16/10/2022
✳ *103 వ కీర్తనా ధ్యానం* ✳
(మూడవ భాగం)
7️⃣ *యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.*
కీర్తనలు 103:8
👉 *దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు.*
1. *యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు*
దేవుని దయ సంపూర్ణమయినది. ఇశ్రాయేలీయులు అరణ్యములో సణుగుతూ వున్నారు.
*దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వున్నారు. అయినా ప్రతీ పరిస్థితియందు వారి అవసరతలు తీరుస్తూ వారిని ముందుకు నడిపిస్తూ వున్నాడు.*
మన జీవితాలు అంతే. భక్తి చేస్తున్నాం.
*కాని ఆ భక్తిలో భయం లేదు. సంతృప్తికి చోటేలేదు.*
అయినా, ఆయన దయాళుడు కాబట్టి ఇట్టి రీతిగా జీవింప చేస్తున్నాడు.
2. *యెహోవా దీర్ఘశాంతుడు*
ఇశ్రాయేలీయులు జరిగించిన ప్రతీ పరిస్థితిని ఆయన సహిస్తున్నాడు.
మన జీవితాలు అంతే. మన పట్ల కూడా అదే దీర్ఘ శాంతమును చూపు చున్నాడు.
*క్షణక్షణం ఆయన గాయాలను రేపే వారిగానే వున్నాం.ప్రతీ క్షణం ఆయనను సిలువ వేస్తూనే వున్నాం.*
👉 ఒక్క క్షణం ఆయన కన్నెర్ర చేస్తే ఏమవుతుందో తెలుసా? అది ఊహలకే భయంకరం.
వద్దు!
*ఆయన సహనాన్ని చులకన చెయ్యొద్దు.*
*3. యెహోవా కృపాసమృద్ధిగలవాడు*
ఏ అర్హత లేని మనం నిర్మూలము కాకుండా నేటి వరకు నిలిచి యున్నామంటే ఆయన యొక్క సమృద్ధి అయిన కృప మాత్రమే.
*"యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము"*
విలాప 3:22.
అవును!
సందేహం లేనేలేదు.
*నీ కోసం ఇంత శ్రద్ధ కలిగియున్న ఆయన కోసం నీవేమి చెయ్యగలవు?*
విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతచేరి, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతించు. అది చాలు. అంతకుమించి దేనినీ నీ నుండి ఆయన ఆశించడు.
8️⃣ *తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.*
కీర్తనలు 103: 13,14
తండ్రి తన కుమారుల యెడల ఎట్లా జాలి చూపిస్తాడో మన పరలోకపు తండ్రి కూడా ఆయన యందు భయ భక్తులు కలిగిన తన పిల్లలపట్ల కూడా అదే రీతిగా జాలిని కలిగి ఉంటాడు.
👉 *కారణం ఏంటో తెలుసా?*
*ఆయన చేతులే మనలను నిర్మించాయి. మనము మంటి వారమని ఆయనకు తెలుసు.*
*ఏల యనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.*
ఆది 3:19
👉 మనము బలహీనులము, మంటివారమని చెప్పి, ఆయన మన పట్ల జాలిని చూపిస్తుంటే?
*మనమేమో ఇది నా నీతి, నా పరిశుద్దత, నా తెలివి, నా జ్ఞానం అంటూ నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే అంటూ అతిశయిస్తున్నాం.*
👉అంతేగాని, పెంట కుప్పల మీద ఉండాల్సిన మనలను మింటపైన ఘనులతో కూర్చుండ బెట్టాడు అనే సత్యాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నాం.
*ప్రతీ పరిస్థితియందు ఆయన మనపట్ల జాలి చూపి మనలను ఈస్థితిలో ఉంచాడు అనే విషయాన్ని గుర్తిద్దాం!*
*అంగీకరిద్దాం!*
*ఆయనను స్తుతిద్దాం!*
9️⃣ *నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.*
కీర్తనలు 103: 15,16
👉అవును!
మనిషి జీవితం క్షణబంగురం.
అంతలోనే కనిపించి అంతలోనే మాయమయ్యే నీటి బుడగ వంటిది.
*దాని అందం వర్ణనాతీతం. లెక్కలేని రంగులతో ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. కాని దాని అందం ఎంతసేపు? ఏ క్షణంలో పగిలిపోతుందో?*
👉గడ్డి పువ్వు అందం అద్భుతం, దానికీ ఎన్ని రంగులో?
👉గాలిలో అటూ ఇటూ ఊగుతూ వుంటే దాని వైభవం మరింత పెరిగిపోతుంది. కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది.
👉 *కాని, దాని అందం ఎంతసేపు?*
👉 *దాని వైభవం ఎంత కాలం?*
👉 *మన జీవితాలు అంతే.*
*ఈ రంగుల ప్రపంచంలో ఇదే శాశ్వతం ఆనుకొని అంతా నేనే, నాకు నేనే సాటి. అనుకొంటూ దేవుడంటే భయము భక్తి లేని జీవితాన్ని జీవిస్తున్న మనము ఏ క్షణాన్ని వాడిపోతామో?రాలిపోతామో?*
*సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.* 1పేతురు 1:24
ఆ ఎండిన గడ్డిపువ్వు గాలిచేత నెట్టబడినప్పుడు దాని గమ్యమెటో దానికి తెలియదు. మరల ఎప్పటికీ కూడా తన స్థలానికి తిరిగి చేరుకోలేదు.
*ఈలోకంలో ఎన్ని రంగులు మార్చినా, ఒకదినాన్న ఈ లోకాన్ని విడవాల్సిందే?*
అది నీ ప్రాణం పోకడో?
దేవుని రాకడో?
ఏదయినా కావొచ్చు.
మరళా ఎప్పటికీ నీ స్థలానికి రావు.
*వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు* యోబు 20:9
👉 మనవి అంత అల్ఫమైన జీవితాలు, మట్టి జీవితాలు అని ఆయన జ్ఞాపకం చేసుకొని మనపై జాలి చూపి, ఆయన కృపతో మనలను నడిపిస్తుంటే?
మనమేమో, దేవునికే ఎదురాడు వారివలే జీవిస్తున్నామేమో?
వద్దు! అల్పమైన ఈ జీవితం ఆయనకోసం జీవించి, శాశ్వత రాజ్యమును స్వతంత్రించు కుందాం!
🔟 *ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.*
కీర్తనలు 103: 17,18
👉ఆయన నిబంధన, కట్టడ అనగా *"దేవుని వాక్యము."*
👉 ఎవరయితే దేవుని వాక్యమును అనుసరిస్తారో?
👉ఎవరయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో?
*వారి మీద ఆయన కృప వారి పిల్ల తరములు నిలిచి వుంటుంది.*
అవును!
*మన జీవితాలు మన పిల్లలమీద ప్రభావం చూపుతాయి.*
🔹ఆ దినాలలో ఒకమాట వాడుకలో వుండేది.
*"తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి."* అని
అంటే దీని అర్ధం,
*తలిదండ్రులు జరిగించిన క్రియల ఫలితాన్ని వారి బిడ్డలు అనుభవించాల్సి వస్తుందని.*
*అట్లానే, మనము తలిదండ్రులుగా దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తే ఆ ప్రతిఫలం మన పిల్లలు అనుభావిస్తారట.*
👉 అట్లాఅని, మనము రక్షించబడి మన పిల్లలు రక్షణ లేని వారయితే, మనలను బట్టి వారు నిత్య జీవంలోనికి ప్రవేశించరు.
♻ *కాని ఒక్క విషయం!!*
*మనము రక్షించబడిన వారమైతే మన జీవిత విధానం మన పిల్లల మీద ప్రభావం చూపి వారును రక్షణలోనికి వచ్చే అవకాశం తప్పక వుంటుంది.*
👉 అంతేగాని,
చేదు విత్తులు విత్తి, శ్రేష్ఠ ఫలాలకోసం ఎదురు చూడొద్దు.
కొబ్బరి చెట్టు నుండి ఖర్జూరాలు ఆశించ్చొద్దు
*ఆయన యందు భయభక్తులు కలిగియుందాం!*
*ఆయన కట్టడలను,నిబంధనలను అనుసరిద్దాం!*
*ఆయన కృపకు మరింత దగ్గరవుదాం!*
*తద్వారా మన పిల్లలు ఆశీర్వదించ బడడానికి కారకులవుదాం!*
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
1️⃣1️⃣ *యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీదరాజ్యపరిపాలనచేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.*
కీర్తనలు 103: 19,20
*"ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము"*
యెషయా 66:1
👉 ఆయన ఎంత అత్యున్నతుడో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి.
👉 ఆకాశమునే ఆయన సింహాసనముగా చేసుకొని కూర్చుంటే,
ఆయన పాదములు భూమిని తాకుతున్నాయట.
♻ *అంతటి గొప్ప దేవునిపై 6 అడుగులు పొడవు కూడా లేని ఈ మనిషి ఎదురు తిరుగుతున్నాడంటే?*
👉 అది మూర్ఖత్వమో?అమాయకత్వమో?
*ఆయన ఒక దేశానికే రాజు కాదు,రాజులకే రాజు,విశ్వమంతటికి రారాజు.*
👉 దూతలు మొదలుకొని సామాన్య మానవుని వరకు ఆ రాజుని స్తుతిచెయ్యాలని దావీదు జ్ఞాపకం లోనికి తీసుకొని వస్తున్నాడు.
*సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.*
కీర్తనలు 47:1,2
*బలహీనత చేత కృంగిపోతున్న నీవు ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నట్లయితే?*
ఆయన మనకు పెట్టిన పేరేంటో తెలుసా?
*"బలశూరులు".*
శారీరకంగా బలహీనులమే కావొచ్చు.
*ఆత్మీయంగా బలవంతులం.*
👉ఎందుకంటే?
ఆయన బలవంతుడైన దేవుడు.
*ఆయన పిల్లలమైన మనం బలశూరులం.*
*మనకు బలమిచ్చి,మనకోసం బలియాగమైన,ఆ దేవునికి మనమేమిచ్చి ఋణం తీర్చుకోగలం?*
🔹మనసారా!
🔹నోరారా!
🔹ఊరూరా!
*ఆయన స్తుతించడం తప్ప.*
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచు కొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
(103 వ కీర్తనా ధ్యానములు సమాప్తం)
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదము.*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*
👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు
*WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *8520848788* - *9492917661*
👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*