04/05/2026
*✊జై భీమ్✊జై భారత్✊జై ఆర్.యమ్.పి✊*
విషయం: దళిత క్రైస్తవులకు న్యాయం కోసం లక్ష సంతకాల సేకరణ j
*జస్టీస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం దళితులు క్రైస్తవ మతం స్వీకరించిన వారి స్టేటస్ మారలేదు. వారిమీద ఉన్న వివక్ష పోలేదు అని ఆ నివేదికను గవర్నమెంటుకు సమర్పించడం జరుగుతుంది ఆ నివేదికను బుట్టదాఖలు చేసేసారు*
*2026మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్తించదు అని తీర్పు ఇవ్వడం జరిగింది.*
పై విషయంలో దళిత క్రైస్తవుల పక్షాన ఏ రాజకీయ పార్టీలు స్పందించలేదు.
*దళిత క్రైస్తవుల రిజర్వేషన్ పునః సమీక్షకు జస్టీస్ రాధాకృష్ణన్ కమీషన్ ఏర్పాటు చేశారు. జూన్ నెల 10వ తేదీ లోపు నివేదిక గవర్నమెంట్ కు సమర్పించాలి*
జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఇచ్చిన నివేదికనే అమలుపరిచేటట్లుగా దళితులు ఏ మతం తీసుకున్నా వారికి ఉన్న రిజర్వేషన్ అమలు అయ్యేటట్లుగా తీర్పు రావాలి.!
*ఈ క్రమంలో మన ఆత్మీయ తండ్రి, సామాజిక సంఘ సంస్కర్త, రాష్ట్రీయ మసీహీ పరిషత్ (RMP) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రంజితన్న గారు లక్ష సంతకాల సేకరణ కొరకు పిలుపునిచ్చారు.*
గనుక యావత్ దళిత క్రైస్తవ సమాజమంతా ఈ సంతకాల సేకరణ ఉద్యమం కొరకు ముఖ్యంగా ప్రతి ఓఫీరిస్ట్ ఉద్యమ స్పూర్తితో జయప్రదం కోసం పనికి పూనుకోవాలి.
*✊జై భీమ్✊*
డి. జేమ్స్ జగదీశ్వర్
రాష్ట్రీయ మసీహీ పరిషద్ RMP