Lord Shiva Temple In D.Vellampalli

Lord Shiva Temple In D.Vellampalli స్తంబలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్తనం t.me/VelampalliShivanTemple join this for recent updates

స్తంబలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్తనం వెలసిన తరువాత దాతల సాయంతో ఇంత అభివృద్ధి అయ్యింది. దానికి కారనం వాళ్ళ కోరికలు, నోములు నేరవేరడమే..
కానీ ఇక్కడ చాలమందికి ఈ దేవస్తానం గురించి తెలియదు, తమిళనాడు , కడప ,నుంచి ఇక్కడికి ఎక్కువగ వస్తుంటారు కానీ పక్కనే వున్నా మండలాల వారికీ మాత్రం పెద్దగ తెలియదు. అందరికి తెలియాలి అనే ఈ పేజి ని ఉపోయోగిస్తున్నాము..

డి. వెలంపల్లి గ్రామ తిరునాళ్ల ఏర్పాట్ల పనులనుమాజీ జెడ్పీటీసీ మరియు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు సమీ...
04/04/2026

డి. వెలంపల్లి గ్రామ తిరునాళ్ల ఏర్పాట్ల పనులను
మాజీ జెడ్పీటీసీ మరియు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు సమీపంగా పరిశీలించారు.
తిరునాళ్లకు సంబంధించిన అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయని, అవసరమైన ఏర్పాట్లన్నింటిని గ్రామ పెద్దలు, ఆలయ ట్రస్టీలు సమిష్టిగా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో తిరునాళ్లు వైభవంగా, ఘనంగా నిర్వహించబడనున్నాయనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.

Few pics from April 2026, Thirunallu
04/04/2026

Few pics from April 2026, Thirunallu

Pictures from April 2026. Thirunallu
04/04/2026

Pictures from April 2026. Thirunallu

04/04/2026

ఈ ఏప్రిల్ 5వ తేదీ మరియు 6వ తేదీలలో
డి. వెలంపల్లి శ్రీ శివుని తిరునాళ్లు జరుగనున్నాయి.
భక్తులందరూ తప్పకుండా విచ్చేసి,
శ్రీ శివ పరమేశ్వరుని దివ్య ఆశీర్వాదాలను పొందండి.

இந்த ஏப்ரல் 5 மற்றும் 6 தேதிகளில்
டி. வேளம்பள்ளி ஸ்ரீ சிவன் திருவிழா நடைபெற உள்ளது.
அனைத்து பக்தர்களும் தவறாமல் வந்து,
ஸ்ரீ சிவபெருமானின் தெய்வீக ஆசீர்வாதங்களைப் பெறுங்கள்.

రాబోయే తిరునాళ్లను ఘనవిజయంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింద...
04/04/2026

రాబోయే తిరునాళ్లను ఘనవిజయంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి
గౌరవనీయులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు,
శ్రీకాళహస్తి ఆర్‌డిఓ గారు,
మాజీ జెడ్పీటీసీ రామచంద్ర నాయుడు గారు,
డక్కిలి మరియు వెంకటగిరి మండల తహసీల్దార్లు (ఎంఆర్ఓలు),
గ్రామ అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో తిరునాళ్లను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో మరియు వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించబడింది. తిరునాళ్ల నిర్వహణకు సహకరిస్తూ సమన్వయంతో పనిచేస్తున్న అధికారులు, ఆలయ ట్రస్టీలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి సహకారంతో ఈ తిరునాళ్లు అత్యంత ఘనవిజయంగా నిర్వహించబడతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

రాబోయే తిరునాళ్లను ఘనవిజయంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింద...
04/04/2026

రాబోయే తిరునాళ్లను ఘనవిజయంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి
గౌరవనీయులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు,
శ్రీకాళహస్తి ఆర్‌డిఓ గారు,
మాజీ జెడ్పీటీసీ రామచంద్ర నాయుడు గారు,
డక్కిలి మరియు వెంకటగిరి మండల తహసీల్దార్లు (ఎంఆర్ఓలు),
గ్రామ అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో తిరునాళ్లను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో మరియు వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించబడింది. తిరునాళ్ల నిర్వహణకు సహకరిస్తూ సమన్వయంతో పనిచేస్తున్న అధికారులు, ఆలయ ట్రస్టీలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి సహకారంతో ఈ తిరునాళ్లు అత్యంత ఘనవిజయంగా నిర్వహించబడతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

రాబోయే డి. వెలంపల్లి తిరునాళ్ల పోస్టర్లను గౌరవనీయులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు, మాజీ డక్కిలి జెడ్పీటీ...
04/04/2026

రాబోయే డి. వెలంపల్లి తిరునాళ్ల పోస్టర్లను గౌరవనీయులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు, మాజీ డక్కిలి జెడ్పీటీసీ రామచంద్ర నాయుడు గారు, ఆలయ ట్రస్టీలతో పాటు గ్రామ అధికారుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ పవిత్ర తిరునాళ్లు ప్రజలందరికీ శుభఫలితాలను అందించి, ప్రాంతమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడానికి, వ్యవసాయ పంటలు బాగా పండడానికి, రైతులందరికీ సస్యశ్యామలత, ఐశ్వర్యం కలగడానికి దోహదపడతాయని వారు ఆకాంక్షించారు. ఈ తిరునాళ్ల ద్వారా ప్రాంతం సుభిక్షంగా, సంతోషంగా వికసించాలని కోరుకున్నారు.

04/04/2026
మన దేవుడు వెల్లంపల్లి స్తంభాల గిరి ఈశ్వరయ్య స్వామివారి గుడి తరపున నేను అందరికీ వినయపూర్వకంగా విన్నవించుకుంటున్న విషయం ఏమ...
16/01/2026

మన దేవుడు వెల్లంపల్లి స్తంభాల గిరి ఈశ్వరయ్య స్వామివారి గుడి తరపున నేను అందరికీ వినయపూర్వకంగా విన్నవించుకుంటున్న విషయం ఏమనగా—
ప్రస్తుతం మన గుడిలో ఉన్న అన్నదాన సత్రం నిర్మించి రెండు దశాబ్దాలకు పైగా అన్నదానం నిర్వహించబడుతోంది. అయితే, ప్రస్తుతం ఉన్న సత్రంలో సీటింగ్ సామర్థ్యం చాలిపోకపోవడం వల్ల అన్నదాన సమయంలో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, ఈ సత్రం వల్ల స్వామివారి ప్రదక్షిణలు చేసే సమయంలో రద్దీ ఏర్పడుతోంది.
ఈ అన్ని అంశాలను గమనించి, మేము—అనగా గ్రామ పెద్దలందరం కలిసి—మన EX ZPTC శ్రీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు గారి ద్వారా మన MLA శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారిని కలిసి వారి సహకారం తీసుకున్నాము. వారి సూచన మేరకు కొత్త అన్నదాన సత్రం నిర్మించాలని తీర్మానించాము.

```అధ్యాయం – 2```
కొత్త అన్నదాన సత్రానికి సంబంధించి ప్రభుత్వ సివిల్ ఇంజనీర్ ద్వారా ప్లానింగ్ మరియు ఎస్టిమేషన్ వేయించగా, దీని వ్యయం కనీసం రూ.1 కోటి నుంచి రూ.1.3 కోట్లు వరకు అవుతుందని అంచనా వేయబడింది.
ఈ మా ఆలోచన విజయవంతంగా ముందుకు సాగాలంటే, స్తంభాల గిరి ఈశ్వరయ్య స్వామి భక్తులందరూ కలిసి ఈ కార్యానికి అండగా నిలవాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము.
విరాళాలు ఇవ్వదలచిన భక్తుల కోసం, త్వరలో మన గుడి పేరు మీద ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి, దాని ద్వారా విరాళాలు సేకరించాలనే ఆలోచనలో ఉన్నాము.
విరాళాలు ఇవ్వదలచిన వారు గ్రామ పెద్దలను లేదా గుడి కార్యనిర్వహణ అధికారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.

Address

Nellore
524134

Website

Alerts

Be the first to know and let us send you an email when Lord Shiva Temple In D.Vellampalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Lord Shiva Temple In D.Vellampalli:

Share

Category