14/08/2026
💥 " శ్రీ తీర్థం ( SRI TEERTHAM ) " ....ధార్మిక , ఆధ్యాత్మిక మాస పత్రిక :
🟡 శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానం - శక్తి పీఠం ఆధ్వర్యములో త్వరలో " శ్రీ తీర్థం " పేరిట ధార్మిక , ఆధ్యాత్మిక మాస పత్రిక వెలువడనుందని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
🔴 మన సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకై , మన సనాతన ధర్మ , మన ఆధ్యాత్మిక విషయాల ప్రచార ప్రసారముల ద్వారా మన ఆధ్యాత్మిక వైభవమును సమాజములో వ్యాప్తి చేయాలనే సత్సంకల్పముతో ఇట్టి మాస పత్రిక వెలువరింపబడనున్నది.
🟢 Ministry of Information and Broadcasting , Government if India ..... సమాచార మరియు ప్రసార మంత్రత్వ శాఖ , భారత ప్రభుత్వము ద్వారా గుర్తింపు పొందడం జరిగినదని.... Press Registrar General of India ( PGRI ) , .... Registrar of News papers for India ( RNI ) ద్వారా అధికారికంగా శ్రీ తీర్థం పేరిట మాస పత్రిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను కూడా పొందడం జరిగినదని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
🟣 TGTEL / 26 / A6729 రిజిస్ట్రేషన్ నంబరుతో " శ్రీ తీర్థం " అను తెలుగు ఆధ్యాత్మిక మాస పత్రిక ...శక్తి పీఠం ట్రస్ట్ యాజమాన్యంలో .... పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారి ప్రధాన సంపాదకత్వంలో ... ఉభయ తెలుగు రాష్ట్రాలలో , భారతదేశములోని వివిధ రాష్ట్రాలలోని తెలుగు చదువరులను ఆకట్టుకునే విధంగా , తెలుగు లోగిళ్ళలో ఆధ్యాత్మిక శోభను పరిఢవిల్లజేసే విధంగా మన శ్రీ తీర్థం ఆధ్యాత్మిక మాస పత్రిక ఉండబోతుందని విన్నవించుకొనుటకు గర్వంగా ఉన్నది.
🔵 భారత ప్రభుత్వము ద్వారా గుర్తింపు పొంది , రిజిస్ట్రేషన్ ను కలిగి ఉండి...అధికారికంగా మన ఆధ్యాత్మిక మాస పత్రిక వెలువడనున్నది కాబట్టి....ఇట్టి పత్రికకు చందాదారులుగా చేరటానికి తామందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
🟡 అలాగే భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇట్టి మాస పత్రికను సమాజములో వ్యాప్తి చేయడానికి మార్కెటింగ్ / అడ్వర్టైజ్ మేనేజర్ / రిపోర్టర్ గా సేవలందించుటకు ఆసక్తికలిగిన ఔత్సాహికులకు స్వాగతం పలుకుతున్నాము.
🟣 వార్షిక చందా వివరాలు , మాస పత్రిక ప్రారంభోత్సవ వివరాలు తదితర విషయములు త్వరలో తామందరితో పంచుకుంటాము.
💥 భారత ప్రభుత్వ గుర్తింపు పొంది , అధికారికంగా వెలవడనున్న ...మన ప్రాతంలోనే మొట్టమొదటి తెలుగు ధార్మిక , ఆధ్యాత్మిక మాస పత్రికగా " శ్రీ తీర్థం " వెలుగొందడం మనందరికీ గర్వకారణమైన విషయం.
🛕 మన పత్రికను నిలుపుకుందాం...మన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుందాం.
🏵️ జయహో " శ్రీ తీర్థం "
॥ శ్రీమాత్రే నమః ॥
✍️ ప్రధాన సంపాదకులు
శ్రీ తీర్థం ఆధ్యాత్మిక మాస పత్రిక