02/07/2025
2. శక్తి దృష్టి
మీరు దేవుని డునామిస్ శక్తిని పొందినప్పుడు, మీరు దేవుని అసాధాణ శక్తి యొక్క దృష్టిని పొందుకుంటారు. దేవుని ఆత్మ పావురం వలే ఆయన పైకి దిగినప్పుడు క్రీస్తుకు జరిగిన మొదటి అద్భుతం సాధాణ మండలమునకు మించి చూడగలిగిన సామర్థ్యం మరియు దేవుని స్వరాన్ని వినే సామర్థ్యం కలిగాయి. "యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను." (మత్తయి 3: 16-17).
పరిశుద్ధాత్ముడు క్రీస్తులో చేసిన మొదటి పని ఎదనగా, ఆయన అసాధాణ నేత్రాలను మరియు చెవులను తెరవడం. ఆ దినము మొదలుకొని, క్రీస్తు మనుష్యులను, పరిస్థితులను, తన తండ్రియైన దేవుడిని, సాతానును మరియు సాతాను సేనలను కూడా చాలా భిన్నమైన అసాధాణ దృష్టితో చూడటం ప్రారంభించాడు. "అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు." (యోహాను 2: 24-25).
దేవుడు మాత్రమే మనిషి హృదయాన్ని చూడగలడు. మనిషి ముఖాన్ని మాత్రమే చూస్తాడు కాని దేవుడు హృదయాన్ని చూస్తాడు. తనకు ముప్పై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, యేసు మనిషిలా చూశాడు. దేవుని ఆత్మ ఆయన పైకి వచ్చినప్పుడు, ఆయన మనోనేత్రములు తెరవబడ్డాయి మరియు ఆయనకు దైవిక దృష్టి లభించింది. అద్భుతమైన విషయం ఏమిటంటే, క్రీస్తు పైన ఉన్న అదే ఆత్మ ఈ రోజు మీ పైన నిలిచి ఉన్నది.
మీరు కూడా సహజ అడ్డంకులను దాటి చూడవచ్చు. ఆయనలో ఉన్న అదే 'డునామిస్' మీలో ఉంది. అందువల్ల మీరు నిజంగా యేసు లాగా మారవచ్చు. మీరు ఆయన అడుగుజాడల్లో నడచునట్లు, మీ రక్షకుడు మీకు ఒక ఉదాహరణగా వచ్చాడు(1 పేతురు 2:21). క్రీస్తు, " ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికోనెను. " (ఫిలి. 2:6-7).
మీరు మీ యేసు లాగా మారడం చాలా సాధ్యమే. దేవుని లోతులను మీకు చూపించడానికి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చాడు. "కానీ వ్రాయబడినట్లుగా: ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
ఒక మనుష్యుని సంగతులు అతనిలో నున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది యున్నాము.” (1కోరిం. 2.9. 12). దేవుని ఆత్మ మానవ దృష్టికి దాగి ఉన్న వాటిని వెల్లడిస్తుంది.
యేసుక్రీస్తు పరిశుద్దాత్మ కళ్ళ ద్వారా ఒక ప్రత్యేక దృష్టిలో చూశాడు. ఆయన తన శిష్యులను ఎన్నుకునే ముందు, ఆయన తన ఆత్మీయ నేత్రముల ద్వారా వారిని చూశాడు. ఆయనకు వారి పేర్లు మరియు వారి నివాస స్థలములు కూడా తెలుసు. "యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి- ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. -నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు-ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు- బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు-చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందు వలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన- మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను."(యోహాను 1: 47-51).
To be continued....