18/06/2023
స్వస్తిశ్రీ విజయాభ్యుదయ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సర - ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి 19.06.2023 అనగా సోమవారం నుండి- 27.06.2023 - మంగళవారం వరకు శ్రీ వారాహి గుప్త నవరాత్రులు.🙏
దేవి వారాహి అష్ట మాతృకలు యొక్క ప్రధాన దేవతలలో ఒకరు. ఈ ఎనిమిది మంది దేవతలు దుర్గాదేవికి యుద్ధ రంగంలో సహాయం చేస్తారు. దేవి వారాహి భూదేవి లేదా భూమి తల్లి మరియు ఆమె శ్రీ దేవి లేదా సంపద దేవతగా సూచించబడే లక్ష్మితో పాటు విష్ణువు యొక్క భార్య కూడా
నిత్య పూజతో పాటు మనం వారాహి దేవి నవరాత్రులను కూడా ఎంతో సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు.. ఉదయం నిత్య పూజ చేసుకొని సాయం సంధ్య వేళలో వారాహి అమ్మకి పూజ చేసుకోవచ్చు..
సాయం సంధ్య వేళ నిత్యపూజ అయిపోయాక..వారాహి అమ్మకి నైవేద్యం కింద బెల్లంపానకం,దానిమ్మ గింజలు, తీపిదుంపలు, చిలకడదుంపలు, క్యారెట్, బీట్రూట్ ఏదైనా సరే అమ్మకి మనము నైవేద్యంగా సమర్పించుకోవచ్చు..ఇంకా మీ మనసుకు నచ్చినవీ అన్నీ కూడా వండి పెట్టుకోవచ్చు..అది మీ ఓపిక,మీ శక్తి కొద్దీ..
అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు ప్రధానం..మర్చిపోకుండా కాలభైరవాష్టకం చదువుకోవాలి కాలభైరవుడికి నైవేద్యం కింద పాలలో యాలకుల పొడి కలిపి పెట్టుకోవాలి..
ఏ పాలు పెట్టుకోవాలి ఆవు పాల గేదెపాలా పూజకి ఎప్పుడూ కూడా ఆవుపాలే పెట్టుకోవాలండి..(కుదరకపోతే ఏదుంటే అది)మరి పచ్చిపాల కాచి చల్లార్చిన పాల అని కూడా అడుగుతున్నారు కాచి చల్లార్చిన పాలని నైవేద్యంగా సమర్పించుకోవాలి..
ఎంతో ముఖ్యమైన విషయం అమ్మకి అయ్యకి పెట్టిన నైవేద్యాలు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ తీసుకోండి అదే మనకి అమృతంతో సమానం..
వారాహి ద్వాదశ నామాలు,వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవ వారు వారాహి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు.తప్పకుండా వారాహి షోడశ నామా స్తోత్రం పఠిచండి.
ఈ నవరాత్రి పూజల్లో భాగంగా అష్టోత్రాలతో కుంకుమార్చన చేసుకోవొచ్చు మరియు సహస్రనామాలు, స్తోత్రాలు, దేవి భాగవతం, దుర్గ సప్తశతి మరియు దేవి మహత్యం లాంటివి పారాయణం చేయటం కూడా చాలా మంచిది..
కుదిరితే అమ్మ నామాన్ని జపం చేసుకోండి..ఈ పూజ ఎవరన్నా చేసుకోవచ్చు..మొదటిసారి చేసుకోవాలనుకున్న చక్కగా సంతోషంగా చేసుకోండి..ఏమీ తెలియకపోతే,కుదరకపోతే అమ్మవారి నామాన్ని స్మరించుకోండి
అన్నిటికన్నా ముఖ్యమైనది మీ మనసు మీ మనసు పూజ మీద నిలబడాలి అనుకుంటే స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టల్ని వేసుకొని చిన్నగా అగరబత్తులు వెలిగించుకొని అప్పుడు పూజ చేసుకోండి పూజ అయిపోయాక చక్కగా అమ్మకి ధూపం వేయండి..
ఈ పూజ మనం నిత్య పూజలో కూడా అమ్మకి చేసుకోవచ్చు..ఒకవేళ వారాహి దేవి చిత్రపటం లేకపోతే పసుపు వారాహిని చేసుకోండి..అది కూడా కుదరకపోతే మీ ఇంట్లో లలితా దేవి చిత్రపటానికి అన్నా సరే మనము పూజ చేసుకోవచ్చు..అది కూడా లేకపోతే నిత్యం పూజించే దీపపు కుందికి అమ్మవారిని ఆవాహనం చేసుకొని పూజని అందించొచ్చు..
పూజ చేయాలనే ఆలోచన మీదైతే ఎన్నో విధాలుగా మనం అమ్మని పూజించుకోవచ్చు..అమ్మ పైన మన కున్న భక్తి ప్రధానం,మనసు ప్రధానం..
శ్రీ మాత్రే నమః ..🙏