30/08/2025
పల్నాడు లో ప్రసిద్ద శైవాలయం సత్రశాల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి ఆలయ చరిత్ర:
మన పల్నాడు లోని రెంట చింతల మండలంలో జెట్టిపాలెం గ్రామంలో ఉన్న ప్రసిద్ద శ్రీ మల్లికార్జున భ్రమరాంభికా దేవాలయం గురించితెలుసుకుందాం ద్వాపర యుగం నుండి ఈ ఆలయం ఉన్నట్లు ఆధారాలున్నాయి. పూర్వ కాలంలో విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేసుకుంటుండగా. కాకులు రూపంలో కాకాసురుడు అనే రాక్షసుడు తపస్సు కు భంగం చేయుచుండగా అయోధ్యకి పోయి రామ,లక్ష్మణుల సహాయం కోరతాడు .దైదా కుమారుడైన కాకాసురడును రాక్షసుడు తోటి రాక్షసులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు తపస్సును భగ్నం చేయదలచి కావ్..కావ్ అని వాయురోధన చేయుచుండెను. ఆ రోధనలుకు ఆగ్రహించిన విశ్వామిత్రడు అవి నిజమైన కాకులని భావించి ఈ నీచ కాకులు ఈ ప్రాంగణములో ఎక్కడా వాలినా జీవము పోవుగాక అని శపించెను అని స్థలపురాణం. దీంతో ఈ ప్రాంతంలో నేటికి కాకులు వాలవు. రామ,లక్ష్మణులు కాకాసురుడు ఇతర రాక్షసులను సంహరించి విశ్వామిత్రుడు యాగం పూర్తి చేసేలా సహకరిస్తారు
శ్రీరాముడు ఈ ప్రాంతంలో తన విల్లు,అంబులను ఒక చెట్టు పై దాచాడని లంక పై యుద్దానికి వెళ్లేటప్పుడు మరలా ఆయుధాలు తీసుకున్న మహిమాన్విత స్తలంగా చెపుతారు ఇప్పుడున్న నది నీరు లో రామ పాద గుర్తులుఉన్నట్లు ఆ గుర్తు నుండి ప్రతి నిండు పౌర్ణమి రోజు నాగేంద్ర స్వామి వచ్చి శివలింగం ను చుట్టు కుంటుందని పెద్దలు చెపుతారు... ఆలయం పక్కనే ప్రవహించే కృష్ణానది పరవళ్లు చూడ చక్కగా ఉంటుంది.ఈ ఆలయ ప్రాంగంణంలో శిల్పసంపద అద్బుతం గా ఉంటాయి.పురాతన నాగ శాసనాలు ఇక్కడ చాలా కనిపిస్తాయి.. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే భ్రమరాంభికా అమ్మవారి విగ్రహం భక్తుల కోరిన కోరికలు తీర్చే తల్లి గా చెపుతారు.ఆలయ ప్రాంగణంలో ఉండే నందీశ్వరుని విగ్రహం ఇక్కడ శిల్పా కళా వైభవానికి నిదర్శనం. అతి ప్రశాంత మయిన వాతావరణం,రమణీయ శిల్ప సంపద భక్తులను ఆకట్టుకుంటాయి.శివుడు భోళా శంకరుడు కనుక కోరిన కోర్కెలుతీర్చుతాడని ఈ దేవాలయాన్ని సందర్శించిన వారికిసుఖశాంతులు,ఆయురారోగ్యాలు కలుగు తాయని భక్తుల నమ్మకం. శివరాత్రి సమయంలో ఇక్కడ కు అధిక సంఖ్య లో భక్తులు వస్తారు.
స్వయంభువు అయిన ఈ మల్లిఖార్జున లింగాన్ని కౌషికముని,శ్రీరాముడు,లక్షమణుడు,విశ్వామిత్రమహర్షి,యదావాక్కుల అన్నమాచార్యులవారు పూజించి తరించారు శ్రీమహావిష్ణువు వామన రూపం దాల్చిన ప్రదేశం కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే అందుకని ఈ ఆలయానికి సిద్దివనం అని పేరు. యదావాక్కుల అన్నమాచార్యుల వారు ఈ ఆలయ మల్లన్న స్వామిపై సర్వేశ్వరశతకం అనే గ్రందాన్ని రచించెను
స్తలపురాణం....పార్వతీ పరమేశ్వరులు నడచివస్తుండగా అమ్మవారు పరమశివునితో పరమేశ్వరా మీరు పదండి నేను వచ్చెదను ఏట్టి పరిస్తితులలొ వెనుకకు తిరగవద్ధు అని పలికెను ధానికి పరమశివుడు అంగీకరించెను కొంత దూరం నడచిన తరువాత పరమేశ్వరుడు తన మదిలో ఏమిటి పార్వతీ దేలి కాలి గజ్జల చప్పుఢు వినిపించంటంలేధు అని వెనుధిరిగిచూసెను ఆ వెనువెంటనే పరమేశ్వరుడు శిలగా మారెను ఈ ఈ వృత్తాంతం అంతా ఆ రాజ్యపు రాజు కలలో వచ్చెను మరుసటిరోజు ఆ ప్రదేశానికి వెల్లిచూడగా అక్కడ నిజంగానే శివలింగం అగుపించెను అప్పుఢు ఆ రాజు మల్లిఖార్జునుడికి ఆలయం నిర్మించి పూజించెను
సత్రశాల లో మల్లేశ్వరలింగంను విశ్వామిత్రుడు ప్రతిష్ఠించినాడు. క్రీ.శ.1244లో కాకతీయ సామంతుడు మహామండలేశ్వర కాయస్థ అంబయ్య దేవుడు సత్రశాలలోని స్వయంభూ శ్రీమహాదేవుని ఆలయానికి మార్గళి ఉత్సవం జరపడానికి ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రాంతంలో వసూలైన సుంకాలను దేవాలయ దైవ, దూప, నైవేధ్యాలుకు ఉపయోగించాలి. అనేక మంది దివ్యర్షులు ఈశ్వరాధన చేస్తూ, సత్రయాగాదులు చేసిన మహాస్థల మగుటచేత ఈ ప్రాంతం సత్రశాల గా పేరొందని మరొక కధనం ఉంది. పాల్కురికి సోమనాథులకు సమాకాలికుడైన గోదావరి మండలం పట్టస గ్రామానికి చెందిన యథావాక్కుల అన్నమయ్య ఈ పుణ్యభూమికి వచ్చి మల్లేశ్వరస్వామివారిని సేవించుచు శా.శ 1164 లో సర్వేశ్వర శతకము రచించి యిచ్చటనే సిద్ధి పొందినట్లు ప్రతీతి. విశ్వామిత్రుడు బ్రహ్మరిషి అనబడే మహొన్నత పదవి కోసం సత్రయాగం చేయుట చేత ఈ ప్రదేశంకు సత్రశాల అనియు, శ్రీ మహా విష్ణువు బలిచక్రవర్తి గర్వము అణుచుటకు వామనరూపము దాల్చిన ఈ వనమును సిద్ధవనం అనియు, శ్రీరాముడు అస్త్రశస్త్రంబులచే ఛత్రాకారము నిర్మించుటచే శస్త్రశాల అనియు నామధేయము ఏర్పడిందని ప్రతీతి.
* ఆలయ విశేషాలు
సత్రశాల క్షేత్రమున అనేక ప్రాచీన శివాలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రమున భ్రమరాంబ, మల్లిఖార్జునుడు, శివకేశ భేదరహితముగా శ్రీ కుమారస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి,శ్రీ కాశీ అన్నపూర్ణ,శ్రీ విశ్వేశ్వరుడు,శ్రీ కాలభైరవుడు, శ్రీ చీకటి మల్లయ్యస్వామి,శ్రీ బ్రహ్మదేవుడు, శ్రీ ఆంజనేయస్వామి, అమరలింగేశ్వరుడు, సంతానమల్లిఖార్జునుడు, శ్రీచెన్నకేశవస్వామి, శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయాలు కలవు.
*ఏకశిలా నంది=ఆంథ్రప్రదేశ్ లొ గల అతి పెద్ద నందివిగ్రహాలలో ఈ నంది ఏకశిలా నంది
*ఓంకార లింగం=స్వామి వారి ప్రధాన విగ్రహం నుండి ఓంకార ద్వనులు వినిపిస్తుంటాయి
* బ్రహ్మ దేవుని ఆలయం=హిందూ సాంప్యదాయంలో భ్రహ్మ దేవునికి అరుదుగా ఆలయాలు కనిపిస్తాయి ఈ దేవాలయంలొ బ్రహ్మ దేవునికి ఆలయం కలదు
*విచిత్ర నంది=సాదారణంగా శివుని ఎదురుగా ఉన్న నందీశ్వరుడు శివుని వైపుకే చూస్తాడు కాని ఈ దేవాలయంలోగల నందీశ్వరుఢు మాత్రం ప్రక్క దేవాలయంలో ఉన్న భ్రమరాంభ అమ్మవారిని చూస్తూ ఉంటాడు
*జోడీ లింగాలు=హైందవ సాంప్రదాయంలో కనిపించే అరుదైన శివలింగం
*సీతలేని రామునిగుడి=రాములవారు ఈ ఆలయానికి వచ్చినపుడు ఆయనకు ఇంకా వివాహం జరుగలేదు అందు వలన ఈ దేవాలయంలొ సీతాదేవి ఉండదు
ప్రతి ఏటా ఆషాడ శుద్ధ ఏకాదశి వ్యాస పూర్షమ, మహా శివారాత్రి పర్వదినాలలో ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానదిలో తోట్టి,లాంచీల ద్వారా కృష్ణానది దాటి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. కృష్ణా పుష్కరాలు సమయం భక్తులు పోటేత్తుతారు. ఈ క్షేత్రం నందు శ్రీశైలం వలే అన్ని కులముల వారిక సత్రాలు కలవు. ఈ సత్రాలు నందు వసతి,బోజన సదుపాయాలు ఉంటాయి. . అతి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దర్శిస్తే సకల పాపాల హరణం అని పెద్దలు చెపుతారు. అతి పురాతన చారిత్రక సంపద కలిగినఈ దేవాలయం ను దర్శించని వారు తప్పక దర్శించండి.మన పల్నాడు ప్రాంతం చరిత్ర కు,పురాతన ఆలయాల కు పెట్టింది పేరు.అటువంటి పల్నాటి సీమ లో పుట్టిన మనం మన చరిత్ర తెలుసుకోవాలి,ఇతరులకు పంచాలి.
మాచెర్లకు 20కిమీ దూరంలో గోలి, మల్లవరం, జెట్టిపాలెం గ్రామాలకు సమీపంలో ఈ సత్రశాల క్షేత్రం ఉంది. గుంటూరు, మాచర్ల నుంచి బస్సు ద్వారా పాలువాయి జంక్షన్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోద్యారా 6 కీమీ దూరంలో ఉన్న సత్రశాలకు చేరుకోవచ్చును.