Calvary Prayer Hall - Ongole.

Calvary Prayer Hall - Ongole. Official page for Calvary prayer hall, Ongole.

10/01/2026
16/11/2025

అపవాదిని మీరు జయించారా? అయితే సంఘ ఆరాధనకు వెళ్ళి ఉంటారు!

అపవాది మిముల్ని జయించాడా? అయితే సంఘ ఆరాధనకు వెళ్ళి ఉండరు!

ప్రియులైన సహోదరీ సహోదరులకు వందనాలు... 🙏ప్రియులారా... ఈ నెల 27న (బుధవారం, సెలవు దినం) మన కల్వరి ప్రార్ధన మందిరము, ఒంగోలుల...
19/08/2025

ప్రియులైన సహోదరీ సహోదరులకు వందనాలు... 🙏

ప్రియులారా... ఈ నెల 27న (బుధవారం, సెలవు దినం) మన కల్వరి ప్రార్ధన మందిరము, ఒంగోలులో *శ్రీ సురేష్ బాబు పురిటిగడ్డ* (ప్రముఖ పరిశోధకులు, రచయిత మరియు తెలంగాణా రత్నా అవార్డు గ్రహీత) గారి ఆధ్వర్యములో *ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర* అనే ప్రత్యేకమైన చరిత్రను తెలియజేయు కార్యక్రమము నిర్వహించబడుతుంది... రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఈ మీటింగులో పాల్గొంటున్నారు... మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 250 సంవత్సరాల తెలుగు క్రైస్తవ చరిత్రను నేర్చుకోవాలని కోరుతున్నాము... ఇది అత్యవసరమా అని అంటే నా మనస్పూర్తిగా చెబుతాను., ఈ నాటి తెలుగు క్రైస్తవలోకం నాటి చరిత్రను మరచిపోవుచున్నది... గనుక నేటి తరాలు, రాబోవు తరాలు చరిత్రను మరచిపోకూడదు అనే సంకల్పంతో ఈ మీటింగ్ ను నిర్వహిస్తున్నాము... ఇది బోధకులకు, పాస్టర్లకు, సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, చరిత్ర పరిశోధకులకు, విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకం... ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు ₹.100/- (మార్నింగ్ టీ స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ స్నాక్స్ నిమిత్తం) 9652962128 కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మీ చైర్ రిజర్వ్ చేసుకోవాలని, మీరు వచ్చే విషయాన్ని కనీసం ఒకరోజు ముందుగా 8977751077 కి వాట్సాప్ చెయ్యాలని కోరుతున్నాము... మనం మీటింగులో కలుద్దాం.. దేవుడు మనలను తన జ్ఞానముతో, చరిత్రలోని సత్యాల ద్వారా ఆత్మస్థైర్యం పెంపొందించి దీవించును గాక! ఆమెన్.

23/06/2025

*వాంఛ - ఏలుబడి*

నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.
ఆదికాండము 3:16

🟣 నువ్వు దేనినైతే వాంచిస్తావో అంటే కోరుకుంటావో లేదా ఇష్టపడతావో అది నిన్ను ఏలుతుంది...

🟣 ఉదాహరణ1: నీ మనసులో ఐస్ క్రీమ్ తినాలనే ఆలోచన కలిగింది... అప్పటినుంచి ఐస్ క్రీమ్ గురించి విపరీతమైన ఆలోచనలు కలుగుతున్నాయి... ఇలా ఆలోచనలు కలగడాన్ని వాంఛించండం అంటాము లేదా ఐస్ క్రీమ్ నిన్ను వాంఛిస్తుంది అని అర్థం... అప్పుడు మరో ఆలోచన లేకుండా నువ్వు ఐస్ క్రీమ్ తింటే... ఐస్ క్రీమ్ నిన్ను ఏలుబడి చేసింది అని అర్థం... ఇలా మన జీవితంలో ఎన్నో విషయాలు...

🟣 ఉదాహరణ 2: యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారు... వాటిలో ఒక కోర్టు సీన్ మిమ్ముల్ని ఆకట్టుకుంది అంటే వాంఛించింది., అప్పుడు మీరు అది ఏ సినిమా? అని దాన్ని వెదికి మొత్తం సినిమా చూశారు అంటే ఆ సినిమా మిమ్ముల్ని ఏలుబడి చేసింది అని అర్థం...
~ ఇక్కడ 1 నిమిషం వాంఛకు 3 గంటల ఏలుబడి జరిగిందన్నమాట...

🟣 ఇక లవ్ స్టోరీలన్ని ఇంతే...

అబ్బాయి మీద అమ్మాయికి, అమ్మాయి మీద అబ్బాయికి వాంఛ కలుగుతుంది., ఇక్కడ వాంఛ పేరు ప్రేమ...

_ఆ తరువాత జరిగేదంతా ఏలుబడే..._

🟣 మొదటి ఉదాహరణలో ఆరోగ్యం చెడిపోతుంది

రెండవ ఉదాహరణలో సమయం వృధా అవుతుంది

మూడవ ఉదాహరణలో
కొన్ని సార్లు జీవితమే నాశనం అవుతుంది

🟣 నన్ను ఏలమని కోరేది భార్య... ఏలేవాడు భర్త.

*ఇప్పుడు ఎవర్ని ఎవరు ఏలుతున్నారు?*

🟣 ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి (వాంఛింపబడి) మరులు కొల్పబడినవాడై శోధింపబడును (ఏలుబడు జరుగును). దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును (స్వనాసనం జరుగును).
యాకోబు 1:14-15

*మీరు వాంఛింపబడుతున్నారా?*
__________________
టి. మిత్రా మనోహర్
కల్వరి ప్రార్ధన మందిరము, ఒంగోలు.

Please attend 40 day fasting prayers at Calvary Prayer Hall - Ongole.
26/02/2025

Please attend 40 day fasting prayers at Calvary Prayer Hall - Ongole.

21/01/2025

*వాక్యాన్ని తప్పు దారి పట్టిస్తున్న - ముసుకు లేని పాస్ట్రమ్మలు*

🧕బెల్లంపల్లిలోని ఓ ప్రముఖ సేవకుని భార్య ఒక టివి కార్యక్రమంలో సాక్ష్యం చెబుతూ _*తనను ముసుకు వేసుకోవద్దని దేవుడు చెప్పాడట!*_ అందువల్ల ఆమె ముసుకు వేసుకోదు...

🧕"మీరు వాక్యం వింటారా లేక ఆమె ఏమి వేసుకుంది, ఏమి వేసుకోలేదు అనేదే చూస్తారా" అని నా మీద మాటలు అనేవారు చాలామంది ఉంటారు, దానిగురించి నాకు భయం లేదు..

🧕అయితే దేవుడు తన వాక్యానికి విరోధముగా తనే ప్రవర్తింపమని చెబుతాడా!? ఆయన వాక్యానికి విరోధముగా ఆయనే ఎప్పుడూ చెప్పడు కదా!?...

*🧕ముసుకు వేసుకోవడం గురించి బైబిల్ ఏమి చెబుతుంది?*

1 కోరింథీ 11:5, 6,13 - ఏ స్త్రీ తలమీద 🧕ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును | స్త్రీ 🧕ముసుకు వేసికొనని యెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె 🧕ముసుకు వేసికొనవలెను. | మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ 🧕 ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?

🧕బైబిల్ లో స్త్రీలు ముసుకు వేసుకోవాలి అని రాసివుంటే... అదే దేవుడు 🧕ముసుకు వేసుకోవద్దని ఎలా చెబుతాడు?

బ్రదర్... అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు గనుక ఇదేమి అంత సీరియస్ మ్యాటర్ కాదు అనేదే నీ అభిప్రాయమా?

*అయితే దాని పర్యవసానం ఎలా మారిపోయిందో చూడండి...*

నేడు స్టేజీ / చర్చి / సోషల్ మీడియా మాధ్యమాలలో అనేకమంది సేవకురాండ్రు ముసుకు వేసుకోకుండా ప్రసంగిస్తూ వాక్యసత్యాలనే దారిని తప్పిస్తున్నారు. ముసుకు వేసుకోవాలని వాక్యంలో చెప్పిన దేవుని మాటను విస్మరించి ముసుకు తీసేసి వాక్యం చెప్పే తరం వెలుగులోకి వచ్చింది... దానికి కారణం ఆనాడు ఆమె దుర్భోధను ఖండించకపోవడమే!

మీ పాస్త్రమ్మ గారు ముసుకు వేసుకునే వాక్యం బోధిస్తున్నారా? ముసుకు జారిపోతుంది కదా అని తీసేస్తున్నారా... బొంకాల్సిన అవసరం లేకుండా పిన్స్ పెట్టుకోవచ్చు... ఎందుకంటే వాక్యాప్రకరం మనమే ప్రవర్తింపకపోతే మనల్ని అనుకరించేవారు ఇంకెలా చేస్తారు?

🧕బెల్లంపల్లిలోని ఓ ప్రముఖ సేవకుని భార్య *ముసుకు చేసుకోవద్దు అని దేవుడే చెప్పాడు* అనే మాట ముసుకు వేసుకోకపోవడాన్ని సమర్ధిస్తుంది... అదే మాట నేడు అనేకమంది పాస్ట్రమ్మలు ఫాలో అవుతున్నారు... అంటే బాధపడతారు కనుక నేను లోతుగా మాట్లాడడం లేదు గాని అది యెజబెలు ఆత్మ., యెజబెలు ఆత్మ ఆవహించి దేవుని పేరును కూడా వాడుకుని దేవుడే చెప్పాడు అని నేటి పాస్ట్రమ్మలను/ సేవకురాండ్రను ప్రలోభాలకు గురిచెయ్యడం అపవాది ఆలోచన కాకపోతే ఇంకొకటి అవ్వదు!

ప్రతి పాస్టర్ తన ముసుకు వేసుకోని భార్యను (పాస్ట్రమ్మను) హెచ్చరించాలి... మీరు హెచ్చరిస్తున్నప్పుడు మీ మాటకు తను లోబడడం లేదు అంటే ఆ ఆత్మ ఎంత తీర్వంగా పనిచేస్తుందో, యజమనునికే లోబడనంతగా పనిచేస్తుందని గ్రహించండి!

*దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.*
_________________
టి. మిత్రా మనోహర్
కల్వరి మినిస్ట్రీస్, ఒంగోలు.

Address

Ongole

Alerts

Be the first to know and let us send you an email when Calvary Prayer Hall - Ongole. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Calvary Prayer Hall - Ongole.:

Share