20/05/2025
🟣 క్రైస్తవులకు దశమభాగం వర్తిస్తుందా ?
ముందుగా, పాత నిబంధనలో దశమభాగానికి సంబంధించిన నియమాలు తెలుసుకుని తరువాత కొత్తనిభంధనలో దశమభాగం క్రైస్తవులకు వర్తిస్తుందా అనేది చూద్దాము. (NOTE: ఈ పోస్టును వరుస క్రమంలో చదవండి. ఈ పోస్టును క్లుప్తంగా రాయడం జరిగింది . )
Published by: Reformation 2.0
www.facebook.com/1517Reformation2.0
=============
🟣1. ఇశ్రాయేలు 12 గోత్రాలలో నుండి -> లేవి గోత్రానికి చెందిన లేవీయులు నుండి -> లేవి పరిచారకులు, లేవి యాజకులు & లేవి ప్రధాన యాజకుడు
(12 Tribes of Israel -> Levi Tribe (levites) -> Levi Assistants, Levi Priests & Levi High Priest)
ఇశ్రాయేలీయులలో ఉన్న 12 గోత్రాలలో లేవీ గోత్రానికి చెందిన “లేవీయులు”.
లేవీయులు ఇశ్రాయేలియకు ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారు, మందిర గుడారo & ప్రత్య క్షపు గుడారము కాపాడే వారు .( ద్వితీ 33:10, సంఖ్యా 3:25) .
"లేవీ" గ్రోతములో నుంచి “పరిచారకులు” & “యాజకులు " ఉంటారు (సంఖ్యా 3:5) .
పాత నిబంధన కాలంలో దేవాలయంలో ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయడానికి లేవి గోత్రం నుంచి పరిచారుకులుగా యాజకుడైన అహరోను దగ్గర నియమించారు. అహరోను & అతని కుమారులు యాజకులు మందిర సేవలో ఉంటారు (నిర్గమ 28:1-5, సంఖ్యా 18:1).
ప్రతి యాజకులు లేవీయుల గోత్రం నుంచి మాత్రమే ఉంటారు . ప్రతి లేవీయుడు యాజకుడు కాదు.
పాత నిబంధన కాలంలో దేవాలయంలో ప్రత్యక్షపు గుడారం యుక్క “పరిశుద్ధ స్థలం” వెళ్ళటానికి యాజకుడికి ప్రవేశం ఉంటుంది.
"అతి పరిశుద్ధ" స్థలంలో ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇతను బలిపీఠము దగ్గర జంతు రక్తముతో పాపపరిహార్ద బలిని ఎన్నో నిష్టమైన నియమాలను పాటిస్తూ చాలా జాగ్రత్తగా దేవునికి అర్పిస్తూ దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేయాలి. (లేవీ 16:14-18). ఈ పరిశుద్ధ స్థలాన్ని & అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక దేవాల తెర విభజిస్తుంది. (నిర్గమ 26:32-35)
(NOTE: యేసు క్రీస్తు ప్రభువు మరణించిన తరువాత ఈ తెర చిరిగింది .. ఇక కొత్త నిబంధనలో యేసు రక్తమువలన పరిశుద్ధస్థలములో ప్రవేశించడానికి ఆధ్యాత్మిక మైన మార్గం అందరికి తెరువబడింది (మత్తయి 27:51 & హెబ్రీ 9:8, 10:20)
=============
🟣2. దశమభాగంలో ఉన్న రకాలు & దశమభాగం ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి?
లేవీయులు ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన సేవ చేస్తున్నందుకు ఇశ్రాయేలీయుల దశమభాగములన్నిటిని దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చారు (సంఖ్యా 18:21 నెహెమ్యా 13:10-13 & హెబ్రీ 7:5 ,).
ఇశ్రాయేలీయులును(11 Tribes of Israel) & లేవీయులు (Levite Tribe) తెచ్చిన దశమభాగాలు లో మరలా దశమభాగం తీసి లేవి యాజకులు (Priests) దేవునికి ప్రతిష్ఠార్పణముగా చెల్లించాలి . దేవాలయంలో సేవ చేస్తున్న లేవి యాజకులుకు, ద్వారపాలకులకు & గాయకులకు ఇవ్వాలి.(సంఖ్యా
18:26-28 , నెహెమ్యా 10:39).
ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతి ష్ఠార్పణముగా అర్పించు దశమభాగలను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చారు కాబట్టి లేవీయులు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదు.
ఇశ్రాయేలీయులు మొదట వచ్చిన పంటలలో ప్రత్యక్షపు గుడారంలో సేవ చేస్తున్న లేవీయులకు దశమభాగం ఇవ్వాలి.
దశమభాగం పాతనిభంధనలో ఉన్న ఆజ్ఞ.(సంఖ్యా 18:21-24, సంఖ్యా 18:21-24, హెబ్రీ 7:5).
ఇశ్రాయేలీయుల నుండి లేవీయులు దశమభాగం తీసుకోడానికి అర్హులు (సంఖ్యా 18:21-25).
పంటలలో , ఆహార పదార్ధాలలో & జంతువులలో నుంచి దశమభాగం తీసి దేవునికి ప్రతిష్ఠిత చేసేవారు (లేవీ 27:30).
🟣దశమభాగం మూడు రకాలు. వీటిని కలిపితే దాదాపుగా 23.3% వస్తుంది.
🟣A. లేవీయుల దశమభాగం: ధాన్యములో, చెట్ల ఫలాల అన్నిటిలో ఇశ్రాయేలీయులు లేవి గోత్రం వారికి దశమభాగం ఇచ్చేవారు .(లేవీ 27:30-33, సంఖ్యా. 18:21-26)
NOTE: ఇశ్రాయేలీయుల నుంచి లేవీయులకు వచ్చిన దశమభాగాలలో మరలా లేవీయులు దశమభాగం తీసి దేవునికి ప్రతిష్ఠార్పణముగా చెల్లించాలి . యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి (సంఖ్యా 18:26-28)
🟣B. పండుగల దశమభాగం : పంటలలో, ద్రాక్షారసంలో, నూనెలో , గోవులు, గొర్రెలు, మేకలు, కోలక్రింద నడిచే అన్నిటిలో ఇశ్రాయేలీయులు దశమభాగం ప్రతిష్టించాలి . ఇవి ఇశ్రాయేలీయులు పండుగలను ఆచరించడానికి దమసభాగం . ఈ పండుగలో లేవీయులు పాలుపంచుకునేవారు. లేవీయుల దశమభాగంతో పాటు పండుగ దశమభాగం కూడా ఇశ్రయేలీయులు ఇవ్వాలి . (లేవీ 27:32, ద్వితీ 12:17-19, 14:22-27, 16:11). ఇవి భోజన పదార్ధాలు.
ఈ పండుగ దశమభాగాలు పంటలు & పైన చెప్పిన జంతువులు ఉంటాయి కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న నివాసస్థానము దూరంగా ఉంటె వీటిని ఆ ప్రదేశానికి మోయలేరు అందుకు వాటిని వెండికి మార్చుకుని తిరిగి అక్కడ వెళ్ళినప్పుడు ఆ వెండితో అక్కడ మళ్ళా పైన చెప్పిన జంతువులకు మార్చుకుని దేవుని సన్నిధిలో లేవీయులుతో సహా అందరూ భోజనముచేసి సంతోషించాలి (ద్వితీ 14:23-27)
🟣C. దాతృత్వ దశమభాగం : స్వాస్థ్యము లేని లేవీయులు, పరదేశులు, తండ్రిలేనివారు , విధవరాలు వచ్చి భోజనము చేయడానికి ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి పండిన పంటలలో 10% ఇశ్రాయేలీయులు బయట ఉంచాలి (ద్వితీ 14:28-29, 26:12) . ఇవి కూడా భోజన పదార్ధాలు.
ఈ మూడు రకాల దశమభాగాలు ఇశ్రాయేలీయులు ఇచ్చేవారు . వీటిని కలిపితే దాదాపుగా 24 % ప్రతి సంవత్సరం దశమభాగాలు ఇశ్రాయేలీయులు ఇచ్చేవారు. దశమభాగం 3 రకాలు ఉన్నాయ్ కాబట్టి దశమభాగాలు 23.3% లెక్క వస్తుంది.
(ఈ లెక్కన క్రైస్తవులు 23 .3 % దశమభాగాలు ఇవ్వాలి. 10% మాత్రమే దశమభాగం అని పాతనిభంధనలో లేదు. అసలు దశమభాగం పాత నిబంధన కాలంలో డబ్బులకు ముడిపడి లేదు.. ఈ మూడు రకాల దశమభాగాలలో నాణాలు/రూకలు దశమభాగంగా దేవుడు ఇవ్వమనలేదు . ఆ కాలంలో కూడా డబ్బులు(రూకలు) చెల్లుబాటులో ఉన్నా (ఆది 23:13, 42:25) “దశమభాగం” రూకల నుంచి తీయాలని దేవుడు చెప్పలేదు! )
===============
🟣3. పాత నిభంధనలో ఉన్న స్వేచ్ఛర్పణలు (Freewill offerings) (ద్వితీ 12:11-17 )
పాతనిభంధనలో ప్రత్యక్షపు గుడారము పనికొరకు స్వేత్చార్పణలు ఉన్నాయ్ (నిర్గమ 35:5 -21). దేవునికి దహన బలులలో దోషం లేని జంతులు స్వేచ్ఛర్పణలుగా అర్పించి వాటిని తినటానికి ఉండేవి (లేవీ 7:16, 22:18-19, సంఖ్యా 15:3).
పండుగ ఆచరించడానికి స్వేచ్ఛర్పణలు అర్పించాలి . ఇవి దేవుడు ఆశీర్వదించాలకొలది ఇవ్వాలి (ద్వితీ 16:10)
Note: కొత్తనిభంధనలో స్వేత్చార్పణలు ఏవిధంగా అమలు చేయబడిందో 5వ & 6వ భాగంలో చదవండి.
============
🟣4. మలాకి 3:9-10 వివరణ
దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులతో మాత్రమే మాట్లాడుతున్నారు గాని లోకంలో ఉన్న అన్యజనులను ఉద్దేశించి కాదు(మలాకి v6 & v12 చదవండి) . ఈ అధ్యాయంలో మందిరం(Storehouse) లో “ఆహారం(food)” ఉండడానికి ఉద్దేశించి దేవుడు చెప్తున్నారు . ఇక్కడ మందిరం అని చెప్పబడింది "ఆహారం నిల్వ ఉంచే గది” (whole tithe into the storehouse, that there may be food in my house.).
ఈ వచనంలో దేవుడు డబ్బును(రూకలను) తీసుకుని రండని చెప్పలేదు. దేవుని మందిరములో కొట్లను సిద్ధపరచాలని హిజ్కియా ఆజ్ఞ ఇచ్చాడు (2దిన 32:11-13). దేవుని మందిరపు గదులు (storehouse) ఉద్దేశించి చెప్పబడింది (నెహెమ్యా 10:37-39 కూడా చదవండి ) ..
యూదులు ధాన్యంలో, ద్రాక్షారసంలో, తైలంలో, పిండిలో, ప్రతిష్ఠార్పణలు, పండ్లు ,నూనెలో , పంటలో పదియవ వంతు మొదలైన వాటిలో పదవభాగాన్ని “ఖజానా” లోనికి తెచ్చారు (నెహెమ్యా 13:12). ఇలా చెప్పబడిన మందిరం అనేది “ఖజానా” అంటారు.
ఈ అబద్ధ బోధకులు మందిరాన్ని(Storehouse) కొత్తనిభందంలొ "సంఘం(“Church) గా ముడిపెట్టి బోధిస్తు దశమభాగాలు తీసుకుంటున్నారు.
మలాకి 3 లో దశమభాగం అనేది డబ్బుతో సంభంధం లేదు!
==========
🟣5. మత్తయి 23:23లో, యేసు ప్రభువు దశమభాగం మానక ఇవ్వమని చెప్పారు కాబట్టి కొత్త నిభందంలొ దశమభాగం వర్తిస్తుందని చెప్తుంటారు . యేసు ప్రభువు పాతనిభంధన ధర్మశాస్త్రము ఉన్న కాలంలో జన్మించారు. శాస్త్రులు & పరిసయులతో యేసు ప్రభువు మాట్లాడిన ధర్మశాస్త్ర సంబంధించిన విషయాలు క్రైస్తవులందరికి & అన్ని కాలంలో వర్తిస్తుందని కాదు. ధర్మశాస్త్రంలో ఉన్నవారిని విమోచించి మనము దత్తపుత్రులము కావడానికి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినవారయ్యారు (గలతి 4:5). యేసు క్రీస్తు సిలువ మరణం తరువాత కొత్త నిబంధన అమలుపరచబడింది (లూకా 22:20 హెబ్రీ 9:15 -18,4:14 ,7:26-27, 8:6). (మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి కాదు!).. యేసు సిలువ మరణం ద్వారా పాత నిబంధన నెరవేర్చబడి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రధాన యాజకుడుగా కొత్త నిబంధన క్రింద క్రైస్తవులు ఉన్నారు(లూకా 22:20, హెబ్రీ 8:13 , 9:18 ). క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షగా ఉంది (గలతి 4:5), క్రైస్తవులు మోషే ధర్మశాత్రం క్రింద లేరు కృపకే లోనైనవారు (రోమీ 6:14,2 కోరింథీ 3:15-16) .
దశమభాగం ధర్మశాస్త్రానికి చెందినది (హెబ్రీ 7:5) . యేసు క్రీస్తు విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రాన్నీ నెరవేర్చారు (ఎఫెసీ 2:14, కొలొ 2:14, హెబ్రీ 7:18).
ప్రత్యక్ష గుడారo/దేవాలయం కొత్త నిబంధనలో లేదు. మన శరీరమే దేవుని ఆలయంగా కొత్త నిబంధన ఆధ్యాత్మికమైన బోధనలు ఉన్నాయ్ (1 కోరింథీ 3:16
పాస్టర్లు దశమభాగం తీసుకోడానికి లేవీయులు/యాజకులు కారు! దశమభాగం కొత్త నిబంధన క్రింద ఉన్న సంఘాలలో కొనసాగించలేదు. కొత్త నిబంధనలో ఉన్న పత్రికలలో అపోస్తులు దశమభాగాలు అడగలేదు. క్రైస్తవులందరూ యాజకులు (1 పేతురు 2:9, ప్రకటన 1:6) & యేసు క్రీస్తు ప్రభువు మన ప్రధానయాజకుడు (హెబ్రీ 4:14, 8:13)
============
🟣6. కొత్తనిభంధన క్రింద ఉన్న క్రైస్తవులకు దశమభాగం వర్తించదు . స్వేచ్ఛర్పణ మాత్రమే వర్తిస్తుంది (Freewill offerings)
క్రైస్తవులు వారి హృదయాలలో నిశ్చయించుకున్న ప్రకారం వర్థిల్లినకొలది ఇవ్వాలి. ఇవి దశమభాగాలకన్నా ఎక్కువగా ఉండవచ్చు (23.3% కన్నా ఎక్కువ లేదా తక్కువ). కొత్తనిభంధనలో (సంఘ పత్రికలలో) " క్రైస్తవ దాతృత్వం & ఇవ్వడం ” గురించి ఉంది కానీ దశమభాగం నియమాలు లేవు. కొత్తనిభంధన ప్రకారం క్రైస్తవులకు స్వేచ్ఛఅర్పణ కానుకలు(freewill offerings) మాత్రమే వర్తిస్తుంది.
క్రైస్తవులు వర్ధిల్లిన కొలది స్వేచ్ఛర్పణమైన కానుకలు ఇవ్వాలి (1కోరింథీ 16:1-2, 2కోరింథీ 9:6-7.) మనం ఇచ్చేది మన స్వయప్రయోజనానికి కాదు, మనల్ని మనం ధనవంతులు చేసుకోవడానికి కాదు. మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడానికి కోసం & దేవుడిని మహిమపరచడం కోసం ఇస్తాము. యేసు క్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు తనను తాను అర్పించుకున్న ప్రాయశ్చిత్త బలియాగం ద్వారా మరియు దేవుడు మనకు ఇస్తున్న ఆశీర్వాదాలు & కృపను బట్టి కృతజ్ఞతతో మనము స్వేత్చార్పణము ఇస్తున్నాము (2 కోరింథీ 8:1-3. ఇవి పూర్తిగా మన హృదయాలలో నుంచి కలగాలి. ఇతరుల నుంచి వస్తున్న వత్తిడి ద్వారా లేదా తమనుతాము ఇష్టం లేకుండా కానుకను ఇవ్వకూడదు.
1 కోరింథీ 16:1 చందా విషయమైతే …. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
2 కోరింథీ 9:7 సణుగుకొనక బలవంతముగా కాక హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వాలి; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
తన శక్తికొలది సహోదరులకు సహాయo చేసిన సందర్భాలు ఉన్నాయ్ (అపో. 11:29 , గలతీ 6:6)
 బలవంతముచేత కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉపకారాలు ఉండాలి ( ఫిలేమోను 1:14)
సంఘ సభ్యుల నుంచి సువార్తికులకు , ఉపదేశకులకు , సంఘ కాపరులకు స్వేత్చార్పణ కానుకలు ఇవ్వాలి (1 కోరింథీ 9:13-14)
సేవలో ఉన్నవారికి & మరి ప్రత్యేకంగా సంఘంలో ఉన్నవారికి సహాయం చేయాలి (గలతీ 6:6)
దేవుడు మనలో ఇవ్వాలనే కోరికను కలుగజేస్తాడు మరియు ఆ తర్వాత అవసరమైన వారికి ఇవ్వడానికి మనకు వనరులను ఇస్తాడు.
మనం “వర్ధిల్లినకొలది” వాటిని ఇతరులకు ఉపయోగపడే విధంగా ఇవ్వాలని భావం. (2 కొరింథీ 9:8)
క్రైస్తవ దాతృత్వం అంటే, కృపగల దేవునికి కృతజ్ఞతలు అర్పించటానికి మాత్రమే గాని, ఇచ్చింది తిరిగి పొందుకుంటాననే ఉద్దేశంతో కూడినది కాదు. క్రైస్తవ దాతృత్వం యొక్క లక్ష్యం దేవుని నుండి మనం పొందగలిగే ప్రతిఫలం గురించికాదు. (2 కొరింథీ 9:11)
అపోస్తులు వారు పొందుకున్నవన్నీ అందరికి పంచారు (2 కొరింథీ 12:5). ఇస్తున్నది తిరిగి నూరింతలుగా తిరిగి వస్తుందంటే పౌలు ధనవంతుడిగా ఉండేవాడు.
================
🟣7. హెబ్రీ 7 వివరణ -> అబ్రాహాము శత్రువులనుంచి కొల్లగొన్న వాటిలో ఒక్కసారి మాత్రమే దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు దశమభాగం ఇచ్చాడు (హెబ్రీ 7:2-4, ఆది 14:19-20) . అబ్రాహాము కన్నా మెల్కీసెదెకు గొప్పవాడు(v4) కాబట్టి, అబ్రాహాము కొల్లగొట్టిన వాటిలో దశమభాగాలు ఇచ్చాడు
లేవి యాజకులు దశమభాగం తీసుకున్నారు & వంశావళి లేని మెల్కీసెదెకు అబ్రాహాము నుండి దశమభాగం తీసుకున్నాడు(v8).
ధర్మశాస్త్రము కంటె శ్రేష్ఠమైన నిరీక్షనైన యేసు క్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు చేరుతున్నాం. మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు అనగా యేసు క్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడిగా ఉన్నారు (కీర్తన 110:4) . మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము ప్రధాన యాజకుడుగా యేసు క్రీస్తు ఉన్నారు . యాజకులు మార్చబడితే యాజక ధర్మము కూడా మార్చబడుతుంది (v12) . లేవీయ యాజకత్వం & మోషే ధర్మశాస్త్రం యేసు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి (v19). క్రొత్తనిబంధన అని చెప్పినప్పుడు మొదటిది పాతదిగా చేసియున్నాడు (హెబ్రీ 8:13, 10:9)
================
🟣ఇప్పటి వరకు , కొత్త నిబంధనలో దశమభాగం క్రైస్తవులకు వర్తించదని తెలుసుకున్నాము. ఈ క్రింద పోస్టులో కొత్తనిభంధనలో ఉన్న కొన్ని వాక్యాలను ప్రోస్పెరిటీ అబద్ధ బోధకులు వక్రీకరించి కానుకలు తీసుకుంటున్నారు. వీటికి వివరణ కూడా చదవండి.
-> https://www.facebook.com/photo/?fbid=256875873721373&set=a.152148240560616
================
🟣సంఘ నియమాలు కొత్త నిబంధనలో ఉంటె ఈ అబద్ధ బోధకులు పాత నిబంధన లోనికి వెళ్ళి దశమభాగం ప్రసంగాలు చేసి క్రైస్తవులపై మోయలేని భారాన్ని పెడుతూ డబ్బును దోచుకుంటున్నారు. పాత నిబంధన కాలంలో వర్తించే "దశమభాగం" ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు వర్తింపజేసి దశమభాగం & కానుకలు రెండిటిని తీసుకుంటూ అబద్ధ బోధకులు డబ్బును సంపాదించుకుంటున్నారు(ఇలా చేస్తున్నవారందరూ కావాలని చేస్తారని కాదు గాని వీరిలో కొంతమందికి బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు తెలియకుండా చేస్తుంటారు).
దశమభాగం ఇవ్వకపోతే దేవుడు శపిస్తాడని భయపెట్టి దోచుకుంటుంటే మరికొందరు
దశమభాగం దేవుడికి ఇస్తే తిరిగి రెట్టింపు చేసి ఇస్తాడని చెప్తు దేవుడి పేరిట ఎమోషనల్ మాటలు చెప్పి డబ్బుని దోచుకుంటున్నారు.
ఇంకొందరు దశమభాగం ఇస్తే అప్పులు పోతుందని ప్రసంగాలు చేస్తున్నారు. అప్పులు తీరుతుందని & పాస్టర్లు దశమభాగాలు అడిగారని ఇస్తే ఇంకా అప్పులవుతాయి.
దశమభాగం ఇస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి అంటూ షేర్ మార్కెట్ లో డబ్బును ఇన్వెస్ట్మెంట్ లాగా దేవుడిని చూపిస్తున్నారు..
క్రైస్తవుల నుంచి దశమభాగం పేరిట డబ్బును పీల్చుకుని తినడంలో ప్రోస్పెరిటీ అబద్ధ బోధకులు దశమభాగాల పేరిట తీవ్రమైన స్థాయిలో అబద్ధ బోధలు చేస్తుంటారు (అతి పెద్ద దోపిడీదారులు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ , కింగ్స్ టెంపుల్ శామ్యూల్ పట్టా & ఇంకా అనేకమంది ప్రసిద్ధి చెందిన అబద్ధ బోధకులు ఉన్నారు.) . వీళ్ళు బైబిల్ లో ఏ సందర్భాన్ని తీసుకున్నా చివరకు దశమభాగంతో ముడిపెట్టి చాలా తెలివిగా వాక్యాన్ని వక్రీకరిస్తూ డబ్బును తీసుకుంటారు. వీళ్ళను వెంబడిస్తున్నవారు కూడా వాక్యాన్ని సరిగ్గా చదవకుండా దురుద్దేశంతో దశమభాగం ఇస్తుంటారు. ఇలాంటి అర్పణలు దేవుడు అంగీకరించరు.
వాక్యావగాహన లేని క్రైస్తవులు బైబిల్ వాక్యాలను వాటి సంబర్భంలో చదవరు కాబట్టి బైబిల్ లో రాసింది ప్రతిదీ కాలం/నిబంధనతో సంభంధం లేకుండా తమకు కూడా వర్తిస్తుందని మూఢ భక్తితో వ్యవహరిస్తుంటారు . క్రైస్తవ్యం అంటేనే దశమభాగం దోచుకునే మతమని ప్రజల మధ్య అభిప్రాయం ఉండటానికి ఇలాంటి అబద్ధ బోధకులు, నామకార్థ క్రైస్తవులు & మూఢ భక్తిని కలిగి ఉన్న క్రైస్తవులు కారణం.
Published by : Reformation 2.0
www.facebook.com/1517Reformation2.0
fans