BacktotheBible India

BacktotheBible India Back to The Bible - provides Bible -Teaching using Radio, TV, Internet, Mobile Technology, Literature.

10/07/2025

11 జూలై 2025 అధములు మరియు శక్తిమంతులు

చదవండి: 1 కొరింథీ 1:18-31

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 1 కొరింథీ ‭1: 27‭.

నశించిన ఈ లోకం పుట్టుక, సామాజిక హోదా, ఆర్థిక విజయం, అధికారం, మరియు గుర్తింపు అనే వాటికి మెప్పునిస్తుంది. కానీ ఈ విషయాల్లో ఏదీ కూడా నిత్య జీవానికి భరోసా ఇవ్వదు. యేసు క్రీస్తునందలి సందేశం మరియు అధ్భుత కార్యం ఈ లోకం లోని గొప్పవాళ్ళను, బలవంతులను బొత్తిగా సిగ్గుపర్చింది. ఈ లోక జ్ఞానులు దేవుడు పాపులను పరిశుద్ధులుగా ఎలా మారుస్తాడో అర్థం చేసుకోలేరు, అలాగే ఈ లోకంలోని మహాశక్తివంతులు ఇలాంటి అద్భుతం జరిగించలేని నిస్సహాయులు.

సంఘ చరిత్ర పుటలు సువార్త శక్తి రూపాంతరం చెందించిన ఘోరపాపుల వృత్తాంతాలతో నిండి ఉన్నాయి. నా స్వంత పరిచర్యలో న్యాయవాదులు, మానసిక శాస్త్ర నిపుణులు అర్థం చేసుకోలేకపోయిన ఆశ్చర్యకార్యాలు జరగడం నేను చూసాను. మేము నేరప్రవృత్తి గల టీనేజర్లు సఫలురైన విద్యార్థులుగా, ప్రయోజనకరమైన పౌరులుగా మారడం చూసాం. న్యాయస్థానాలే ఆశ్చర్యపోయే విధంగా, వివాహాలు పునరుద్ధరింప బడడం, కుటుంబాలు తిరిగి కట్టబడడం మేం చూసాం.

సరే, దాని తత్వవిచారం, మతంతో సహా, దేవుడు ప్రస్తుత ఈ ప్రపంచ వ్యవస్థ యొక్క మూర్ఖత్వం, దౌర్బల్యం ఎందుకు బహిర్గతం చేస్తాడు? “దేవుని యెదుట ఏ శరీరియు అతిశయ పడకుండునట్లు" (v. 29). రక్షణ పూర్తిగా కృపచేతనే కలగాలి; లేనట్లయితే, దేవునికి మహిమ కలుగదు.

లోతుగా ఆలోచించాల్సిన విషయం:

జ్ఞానులకు, శక్తివంతులకు కూడా అంతుపట్టని దేవుని ఏ ఆశ్చర్యకార్యం మీరు ఇటీవల చూసారు?

For online donation
https://backtothebible.in/donate-now/

The Good News Broadcasting Society
A/c no - 30181010001343
IFSC-CNRB0013313
Branch code- 13313
Canara Current account

Ph No. 9492440070
[email protected]

29/06/2025

30 జూన్ 2025 పైకి చూడడం

చదవండి: కొలస్సీ 3:1-2
‭‭ ‭
పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీ ‭3:2‭-‬3‬

మన హృదయాలను ఎలా పైనున్న వాటిమీద పెట్టుకోగలం? దాని రహస్యం 2వ వచనం యొక్క అక్షరార్థ తర్జుమాలో కనుగొంటాం. “మీ మనసును - మీ ధ్యాసను- అలవాటుగా పైనున్నవాటిపై పెట్టుకోండి, భూసంబంధమైన వాటిపై కాదు." మన పాదాలు భూమ్మీద ఉండాలి, మన మనసులు పరలోకంలో ఉండాలి. (డి.ఎల్. మూడి గారు ఎప్పుడూ అంటుండే విధంగా) "భూలోకంలో ఎందుకూ పనికిరానంతగా మనం పరలోకమనస్కులం" కావాలనడం కాదిది. దాని అర్థం ఏమిటంటే మన జీవితానికి సంబంధించిన రోజువారీ వ్యవహారాలు పరమందలి క్రీస్తు నడిపింపుతో సాగాలని. ఇంకా దాని అర్థం ఏమిటంటే, మనం పరలోక దృష్టి కోణంతో భూమి వంక చూడాలని.

వాషింగ్టన్ డి. సి.లో ఓ సభకు హాజరైన సందర్భంలో, నేను టీవిలో ఓ సెనేట్ కమిటీ వారి చర్చను చూసాను. వారు ఐక్యరాజ్య సమితికి పంపడానికి ఓ కొత్త రాయబారి గురించి ఆలోచిస్తున్నారని నా నమ్మకం. సరిగ్గా నేను టెలివిజన్ ఆన్ చేసినపుడు దివంగత సెనేటర్ హ్యూబర్ట్ హంఫ్రీ ఓ వ్యాఖ్య చేస్తున్నాడు: "మీరు తప్పక గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే రాజకీయాల్లో మీరు ఎలా నిలబడతారనేది మీరెక్కడ కూర్చుంటారు అన్న దానిపై ఆధారపడివుంటుంది." అయితే, అపుడు అతడు మాట్లాడుతున్నది సెనేట్ లో ఆ రాజకీయ పార్టీ కూర్చునే ఏర్పాటు గురించి అనుకోండి, కానీ వెంటనే నేను దాన్ని క్రీస్తులో మన స్థానానికి అన్వయించుకున్నాను. మనం ఎలా నిలబడతాం అన్నది మనం ఎక్కడ కూర్చుంటాం అనేదానిపై ఆధారపడ్తుంది, మరి మనమైతే క్రీస్తు తో పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం (ఎఫెసీ 2:6)!

లోతుగా ఆలోచించాల్సిన విషయం:

మీరెలా మరెక్కువగా పరలోకమనస్కులై ఉండగలరు?

For online donation
https://backtothebible.in/donate-now/

The Good News Broadcasting Society
A/c no - 30181010001343
IFSC-CNRB0013313
Branch code- 13313
Canara Current account

Ph No. 9492440070
[email protected]

27/06/2025

28 జూన్ 2025 ఆశావహ భవిష్యవాక్కు

చదవండి: యెషయా 32-33

‭‭యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. యెషయా 33:22

ఓ విశ్వవిద్యాలయ ఆచార్యుడు తన పఠన గది గోడపై ఒక ప్రకటన పెట్టాడు, అది ఇలా ఉంది," భవిష్యత్తు మునుపు ఎలా ఉండేదో అలా లేదు". అణుశక్తి రాకతో చాలా మంది అసలు భవిష్యత్ అనేది ఉందా అని విస్మయపడ్తుంటారు. ఆల్బర్ట్ ఐన్ స్టైన్ తాను భవిష్యత్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదనీ, ఎందుకంటే అది తగినంత తొందరగా వచ్చేసేదని అన్నాడు!

యెషయా 32-35, ప్రవక్త దేవుడు తన ప్రజల కోసం, తన ప్రపంచం కోసం ఏమి ఏర్పాటు చేశాడో చూడ్డానికి భవిష్యత్ సంఘటనల్ని చూడమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. యెషయా 32:1 లో, అతడు "ఒక రాజు" గురించి రాస్తాడు; కానీ 33:17 లో, అతడు ఆయనను "రాజు" అంటాడు. మనం 22వ వచనం వరకు వచ్చేసరికి, ఆయన "మన రాజు" అని అంటాడు. యేసు క్రీస్తు "ఓ రాజు" అంటే సరిపోదు, "రాజు" అంటే కూడా సరిపోదు. మనం ఆయన యందు విశ్వాసాన్ని ప్రకటించి, నిశ్చయత కలిగి "మన రాజు" అనాలి.

యెషయా దినాల్లోని దుర్మార్గపు పాలకులకు భిన్నంగా, మెస్సీయా నీతి, న్యాయాలతో పరిపాలిస్తాడు. యెషయా ఆధ్యాత్మిక అంధులకు, బధిరులకు, అజ్ఞానులకు పరిచర్య చేశాడు; కానీ దేవుని రాజ్యంలో, అందరూ దేవుని సత్యాన్ని చూస్తారు, వింటారు మరియు గ్రహించి దానికి లోబడ్తారు.

లోతుగా ఆలోచించాల్సిన విషయం:

సరిగ్గా ఈ నిమిషమే, భవిష్యత్తు గురించి మీకున్న కొన్ని చింతలు ఏవి? మీరు నిజంగా దేవునిలో నమ్మిక ఉంచితే, మీరింకా ఎందుకు చింతిస్తున్నారని మీరనుకుంటారు?

For online donation
https://backtothebible.in/donate-now/

The Good News Broadcasting Society
A/c no - 30181010001343
IFSC-CNRB0013313
Branch code- 13313
Canara Current account

Ph No. 9492440070
[email protected]

24/06/2025

26 జూన్ 2025 దాహం తీర్చువాడు

చదవండి: యెషయా 54-56

‭‭దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. యెషయా‬ ‭55:1‬ ‭

తూర్పు ప్రాంతంలో, నీరు ప్రశస్తమైనది, నీళ్ళు సమృద్ధిగా ఉండడం ఓ ప్రత్యేక ఆశీర్వాదం. ద్రాక్ష రసం, పాలు, రొట్టె మధ్యప్రాచ్య ఆహారంలో ప్రధానమైనవి. యూదా జనులు వారికి పోషణనివ్వని ప్రత్యామ్నాయాలపై జీవిస్తూ ఉన్నారు. వారికి "నిజమైంది" కావాల్సి ఉంది, అది ప్రభువు మాత్రమే ఇవ్వగలిగినది. లేఖనాల్లో, నీరు, ద్రాక్షరసం రెండూ పరిశుద్ధాత్మకు సాదృశ్యం (యోహాను 7:37-39; ఎఫెసీ.5:18). యేసు జీవాహారం (యోహాను 6:32-35), ఆయన యొక్క జీవవాక్యం పాల వంటిది (1 పేతురు 2:2). మన ప్రభువు," ‭క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి"(యోహాను 6:27) అని అన్నపుడు బహుశా ఆయన మనసులో యెషయా 55:2 ఉండవచ్చు.

బావులు త్రవ్వడానికి, వారి పశువుల మందలను కాయడానికి, విత్తనాలు విత్తడానికి, ద్రాక్ష తోటలు కాయడానికి ప్రజలు చాలా కష్టపడి పని చేయాల్సి వచ్చేది. కానీ వారు దేనికోసం కష్టపడుతున్నారో అదంతా ప్రభువు వారికి ఉచితంగా ఇస్తానన్నాడు. వారు ఒకవేళ ఆయన మాట విని ఉంటే, వారికి రావడానికి మనసుండేది; ఎందుకంటే దేవుడు పాపులను తన వద్దకు రప్పించుకుంటాడు (యోహాను 5:24). యేసు క్రీస్తు అన్యులకు ("జనములకు",55:4), దేవుని నిబంధన. దేవుని వాగ్దానాలు ఆయన కుమారుడు జీవించినంత కాలం నిలిచి ఉంటాయి, అంటే నిరంతరం.

లోతుగా ఆలోచించాల్సిన విషయం:

తీవ్రమైన దప్పిక మీ మనోస్తితిని, పనితనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆధ్యాత్మిక అర్థంలో కూడా ఇది ఎలా నిజమై ఉండొచ్చు?

For online donation
https://backtothebible.in/donate-now/

The Good News Broadcasting Society
A/c no - 30181010001343
IFSC-CNRB0013313
Branch code- 13313
Canara Current account

Ph No. 9492440070
[email protected]

23/06/2025

24 జూన్ 2025 ఆత్మ వంచన

చదవండి 1 యోహాను 1:8-9

మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. ‭‭1 యోహాను‬ ‭1:3‬ ‭

నిజాయితీ లేని విశ్వాసులు దేవునితో మరియు దేవుని ప్రజలతో సహవాసాన్ని కోల్పోతారు. ఫలితంగా ప్రార్థన వారికి లోన ఖాళీగా ఉన్న ఓ బాహ్యారూపమౌతుంది. ఆరాధన నిరాసక్తంగా ఉండే రోజువారీ తంతు అవుతుంది. వారు ఇతర క్రైస్తవులను విమర్శించే వారిగా మారి, సంఘానికి దూరంగా ఉండడం మొదలుపెడతారు. ఓ సంఘ సభ్యుల గుంపొకటి కొత్తగా వచ్చిన వారి కాపరి గురించి చర్చించుకుంటున్నది. “ఎందుకోగాని నిజంగా ఆయన దగ్గర నేను మామూలుగా ఉండలేకపోతున్నాను. నేను ఆయన మంచి వాడని నమ్ముతున్నాను, బానే వుంది - కానీ మా మధ్య ఏదో అడ్డం వస్తున్నట్టు అనిపిస్తుంది" ఒకతను అన్నాడు. మరొకతను జవాబిస్తూ,"అవును, మీరు చెప్పేది నాకు అర్థమైందనుకుంటున్నా . నాక్కూడా ఆయనతో అదే సమస్య ఉండేది, కానీ ఇప్పుడు నాకది ఎంతమాత్రం లేదు. పాస్టర్ గారితో నాకు గొప్ప సహవాసం ఉంది.

‘మీ సంబంధం బాగుపడ్డానికి ఆయనేం చేసాడు?" జవాబుగా అతని స్నేహితుడు, “ఆయనేమీ చేయలేదు. మారడం అంతా నేనే చేసాను" అన్నాడు. "నువ్వు మారావా?" "అవును, అన్ని విషయాల్లో నేను దాపరికం లేకుండా, నిజాయితీగా ఉండడానికి నిర్ణయించుకున్నాను, మన పాస్టర్ గారిలా. ఆయన జీవితంలో కపటపు మచ్చ ఒక్కటైనా లేదు, కానీ నా జీవితంలో ఎంత నటన ఉండిందంటే, మా ఇద్దరికీ అసలు కుదిరేది కాదు. ఆయనకూ, నాకూ కూడా నేను నకిలీ అని తెలుసు. నేను నిజాయితీగల క్రైస్తవునిగా జీవించడం మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి విషయం మెరుగ్గా ఉంది."

లోతుగా ఆలోచించాల్సిన విషయం:

మీ ప్రార్థన శూన్యంగా,మీ ఆరాధన నిరాసక్తంగా మారినపుడు, మీరు దారిలో పడ్డానికి ఏం చేస్తారు?

For online donation
https://backtothebible.in/donate-now/

The Good News Broadcasting Society
A/c no - 30181010001343
IFSC-CNRB0013313
Branch code- 13313
Canara Current account

Ph No. 9492440070
[email protected]

Address

1-30-220, Telecom Colony, Kanajiguda
Secunderabad
500015

Alerts

Be the first to know and let us send you an email when BacktotheBible India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to BacktotheBible India:

Share