Sri Dattatreya Veda Vidya Gurukulam, Rajahmundry

Sri Dattatreya Veda Vidya Gurukulam, Rajahmundry This is a Veda Gurukulam where Vedas are secured and taught in the most traditional way........

This is a place where vedas are secured and taught in the most traditional way....

కంచికామకోటి పీఠం ... ***రాజమండ్రి కొంతమూరు-కాతేరు రోడ్డులో వేద పాఠశాల దగ్గర యోగాంబా సమేత శ్రీ కామకోటీశ్వర స్వామి దేవాలయం...
16/06/2026

కంచికామకోటి పీఠం ...
***

రాజమండ్రి కొంతమూరు-కాతేరు రోడ్డులో వేద పాఠశాల దగ్గర

యోగాంబా సమేత శ్రీ కామకోటీశ్వర స్వామి దేవాలయంలో..

శిఖర జీవధ్వజ నవగ్రహ సహిత పంచాయతన ప్రతిష్ఠా మహోత్సవాలు జూన్ 21 నుండి 24 వ తేదీ వరకు ....

******
*శ్రీ కంచి కామకోటి పీఠం నిర్వహణలో, శ్రీ కంచి కామాక్షిదేవి అమ్మవారి అనుగ్రహంతో రాజమండ్రి సమీపంలోని కొంతమూరు-కాతేరు రోడ్డులో శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం దగ్గర శ్రీ యోగాంబా సమేత శ్రీ కామకోటీశ్వర స్వామి, గణపతి, శ్రీ సూర్యనారాయణ మూర్తి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, దక్షిణామూర్తి, నాగేంద్ర, ఆది శంకరాచార్య, నవగ్రహమూర్తులతో పాటు మినీ కళ్యాణమండపంతో కూడిన పంచాయతన దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు జూన్ 21 వ తేదీ ఆదివారం నుంచి 24వ తేదీ బుధవారం వరకు జరుగుతాయి.

జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య అనుగ్రహంతో జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీశ్రీశ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వార్ల దివ్య ఆశీస్సులతో 24వ తేదీ బుధవారం ఉదయం 07.47 ని.లకు శ్రీ యోగాంబా సమేత శ్రీ కామకోటీశ్వర స్వామి దేవాలయంలో శిఖర జీవధ్వజ నవగ్రహ సహిత స్థిర ప్రతిష్ఠ జరుగుతుంది.

స్వర్గీయ డాక్టర్ నూకల వెంకట్రావు, శ్రీమతి సూకల మాణిక్యాంబ గార్ల దంపతులు, వారి కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు కల్సి ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ కంచి కామకోటి పీఠానికి ధారాదత్తం చేసారు.

శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భక్తమహాశయులంతా పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము.

ఈ కార్యక్రమానికి సహకరించే దాతలు, వదాన్యులు ఈ క్రింది ఖాతాకు జమచేయగలరు.


ACCOUNT NO 50100877924011 savings account
Ifsc HDFC0004259
AP KANCHIKAMAKOTI CHARITABLE TRUST
CURRENCY NAGAR BRANCH
VIJAYAWADA

10/06/2026

సభ్యులకు శుభాభినందనలు. మన వేదపాఠశాల సమీపంలో నిర్మితమైన శివాలయంలో పరమేశ్వర ప్రతిష్ఠ విషయంలో చర్చించుటకు కంచి కామకోటి పీఠాధిపతుల అనుయాయుల సమావేశం మన పాఠశాలలో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జరుగనున్నది. అవకాశం గల సభ్యులు పాల్గొనవలసినదిగా కోరడమైనది.

27/04/2026

సభ్యులకు సూచన :

దత్తాత్రేయ వేదవిద్యా గురుకుల కోశాధికారి, వేదాభిమాని, మన ప్రియ మిత్రుడు యశఃకాయుడు అయిన జయంతి సత్య వేంకట ఉమాపతి శర్మగారి సపిండీకరణ కార్యక్రమము ఈ రోజు వారి స్వగృహమునందు జరుగుచున్నది. ఈ సందర్భంగా వేదపాఠశాలలో అన్న సమారాధనము ఏర్పాటు చేయడమైనది. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు శర్మగారి స్వగృహము నందు వేదాశీర్వచనములు, సంతాప సభ ఏర్పాటు చేయడమైనది.

శ్రీ జయంతి సత్య వేంకట ఉమాపతి శర్మ గారి అకాల మరియు ఆకస్మిక నిర్యాణం నిజంగా దిగ్భ్రాంతికరం.శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురు...
24/04/2026

శ్రీ జయంతి సత్య వేంకట ఉమాపతి శర్మ గారి అకాల మరియు ఆకస్మిక నిర్యాణం నిజంగా దిగ్భ్రాంతికరం.

శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి సంస్థాపక కోశాధికారిగా ఆయన అందించిన సేవలు, వేద విద్య పట్ల ఆయనకు గల నిరుపమానమైన అనురాగం వర్ణనాతీతం.

ఒక సాధకుడు తన జీవితాన్ని ధర్మబద్ధంగా, సనాతన ధర్మ విలువల కోసం అంకితం చేసినప్పుడు, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ధర్మకార్యాలు నిరంతరం జీవించే ఉంటాయి.

తాను భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేసినప్పటికీ తన యేకైక కుమారుడిని వేద విద్యలో ప్రవేశపెట్టడం ద్వారా ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని జాతికి అందించారు.

ఈ కష్టసమయంలో వారి కుటుంబ సభ్యులకు గురుకుల సభ్యుల తరపున, ఈ క్రింది నివాళి సమర్పిస్తున్నాము .

శ్రీ జయంతి సత్య ఉమాపతి శర్మ గారు

"ధర్మో రక్షతి రక్షితః" అన్న సూక్తికి నిలువెత్తు రూపం . వేదమాత సేవలో తరించిన పుణ్యమూర్తి .

శ్లో||

వేదశ్రీనిలయ శ్చ ధర్మనిరతః సత్యైకవర్తీ చ సః

దత్తాత్రేయపదాబ్జసేవకమణిః శర్మాఖ్య సద్భావధీః

సాయుజ్యం శివలోకధామమగమత్ పుణ్యైః కృతైః పావనైః

ధైర్యం దేహి కుటుంబకే చ నితరాం హే వేదమాత స్సదా ||

వేదశోభకు నిలయమైనవాడు, నిరంతరం ధర్మనిరతుడు, ప్రశాంత సత్య చిత్తుడు, శ్రీ దత్తాత్రేయ స్వామి పాదపద్మ సేవకుడు అయిన సత్య ఉమాపతి శర్మ గారు తాను చేసిన పవిత్ర పుణ్యకార్యాల వల్ల ఆ పరమశివునిలో సాయుజ్యాన్ని -పునరావృత్తి రహిత స్థితిని- పొందారు.

ఓ వేదమాత! ఆయన వియోగాన్ని తట్టుకునే ధైర్యాన్ని, స్థైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదింతువు గాక.

శర్మ గారు కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, వేదగురుకులానికి ఒక మూలస్తంభంగా నిలిచారు. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమ్" అన్నట్లు, వేద సేవలో నిమగ్నమైన వారికి ఉత్తమ గతులు లభిస్తాయన్నది శాస్త్ర ప్రమాణం. ఆయన శివసాయుజ్యాన్ని పొందారన్నది నిశ్చయం.

జీవితాంతం ధర్మాన్ని నమ్మి, తన సంతానాన్ని కూడా వేద మార్గంలో నడిపించిన ఆ మహానుభావుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి.

ఆ వేదమాత, దత్తాత్రేయ స్వామి వారి కుటుంబానికి కొండంత అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాము .

ఓం శాంతిః శాంతిః శాంతిః

వారి కుటుంబ సభ్యులకు సార్ద్రమైన మనస్సులతో ఈ సందేశం అందిస్తున్నాము .

ఇట్లు
శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల :అధ్యక్షకార్య దర్శులు , ఇతర సభ్యులు .
అధ్యాపకులు , వేదవిద్యార్థి బృందం

రాజమహేంద్రవరమ్
19.04.2026.

Address

Veda Godavari Marg, 10-473/2, Seetharama Agraharam, Konthamuru
Rajahmundry
533102

Alerts

Be the first to know and let us send you an email when Sri Dattatreya Veda Vidya Gurukulam, Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Dattatreya Veda Vidya Gurukulam, Rajahmundry:

Shortcuts

Share