05/06/2024
✍️పాస్టరు పట్ల సంఘము ఎలా స్పందించాలి? 📖
📚📚📚📚📚📚📚📚
1 కొరింథీ 9:11-19 - “మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా? ఇతరులకు మీపైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. ఆలయకృత్యములు
జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారైయున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు.
నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినయెడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.”
♻️1. ప్రార్థించండి:♻️
🟣🔵🟢🟡🟠🔴⚪⚫🟤
సంఘము తమ పాస్టరు కొరకు ప్రార్థించే బాధ్యతను కలిగి ఉంది.
♦️ఎఫెసీ 6:20 - “దానినిగూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.”
👉మాట్లాడే శక్తి కొరకు ప్రార్థించాలి.
♦️ కొలస్సీ 4:4 - “... వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి.”
👉ప్రకటించడానికి అనుకూల సమయము కొరకు ప్రార్థించాలి.
♦️2 థెస్స 3:2 - “మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.”
👉పాస్టరుగారి క్షేమము కొరకు సంఘము ప్రార్థించాలి
♦️హెబ్రీ 13:18 - “మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”
👉పాస్టరు యొక్క శీలము కొరకు సంఘము ప్రార్థించాలి.
♻️ 2. లోబడండి:♻️
🟨🟧🟥⬜⬛🟫🟪🟦🟩
హెబ్రీ 13:17 - “మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ ప్రయోజనము గనుక దుఃఖముతోకాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.
♻️3. గౌరవించండి:♻️
⬜⬛🟫🟪🟦🟩🟥🟧🟨
1 తిమోతి 5:17 "బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.
♻️4. కష్టాలలో తోడుగా ఉండండి:♻️
🟨🟧🟥⬜⬛🟫🟪🟦🟩
రోమీయులకు 16:4
వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
1 కొరింథీ 16:10“తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు.”
1 తిమోతి 5:19 “మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషారోపణ అంగీకరింపకుము.”
2 తిమోతి 1:15 “ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు; వారలో పుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.”
♻️5. ఆర్థికంగా తోడ్పడండి:♻️
🟨🟧🟥⬜⬛🟫🟪🟦🟩
సంఖ్యాకాండము 18:20
మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనువారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.
సంఖ్యాకాండము 18:21
ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.
మత్తయి 10:10 - “పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
లూకా 10:10 - పనివాడు జీతమునకు పాత్రుడు."
1 కొరింథీ 9:11 “మీకొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా?”
1 కొరింథీ 9:14 - “ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు."
గలతీ 6:6 - “వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను.”
1 తిమోతి 5:17,18 - "బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.
♻️' 6. ఉపచారము చేయండి:♻️
⬛🟫⬜🟪🟦🟩🟥🟧🟨
ఫిలేమోను 13వ “నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని...”
ఫిలిప్పీ 2:29 - “నాయెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను.”
లూకా 8:1
వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా
లూకా 8:2
పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.
లూకా 8:3
వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము(అనేక ప్రాచీన ప్రతులలో-ఆయనకుపచారము అని పాఠాంతరము) చేయుచు వచ్చిరి.
♻️7. సేవకుని ఘనపరచండి ♻️
🟡🟠🔴⚪⚫🟤🟣🔵🟢
1 థెస్స 5:12,13 “మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ది చెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి.
WhatsApp Group Invite