలుగజేస్తాను ఇక నీవు సిగ్గునొందవు " ఆమెన్ 🙏🙏🙏🙏

31/10/2022

యెషయా 50: 7
ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు.

Isaiah 50: 7
For the Lord GOD will help me; therefore shall I not be confounded:

"ఈ ఉదయ కాల సమయంలో జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నారు నీకు ఆపద వచ్చినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు సహాయం కోసం మనుషులు వైపు చూసి అవమానపడుతున్నావా? " ప్రభువగు యెహోవా నేను మాట్లాడుతున్నాను నీకు సహాయం చేయువాడును నేనే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడును నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడును సిగ్గునొందరు "ఆమెన్ 🙏🙏🙏🙏

Address

Vanasthalipuram
Secunderabad

Telephone

+919394749103

Website

Alerts

Be the first to know and let us send you an email when Fifth Gospel Ministries. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Fifth Gospel Ministries.:

Share