Biblemission Machilipatnam

Biblemission Machilipatnam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Biblemission Machilipatnam, Religious organisation, Godugupet, Machilipatnam.

❓ యేసు “నేను ఎవడనని మీరు చెప్పుచున్నారు?” అని అడిగినప్పుడు పేతురు ఏమని సమాధానమిచ్చాడు?A) నీవు ప్రవక్తవుB) నీవు క్రీస్తువ...
27/08/2026

❓ యేసు “నేను ఎవడనని మీరు చెప్పుచున్నారు?” అని అడిగినప్పుడు పేతురు ఏమని సమాధానమిచ్చాడు?
A) నీవు ప్రవక్తవు
B) నీవు క్రీస్తువు, సజీవుడైన దేవుని కుమారుడవు
C) నీవు గొప్ప బోధకుడవు
D) నీవు దావీదు కుమారుడవు

*నేటి దిన వాగ్దాన సందేశము**"మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి" (యోహాను 16:24)**దేవుడు మాట్లాడిన ప్రతి యొక్క మాట కృప, స...
27/08/2026

*నేటి దిన వాగ్దాన సందేశము*

*"మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి" (యోహాను 16:24)*

*దేవుడు మాట్లాడిన ప్రతి యొక్క మాట కృప, సత్యముతో నింపబడి లోతైన ఆత్మీయ భావము కలిగియుండును. ఎంతో అద్భుతముగా మాట్లాడగల గొప్ప బోధకులు ఉన్నారు. కానీ ప్రభువైన క్రీస్తు మాటలు అసమానమైనవి. అవి ఎన్నటికిని మరువబడవు. ప్రభువైన యేసు క్రీస్తు మాటలు గొప్ప రచయితలచే అనేక గ్రంథములలో వ్రాయబడినవి, వివరించబడినవి, గాని ఇప్పటికిని అవి వాటి అర్థమును పోగొట్టుకొనలేదు.*

దేవుని వాక్యము ఎఫెసీ. 3:20 ప్రకారము "మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు". ఉదాహరణకు ఒక పాపి వణుకుచు ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి "ప్రభువా, నా పాపములు క్షమించుము" అని చెప్పిన యెడల ప్రభువు "నా బిడ్డా, నేను నీ పాపములు క్షమించుట మాత్రమే కాదు, నా రాజ్యమంతటిని నీకిచ్చెదను. నీకు ఏది కావలెనో, అడిగి నా యొద్ద నుండి పొందుము" అని చెప్పును. కానీ ఏ విధముగా అడుగవలెనో మనకు తెలియదు. అదే మన కష్టము. ఆయనతో మూడు సంవత్సరములు ఉన్నను, ఆయన శిష్యులకు కూడా ఏవిధముగా అడుగవలెనో తెలియదు. యోహాను 16:24లో ప్రభువు, "ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు.. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును" అని వారితో చెప్పెను. వారు ఆయనను ఎన్నో అడిగితిమని తలంచుచున్నారు. ఒకసారి ఎంతో సంతోషముతో, ఉప్పొంగిన ఆనందముతో ఆయన దగ్గరకు వచ్చి, "ప్రభువా నీ నామమున మేము ఏమి చేయగలిగితిమో చూడుము"అని చెప్పిరి. అయినప్పటికిని ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు" అని ప్రభువు చెప్పెను. దీని అర్ధము ఏమనగా, వారు తమ సంతోషము పరిపూర్ణము చేయలేని వాటిని గురించి మాత్రమే అడుగుచున్నారు. ఇప్పుడే అడుగుడి, అడుగుచు ఉండుట నేర్చుకొనుడి" అని ప్రభువు చెప్పుచున్నాడు. మనము కూడా అదే పాఠమును నేర్చుకొనవలెను. ఇప్పటికిని దేవుని అడుగుట ఎట్లో మనకు తెలియదు. మనము అడుగుట నేర్చుకొనినప్పుడు, మన దేవుడు అడిగిన దానికంటెను, ఊహించిన దానికంటెను అత్యధికముగా ఇచ్చును.

Maranatha 🙏

❓ యేసును ముప్పై వెండి నాణేలకు అప్పగించిన శిష్యుడు ఎవరు?A) పేతురుB) మత్తయిC) యూదా ఇస్కరియోతుD) తోమా
26/08/2026

❓ యేసును ముప్పై వెండి నాణేలకు అప్పగించిన శిష్యుడు ఎవరు?
A) పేతురు
B) మత్తయి
C) యూదా ఇస్కరియోతు
D) తోమా

26/08/2026
*నేటి దిన వాగ్దాన సందేశము**✝️నీ కాలు చిక్కు బడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును🛐*మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిత్రులందర...
26/08/2026

*నేటి దిన వాగ్దాన సందేశము*

*✝️నీ కాలు చిక్కు బడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును🛐*

మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిత్రులందరికీ శుభవందనాలు!

_(యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:26)_

ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నేడు మిమ్మును కాపాడాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, సామెతలు 3:26 ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు.

ఇక్కడ బైబిల్ ఇలాగున చెబుతుంది, "యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.' అవును, నేడు మీ కాలు చిక్కు బడుతుందని మీరు చెప్పవచ్చును.

కానీ, ప్రభువు కృప మిమ్మును కప్పుతుంది. ప్రజలు మీకు వ్యతిరేకంగా వస్తున్నారని మీరు చెప్పినప్పుడు, ప్రభువు మిమ్మల్ని తన రెక్కల క్రింద దాచడం ద్వారా మిమ్మల్ని రక్షిస్తాడు.

అందుకే బైబిలేమంటుందో చూడండి, "పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచు నుండును దానికి హానిచేయక తప్పించుచు నుండును' అని యెషయా 31:5.

నేడు మిమ్మల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు మరియు కాపాడుతాడు. ప్రియులారా, నేడు మీరు 124వ కీర్తనను చదువుతున్నప్పుడు బైబిల్‌లో, ప్రభువు తన సన్నిధి ద్వారా దుష్టుల నుండి మిమ్మల్ని ఎలా విడిపించుకుంటాడో ఆ అధ్యాయమంతయు మనకు తెలియజేయుచున్నది.

కాబట్టి, నేడు మీలో దేవుడు ఉన్నందున, మీకు విరోధంగా లేచు వ్యక్తులు మీ యెదుట నిలబడలేరు. మీరు ప్రభువును విశ్వసించి నప్పుడు, దుష్టుల చేతులలో నుండి మరియు అపవాది నుండి మిమ్మల్ని విడిపించే శక్తి ఆయనకు మాత్రమే కలదు.

ప్రజలు మీకు విరోధంగా వచ్చినప్పుడు, వారు మిమ్మల్ని కించపరిచే మాటలతో నేల మీద త్రొక్కడానికి వారి నాలుకను ఊపుతారు.

మీరు కోర్టు కేసులు, మీ స్వంత కుటుంబంలో తగాదాలు, మీ స్వంత ఇంటిలో అపార్థం లేదా మీ స్వంత కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా రావడంతో పోరాడుతూ ఉండవచ్చును; అయితే అప్పుడు ప్రభువు మిమ్మును విడిపిస్తానని వాగ్దానము చేయుచున్నాడు.

కాబట్టి, ధైర్యంగా ఉండండి. బైబిల్‌లో ద్వితీయోపదేశ కాండము 28:7లో ఇలాగున చెబుతుంది. ఆ వచనమేమనగా, "నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీ మీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు.''

మీకు విరోధముగా లేచిన మీ శత్రువులను ప్రభువు మీ యెదుట ఓడింపజేయును. అవును, నా ప్రియులారా, సాతాను మరియు దుష్టులు మీకు వ్యతిరేకంగా ఒక దిశ నుండి వస్తారు. కానీ, వారు మీ నుండి ఏడు దిక్కులకు పారిపోతారు.

కాబట్టి, నేడు మీ మీదికి ఈ ఆశీర్వాదం దిగివచ్చునట్లు నేను ప్రార్థించుచున్నాను. ప్రభువు హస్తము మీ మీదికి వచ్చి, ఉచ్చులన్నిటి నుండి మిమ్మును విడిపించి, మిమ్మును ఆశీర్వదిస్తాడు.

*🛐ప్రార్ధన:* ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానానికై నీకు వందనాలు. దేవా, నేడు మేము ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో మా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాము.

తండ్రీ, అన్ని ఉచ్చుల నుండి మమ్మల్ని విడిపించుము మరియు మా జీవితంలో ఈ రోజు వాగ్దానాన్ని నెరవేర్చుము.

ప్రభువా, సాతాను మరియు దుష్ట ప్రజలను నాశనం చేయడానికి నీ శక్తివంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లుగా దేవా, నీవు మమ్మల్ని కాపాడుము.

దేవా, మా మీదపడు మా శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయుము; వారొక త్రోవను మా మీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవునట్లు చేయుము.

దేవా, మా కాలు చిక్కు బడకుండునట్లు నీవు మమ్మును కాపాడుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

ఈ దినమంతా మిమ్ములను బహగా దీవించునుగాక ఆమేన్!

దైవాశీర్వాదాలతో!!

Maranatha 🙏

Address

Godugupet
Machilipatnam
521001

Website

Alerts

Be the first to know and let us send you an email when Biblemission Machilipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share