18/09/2019
*అలసిన వానికి ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷సెప్టెంబరు 18🌷🌷*
*"నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్ధన చేసిన .. ఎడల .. ఆకాశము నుండి నేను ప్రార్ధనను విని వారి* *పాపమునుక్షమించి వారి దేశమును స్వస్థ పరచుదును. ( 2 దిన. 7:14)*
నెహెమ్యా యెరూషలేము గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని, ప్రాకారములు పడద్రోయ బడినవని వినినప్పుడు ఎంతో కన్నీటితో మరియు ఉపవాసముతో ప్రార్ధించ మొదలు పెట్టెను. దేవుడు ఇశ్రాయేలీయులకు తానిచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేయగోరెను (లేవీయ. 26: 40-45). మొదట అతడు తన పాపములను, తన తండ్రి యింటి పాపములను మరియు దేవుని ప్రజల యొక్క పాపములను ఒప్పుకొన నారంభించెను.
నెహెమ్యా దినములలో ఉన్నట్లు అనేకమంది విశ్వాసుల పరిస్థితి ఇశ్రాయేలీయుల పరిస్థితి వలె నున్నది. దేవునికి, ఆయన వాక్యమునకు మరియు ఆయన మందిరమునకు వారి జీవితములలో తగిన స్థానమివ్వక పోయినందున వారు గొడ్డుబారిన స్థితిలో నుండిరి (1 కొరింతి. 3: 1-6) . మనలను మనము తగ్గించుకొని, నిజమైన పశ్చాత్తాపముతో ఆయనవైపు తిరిగిన యెడల, హృదయపూర్వకముగా ఆయనను ఘనపరచిన యెడల గొప్ప ఆశీర్వాదములను పొందుదుము. భయముతోను, వణకుతోను మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన మన ప్రార్ధన ఆలకించి, మన పాపములను క్షమించి, మనలను దీవించును. నెహెమ్యా దేవుని వాగ్దానమును నమ్మినవాడై 2 దిన. 7:14 లో నున్నట్లు దుఃఖముతోను, ఉపవాసముతోను ప్రార్ధించ మొదలుపెట్టెను. మనలను మనము తగ్గించుకొని, దేవునికి ప్రార్ధించిన యెడల మొదటి ప్రేమను తిగిరి పొందుదుము. అప్పుడు దేవుడు కూడా మనలో కార్యము చేయనారంభించి, ఆయన తన ఆత్మను, విజ్ఞాపన ఆత్మను మనపై కుమ్మరించును. అప్పుడు మన జీవితములు సంపూర్ణముగా ఫలవంతమగును. మరియొక సారి ఇంతకు ముందు అనుభవించిన రీతిగా ఆయన దీవెనలు పొందుదుము.
నెహెమ్యా యెరూషలేమునకు వెళ్లి అక్కడ పరిస్థితి ఎంతో విషాదకరంగా ఉన్నట్లు చూచి యితరులకు కూడా తెలియజేసెను (నెహెమ్యా 2:17). పని ఆరంభమైనప్పుడు ఎంతో మంది ముందుకు వచ్చిరి. దేవుని కరుణా హస్తము తనపై నున్నదని నెహెమ్యా చెప్పెను. నేటి దినములలో కూడా నెహెమ్యా వంటి వ్యక్తులు అవసరమై యున్నది. అట్టివారిని గురించి ప్రజలు ఈ విధముగా చెప్పవలెను, "నిజముగా దేవుని హస్తము ఈ వ్యక్తి పై నున్నది." దేవుని హస్తము నెహెమ్యా మీద నుండుట ప్రజలు చూచి వారు కూడా అతనితో కలసి దేవుని పనిని చేసిరి. కానీ హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా, అరబీయుడైన గెషెమును వినినప్పుడు వారు అపహసించి, తిరస్కారము చేయుచు, తృణీకరించిరి. అదే విధముగా దేవుని పనిలో మనము కూడా ముందుకు వచ్చినప్పుడు దేవుని శత్రువులచేత పరిహాసము చేయబడుదుము. అదే మొదటి ఆయుధముగా సాతాను మనలను నిరాశపెట్టి భయపెట్టుటకు ఉపయోగించును. నెహెమ్యా దినములలో ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతో పలుకుబడిగల వ్యక్తులుగా నుండిరి. సన్బల్లటు, టోబీయాలు దేవుని పనిని ఆటంకపరచి నట్లు ప్రతి దేశములోను దేవుని పనిని ఆటంక పరచు వ్యక్తులను చూడగలము. ప్రభువు శక్తి కొరకు చాలినంత ప్రార్ధించని యెడల మనలను కూడా అటువంటి వ్యక్తులు దేవుని వెంబడించకుండా అడ్డుకొనగలరు. నెహెమ్యా, ప్రార్ధన ద్వారా ఇటువంటి వ్యక్తులను జయించ గలిగెను. దేవునిపై తన మనస్సును నిలుపుకొనుటను బట్టి వారి మాటలను లక్ష్య పెట్టలేదు. అందుచేత ఎంతో నమ్మకముగా ఇట్లు చెప్పగలిగెను. " ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము"(20వ). *తిరిగి జన్మించని వారు ఇహలోక సంబంధమైన మనస్సు కలిగి ఎంతో తెలివిగలవారైనను దేవుని పనిలో ఎటువంటి భాగమును కలిగి యుండలేరు*, ఎందుకనగా వారు దేవునిచేత పిలువబడలేదు. *అనేక మంది దేవునికి లోబడుదురు. కానీ కష్టములు వచ్చినప్పుడు దేవుని నమ్ముకొనుటకంటె గొప్పవారిపై నమ్మకముంచెదరు. ఎట్టి పరిస్థితుల లోనైనను దేవుని ప్రజలు అవిశ్వాసులు మరియు లోకస్థులపై ఆధారపడి కూడదు*. దేవునికి సంపూర్ణ విధేయత చూపుట ద్వారా మరియు ప్రార్ధన ద్వారా తప్పనిసరిగా శత్రువును ఓడించగలము. మనము దేవుని పనిలో ధైర్యముగా ముందుకు వచ్చినపుడు మనలను అడ్డగించుటకు మరియు భయపెట్టుటకు శత్రువు ప్రయత్నము చేయును. ఆ రీతిగా దేవునిపై ఆధారపడి ప్రార్ధన ద్వారా నెహెమ్యా శత్రువును ఎదుర్కొనుటయే గాక, ఓడించెను.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼