Madanapalle - మదనపల్లె

Madanapalle - మదనపల్లె Welcome to Madanapalle Official page. Serving the real content since 2016. Madanapalle was founded by Sri Ahobila Naidu in 1618 AD.
(1)

Madanapalle is a city in Chittoor district of the Indian state of Andhra Pradesh. It is a municipality and the headquarters of Madanapalle mandal and Madanapalle revenue division.

09/03/2026

#హిజ్రాలు ఆందోళన మదనపల్లి లో..! 👭

#హిజ్రాని మోసం చేసి లక్షల రూపాయలు కజేసిన కిలాడీ జంట.!!🧛🏻‍♂️

#మదనపల్లి కలెక్టర్ ఆఫిస్ బయట అందోళన చేపట్టిన హిజ్రాలు..!

#తమ తోటి హిజ్రాకి న్యాయం చేయాలనీ కలెక్టరేట్ వద్ద వాహనాలని అడ్డుకొని రోడ్డు పైన ఆందోళన చేస్తున్న హిజ్రాలు.!!@!

❤️❤️

#కిలాడీ దంపతులను అరెస్ట్ చేయాలనీ ఆందోళన.!!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 'చైన్ స్నాచింగ్' వేషాలు.. నిందితుడి అరెస్ట్, రూ. 40 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం....!  మదనపల...
04/03/2026

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 'చైన్ స్నాచింగ్' వేషాలు.. నిందితుడి అరెస్ట్, రూ. 40 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం....! మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కోరకూటి రాజేష్ అరెస్ట్..... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉంటూ విలాసాలకు అలవాటు పడి, దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న ఒక మోస్ట్ వాంటెడ్ ‘హాబిచ్యువల్ అఫెండర్’ను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు రూ. 40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియా సమావేశంలో వెల్లడించారు.

నిందితుడి వివరాలు
అరెస్టయిన నిందితుడు మదనపల్లె మండలం, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కోరకూటి రాజేష్ (35). వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రాజేష్, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు.

నేరాల వివరాలు
నిందితుడు రాజేష్ ప్రధానంగా మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది..
1. మదనపల్లి I టౌన్ P.S. Cr No. 49/2026 (U/Sec 331(3), 305(a) BNS): ఫిబ్రవరి 16న మదనపల్లి బీసెంట్ రోడ్డులోని ఒక ఇంట్లో చొరబడి భారీగా బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు.
2. Cr No. 36/2025 (U/Sec 304(2), 329(4) BNS): గత ఏడాది మార్చి 24న దేవాలయం వీధి సందులో ఒక ముసలి ఆమె వద్ద నుండి 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్ళాడు (చైన్ స్నాచింగ్).
3. Cr No. 59/2026 (U/Sec 304(2) BNS): ఇదే ఏడాది ఫిబ్రవరి 6న మళ్ళీ దేవాలయం వీధిలోనే మరో వృద్ధురాలి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించాడు.

పోలీస్ ఆపరేషన్
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లి అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటాద్రి పర్యవేక్షణలో, మదనపల్లి 1 టౌన్ సిఐ కె. రాజా రెడ్డి, సి.సి.ఎస్ ఇన్ స్పెక్టర్ ఎం. చంద్రశేఖర్, ఎస్.ఐ ఎస్.కె రహమతుల్లా, సి.సి.ఎస్ ఎస్.ఐ ఎం.కె నరసింహులు మరియు వారి బృందం మార్చి 3న ఉదయం 08:30 గంటలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసులకు సంబంధించిన మొత్తం రికవరీని పూర్తి చేశారు.

జిల్లా ఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, "యువత చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాట పట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతుంది. చదువుల్లో రాణించి జీవితంలో పైకి రావాలి తప్ప, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డులను అందజేశారు.

❤️❤️

25/02/2026
18/02/2026

ఛిద్రమైపోయిన చిన్నారి జీవితం.!!😓

మానవ మృగానికి భలైపోయిన చిట్టీ తల్లి. 🥹👧🏻

తల్లాడిళుతున్న తల్లి ప్రేగు 👩🏻‍🍼.. 😭

ఋషిక ప్రియా అంత్యక్రియలు అశ్రునాయాలతో అంతిమ వీడ్కోలు 😭🙏🏻..!

ఓం శాంతి. 🙏🏻🥹

18/02/2026

మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య..?!*
*ముదివేడు కనసానిపల్లి చెరువులో నిందితుడి మృతదేహం లభ్యం.*
*మృతదేహాన్ని మదనపల్లికి తరలిస్తున్న పోలీసులు.

17/02/2026

కచ్చితంగా అంతకున్ని నడిరోడ్డుపైన రాళ్లతో కొట్టి చంపాలి ఇమెస్సెజ్ ప్రతీ సైకోగాళ్లకు చేరాలి ఇకమీదట ఇలాంటి అగాయిత్యాలకు పాలుపడాలంటే ఇదే సంఘటన గుర్తుకు రావాలి.

17/02/2026

మదనపల్లి లో 7 ఏళ్ళ ఆడ బిడ్డ పైన అవమానియ ఘటన 🥹.! దారుణం.!

అభంశుభం తెలియని ఆడ బిడ్డ పైన ఘతూకం.. 😡

మదనపల్లి లో 7 ఏళ్ళ బాలిక హత్య 😭.!👧🏻

నిందుతులని కఠినంగా శిక్షించాలి.! 🥹

చిన్నపిల్ల అని కనికరం లేకుండా దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కిన నీచుడు 😥😭..!
మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే
అవుట్లో బాలిక దారుణ హత్యకు గురైన విషయం
తెలిసిందే. ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని
అనుమానిస్తున్న కులవర్ధన్ను వన్ టౌన్ పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం చేసి ఆపై
దారుణంగా హత్య చేసి డ్రమ్ములో వేసినట్లు పోలీసులు
భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా హత్య
ఉదంతాన్ని వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ వెలుగులోకి
తెచ్చారు.
మదనపల్లెలో బాలిక దారుణ హత్య వెలుగు చూడటం
తీవ్ర కలకలం రేపుతోంది. మదనపల్లె పట్టణం,
నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో ఉంటున్న
చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (7)
సోమవారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా..
మహమ్మద్ రఫీ తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలు
పరిశీలించి విస్తృతంగా గాలించారు. ఓ వ్యక్తి హత్య
చేసినట్లు గుర్తించారు.
వీ
సీఐ Vayalpad Town B.KothaKota , Andhra Pradesh, India

Address

NTR Circle
Madanapalle Revenue Division
517325

Alerts

Be the first to know and let us send you an email when Madanapalle - మదనపల్లె posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share