Kadapa Rayalaseema

Kadapa Rayalaseema Kadapa: Kadapa (also known as Cuddapah) is a city (municipal corporation) in Rayalseema, Rayalu elilina seema na rayala seema, Andhra Pradesh.

09/07/2026
🚨🚨Missing 🚨🚨🚨Tvs victor, bandi AP04BN5288 నెంబర్ గల బండి నిన్న 5/7/26 రాత్రి 9:30 pm టైం లో రాయచోటి మాసాపేట opposite ind...
06/07/2026

🚨🚨Missing 🚨🚨🚨Tvs victor, bandi AP04BN5288 నెంబర్ గల బండి నిన్న 5/7/26 రాత్రి 9:30 pm టైం లో రాయచోటి మాసాపేట opposite indian oil petrol bunk ఐటిఐ కాలేజీ రోడ్ లో ఎవరో దొంగలు తీసుకెళ్లడం జరిగింది ఎక్కడైనా కనపడితే కామెంట్ చేయగలరు 🙏ఈ క్రింది నెంబర్ కూడా తెలుపగలరు 🙏🙏, pls share to every one.. 🙏
8328608065,7989351014

13/06/2026

"ప్రీపెయిడ్ మరణం"

బెంగళూరులోని బయ్యతరాయణಪುರలో 70 ఏళ్ల నారాయణప్ప అనే రిటైర్డ్ బస్సు కండక్టర్ ఉండేవాడు. అతని భార్య లక్ష్మి ఐదేళ్ల క్రితం మరణించింది. ఇద్దరు పిల్లలు — కొడుకు రమేష్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కూతురు సుమా దుబాయ్‌లో నర్స్.

నారాయణప్ప ఒంటరిగా జీవించేవాడు. నెలకు ₹18,000 పెన్షన్ వచ్చేది. అందులో ₹8,000 అద్దెకు, మిగిలిన ₹10,000 మందులు, ఆహారం, విద్యుత్ బిల్లులకు సరిపోయేది.

ప్రతి ఆదివారం పిల్లలకు వీడియో కాల్ చేసేవాడు. "ఎలా ఉన్నావు నాన్న?" అని అడిగినా, వారి సమాధానం ఒక్కటే...

"Busy Dad... తర్వాత మాట్లాడతాం."

రెండేళ్లుగా నారాయణప్పకు కిడ్నీ సమస్య. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఒక్కోసారి ₹2,000 ఖర్చు. నెలకు ₹16,000.

ఒకరోజు డాక్టర్ చెప్పాడు:

"నారాయణప్పగారు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. ఖర్చు దాదాపు ₹10 లక్షలు."

నారాయణప్ప నవ్వుతూ అన్నాడు:

"డాక్టర్ గారు, నా కొడుకు నెలకు ₹5 లక్షలు సంపాదిస్తాడు. కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడటానికి సమయం లేదు. ఇక నా కోసం ₹10 లక్షలు ఎక్కడ ఖర్చు చేస్తాడు?"

ఆ రోజు నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు.

డయాలసిస్ ఆపేశాడు.

పిల్లలకు చెప్పలేదు.

అలాగే ఒక డైరీ కొనుగోలు చేసి దానికి పేరు పెట్టాడు:

"Prepaid Death" (ప్రీపెయిడ్ మరణం)

మొదటి పేజీలో ఇలా రాశాడు:

> "జియో, ఎయిర్‌టెల్‌లా నా జీవితానికీ రీచార్జ్ కావాలి. కానీ ఎవరూ చేయరు. అందుకే నా మరణానికి నేనే ముందుగానే చెల్లిస్తున్నాను."

ప్రతి రోజు ఒక పని పూర్తి చేసి "PAID" అని రాసేవాడు.

తన ఫోటో ఫ్రేమ్ చేయించాడు — PAID

శ్మశానంలో తన స్థలం ఎంపిక చేసి అడ్వాన్స్ ఇచ్చాడు — PAID

దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేశాడు — PAID

13వ రోజు కర్మల కోసం దక్షిణా కవర్లు సిద్ధం చేశాడు — PAID

పిల్లలకు చివరి లేఖ రాశాడు — PAID

20 రోజుల తర్వాత ఆరోగ్యం విషమించింది.

పక్కింటి పాపన్న ఆసుపత్రిలో చేర్పించాడు.

డాక్టర్ రమేష్‌కు ఫోన్ చేశాడు:

"మీ నాన్నగారికి కేవలం 48 గంటల సమయం ఉంది. వెంటనే రండి."

రమేష్:

"డాక్టర్, నేను ప్రాజెక్ట్ డెలివరీలో ఉన్నాను. మూడు వారాలు పడుతుంది. వీడియో కాల్ చేయండి."

డాక్టర్ ఆశ్చర్యపోయాడు.

సుమాకు ఫోన్ చేశాడు.

ఆమె:

"టికెట్ లక్ష రూపాయలు అవుతుంది. ఇప్పుడే రావడం కుదరదు. డబ్బు పంపిస్తాను."

నారాయణప్ప ఇవన్నీ విని చిరునవ్వు నవ్వాడు.

డైరీ చివరి పేజీ తెరిచాడు.

అందులో ఇలా ఉంది:

> డయాలసిస్ — ఆపివేశాను. PAID
పిల్లలపై ఆశలు — సున్నా. PAID
జీవితం — రేపు ముగుస్తుంది. ముందుగానే PAID

కింద ఇంకో వాక్యం:

> "నా మరణాన్ని నేనే రీచార్జ్ చేసుకున్నాను. నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అందుకే నా టాక్‌టైమ్ మొత్తం నేనే వాడేసుకున్నాను."

ఆ రాత్రే నారాయణప్ప ప్రశాంతంగా కన్నుమూశాడు.

---

మూడు వారాల తర్వాత పిల్లలు వచ్చారు.

పాపన్న వారికి రెండు కవర్లు ఇచ్చాడు.

రమేష్‌కి:

> "కొడుకా,

అమెరికా నుంచి రావడానికి లక్ష రూపాయలు ఖర్చవుతాయి కదా.

నా శవం చూడటానికి అంత ఖర్చు చేయొద్దు.

ఈ ₹500 బస్సు చార్జీ.

నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో.

నీ సమయానికి నేనే ముందుగానే PAID చేశాను.

— నీ Prepaid Appa"

సుమాకు:

> "కూతురా,

నువ్వు వందల మందికి Nurse సేవ చేస్తావు.

కానీ నీ తండ్రి డయాలసిస్ సమయంలో రావలేకపోయావు.

బాధ లేదు.

ఈ ₹500తో ఒక పూలమాల కొనిపెట్టి నా సమాధిపై వేయి.

నేను ఎదురు చూడను.

ఇప్పటికే PAID చేసి వెళ్లిపోయాను.

— నీ Prepaid Appa"

డైరీ చివరి పేజీలో ఎరుపు అక్షరాలతో ఇలా ఉంది:

> "పిల్లలూ...

మీ ప్రేమ Incoming Calls Free లాంటిది.

కానీ మీరు ఒక్క Missed Call కూడా ఇవ్వలేదు.

అందుకే నేను Outgoing అయ్యాను.

Balance Zero.

Validity Over.

Number Not Reachable — Forever."

---

నీతి

తల్లిదండ్రులు ప్రీపెయిడ్ సిమ్‌లాంటివారు.

సమయం, ప్రేమ, శ్రద్ధ అనే రీచార్జ్ ఇవ్వకపోతే ఒక రోజు వారు "Not Reachable" అయిపోతారు.

అప్పుడు ఎంత బాధపడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు.

"Busy" అనేది కారణం కాదు.

ఈరోజే మీ తల్లిదండ్రులకు ఒక ఫోన్ కాల్ చేయండి.

వాళ్లు ఉన్నప్పుడే ప్రేమను చూపండి.

ఎందుకంటే వారు లేన తర్వాత...

"నెట్‌వర్క్ అందుబాటులో లేదు" అనే సమాధానం మాత్రమే మిగులుతుంది. 🙏

🙏 తల్లిదండ్రులు కంటే గొప్ప ఎవరు లేరు వుండరు 🥲🥲

సేకరణ...

21/05/2026

రోడ్డుపై ఉష్ణోగ్రత48°C
చెట్టు నీడలో 29°C
అంటే ఒక్క చెట్టు నీడే దాదాపు
19°C తేడా తీసుకొచ్చింది!
ఎండల నుంచి రక్షణకి ACలు కాదు..
చెట్లే అసలు సహజ కవచం!
ఇది ప్రకృతి ఇచ్చిన క్లియర్ మెసేజ్!

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం మూడు గంటలు. అక్కడ ప్రయాణీకులంతా నిద్రలో ఉన్నారు. డెబ్భై ఎనిమిదేళ్ళ వృద్ధుడు. త...
12/05/2026

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం మూడు గంటలు. అక్కడ ప్రయాణీకులంతా నిద్రలో ఉన్నారు. డెబ్భై ఎనిమిదేళ్ళ వృద్ధుడు. తెల్లటి ధోవతి, చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట. అందులో వేడి వేడి ఇడ్లీ ఉన్నాయి. ఆయన,

“ఇడ్లీ… వేడి ఇడ్లీ… ఒక రూపాయి… ఒక్క రూపాయి మాత్రమే…” అని పిలుస్తున్నాడు. కానీ, ఎవరూ కొనలేదు. ఇది 2026 సంవత్సరం. ఒక రూపాయికి చాక్లెట్ కూడా రాదు… ఇడ్లీలా? చాలామంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. నా పేరు అరవింద్. నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాళ్లలో ఇడ్లీ ప్లేట్ ₹50. ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్లలో తేమ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి అడిగాను: “తాతయ్య… ఒక రూపాయికి ఇడ్లీ అమ్మితే నష్టమవదా?” ఆయన చిరునవ్వు నవ్వాడు. “బాబూ… ఇది నష్టం కాదు. లాభం.” “ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర… ఒక్క ఇడ్లీకి కనీసం ₹5 ఖర్చవుతుంది కదా!” ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు… “1975 సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్లు. రైల్వే పోర్టర్‌గా పనిచేసేవాడిని. నెల జీతం ₹100. ఒక రోజు భారీ వర్షం. పని లేదు. డబ్బు లేదు. మూడు రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీదే మూర్చపోయాను.” “అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్‌ఫాంపై ఇడ్లీలు అమ్మేది. ఒక్క రూపాయికి. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు.” “నేను ఏడుస్తూ… ‘నా దగ్గర డబ్బు లేదు’ అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది — ‘బాబూ… నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను ఒక మాట ఇచ్చుకున్నాను — నేను బ్రతికినంతకాలం ఆకలితో ఉన్నవారికి ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తాను. నువ్వూ పెద్దవాడైన తర్వాత ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి.’” వృద్ధుడి కళ్లలో నీళ్లు మెరిశాయి. “ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని అడిగింది — ‘నా మాట నిలబెడతావా?’ నేను ‘అవును’ అన్నాను.” “ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్టులు తీసుకున్నాను. బాగా సంపాదించాను. మూడు ఇళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈరోజు వరకు… ప్రతి ఉదయం 3 గంటలకు… 100 ఇడ్లీలు… ఒక రూపాయి… ఈ స్టేషన్‌లోనే.” నా శరీరమంతా గగుర్పొడిచింది. “తాతయ్య… రోజుకి ₹400 నష్టం. నెలకి ₹12,000. సంవత్సరానికి ₹1.5 లక్షలు. 30 సంవత్సరాలకు ₹45 లక్షలు!” ఆయన చిరునవ్వుతో అన్నాడు: “డబ్బు ప్రకారం చూస్తే నష్టం. కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంతమందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు… 10 లక్షల కడుపులు… 10 లక్షల ఆశీర్వాదాలు… వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబూ?” అంతలో ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా. వయస్సు 12 సంవత్సరాలు. “తాతయ్య… ఇడ్లీ… మూడు రోజులుగా తినలేదు. అమ్మ ఆసుపత్రిలో ఉంది. డబ్బు లేదు.” వృద్ధుడు ఒక ఆకు మీద 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేశాడు. “నెమ్మదిగా తిను బాబూ.” ఆ బాలుడు తింటూ ఏడ్చాడు. “రేపు డబ్బు ఇస్తాను…” “అవసరం లేదు. నువ్వు పెద్దవాడైన తర్వాత ఇంకొక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు. అదే చెల్లింపు.” ఆ బాలుడు ఆయన కాళ్లకు పడిపోయాడు. “నేను కూడా మాట ఇస్తున్నాను తాతయ్య. నేను కూడా ఒక రూపాయికి ఇడ్లీ అమ్ముతాను.” నేను వెంటనే ₹1000 తీసి ఇచ్చాను. “తాతయ్య… దయచేసి ఈ ఇడ్లీల్లన్నీ నాకు ఇవ్వండి.” ఆయన నవ్వి అన్నాడు: “ఇవి ఒకరికే అమ్మడానికి కాదు బాబూ… ఆకలితో ఉన్నవారికోసం. నీకు ఆకలి అయితే ఒక ఇడ్లీ తీసుకో. ఒక రూపాయి వేయి. చాలు.” నేను ₹1 పెట్టి ఒక ఇడ్లీ తీసుకున్నాను. నా జీవితంలో అంత రుచిగా అనిపించిన భోజనం మరొకటి లేదు. కన్నీళ్లతో తిన్నాను. “తాతయ్య… ఒకటి అడగనా?” “అడుగు బాబూ.” “మీ పిల్లలు ఇది డబ్బు వృథా అంటారా?” ఆయన ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు. అమెరికాలో ఉన్న తన కొడుకు ఫోన్ ఎత్తాడు. “అప్పా, ఇడ్లీలు అమ్మేశారా? ఆరోగ్యం ఎలా ఉంది?” “బాగున్నాను. ఈరోజు ఒక యువకుడు నా కథ విన్నాడు.” ఆయన కొడుకు నన్ను చూసి నవ్వాడు. “సర్, మా నాన్నను చూసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి నెలా మేము ₹50,000 పంపిస్తాం — ఇడ్లీల కోసం. అది ఆయన కోరిక. అదే మా ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన మాట… ఇప్పుడు మా మాట.” వృద్ధుడు కాల్ ముగించి అన్నాడు: “చూశావా బాబూ? నా పిల్లలు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. నేను చనిపోయినా ఈ బుట్ట ఆగదు. ఒక రూపాయి ఇడ్లీ ఆగదు.” ఈరోజు 2026. ఆ వృద్ధుడు ఇక లేరు. గత సంవత్సరం 79 ఏళ్ల వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని చెప్పారు: “బాబూ… ఈ బుట్టను చూసుకో. మాట నిలబెట్టు.” ఇప్పుడు ప్రతి ఉదయం 3 గంటలకు… అదే చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో… అదే బెంచ్ దగ్గర… నేను ఉంటాను. బుట్ట నిండా ఇడ్లీలు. ఒక్క రూపాయి. నేను నా ఐటీ ఉద్యోగం వదల్లేదు. కానీ ప్రతి ఉదయం 2 గంటలు… ఇడ్లీల కోసం కేటాయిస్తున్నాను. మా కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెలకు ₹100 ఇస్తున్నారు. “వన్ రూపీ ఇడ్లీ ట్రస్ట్.” ఆ 12 ఏళ్ల బాలుడు — గణేష్ — ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సాయంత్రం వచ్చి సహాయం చేస్తాడు. “అన్నా… నేనూ మాట ఇచ్చాను. పెద్దవాడైన తర్వాత నేనూ ఇదే చేస్తాను.” --- స్నేహితులారా… డబ్బు సంపాదించడం గొప్ప కాదు. ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒక చిన్న పొదుపు డబ్బా పెట్టండి. “₹1 డబ్బా.” ప్రతి రోజు ₹1 వేయమని చెప్పండి. నెలకి ₹30 అవుతుంది. ఆ డబ్బుతో ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. ఎందుకంటే… మీకు ₹30 ఒక చిన్న ఖర్చు మాత్రమే కావచ్చు… కానీ ఇంకొకరికి అది 30 రోజుల ఆశ కావచ్చు. --- ఒక మాట ఇచ్చుకుందాం: కనీసం ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. డబ్బు పోతుంది… పుణ్యం మిగులుతుంది… బుట్ట ఖాళీ కావచ్చు… కానీ మనసు మాత్రం నిండిపోతుంది… 🙏

23/04/2026
23/04/2026
21/04/2026

20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు

సామాజిక మాధ్యమాల్లో పలువురు డబ్బులున్న మైనర్ బాలికలను ప్రేమ పేరిట వంచించి.. రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ రూ. లక్షలు వసూలు చేస్తున్న కేటుగాడు

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల వ్యవధిలో ఇలా అతడి చేతిలో మోసపోయిన 20 మందికి పైగా బాలికలు

బాధితుల ఫిర్యాదులతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడైన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రస్తుతం మియాపూర్లో నివాసముంటున్న.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన ఆజాద్

హైదరాబాద్, పరిసరాల్లోని సంపన్నుల ఇళ్లలో వాచ్మెన్, తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లల్లోని బాలికలు, యువతుల వివరాలు రాబట్టి.. తర్వాత వారిని అనుసరించి మోసానికి పాల్పడ్డ యువకుడు

మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిల ప్రొఫైల్స్ ను పరిశీలించి.. డబ్బున్న అమ్మాయిలను ఎంచుకుని, చాటింగ్ చేస్తూ దగ్గరై, ఖరీదైన కార్లు, పబ్ లలో తాను దిగిన ఫొటోలు పంపేవాడు

ప్రేమ అనుకుని నమ్మి వచ్చిన యువతులను లోబరుచుకుని.. వారి ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేసిన ఆజాద్

ఆ భయంతోనే ఇళ్లల్లో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి అతడికి ఇచ్చిన కొందరు బాలికలు, యువతులు

అయితే ఇటీవల జూబ్లీహిల్స్ లోని సంపన్న కుటుంబానికి చెందిన బాలిక(15)కు అర్జున్ పేరుతో ఆజాద్ ఇన్స్టా ద్వారా పరిచయం చేసుకొని.. రాత్రివేళల్లో ఆమె ఇంటికెళ్లి కలవగా, బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులు

బయటకు వచ్చాక మరోసారి బాలికకు దగ్గరై.. ఆ ఇంటి డ్రైవర్ కృష్ణ, అతడి భార్య సరస్వతి సెల్ ఫోన్ల నుంచి నిందితుడితో మాట్లాడిన బాలిక

అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో ఆజాద్ ఏకాంతంగా గడపగా.. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతానంటూ బాలికను బెదిరించి రూ. లక్షలు కొట్టేసిన డ్రైవర్ భార్య సరస్వతి

మరో వైపు ఆజాద్ కూడా బెదిరించడంతో ఇంట్లో దాచిపెట్టిన రూ.29 లక్షల నగదును బాలిక చోరీ చేసి.. అందులో ఆజాద్‌కు రూ.13 లక్షలు, సరస్వతికి రూ10 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్న కుటుంబసభ్యులు

నార్సింగి ప్రాంతానికి చెందిన మరో యువతిని కూడా నిందితుడు మోసగించినట్లు విచారణలో వెల్లడి

గుంటూరులో కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లి శారీరకంగా దగ్గరై.. గుంటూరు, హైదరాబాద్‌లో పలుమార్లు ఇద్దరూ పబ్లు, హోటళ్లకు తిరిగి.. ఆ ఫొటోలు, వీడియోలు చూపించి ఆమె నుంచి బంగారు గొలుసు కాజేసిన నిందితుడు

20/04/2026

శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల ముఠా బీభత్సం.. 5 భోగీల్లో చైన్ స్నాచింగ్‌లు.. రూ. 17 లక్షల సొమ్ము అపహరణ!*

రైలు ప్రయాణికులకు రక్షణ కరువైంది. నిద్రలో ఉన్న ప్రయాణికులే లక్ష్యంగా దొంగల ముఠా రెచ్చిపోయింది. బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.ఏకంగా ఐదు భోగీల్లో చొరబడి మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటన బాపట్ల జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.

నిద్రలో ఉండగా మెరుపు దాడి
ఈనాడు కథనం ప్రకారం.. శేషాద్రి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 17209) శనివారం రాత్రి బెంగళూరులో బయలుదేరింది. ఈ రైలు బాపట్ల స్టేషన్‌కు శనివారం రాత్రి 10:19 గంటలకే చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు సుమారు మూడు గంటల ఆలస్యంగా నడుస్తుండటంతో, ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:24 గంటలకు బాపట్ల వైపు వచ్చింది. అప్పటికే ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి 1:45 నుంచి 1:55 గంటల మధ్య, రైలు బాపట్ల జిల్లాలోని అప్పికట్ల - గుడిపూడి రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఈ దోపిడీ జరిగింది. దొంగల ముఠా ఒకేసారి ఎస్-4, ఎస్-7, ఎస్-11, ఎస్-12, ఎస్-18 భోగీల్లోకి ప్రవేశించింది. నిద్రిస్తున్న ఐదుగురు మహిళల మెడల నుంచి బంగారు గొలుసులను బలవంతంగా లాగారు.

చైన్ లాగి.. చీకట్లోకి మాయం
మెడలో నుంచి గొలుసులు లాగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు వేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసేలోపే, దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఏ-1 (A1) కోచ్‌లో చైన్ లాగి రైలును ఆపేశాడు. రైలు ఆగీఆగడంతోనే దొంగలంతా చీకట్లోకి దూకి పొలాల్లోకి పరారయ్యారు. బాధితులు వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి ఫిర్యాదు చేశారు.

లక్షల విలువైన ఆభరణాల దోపిడీ
ఈ దోపిడీలో నరసాపురం మరియు తెనాలికి చెందిన ఐదుగురు మహిళలు తమ బంగారాన్ని కోల్పోయారు. సుమారు 120 గ్రాముల బంగారు గొలుసులు, 10 గ్రాముల వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. వీటి విలువ సుమారు రూ. 17.50 లక్షలు ఉంటుందని అంచనా. బాపట్ల రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నేరానికి అనుకూలించిన పరిస్థితులు
దొంగల ముఠా ఈ ప్రాంతాన్ని మరియు సమయాన్ని పక్కా ప్రణాళికతో ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నెమ్మదించిన రైలు: అప్పికట్ల-గుడిపూడి మధ్య అండర్‌పాస్ వంతెన పనులు జరుగుతుండటంతో రైలు వేగం కేవలం గంటకు 20 కి.మీ. మాత్రమే ఉంది. ఇది దొంగలు రైలు ఎక్కడానికి, దిగడానికి అనుకూలించింది.

రక్షణ లేకపోవడం: సాధారణంగా రాత్రి వేళ రైళ్లలో ఉండే ఆర్పీఎఫ్ (RPF) ఎస్కార్ట్ సిబ్బంది ఈ రైలులో లేకపోవడం దొంగలకు కలిసి వచ్చింది.

ట్రైన్ లేట్: రైలు మూడు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు గాఢ నిద్రలోకి వెళ్లిన సమయాన్ని నేరగాళ్లు వాడుకున్నారు.

పోలీసుల వేట
ఈ ఘటనపై రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ స్పందిస్తూ.. దోపిడీకి పాల్పడింది సుమారు పది మందితో కూడిన అంతరాష్ట్ర ముఠా అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ భారీ చోరీ ఘటనతో రైలు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో రైళ్లలో భద్రతను మరింత కఠినతరం చేయాలని కోరుతున్నారు.

Address

Rayachoti
516269

Alerts

Be the first to know and let us send you an email when Kadapa Rayalaseema posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category