Chatrapathi Hanuman Temple, Namdevwada, Nizamabad

Chatrapathi Hanuman Temple, Namdevwada, Nizamabad Chatrapathi Hanuman Temple Situated at Namdevwada Nizamabad.Andhra pradesh. Chatrapthi Hanuman Temple,
Namdevwada,
Nizamabad-503001 (A.P).
9290199175

🕉️జై శ్రీరాం ! ఇందూర్ ప్రజలకుజై జై శ్రీరాం !!🚩*హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు*💐తేది: 06-04-2023 గురువారం రోజున హనుమాన్ జ...
05/04/2023

🕉️

జై శ్రీరాం !

ఇందూర్ ప్రజలకు
జై జై శ్రీరాం !!🚩

*హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు*💐

తేది: 06-04-2023 గురువారం రోజున హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా *శ్రీ ఛత్రపతి హనుమాన్ మందిరము*
నందు *అన్నదాన ప్రసాదం* కార్యక్రమము నిర్వహించబడును,
కావున భక్తులు తమకు తోచిన విధముగా అనగా వస్తు, ధన రూపేణ విరాళాలు ఇచ్చి *అన్న ప్రసాద* కార్యక్రమమును జయప్రదం చేయగలరని ప్రార్థన🙏🚩

సెల్: 9866123230, 9705002680

ఇట్లు,
*శ్రీ చత్రపతి హనుమన్ సేవా సమితి*
నామ్ దేవ్ వాడ
ఇందురు.

💥🚩💥🚩💥🚩💥🚩💥

🌿🌼🙏 #నవరాత్రులలో  #మొదటిరోజు  #శైలపుత్రీ_దుర్గా🙏🌼🌿  #శైలపుత్రీ  #దేవి  #ఆవిర్భావ  #వృత్తాంతం🙏🌼🌿🌿🌼🙏శైలపుత్రీ దుర్గా, అమ్మ...
25/09/2022

🌿🌼🙏 #నవరాత్రులలో #మొదటిరోజు #శైలపుత్రీ_దుర్గా🙏🌼🌿 #శైలపుత్రీ #దేవి #ఆవిర్భావ #వృత్తాంతం🙏🌼🌿

🌿🌼🙏శైలపుత్రీ దుర్గా, అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీ దేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తూ పార్వతీ దేవి అవతారమే శైలపుత్రీ దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు🙏🌼🌿

🌿🌼🙏మూలాధార చక్రానికి అధిష్టాన దేవత🙏🌼🌿

పరాశక్తి అవతారం(నవదుర్గల్లో మొదటి అవతారం)

🌿🌼🙏మంత్రం🙏🌼🌿

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం, వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్

🌿🌼🙏ఆయుధములు - త్రిశూలం, కమలం🙏🌼🌿

🌿🌼🙏భర్త - శివుడు🙏🌼🌿

🌿🌼🙏వాహనం - వృషభం🙏🌼🌿

🌿🌼🙏పురాణ గాథ🙏🌼🌿

🌿🌼🙏నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రీ దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతీ, హైమవతీ అని కూడా పిలుస్తారు.🙏🌼🌿

🌿🌼🙏బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రీ దుర్గా దేవి వృషభవాహనంపై తిరుగుతుంది. కుడిచేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి, ఎడమచేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిణి అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి, శివుణ్ణీ, సతీదేవినీ ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైన నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ, అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి, అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దనీ, అలా పిలిచినపుడు వెంటనే దక్షయజ్ఞ వినాశినీ అని పిలవాలనీ శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు, మేనకా, హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతీ, శైలజ, శైలపుత్రీ అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. 🙏🌼🌿

🌿🌼🙏శివమహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతరన పురాణాల్లోనూ సతీ, పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు.🙏🌼🌿

🌿🌼🙏రుతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి(హిమవంతుడు) నుంచి భర్త(శివుడు)ను వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగసాధనకు ప్రధమమైనది. శైలపుత్రీదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివకుటుంబిణి కాబట్టీ తన భర్త అయిన శివుణ్ణి వెతికి, ధ్యానించి, సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు.🙏🌼🌿

🌿🌼🙏యోగ పరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రీ దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటంది అని అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.🙏🌼🌿

🌿🌼🙏యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారా చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రీ దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది.🙏🌼🌿

🌿🌼🙏శైలపుత్రీ దేవిది పృధ్వీ తత్త్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రాహణ, భేద శక్తులతో ప్రకాశిస్తుంది.🙏🌼🌿

🌿🌼🙏ధ్యానం🙏🌼🌿

🌿🌼🙏శైలపుత్రీ దేవి మంత్రం ల,మ. నాలుక, పెదాలపై దృష్టి ఉంచి ఈ రెండు పదాలను పలుకుతారు.🙏🌼🌿

🌿🌼🙏శైలపుత్రీ దుర్గా ధ్యాన శ్లోకం🙏🌼🌿

🌿🌼🙏వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్
"వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నా వందనం/నమస్కారం అర్పిస్తున్నాను." అని ఆ శ్లోకానికి అర్ధం.🙏🌼🌿

12/08/2022

ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. దీనిని తయారు చేయడానికి ఒక రోజు పట్టింది
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

వేదాలు :(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా

పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

పంచేంద్రియాలు : (1) కన్ను,
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.

లలిత కళలు : (1) కవిత్వం,
(2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.

పంచగంగలు : (1) గంగ, (2) కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి,
(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు : (1) మందారం,
(2) పారిజాతం, (3) కల్పవృక్షం,
(4) సంతానం, (5) హరిచందనం.

పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ, (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,
(5) తేనె.

పంచలోహాలు : (1) బంగారం,
(2) వెండి, (3) రాగి,
(4) సీసం, (5) తగరం.

పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,
(3) చేదు, (4) వగరు,
(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు షడ్గుణాలు:(1) కామం,
(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు,
(5) హేమంత, (6) శిశిర

సప్త ఋషులు : (1) కాశ్యపుడు,
(2) గౌతముడు, (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి,
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం,
(4) వేట, (5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు : (1) గంగ,
(2) యమునా, (3) సరస్వతి,
(4) గోదావరి, (5) సింధు,
(6) నర్మద, (7) కావేరి.

నవధాన్యాలు : (1) గోధుమ,
(2) వడ్లు, (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు,
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం,
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,
(6) భయానక, (7) బీభత్స,
(8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత,
(6) కాత్యాయని, (7) కాళరాత్రి,
(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు : (1 ) వివాహం,
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,
(4 ) సీమంతం, (5) జాతకకర్మ,
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన,
(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,
(3) మంగళ, (4) బుధ, (5) గురు,
(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,
(5) శ్రావణం, (6) భాద్రపదం,
(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం,
(9) మార్గశిరం, (10) పుష్యం,
(11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు : (1) మేషం,(2) వృషభం,
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల,
(8) వృశ్చికం, (9) ధనస్సు,
(10) మకరం, (11) కుంభం,
(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ,
(3) తదియ, (4) చవితి,(5) పంచమి,
(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి,
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,
(12) ద్వాదశి, (13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి,
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,
(6) ఆరుద్ర, (7) పునర్వసు,
(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,
(17) అనురాధ, (18) జ్యేష్ఠ,
(19) మూల, (20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,
(23) ధనిష్ఠ, (24) శతభిషం,
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

(2) విభవ :-
1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ. -
1935, 1995, 2055, 2115

10.ధాత. -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159

54.రౌద్రి
1980, 2040, 2100, 2160

55.దుర్మతి
1981, 2041, 2101, 2161

56.దుందుభి
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164

59.క్రోదన
1985, 2045, 2105, 216

60.అక్షయ
1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....
నమస్కారంఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. దీనిని తయారు చేయడానికి ఒక రోజు పట్టింది
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

వేదాలు :(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా

పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

పంచేంద్రియాలు : (1) కన్ను,
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.

లలిత కళలు : (1) కవిత్వం,
(2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.

పంచగంగలు : (1) గంగ, (2) కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి,
(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు : (1) మందారం,
(2) పారిజాతం, (3) కల్పవృక్షం,
(4) సంతానం, (5) హరిచందనం.

పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ, (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,
(5) తేనె.

పంచలోహాలు : (1) బంగారం,
(2) వెండి, (3) రాగి,
(4) సీసం, (5) తగరం.

పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,
(3) చేదు, (4) వగరు,
(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు షడ్గుణాలు:(1) కామం,
(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు,
(5) హేమంత, (6) శిశిర

సప్త ఋషులు : (1) కాశ్యపుడు,
(2) గౌతముడు, (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి,
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం,
(4) వేట, (5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు : (1) గంగ,
(2) యమునా, (3) సరస్వతి,
(4) గోదావరి, (5) సింధు,
(6) నర్మద, (7) కావేరి.

నవధాన్యాలు : (1) గోధుమ,
(2) వడ్లు, (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు,
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం,
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,
(6) భయానక, (7) బీభత్స,
(8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత,
(6) కాత్యాయని, (7) కాళరాత్రి,
(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు : (1 ) వివాహం,
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,
(4 ) సీమంతం, (5) జాతకకర్మ,
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన,
(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,
(3) మంగళ, (4) బుధ, (5) గురు,
(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,
(5) శ్రావణం, (6) భాద్రపదం,
(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం,
(9) మార్గశిరం, (10) పుష్యం,
(11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు : (1) మేషం,(2) వృషభం,
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల,
(8) వృశ్చికం, (9) ధనస్సు,
(10) మకరం, (11) కుంభం,
(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ,
(3) తదియ, (4) చవితి,(5) పంచమి,
(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి,
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,
(12) ద్వాదశి, (13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి,
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,
(6) ఆరుద్ర, (7) పునర్వసు,
(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,
(17) అనురాధ, (18) జ్యేష్ఠ,
(19) మూల, (20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,
(23) ధనిష్ఠ, (24) శతభిషం,
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

(2) విభవ :-
1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ. -
1935, 1995, 2055, 2115

10.ధాత. -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159

54.రౌద్రి
1980, 2040, 2100, 2160

55.దుర్మతి
1981, 2041, 2101, 2161

56.దుందుభి
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164

59.క్రోదన
1985, 2045, 2105, 216

60.అక్షయ
1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....
నమస్కారం

30/05/2022

*ఈ రోజు శనెశ్చర జయంతి , శనెశ్చరుడి అనుగ్రహం పొందితే అదృష్టం మీ వెంటే..!*

శనెశ్చరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు నిర్వహిస్తారు. ఈ రోజు శనెశ్చరున్ని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.

*శనెశ్చర జయంతి*

దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనెశ్చర గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం.

ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.

*చేయవలసిన పూజలు*

శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి.
అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి.
దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి.
తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి.
ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.

అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి.
శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు.

నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.

*శని దేవుడి ప్రాముఖ్యత*

సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

*శని శాంతి మంత్ర స్తుతి*

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

*క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్*
*ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్*
*నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార*
*వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం* *భవకామదశ్చ ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు* *ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ*
*శుద్ధబుద్ధి ప్రదాయనే*
*య ఏభిర్నామభి స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్*
*మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి*

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన *''క్రోడం నీలాంజన ప్రఖ్యం..''* అనే శ్లోకాన్ని ౧౧ సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని ౧౧ సార్లు జపించాలి.

*శన్యారిష్టే తు సంప్రాప్తే*
*శనిపూజాంచ కారయేత్*
*శనిధ్యానం ప్రవక్ష్యామి*
*ప్రాణి పీడోపశాంతయే*

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

*శని జయంతి తేదీ, సమయం:*

ఈ ఏడాది శని జయంతి 30 మే 2022, సోమవారం వచ్చింది. శుభ సమయం మే 29 ఆదివారం మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమవుతుంది. మే 30వ తేదీ సాయంత్రం 4:59 వరకు కొనసాగుతుంది. ఈసారి అయితే ఉదయమే తిథి రావడంతో మే 30న శని జయంతి జరుపుకోనున్నారు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది...🙏🚩💐

🕉🕉🕉🕉🕉🕉

శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలుపరిపూర్ణుడు హనుమ మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్...
25/05/2022

శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు

పరిపూర్ణుడు హనుమ

మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్వామికే ఉన్నాయి. శ్రీమద్రామాయణం మంత్రగర్భిత కావ్యం.
అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణుతేజం శ్రీరామునిగా, శక్తిస్వరూపం సీతమ్మగా, రుద్రమూర్తి హనుమంతునిగా వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమప్రాధాన్యం కలవారిగా రామాయణంలో మన్ననలందారు.
శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణజన్మురాలైన అప్సరః కాంత. ఆ తల్లి తనయునిగా జన్మించాడు హనుమ. అతడు బాల్యంలోనే అలవోకగా సూర్యమండలం వరకు ఎగిరిన బలశాలి. వేదమూర్తి అయిన సూర్యునికి శిష్యుడు. సూర్యోని నుంచి ఆయనకు వరంగా లభించిన దివ్యతేజశ్శక్తే సువర్చస్సు. ఈ శక్తినే స్త్రీ దేవతగా -
ఉపాసనా సంప్రదాయంలో 'సువర్చల' అన్నారు.

వైశాఖ బహుళ దశమి హనుమజననం.

రామాయణంలో తనకోసం కాక, పరుల కోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించినవాడు ఆంజనేయుడే. రావణుని తాను సంహరించ గలిగినప్పటికీ, అది శ్రీరాముని అవతార కార్యమని, అందుకు తగిన సహకారం అందించాడు. "రాముని బాణంలా లంకంలోకి వెళతాను" అనడంలోనే తన వినయాన్నీ, భక్తిభావాన్నీ ప్రకటించాడు.
జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం.... ఇన్నింటి కలబోత హనుమ.
అభయం, ఆనందం.... ఈ రెండూ హనుమ అందించే వరాలు. భయపడిన సుగ్రీవుడికి అభయమిచ్చి శ్రీరామమైత్రిని అందించాడు. శోకంలో ఉన్న సీతకు శ్రీరామ సందేశాన్ని వినిపించి ప్రాణాలను నిలబెట్టి, సంతోషపరచాడు. సీత జాడను తెలిపి, లక్ష్మణుని ప్రాణాలను నిలిపి శ్రీరాముని ఆనందపరచాడు. ఇలా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా భాసించాడు.
నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహస్వామి, ఆంజనేయుడు - ఈ అయిదూ ఒకే తత్త్వం తాలుకూ విభిన్న వ్యక్తీకరణలు. ఇది మంత్రపరమైన ఔచితీదర్శనం. మృగ వదనం, నరశరీరం కలిగిన దేవతలు 'క్షిప్రప్రసాద' (వెంటనే అనుగ్రహించే) లక్షణం కలవారు.
రాక్షస సంహారంలో ప్రతాపాన్ని చూపిన నారసింహ లక్షణం, జ్ఞానస్వరూపినిగా హయగ్రీవ స్వభావం, గరుత్మంతునిగా మహావేగం, వరాహ స్వామిగా సంసార సాగరం నుంచి, శోకపంకం నుంచి ఉద్ధరించే తత్త్వం, తనకు సహజమైన వానరాకారం - ఇవన్నీ కలబోసిన లీలలను రామాయణంలో ప్రదర్శించాడు హనుమ. అందుకే పంచముఖాంజనేయునిగా దర్శనమిచ్చాడు.
అంతేకాక - గజవదనుడైన గణపతత్త్వం, హనుమతత్త్వమూ కూడా ఒకటేనని విజ్ఞుల విశదీకరణ.
"అవ్యక్త అప్రమేయ పరతత్త్వమితడు" అని వాల్మీకి సుందరకాండలో పేర్కొన్నాడు.
"సుతరాం ఆద్రియతే ఇతి సుందరః" - అందరి ఆదరణా పొందే గుణమహిమ రూపాలు కలవాడు హనుమయే సుందరుడు. మంత్రశాస్త్రంలో హనుమ నామం సుందరుడు. అందుకే హనుమ కథ 'సుందర కాండ'గా రామాయణ రత్నమాలలో కొలికిపూసలా ప్రకాశిస్తున్నవాడు.
ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం - కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయస్వామి.

17/05/2022
01/04/2022

*తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు*

1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.
15. వృష ... చర్మం.
16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.
22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.
23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.
24. వికృతి... వికృతమైనటువంటిది.
25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
27. విజయ... విశేషమైన జయం కలిగినది.
28. జయ.... జయాన్ని కలిగించేది.
29. మన్మథ... మనస్సును మధించేది.
30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.
31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి... సాగదీయడం.
33. వికారి.... వికారం కలిగినది.
34. శార్వరి... రాత్రి.
35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.
37. శోభకృత్... శోభను కలిగించేది.
38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ ... అవమానం.
41. ప్లవంగ... కోతి, కప్ప.
42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య... మృదుత్వం.
44. సాధారణ... సామాన్యం.
45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.
46. పరీధావి... భయకారకం.
47. ప్రమాదీచ... ప్రమాద కారకం.
48. ఆనంద... ఆనందమయం.
49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి... దుష్ట బుద్ధి.
56. దుందుభి ... వరుణుడు.
57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన... కోప స్వభావం కలది.
60. అక్షయ... నశించనిది

29/03/2022

#యాదాద్రి_దర్శన_వేళల్లో_మార్పులు.

ఉదయం 3గంటల నుంచి 3.30 గంటలకు సుప్రభాతం..

ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం.. ఆరాధన

ఉదయం 4గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామివారికి బాలభోగం

ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిజాభిషేకం

ఉదయం 5.30 గంటల నుంచి 5.45 గంటల వరకు అలంకార సేవ

ఉదయం 5.45 గంటల నుంచి 6.30 వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన..

ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు సర్వ దర్శనాలు

ఉదయం 8గంటల నుంచి 9గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం

ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు సర్వదర్శనాలు

మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు మాధ్యాహ్న రాజభోగము

మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4 గంటల వరకు సర్వ దర్శనాలు

సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం

సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ దర్శనాలు

రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తిరువారాధన

రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన...

రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు సర్వదర్శనాలు.

రాత్రి 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన. ఆరగింపు.

రాత్రి 9.45గంటల నుంచి 10గంటల వరకు శయనోత్సవ దర్శనం. ప్రధానాలయ ద్వార బంధనం.

+ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకు జరిగే సర్వదర్శన వేళల్లో సువర్ణపుష్పార్చన, వేదాశీర్వచనం.

ఉదయం 8.30 గంటల నుంచి 10గంటల వరకు సుదర్శన నారసింహ హోమం.

ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణోత్సం.. బ్రహ్మోత్సవం.

సాయంత్రం 5గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి వెండి జోడు సేవోత్సవాలు

సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భారు సేవ

ప్రతీ మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు విష్ణుపుష్కరిణి, ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు.

ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవోత్సవం.


ఈ స్తోత్రము నిత్యము పఠించు వారికి హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.  నీలకృత ఆంజనేయ...
29/03/2022

ఈ స్తోత్రము నిత్యము పఠించు వారికి హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.

నీలకృత ఆంజనేయ స్తోత్రం

ఓం జయ జయ! శ్రీ ఆంజనేయ! కేసరీ ప్రియనందన! వాయుకుమారా! ఈశ్వరపుత్ర! పార్వతీ గర్భ సంభూత! వానరనాయక! సకల వేదశాస్త్ర పారగ! సంజీవి పర్వతోత్పాటన! లక్ష్మణ ప్రాణరక్షక! గుహప్రాణదాయక! సీతాదుఃఖ నివారణ! ధాన్యమాలీ శాపవిమోచన దుర్దండీ బంధవిమోచన! నీలమేఘ రాజ్యదాయక! సుగ్రీవ రాజ్యదాయక! భీమసేనాగ్రజ! ధనంజయ ధ్వజవాహన! కాలనేమి సంహార! మైరావణ మర్దన! వృతాసుర భంజన! సప్త మంత్రిసుత ధ్వంసన! ఇంద్రజిద్వధకారణ! అక్షకుమార సంహార! లంకిణీ భంజన! రావణమర్దన! కుంభకర్ణ వధపరాయణ! జంబూ మాలి నిషూదన! వాలినిర్హరణ! రాక్షసకుల దాహన! అశోకవన విదారణ! లంకాదాహక! శతముఖవధకారణ! సప్తసాగర వాలసేతు బంధన! నిరాకార నిర్గుణ సగుణ స్వరూప! హేమవర్ణ పీతాంబరధర! సువర్చలా ప్రాణనాయక! త్రయస్తింశత్కోట్యర్బుద రుద్రగణపోషక! భక్తపాలనచతుర! కనకకుండలాభరణ! రత్న కిరీట హార నూపుర శోభిత! రామభక్తి తత్పర! హేమరంభావన విహార! వక్షతాంకిత మేఘవాహక! నీలమేఘశ్యామ! సూక్ష్మకాయ! మహాకాయ! బాలసూర్యగ్రసన! ఋష్యమూక గిరి నివాసక! మేరు పీఠకార్చన! ద్వాత్రింశతాయుధధరా! చిత్రవర్ణ! విచిత్ర సృష్టినిర్మాణకర్తా! అనంతనామ! దశావతార! అఘటన ఘటనా సమర్థ! అనంతబ్రహ్మన్! నాయక! దుర్జనసంహార! సుజనరక్షక! దేవేంద్రవందిత! సకలలోకారాధ్య! సత్యసంకల్ప! భక్తసంకల్పపూరక! అతిసుకుమారదేహ! అకర్దమ వినోదలేపన! కోటి మన్మథాకార! రణకేళిమర్దన! విజృంభమాణ! సకలలోక కుక్షింభర! సప్తకోటి మహామంత్ర తంత్ర స్వరూప! భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసన! శివలింగ ప్రతిష్ఠాపనకారణ! దుష్కర్మ విమోచన! దౌర్భాగ్య నాశన! జ్వరాది సకలరోగహర! భుక్తి ముక్తిదాయక! కపటనాటక సూత్రధారీ! తలావినోదాంకిత! కళ్యాణ పరిపూర్ణ! మంగళప్రద! గానప్రియ! అష్టాంగయోగ నిపుణ! సకల విద్యా పారీణ! ఆదిమధ్యాంతరహిత! యజ్ఞకర్త! యజ్ఞభోక్త! షణ్మత వైభవసానుభూతి చతుర! సకల లోకాతీత! విశ్వంభర! విశ్వమూర్తే! విశ్వాకార! దయాస్వరూప! దాసజన హృదయకమల విహార! మనోవేగగమన! భావజ్ఞ నిపుణ! ఋషిగణగేయ! భక్తమనోరథదాయక! భక్తవత్సల! దీనపోషక దీనమందార! సర్వస్వతంత్ర! శరణాగత రక్షక! ఆర్తత్రాణ పరాయణ! ఏక అసహాయవీర! హనుమాన్! విజయీభవ! దిగ్విజయీభవ! దిగ్విజయీభవ!

Address

NAMDEVWADA
Nizamabad
503001

Alerts

Be the first to know and let us send you an email when Chatrapathi Hanuman Temple, Namdevwada, Nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category